23, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 177

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దానవులం గొలుచువాఁడు దామోదరుఁడే.

25 కామెంట్‌లు:

  1. దీనుల నెడ దాసుండగు
    దానమ్మును నొసగ బూన దానిడు కేలున్
    మానము విడి తను నమ్మిన
    దానవులం గొలుచువాఁడు దామోదరుఁడే

    రిప్లయితొలగించండి
  2. దానము జేసియు వటునుకి,
    దానవ కులపతియగుబలి ధన్యుండయ్యెన్!
    ప్రాణము తృణమని బల్కెడు
    దానవులంగొలుచు వాడు దామోదరుడే!

    రిప్లయితొలగించండి
  3. ప్రహ్లాదుడు తనగురువులతో:

    మానుడి- మీనోళ్లేగతి
    దానవులంగొలుచు?వాడు దామోదరుడే-
    ఆనతులిడ?కనకకశిపు
    కైనవిభుడాతడె,హరి! కనుగొని గొలువన్!!

    [కైనవిభుడాతడె,హరి! కనిగొలువదగున్]

    రిప్లయితొలగించండి
  4. ప్రహ్లాదుడు తనగురువులతో:

    మానుడి- మీనోళ్లేగతి
    దానవులంగొలుచు?వాడు దామోదరుడే-
    ఆనతులిడ?కనకకశిపు
    కైనన్ విభుడాతడె,హరి! కనుగొని గొలువన్!!

    [కైనన్విభుడాతడె,హరి! కని గొలువదగున్]

    రిప్లయితొలగించండి
  5. హీనుడు సజ్జన దూరుడు
    దానవులం గొలుచువాఁడు, దామోదరుఁడే
    దీనుల దిక్కను నమ్మిక
    మానుగ భజియించు వాడు మాన్యుడు ధరలో !

    రిప్లయితొలగించండి
  6. ఊకదంపుడు గారు పద్యాన్ని దంచి పడేశారు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. ఊక దంపుడి గారి పూరణ చాలా బాగుంది .
    నాది మరో పూరణ.

    లేనే లేడీ ధరలో
    దానవులం గొలుచు వాడు! దామోదరుడే
    నా? నా మదిలొనున్నది ?
    ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!

    రిప్లయితొలగించండి
  8. నా పై పూరణలో మూడవ పాదంలో టైపు పొరపాటు జరిగింది,దానితో పాటు చిన్న సవరణ.

    లేనే లేడని యందును
    దానవులం గొలుచు వాడు! దామోదరుడే
    నా? నా మదిలోనున్నది?
    ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!

    రిప్లయితొలగించండి
  9. ఈ నాటి యుగము నందున
    దానవుల కంటెను మనుజులె దురితము చేయన్ !
    మనుజులె దనుజులు కాగ
    దానవులం గొలుచు వాఁడు దామోదరుఁడే !

    రిప్లయితొలగించండి
  10. సదస్యులందరికీ
    శుభాభినందనలు.
    అందరి పూరణలూ
    అద్భుతముగా
    నలరారు చున్నవి.
    ________________________________
    01)
    ఆనాడు విభీషణుడున్
    దానవులం గొలుచు వాడు! - దామోదరుడే
    జానకి పతియని , నెరుగుట
    చే,నా రావణు విడివడి - జేరెను రామున్
    ________________________________

    రిప్లయితొలగించండి
  11. __________________________________
    02)

    ఏ నాడైనను , సకలము
    తానై హరి యుండు , నంచు - దలచిన మదిలో,
    ప్రాణము లున్నంత దనుక!
    దానవులం గొలుచు వాడు! - దామోదరుడే
    __________________________________

    రిప్లయితొలగించండి
  12. ___________________________________
    పసి నాటి నుండి కలదొక
    కసి,నా హృదియందు,చిన్న- కవితన్ జెప్పన్
    నిశి ప్రాయంబున నేడది
    వశ మాయెను నాకు శంక - రాభరణము నన్
    ___________________________________

    రిప్లయితొలగించండి
  13. ______________________________

    కలుగును శ్రీవాణీ కృప
    వలనను గాదే సమస్త -పదములు జెప్పన్
    ఇలలో! లేదొకొ?!వీలౌ?
    కలనైన కవితల నల్ల - కదలదు కలమున్
    ___________________________________

    రిప్లయితొలగించండి
  14. దీనునిగని వరమీయగ
    వనగజమై భీతి గొలుప వరగర్వమునన్ !
    మనుజుడె దనుజుడు కాగ
    దానవులం గొలుచు వాఁడు దామోదరుఁడే !

    రిప్లయితొలగించండి
  15. మరో పూరణండీ !

    వేనోళ్ళ నింద బడసితి
    'దానవులం గొలుచువాఁడు !''దామోదరుఁడే
    నా నాధు ' డనుచు బలుకగ
    మానవులకు మతము వలన మాంద్యము పెరుగన్!

    రిప్లయితొలగించండి
  16. వసంత్ కిశోర్ గారూ మీరు శిశువులన్న సంగతి మఱచి పోతున్నారు!

    రిప్లయితొలగించండి
  17. కవి మిత్రు లందరికీ వందనాలు.
    పూరణలు పంపిన గన్నవరపు నరసింహ మూర్తి, మంద పీతాంబర్, ఊకదంపుడు, మిస్సన్న, రాజేశ్వరి నేదునూరి, వసంత్ కిశోర్ గారలకు అభినందనలు, ధన్యవాదాలు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ దర్శించడానికి వెళ్ళే తొందరలో మీ మీ పూరణలను విడివిడిగా కామెంటలేక పోతున్నాను. అందరి పూరణలూ బాగున్నాయి. రాజేశ్వరి గారి మొదటి పూరణ రెండవ పాదంలో గణ, యతి దోషాలున్నాయి. సవరించే టైం లేదు.

    రిప్లయితొలగించండి
  18. మూర్తిగారూ,
    బుడి బుడి అడుగుల
    బుజ్జాయి ని
    పడిపోకుండా
    పట్టుకొని నడిపిస్తున్న
    మీకూ
    మిగిలిన
    మిత్రులకూ
    ధన్యవాద
    శతములు
    సమర్పించు కొంటున్నా.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వసంత కిషోర్ గారి రెండు పూరణలు ,రెండు పద్యాలు చాలా బాగున్నాయి.

    శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి రెండు పూరణలూ బాగున్నాయి.శ్రీ చంద్ర శేఖరులు చాలా రోజుల నుండి పూరణలు చేయడం చేయడం లేనట్లుంది.వారి లేని లోటు,లోటు గానే ఉంది .

    శ్రీమతి రాజేశ్వరి గారి మొదటి పూరణ కంటె రెండవ పూరణ చాలా బాగుంది .ఐతే కంద పద్యం కాబట్టి ,సమస్య గురువుతో ప్రారంభమైతే, మిగితా మూడు పాదాలు గురువుతోనే ప్రారంభం కావాలని గురువుగారు నాకు చెప్పిన పాఠం గర్తుకు వచ్చింది.అన్యదా భావించకండి.గురువుగారు క్షమించాలి .
    మీకందరికీ నమస్కారం.

    రిప్లయితొలగించండి
  20. మానవులకు దేవతలకు
    హానిని దలపెట్టు గాన హతమును జేయన్
    తానే దుర్దినముల, గని
    దానవులం; గొలుచువాఁడు దామోదరుఁడే !

    (దానవుల చావుకు రోజులు లెక్కబెట్టు (కొలుచు)వాడని నా భావం)

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. దీనుల మూడు తలాఖులు
    కానగ నాతంక వాది కాశ్మీరములో
    హీనుల నల్ల ధనంబను
    దానవులం గొలుచువాఁడు దామోదరుఁడే


    దామోదరుడు = నరేంద్ర దామోదర్ దాస్ మోడి

    కొలుచు = కొలతవేయు

    రిప్లయితొలగించండి
  23. వానల తడవకనికపై
    పూనికతో టాయిలెట్లు పొందుగ నిడుచున్
    దీనుల; తోలుచు రోమను
    దానవులం; గొలుచువాఁడు దామోదరుఁడే!

    దామోదరుడు = నరేంద్ర దామోదరదాస్ మోడి

    రిప్లయితొలగించండి