అజ్ఞాత గారూ మీ పూరణ లద్భుతం. మీ అజ్ఞాత వాస సమాప్తి అద్భుతం. మీ పాండిత్యానికి వన్నెలద్దేలా మీరు ప్రకటించుకొన్న వినయం అద్భుతం. వైద్య వృత్తిలో ఉంటూ ఇంతటి పాండిత్య ప్రకర్ష కలిగి ఉండటం అత్యద్భుతం. మీరు శంకరాభరణంలో సభ్యులవడం అమందానందం. మీ సరస్వతీ సేవ నిరాటంకంగా సాగాలని శారదను ప్రార్థిస్తున్నాను.
శ్రీ విష్ణు నందన్ గారి మరియు శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలలొ అంతర్లీనంగా ఉన్న భావాన్ని తీసుకొని నాదైన పద్దతిలో చేసిన పూరణ . సాంకేతికంగా నేను ముందు వ్రాసినది పూరణ అవుతుందా? గురువుగారు చెప్పాలి.
అందరికీ నమస్కారం. రెండు రోజులుగా ఊళ్ళో లేను. ఎక్కడా ఇంటర్ నెట్ చూసే అవకాశం దొరకలేదు. ఇప్పుడే (రాత్రి 1.30 గం.లకు) ఇల్లు చేరి నాబ్లాగు తెరిచి చూస్తే ఎన్ని వ్యాఖ్యలు? ముఖ్యంగా డా. విష్ణు నందన్ గారి అజ్ఞాతవాస విరమణ, ఆ సందర్భంగా వారు చెప్పిన పద్యాల మాధుర్యం, దానిపై కవిమిత్రుల స్పందన నన్ను ఆశ్చర్య పరచడమే కాక ఆనంద పరవశుణ్ణి చేసాయి. నాలో నూతనోత్సాహాన్ని నింపాయి. అందరికీ ధన్యవాదాలు.
డా. విష్ణు నందన్ గారూ, ధన్యోSస్మి. మీ పూరణలను చూసి మీరు తప్పకుండా లబ్ధప్రతిష్ఠులైన కవులని. లేక తెలుగు సాహిత్యంలో యం.ఏ. లేదా పి.హెచ్.డి. చేసి తెలుగు భాషా బోధకులుగా పనిచేస్తూ ఉంటారని, అంత గొప్పవారు ఇంత అల్పమైన బ్లాగులో సమస్యలు పూరించడం చిన్నతనంగా భావించి అజ్ఞాతంగా ఉన్నారని భావిస్తూ వచ్చాను. నిజానికి నా మనస్సులో రెండు పేర్లు మెసులుతూ ఉండేవి. మీ ప్రకటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైద్య వృత్తిలో ఉంటూ సాధికారంగా, సలక్షణంగా, మనోహరంగా పద్యాలు చెప్పే మీ అభిరుచికి, నైపుణ్యానికి నమోవాకాలు. శంకరాభరణం బ్లాగుకు లభించిన ఆణిముత్యం మీరు. ముఖ్యంగా అజ్ఞాతవాసాన్ని వీడుతూ మీరు చెప్పిన పద్యాలు రత్నాలే. ఎక్కడిదీ పద సంపద? ఎక్కడిదీ ధారాశుద్ధి? సరస్వతీ కటాక్షమే. కాదు ... కాదు ... పుంభావ సరస్వతి మీరు. నా పక్షాన మిమ్మల్ని అభినందించిన కవి మిత్రులకు ధన్యవాదాలు. వారి అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
డా. విష్ణు నందన్ గారూ, మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు. ఇక మీ పరిచయ పద్యాలు రస గుళికలే. విశేషంగా మీ వినయం అభినందనీయం.
మంద పీతాంబర్ గారూ, మీ మొదటి పద్యాన్ని సమస్యా పూరణంగా స్వీకరించ వచ్చు. అవధానాలలో అలాంటి సంప్రదాయం కూడా ఉంది. ఇక మీ రెండవ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీకు తోడుగా మరో డాక్టర్ కవి అభించారు. వారిని అభినందించినందుకు ధన్యవాదాలు. మీ పూరణ బాగుంది. అభినందనలు. అది "పదును" కాదు "పదను" కదా!
వసంత్ కిశోర్ గారూ, "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు. పద్యరచనా ప్రావీణ్యం మీకు సిద్ధించింది. అనుమానం లేదు. మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి. మీ కంద పద్యం రెండవ పాదంలో యతి తప్పింది. "అందము చందము నెరుగక ననుమానముతో" అంటే సరిపోతుంది.
"అది యొకానొక దేవరహస్య రచన
రిప్లయితొలగించండిఆ యరణ్యవాసమ్మునా మాయ లేడి
కల్పనమె; రక్కసుని చావె కారణముగ
రాముఁ డొసఁగెను జానకిన్ రావణునకు!!! "
నా అజ్ఞాతవాసానికి యివ్వాళ్టితో స్వస్తి చెబుతూ....
అజ్ఞాతృత్వము వీడి నేనిటుల సమ్యక్స్వస్వరూపమ్ముతో
విజ్ఞానాంబుధినోలలాడుటకునై విచ్చేసి కైమోడ్చెదన్!!!
యజ్ఞంబీయది ; అక్షర క్రతువు ; ధ్యేయంబూని పాల్గొందు నో
విజ్ఞుల్ ; పేరుకు -' విష్ణు నందనుడ ' - సర్వేభ్యోః ప్రణామశ్శతం!!!!
ప్రాక్తన పుణ్యలేశమున పద్యము లల్లుచునుందు ; పాండితీ
శక్తియు నావగింజ ; మరి సంస్కృత మేధయు సున్న; భారతీ
భక్తుడనామె దివ్య పద పద్మములన్ భజియించి పుణ్య సం
సక్తుడనైతి- 'ఛాందసపు జాడలెరుంగని వాడ జూడగన్ ' !!!
వైద్యుడ వృత్తికి ; కవితా
సేద్యమ్మే నా ప్రవృత్తి ; శ్రీ కవితా నై
వేద్యమ్మందించి మహా
విద్యా భారతిని గొల్తు వినయాంజలినై!!!!
పద్యాలు చాలా బాగున్నవి.
తొలగించండిడా. విష్ణు నందన్ గారూ అభినందనలు. పూరణ బాగుంది. మీరు అజ్ఞాతవాసము వదలి విజయుడు వలె ముందుకి రావడము ముదావహముగా ఉంది.
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతం.
మీ అజ్ఞాత దీక్ష వీడుతూ మీరు పలికిన పద్యాలు చాలా బాగున్నాయి.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
విష్ణు నందను పూరణల్, వినుతి కెక్కె!!!
రిప్లయితొలగించండిజ్ఞాన మయమైన విజ్ఞాన ఖనులు వారు!!!
"రాము డొసగెను జానకిన్ రావణునకు,"
గొప్ప పూరణ జేసెను మెప్పు గాను !!!
అజ్ఞాత పూరణల స్థాయి అమోఘం,అపూర్వం,అద్భుతం
వారికి అభినందనలు,నమస్సుమాంజలులు .
రాముఁ డొసఁగెను జానకిన్ రావణునకు
రిప్లయితొలగించండియతిథి సేవజే యగనెంచి యసుర రాజు
కపట యతిరూపు దాలిచి గడప ద్రొక్క;
భాసకృత నాటకమ్మగు "ప్రతిమ" యందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరొక చక్కటి కవివరులు లభించారు, శంకరయ్య మాస్టారి బ్లాగు వల్ల. విష్ణునందన్ గారికి నమస్సులతో స్వాగతం.
రిప్లయితొలగించండిసాగరమ్మున ఎర వేసి జాలములను
రిప్లయితొలగించండిమీనరాశులుఁ బట్టరె! మిధ్య గొలిపి
రాము డొసగెను జానకిన్ రావణునకు,
పంక్తికంఠుని గొట్టెను బదును జూసి !!
అజ్ఞాత గారూ మీ పూరణ లద్భుతం. మీ అజ్ఞాత వాస సమాప్తి అద్భుతం. మీ పాండిత్యానికి వన్నెలద్దేలా మీరు ప్రకటించుకొన్న వినయం అద్భుతం. వైద్య వృత్తిలో ఉంటూ ఇంతటి పాండిత్య ప్రకర్ష కలిగి ఉండటం అత్యద్భుతం. మీరు శంకరాభరణంలో సభ్యులవడం అమందానందం. మీ సరస్వతీ సేవ నిరాటంకంగా సాగాలని శారదను ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిఆర్య! వనవాస మందున నండ మీరె
రిప్లయితొలగించండియవనిజకు నంచు వచియించి యగ్ని తోడ,
రాముఁ డొసఁగెను జానకిన్, రావణునకు
కాల పాశము ఛాయను గైకొనియెను
శ్రీ విష్ణు నందన్ గారి మరియు శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలలొ అంతర్లీనంగా ఉన్న భావాన్ని తీసుకొని నాదైన పద్దతిలో చేసిన పూరణ .
రిప్లయితొలగించండిసాంకేతికంగా నేను ముందు వ్రాసినది పూరణ అవుతుందా? గురువుగారు చెప్పాలి.
చేవ గలిగిన వీరుల, చేటు, చెఱుపు
పనుల నాపగ, శక్తితో పాటు యుక్తి,
యుక్త మౌనని,దలపోసి ముక్తిదాత,
రాము డొసగెను జానకిన్ రావణునికి!!
గన్నవరపు వారు కవి గారు రవి గారు
రిప్లయితొలగించండిమణుల మూటనొసగు మందవారు
మెచ్చుకోలు పలుకు మిస్సన్న గారు ! మీ
అందరకివె పేర్మి వందనాలు!!!!
ఉడుతకు ప్రియత చారలనొసగనెవడు
రిప్లయితొలగించండిఆతడెవరినిచేపట్టె?ఆమె జనుట
కారడవికి ఏరికిచేటుగలిగె? వరుస -
రాముడొసగెను; జానకిన్; రావణునికి
#tel
రిప్లయితొలగించండిraamuDosagenu jaanakin raavaNunaku
parama bhaktude gaanibhUpatiye gaani
kaalamunnaMta varaku kaalu Daina
dariki jEraga SakyamE dharaNi paina
డాక్టరు గారూ మీరు సార్ధక నామధేయులండీ
రిప్లయితొలగించండిహా!తెలిసె విష్ణునందన!
మీ తియ్యని పద్యములకు మేల్ కారణమ
ద్దే,తిరమిద్దే, ఆ వా
ణే తమనాల్కపయినిలుచు, నిత్యము పలుకున్!
@ ఊక దంపుడు గారు
రిప్లయితొలగించండిమీ అందమైన కందానికి సుహృన్నమోవాకాలు..!!!!! హృదయపూర్వక కృతజ్ఞతలు !!!
దైవ మెటులౌను రాముడు దెలియ కున్న ?
రిప్లయితొలగించండిదనుజ పరిమార్చ నీరీతి తలచె గాన
మాయ గలిపించి మారీచు ముందు బంపి
రాముఁ డొసఁగెను జానకిన్ రావణునకు !
ఊకదంపుడు గారూ మీరూ స్వంత పేరు చిరునామాతో దిగిరండి ,రంగములోనికి
రిప్లయితొలగించండిగురువుగారూ నమస్కారములు,మరో పూరణ :
అవని కార్యము దీఱగ నవని కేను
రాముఁ డొసగెను జానకిన్; రావణునకు
ముక్తి గల్గె, దిక్పతులకు ముదము నయ్యె
స్వేచ్ఛ చలనము జగతికి శివము గూర్చ
అందరికీ నమస్కారం.
రిప్లయితొలగించండిరెండు రోజులుగా ఊళ్ళో లేను. ఎక్కడా ఇంటర్ నెట్ చూసే అవకాశం దొరకలేదు. ఇప్పుడే (రాత్రి 1.30 గం.లకు) ఇల్లు చేరి నాబ్లాగు తెరిచి చూస్తే ఎన్ని వ్యాఖ్యలు? ముఖ్యంగా డా. విష్ణు నందన్ గారి అజ్ఞాతవాస విరమణ, ఆ సందర్భంగా వారు చెప్పిన పద్యాల మాధుర్యం, దానిపై కవిమిత్రుల స్పందన నన్ను ఆశ్చర్య పరచడమే కాక ఆనంద పరవశుణ్ణి చేసాయి. నాలో నూతనోత్సాహాన్ని నింపాయి.
అందరికీ ధన్యవాదాలు.
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యోSస్మి.
మీ పూరణలను చూసి మీరు తప్పకుండా లబ్ధప్రతిష్ఠులైన కవులని. లేక తెలుగు సాహిత్యంలో యం.ఏ. లేదా పి.హెచ్.డి. చేసి తెలుగు భాషా బోధకులుగా పనిచేస్తూ ఉంటారని, అంత గొప్పవారు ఇంత అల్పమైన బ్లాగులో సమస్యలు పూరించడం చిన్నతనంగా భావించి అజ్ఞాతంగా ఉన్నారని భావిస్తూ వచ్చాను. నిజానికి నా మనస్సులో రెండు పేర్లు మెసులుతూ ఉండేవి.
మీ ప్రకటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైద్య వృత్తిలో ఉంటూ సాధికారంగా, సలక్షణంగా, మనోహరంగా పద్యాలు చెప్పే మీ అభిరుచికి, నైపుణ్యానికి నమోవాకాలు. శంకరాభరణం బ్లాగుకు లభించిన ఆణిముత్యం మీరు.
ముఖ్యంగా అజ్ఞాతవాసాన్ని వీడుతూ మీరు చెప్పిన పద్యాలు రత్నాలే. ఎక్కడిదీ పద సంపద? ఎక్కడిదీ ధారాశుద్ధి? సరస్వతీ కటాక్షమే. కాదు ... కాదు ... పుంభావ సరస్వతి మీరు.
నా పక్షాన మిమ్మల్ని అభినందించిన కవి మిత్రులకు ధన్యవాదాలు. వారి అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు. ఇక మీ పరిచయ పద్యాలు రస గుళికలే. విశేషంగా మీ వినయం అభినందనీయం.
మంద పీతాంబర్ గారూ,
మీ మొదటి పద్యాన్ని సమస్యా పూరణంగా స్వీకరించ వచ్చు. అవధానాలలో అలాంటి సంప్రదాయం కూడా ఉంది.
ఇక మీ రెండవ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీకు తోడుగా మరో డాక్టర్ కవి అభించారు. వారిని అభినందించినందుకు ధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అది "పదును" కాదు "పదను" కదా!
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
ధన్యవాదాలు.
రవి గారూ,
చక్కని పూరణ. బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
ముందుగా ధన్యవాదాలు.
ఇక మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
ప్రశ్నోత్తర రూపంగా ఉన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఇక డా. విష్ణు నందన్ గారిని ప్రశంసించిన మీ పద్యానికి ధన్యవాదాలు.
నిరంజన్ కుమార్ గారూ,
"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ముందర పద్యము వ్రాసితి
రిప్లయితొలగించండిఅందము చందము నెరుగక - సంకోచముతో
చదువరులు చదివి, దీనిగు
ణ దోషముల నెంచగలరు - నాపై దయతో
మురిపెముగ పెంచు కొన్నట్టి - ముద్దు గుమ్మ
పాలు గారెడి ప్రాయంపు - పైడి బొమ్మ
పేరు జానకి; యాపెకు - పెండ్లి జేయ
మేన బావను వరునిగా - నిర్ణయించి
కట్న కానుక కోరని - ఘనుడు గాన
వైభవంబుగ ముత్యాల - వేది యందు
కనుల కన్నీరు కదలగా - గారవమున
రాము డొసగెను జానకిన్ - రావణునకు
పద్యాలు చాలా బాగున్నవి.
తొలగించండివిష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిఇందరు కవిమిత్రుల రచనలను ఆస్వాదించటమే నా భాగ్యమని అనుకొంటుండగా,
మీరు మీ రచనలతో ఆ అదృష్టాన్ని ద్విగుణీకృతం చేశారు.
ధన్యురాలిని.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
మీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు. పద్యరచనా ప్రావీణ్యం మీకు సిద్ధించింది. అనుమానం లేదు. మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి.
మీ కంద పద్యం రెండవ పాదంలో యతి తప్పింది. "అందము చందము నెరుగక ననుమానముతో" అంటే సరిపోతుంది.
విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిఅజ్ఞాతమ్మును వీడి మీరిటుల సద్వ్యాహార సంలేఖనా
భిజ్ఞత్వమ్మున విష్ణునందనులుగా విచ్చేయ నిచ్చోటికిన్
తజ్ఞామోదము కల్గె పద్యమకరందస్వాదనామాధురిన్
ప్రజ్ఞాలుంఠిత సౌహృదీ వినయసంపన్నా నమోవాకముల్
విరిశరముల సరిపోలెడు
వరధారాపూర మధుర పద్యముల వెసన్
సరసుల యెద దోచెడు సుం
దర! సార్థకనామ! విష్ణునందన జయహో!
పద్యాలు చాలా బాగున్నవి.
తొలగించండి