శంకరాభరణము(బ్లాగు) ____________________________ ఆది కాలము నుండియు - జగము లోన విష్ణు శంకరు లొక్కరే! - వేరు గాదు! సర్వ రూపము లొక్కటే! - సత్య మిదని! వివిధ విధముల జెప్పిరి - విబుధ వరులు
నేదునూరి రాజేశ్వరి గారూ, మంచి భావాలతో పద్యాలు చెప్పారు. బాగుంది. అభినందనలు. కాని మొదటి పద్యం మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. నా సవరణ ... "కలలు గనె తల్లి కొడుకును గనవలెనని ముద్దు మురిపాలు గురిపించి పెద్ద సేయ ........" ఇక రెండవ పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణ .... "శంభు గళమందు మెలిగెడు సర్పమైన ......"
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మంచి విషయాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో "అహిలు తోడ" అని ఉంది. అది "అహితు తోడ" అనుకుంటాను.
ఎవని తలపైన దా చేయి నిడిన వాడు
రిప్లయితొలగించండిభస్మమగుటకు భవుడొక వరమొసంగె
దనుజుడంతట శివుడినే తరుమజొచ్చె
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె. !!!!
ఉగ్ర వాదుల నా నాడు యుగ్గు బాల
రిప్లయితొలగించండిరాజకీయమె పెంచెను మోజు మీరి
ప్రజల కది శాపమై నేడు బాధ వెట్టె
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.
భీముడను నొక నల్లరి - పిల్ల వాడు
రిప్లయితొలగించండిపాము తలమీద పాలన్ని - పారవోసె
ఆగ్రహించిన సర్పము - కాటు వేసె
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.
భస్మమయ్యెడి అసురుని - భరత మెల్ల
రిప్లయితొలగించండిచిట్టి పద్యము లోన నే - చెక్కినావు
విష్ణు నందన ! సుందర ! - నీదు రచన
నిరుపమానము ! సత్యము !- నిత్యమయ్య
లేమ పెక్కేండ్లు సంతాన లేమిఁ క్రుంగి
రిప్లయితొలగించండినలుగురమ్మలుజెప్పగ నాగుఁ గొలిచి
పండె తనగర్భమనిదెల్సి పలికె నిటుల-
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె
గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
రిప్లయితొలగించండితారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?
రైతు మరచిన హైటెక్కు రాజకీయు
రిప్లయితొలగించండిడతని నోడించి నొక 'దేవు' కందల మిడ
వేల కోట్లతో పుత్రు కుబేరు జేసె
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె?
కవుల కొలను లోకి కలహంసలొచ్చెను,
రిప్లయితొలగించండిగనుడు కన్ను లార కవిత లెల్ల,
పూరణాలు కనక తోరణాలై దోచు,
మంద వారి మాట!మణుల మూట!!!
ఊకదంపుడు గారూ!
రిప్లయితొలగించండిమంచి ఫలితముతోమీ
మీ పూరణ బాగుంది
మంద పీతాంబరధరా!
మరియు
హరీజీ
మీమీ పూరణలు అద్భుతమైతే
భావనలు అమోఘం
నూటికి నూరుపాళ్ళూ మీతో ఏకీభవిస్తున్నానహో...........................................................
@ వసంత్ కిషోర్ గారు
రిప్లయితొలగించండిమీ ప్రశంసా పూర్వక పద్యానికి బహుధా ధన్యవాదాలు....మూడవ పాదంలో యతి మరొక్క సారి.....గమనింపగలరు!
@ మంద పీతాంబర్ గారు
మంచి ఆటవెలది...." కవుల కొలను లోన కలహంస లడుగిడె" అంటే కావ్యభాషగా మారుతుంది...!!!!!!
పీతంబార్ గారూ మీ కవుల కొలను పద్యం నిజంగా మణుల మూట. డాక్టర్ గారు చెప్పిన చికిత్స మొదటి పాదానికి చెయ్యండి.
రిప్లయితొలగించండిడా.విష్ణు నందన్ మీ సూచనకు కృతఙ్ఞతలు.ఆ పదాన్ని సవరించి నా బ్లాగులో ప్రకటించుకొంటాను
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి ధన్య వాదములు. డాక్టరు గారి సూచనలను, రోగులు పాటించడం పరిపాటే గదా!
అదివొక కొత్త బంగారు లోకమంట
రిప్లయితొలగించండిఅందు కలదొక పాండిత్య విరుల తోట
పూయు చున్నవి పద్యాల పూల మణులు.
గాంచి నంతనె యెద నిండ హాయి కలుగు
సరసతీ పుత్రుల మెండు పేరోలగమ్ము.
అందరికిని గురువు ఆది శంకరుడు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి పూరణ ....
రిప్లయితొలగించండిఅలసి సొలసి నిద్రించిన యతని కొక్క
పాము నీడను పట్టెను పడగ విప్పి
దానిఁ గని మెచ్చి చెప్పి రవ్వాని సఖులు
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.
గురువు గారూ,
రిప్లయితొలగించండినా భావాన్ని సరిచేసి మంచి పద్య రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిఎంత చక్కని పోలికతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
సమయానుకూలమైన పూరణ నందించారు. చక్కగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
బాగుంది. మీ మొదటి పద్యానికి అభినందనలు. రెండవ పద్యానికి ధన్యవాదాలు.
అయితే రెండు పద్యాల్లోనూ మూదవ పాదంలో యతి తప్పింది.
ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
ఇక మీ రెండవ పద్యం "మణుల మూటే". ధన్యవాదాలు.
హరి గారూ,
సమయోచితమైన పూరణ. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
ధన్యవాదాలు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ భావం చందస్సులో చక్కగా ఒదిగిందా?
కలలు గనెనంత నాతల్లి కొడుకు కొరకు
రిప్లయితొలగించండిముద్దు మురిపాలు గురిపించి పెంచె గాన
ఆలి వొడిలోన మురియంగ నమ్మ విషము
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !
-----------------------------------
శివుని గళమందు మెలిగెడు సర్పమైన
పరమ భక్తితొ పూజించి పాలు బోయ
విషపు కోరల నైజము వీడి పోదు
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె !
సదస్యులందరికీ శుభాభినందనలు.
రిప్లయితొలగించండిఒకరిని మించి మరొకరి పూరణ ఉంటోంది.
విష్ణు,శంకరుల సూచనలకు ధన్యవాదములు.
హంసల కొలనిలో ప్రవేశించిన బాతునైన నన్నుకూడా హంసగా
అభివర్ణించిన పీతాంబరధరునికి ధన్యవాదములు.
శంకరాభరణము(బ్లాగు)
రిప్లయితొలగించండి____________________________
ఆది కాలము నుండియు - జగము లోన
విష్ణు శంకరు లొక్కరే! - వేరు గాదు!
సర్వ రూపము లొక్కటే! - సత్య మిదని!
వివిధ విధముల జెప్పిరి - విబుధ వరులు
ఎంద రెంతగ జెప్పినా - వినరె! జనులు!
కావరము చేత సత్యంబు - కానకున్న
వారు! శివ,కేశవులు, వేరు - వేరనియెడి
మూర్ఖు లందరు, నత్యంత - మూఢు లవని
కనులు విప్పుడు! ఇంకెంత - కాల మయ్య!
ఒక్కటై యుండి రిచ్చటే - కొలువు దీరి
కాపురము చేయుచున్నారు - కలసి మెలసి
రండి! రండయ్య! చూతము - రయము గాను
అవని పైనను బ్లాగులు - గలవు పెక్కు
బ్లాగు లన్నియు వెదకెడి - బాధ లేదు
బ్లాగులకు రాజు ఈబ్లాగు - బాగు బాగు
శంకరాభరణ మనునిందు! - శంక ఏల!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిAngla lipi vaadi nanduku kshaminchamdi. ippude world trade center kulina sthalamuni sandarSinchi vastunnaamu. Sree Missanna gaaru cheppinde marala cheppaka tappa ledu. Missanna gaaru sahrudayulu, mannistaaru.
రిప్లయితొలగించండిమూర్తిగారూ భావాలు ఒకరి సొత్తు కాదు. మీ పద్యం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిmissanna gaaru krutajnatalu
రిప్లయితొలగించండినేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావాలతో పద్యాలు చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని మొదటి పద్యం మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. నా సవరణ ...
"కలలు గనె తల్లి కొడుకును గనవలెనని
ముద్దు మురిపాలు గురిపించి పెద్ద సేయ ........"
ఇక రెండవ పద్యం మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణ ....
"శంభు గళమందు మెలిగెడు సర్పమైన ......"
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో "అహిలు తోడ" అని ఉంది. అది "అహితు తోడ" అనుకుంటాను.
గురువుగారూ మీ సూచనకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఉగ్ర వాదుల నాదము నూది యూది
రిప్లయితొలగించండిఅగ్ర రాజ్యము లాడిరి అహితు తోడ
విపణి కేంద్రము కూలగ విజ్ఞు లనిరి
పామునకు పాలు వోసిన ఫలిత మిదియె!!!