డా. ఫణీంద్ర గారిని టీవీలో గరికపాటి వారి అవధానంలో నిషిద్ధాక్షరి అంశం నడిపించటం చూసి చాలా ఆనందించాను. అవధాని పద్య రచనకి దీటుగా అడ్డుకోవటం వల్ల వారికి గరికపాటి వారు "మంచి break inspector" అని బిరుదు ఇవ్వటం చాలా సముచితం. అట్టి వారి పూరణ గురించి వేరే చెప్పాలా? "అసలు ప్రేమ వృద్ధాప్యం లోనే బయటపడుతుంది" అన్న నానుడికి అద్దం పట్టింది మీ పద్యము. ధన్యవాదాలు.
పండు ముత్తైదువ అత్తమ వెండిచంద్రుని వోలె మామయ నిండుగ నున్న దంపతుల వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె ఇది నావంటి వారలకి చూసి ఆనందిచ వలసిన స్థలము కాని రాయ దగినది కాదు... అయినను.. మహామహుల ముందర పూరణం చేయుటకు చేసిన సాహసానికి మన్నించాలి...తెలుగు భాషపై అభిమానంతొ...యీ బ్లాగు చూసి సంతోషము పట్ట లేక చేస్తున్న యీ 'కపిత్వానికీ మన్నించమని మరొక్క సారి వేడుకొంటున్నాను. సింగిలగు వనితను జూచిన డింగరికి ధనము జూచి ఆశలు చెలగే ప్రకృతి వయిపరీత్యమున వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె పయి వ్రాతలకు క్ష్యంతవ్యురాలిని...ఇక్కడ చూస్తున్న పరిస్థితులకు దుఖంతొ చేసిన పూరణ.....అచ్చుకర్హం కాకపొతే దయ చేసి తొలగించ గలరు....
నిఘంటువు నందు వృద్ధ = ఎనుబది యేండ్లు పై బడిన స్త్రీ యని గలదు. దానిని విశేషణముగా దీసికొని పురుషునకు అన్వయింప వచ్చునా యను శంకచే నడుగు చుంటిని. దయ చేసి వివరింపగలరు.
ఎన్నెల గారూ, మీ "రంగు పడుద్ది" చదివాను. మీలో హాస్యప్రవృత్తి ఉంది. సౌజన్యం ఉంది. వీటిని మించిన మంచి రంగులేమున్నాయి లోకంలో? చాలా బాగా రాసారు మీ అనుభవాలను. సంతోషం! ఇక సమస్యాపూరణకు మీరు పంపిన భావాలకు నా పద్య రూపాలు ..... 1) అత్త పండు ముత్తైదువయై విలసిల మామ వెండి చంద్రుని వెల్గుతో మెలఁగఁగ నిండు దంపతులఁ గనుల పండుగ వలె వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె. 2) ధనికురాలైన నొక వృద్ధ వనితఁ గాంచి యామె సంపద పొందెడి యాశతోడ చేరె డింగరి తన కోర్కె దీరు ననుచు వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
వసంత్ కిశోర్ గారూ, మంచి బావంతో పద్యాలు రాసారు. అభినందనలు. మొదటి పద్యం మూడవ, నాల్గవ పాదాలలో యతి తప్పించి. నా సవరణ ... "అడుగు నిడ నప్పటికి సమరాంగణమున ననుచు పలికిన కర్ణుని మనము నందు" రెండవ పద్యం మూడవ పాదంలో యతి తప్పింది. నా సవరణ .... "అంపశయ్యను వాలిన యట్టి భీష్ము"
వసంత్ కిశోర్ గారూ, "వృద్ధ" శబ్దాన్ని విడిగా చూస్తే "వృద్ధురాలు" అనే అర్థం వస్తుంది. కాని "వృద్ధసౌందర్యం" సమాసం చేసినప్పుడు వృద్ధురాలి సౌందర్యం లేదా వృద్ధుడి సౌందర్య అనే అర్థాలు వస్తాయి.
డా. ఆచార్య ఫణీంద్ర గారు, డా. విష్ణునందను గారుల పూరణలు అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో డా.ఆచార్య ఫణీంద్ర గారు యీ బ్లాగుని సందర్శించడము మా బోటి వారలకు ప్రోత్సాహకరముగా ఉంటొంది. ఎన్నెల గారి గేయాలకు గురువుగారు చక్కని పద్య కల్పన చేసారు.
కంది శంకరయ్య గారికి, నమస్సుమాంజలి. మీరు నా బ్లాగ్ సందర్శించినందుకు కృతజ్ఞతలు. మీరు 'అటు నిటు కానీ' పద్యం దిద్దినందుకు నాకు చాల ఆనందంగా ఉంది. పూరణ పద్యాలు ఎంతో అందం సంతరించుకున్నయి. నా అల్లరి చిల్లరి భావాలకు మీరు ఎంతో అందమయిన పద్య రూపమిచ్చారు. మీ బ్లాగు అత్యద్భుతము. నాకు కవినై పోవాలనిపిస్తోంది మీ బ్లాగు చూస్తుంటే.
తనువు రాలక పూర్వమే దయను నీవు
రిప్లయితొలగించండిశబరి గూటికి వస్తివి చక్క నయ్య!
ధన్య నైతిని నినుగని తండ్రి! యనెను
వృద్ధ! సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
Sabhaash missannagaaru, chaalaa chaalaa baagundi.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినేనూ శబరి ని పోలుస్తూ చెప్పాలనుకున్నాను.
మీ పద్యం హృద్యం గా ఉంది. కృతజ్ఞతలు
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గన్నవరపువారూ! మంత్రిప్రగడవారూ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇంతి ముఖ సీమకొక నూత్న కాంతి గూర్చు
రిప్లయితొలగించండిపసుపు తులసీ రసాల లేపనము ; నిజము ;
సహజ సౌందర్య కారక సాధనా ప్ర
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.!!!!
రామాయణాన్తర్గత౦గా సమస్య పూరించటంలో మిస్సన్న గారు యెప్పుడూ ప్రథములే. డా.విష్ణు నందన్ గారి పద్య ధార అమోఘము. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఉదాత్తమైన పూరణ మీది. అభినందనలు.
డా. విష్ణు నందన్ గారూ,
"ప్రవృద్ధ సౌందర్యాన్ని" చూపించిన మీ పూరణ రసబంధురమై శోభిస్తున్నది. ధన్యవాదాలు.
గురువుగారూ కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ ధన్యవాదాలు.
విష్ణు నందన్ గారి పూరణ సుందరంగా శోభిల్లుతోంది.
పత్నికై జీవితమున సర్వమ్ము ధార
రిప్లయితొలగించండివోసి,పండుటాకగు స్వీయ పురుష వరుని
హృదయ వైశాల్య వైభోగ మెదుట నిలువ -
వృద్ధ, సౌందర్యమును జూడ ప్రేమ గలిగె!
డా. ఫణీంద్ర గారిని టీవీలో గరికపాటి వారి అవధానంలో నిషిద్ధాక్షరి అంశం నడిపించటం చూసి చాలా ఆనందించాను. అవధాని పద్య రచనకి దీటుగా అడ్డుకోవటం వల్ల వారికి గరికపాటి వారు "మంచి break inspector" అని బిరుదు ఇవ్వటం చాలా సముచితం. అట్టి వారి పూరణ గురించి వేరే చెప్పాలా? "అసలు ప్రేమ వృద్ధాప్యం లోనే బయటపడుతుంది" అన్న నానుడికి అద్దం పట్టింది మీ పద్యము. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపండు ముత్తైదువ అత్తమ
రిప్లయితొలగించండివెండిచంద్రుని వోలె మామయ
నిండుగ నున్న దంపతుల
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె
ఇది నావంటి వారలకి చూసి ఆనందిచ వలసిన స్థలము కాని రాయ దగినది కాదు... అయినను..
మహామహుల ముందర పూరణం చేయుటకు చేసిన సాహసానికి మన్నించాలి...తెలుగు భాషపై అభిమానంతొ...యీ బ్లాగు చూసి సంతోషము పట్ట లేక చేస్తున్న యీ 'కపిత్వానికీ మన్నించమని మరొక్క సారి వేడుకొంటున్నాను.
సింగిలగు వనితను జూచిన
డింగరికి ధనము జూచి ఆశలు చెలగే
ప్రకృతి వయిపరీత్యమున
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె
పయి వ్రాతలకు క్ష్యంతవ్యురాలిని...ఇక్కడ చూస్తున్న పరిస్థితులకు దుఖంతొ చేసిన పూరణ.....అచ్చుకర్హం కాకపొతే దయ చేసి తొలగించ గలరు....
సదస్యులందరికీ శుభాభినందనలు.
రిప్లయితొలగించండిమీమీ పూరణలు బహు బాగున్నవి
పూర్ణములవలె.
అవతారిక :
పరుల విజయమ్ము కాంక్షించు - పక్షపాతి
నీవు కూలిన పిమ్మటే - నేను వత్తు
అడుగు నిడనంత దనుక నీ - సంగరమున
అనుచు పలికిన గర్ణుని - హృదయమందు
పూరణ :
జనకు హితము గొరకు బ్రహ్మ - చర్య దీక్ష
సలిపి , పేరు గాంచిన మేటి - సచ్చరిత్రు
అంపశయ్యను వాలిన - గంగ తనయు
వృద్ధ సౌందర్యమును జూడ - ప్రేమ గలిగె
శంకరార్యా!
రిప్లయితొలగించండి"వృద్ధ సౌందర్యము " అనగా నేమి?
నిఘంటువు నందు
వృద్ధ = ఎనుబది యేండ్లు పై బడిన స్త్రీ
యని గలదు.
దానిని విశేషణముగా దీసికొని
పురుషునకు అన్వయింప వచ్చునా
యను శంకచే నడుగు చుంటిని.
దయ చేసి వివరింపగలరు.
అమెరికా యందు బుట్టిన - యాంధ్ర వనిత
రిప్లయితొలగించండిపెద్దదై, ఇండియా కొచ్చె - ప్రేమ మీర
మురిపెముగ జూచె! నవ్వను - మొదటి సారి
వృద్ధ !సౌందర్యమును జూడ ప్రేమ గలిగె
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారు చెప్పినట్లు మీ పూరణను వ్యాఖ్యానించే సాహసం చేయగలనా? అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
ఎన్నెల గారూ,
రిప్లయితొలగించండిమీ "రంగు పడుద్ది" చదివాను. మీలో హాస్యప్రవృత్తి ఉంది. సౌజన్యం ఉంది. వీటిని మించిన మంచి రంగులేమున్నాయి లోకంలో? చాలా బాగా రాసారు మీ అనుభవాలను. సంతోషం!
ఇక సమస్యాపూరణకు మీరు పంపిన భావాలకు నా పద్య రూపాలు .....
1)
అత్త పండు ముత్తైదువయై విలసిల
మామ వెండి చంద్రుని వెల్గుతో మెలఁగఁగ
నిండు దంపతులఁ గనుల పండుగ వలె
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
2)
ధనికురాలైన నొక వృద్ధ వనితఁ గాంచి
యామె సంపద పొందెడి యాశతోడ
చేరె డింగరి తన కోర్కె దీరు ననుచు
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి బావంతో పద్యాలు రాసారు. అభినందనలు.
మొదటి పద్యం మూడవ, నాల్గవ పాదాలలో యతి తప్పించి. నా సవరణ ...
"అడుగు నిడ నప్పటికి సమరాంగణమున
ననుచు పలికిన కర్ణుని మనము నందు"
రెండవ పద్యం మూడవ పాదంలో యతి తప్పింది. నా సవరణ ....
"అంపశయ్యను వాలిన యట్టి భీష్ము"
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి"వృద్ధ" శబ్దాన్ని విడిగా చూస్తే "వృద్ధురాలు" అనే అర్థం వస్తుంది. కాని "వృద్ధసౌందర్యం" సమాసం చేసినప్పుడు వృద్ధురాలి సౌందర్యం లేదా వృద్ధుడి సౌందర్య అనే అర్థాలు వస్తాయి.
శతవృద్ధులుపై ఎవరికైనా ప్రేమ సహజము. ఈమెకు మరో నెలలో 102 నిండుతాయి.
రిప్లయితొలగించండిహృదయ రయముకు మందిచ్చి కుదురు జేయ
నిట్ట నిలుబడి దిటవుగ నెగడె శతము
ముదిత మోమున ముడతలు ముద్దు లొలుకె
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
డా. ఆచార్య ఫణీంద్ర గారు, డా. విష్ణునందను గారుల పూరణలు అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో డా.ఆచార్య ఫణీంద్ర గారు యీ బ్లాగుని సందర్శించడము మా బోటి వారలకు ప్రోత్సాహకరముగా ఉంటొంది. ఎన్నెల గారి గేయాలకు గురువుగారు చక్కని పద్య కల్పన చేసారు.
రిప్లయితొలగించండిశ్రద్ధ గలవాడు,జిజ్ఞాసి,బుద్ది జీవి,
రిప్లయితొలగించండిహద్దు లెఱుగును,ఎఱుగడు ముద్దు లాడి,
బ్రతుకు పోరులో వయసంత చితికె! బ్రతుక,
వృద్ద సౌందర్యమును జూడ ప్రేమ గలిగె!
కంది శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండినమస్సుమాంజలి. మీరు నా బ్లాగ్ సందర్శించినందుకు కృతజ్ఞతలు. మీరు 'అటు నిటు కానీ' పద్యం దిద్దినందుకు నాకు చాల ఆనందంగా ఉంది.
పూరణ పద్యాలు ఎంతో అందం సంతరించుకున్నయి. నా అల్లరి చిల్లరి భావాలకు మీరు ఎంతో అందమయిన పద్య రూపమిచ్చారు. మీ బ్లాగు అత్యద్భుతము. నాకు కవినై పోవాలనిపిస్తోంది మీ బ్లాగు చూస్తుంటే.
చంద్రశేఖర్ గారికి,
రిప్లయితొలగించండికంది శంకరయ్య గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి
వినయపూర్వక వందనాలు, ధన్యవాదాలు!