శ్రీ చింతా రామకృష్ణా రావుగారు,డా.విష్ణునందన్ గారు చక్కని పూరణలు చేసారు. గొప్ప పండితుల సరసన నిలుచున్నందులకు మాకు అవకాశమిచ్చినందులకు వారిరువురికి కృతజ్ఞతలు. విష్ణు నందన్ గారూ శంకరాభరణమునకు మకుటముగా చక్కని శ్లోకాన్ని తీర్చి దిద్ది నందులకు మరోసారి అభినందనలు. శ్రీ మంద పీతాంబర్ గారూ మీ పూరణ సవరించాక యింకా బాగుంది.
మీరంతా సరస్వతీ పుత్రులు ,పండితులు ,గురువులు.మీ మధ్యన నా పేరు తగదు.ఐనా ఎంతో వ్రాయ గలనన్న ఆశ కంటె ఏదైనా వ్రాయాలన్న చిన్న కోరిక .మీ అందరికి కృతజ్ఞతాభి వందనములు.+ " నూతన సంవత్సర శుభా కాంక్షలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
రాజేశ్వరి గారూ, మీ పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు. సరస్వతీ పుత్రుల సలహా, సహకారాలు ఎల్లకాలం కొనసాగాలని ఆశిద్దాం. వారి పద్యాలు మనకు స్ఫూర్తిదాయకాలు. పద్య రచనలో ఔత్సాహికులకు పాఠ్యాంశాలు.
హరియె హరియించు నఘముల హరుఁడగుటను.
రిప్లయితొలగించండిధరణిఁ దుష్టుల హరియించు హరుడతండు.
హరియె సుజన రక్షకుఁడగున్. హరియె దురిత
హరుఁడు. ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
హరిహరుల దారులొక్కటే నరయ గాను,
రిప్లయితొలగించండివరములిచ్చినా ,దృంచినా, వసుధ లోన
సత్యమొక్కటే నిత్యమై సాగునంచు,
హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!
ఇందు గలడందు లేడని సందియమ్ము
రిప్లయితొలగించండిలేల ? కలడు ; కలండు - ఎందెందు వెదకి
చూడ నందందు చక్రి ; విష్ణుండు; కలుష
హరుఁడు ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ విష్ణు నందన్ గారి పూరణ గొప్పగా ఉంది .సమస్యకు సరియైన పూరణ అదే అన్నట్లుగా ఉంది
రిప్లయితొలగించండివీరి పూరణ జూచి ,నా పూరణకు చిన్న సవరణ చేస్తున్నాను .
హరి హరుల దారు లొక్కటే నరయ గాను,
వరము లిచ్చినా ,దృంచినా వసుధ లోన
సత్య మొక్కటే నిత్యమై సాగ !దురిత
హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!
అమరు లసురులు వేడగా నమిత విషము
రిప్లయితొలగించండికేల నేరేడు పండును బోల గ్రోలె
హరుఁడు ;ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి
హరియు నిరువురు నొక్కరే, హరిహరుండు
శ్రీ చింతా రామకృష్ణా రావుగారు,డా.విష్ణునందన్ గారు చక్కని పూరణలు చేసారు. గొప్ప పండితుల సరసన నిలుచున్నందులకు మాకు అవకాశమిచ్చినందులకు వారిరువురికి కృతజ్ఞతలు. విష్ణు నందన్ గారూ శంకరాభరణమునకు మకుటముగా చక్కని శ్లోకాన్ని తీర్చి దిద్ది నందులకు మరోసారి అభినందనలు. శ్రీ మంద పీతాంబర్ గారూ మీ పూరణ సవరించాక యింకా బాగుంది.
రిప్లయితొలగించండి"ప్రహ్లాదుడే వచ్చి పలికిపోయినట్లు" ఉంది విష్ణు గారి పూరణ .
రిప్లయితొలగించండిఅసుర సంతతియై యుండి హరుని గొలిచె
రిప్లయితొలగించండితండ్రి హింసించ నొడిగట్టె దడియ కుండ
హరిని స్మరియించి భక్తితొ హరుడె యనగ
హరుఁ డు ప్రహ్లాదుఁ గాచి నాఁ డసురుఁ జంపి. !
మీరంతా సరస్వతీ పుత్రులు ,పండితులు ,గురువులు.మీ మధ్యన నా పేరు తగదు.ఐనా ఎంతో వ్రాయ గలనన్న ఆశ కంటె ఏదైనా వ్రాయాలన్న చిన్న కోరిక .మీ అందరికి కృతజ్ఞతాభి వందనములు.+ " నూతన సంవత్సర శుభా కాంక్షలు.
పాము నేనుగు పురుగుల ప్రేమ నేలె
రిప్లయితొలగించండిహరుఁడు, ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి
హరియు, రామదాసు వెతల హరియించె
దాశరథి జాతి యడ్డమే దైవ కృపకు?
సదస్యు లందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలు అద్భుతముగా నున్నవి.
___________________________________
01)
ఆది మద్యాంత రహితుండు! - అచ్యుతుండు
పరమ పూజ్యుడు! ముల్లోక - పాలకుండు
కమల నాభుడు! కల్యాణ - కారకుండు
హరుఁడు , ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
____________________________________
02)
రిప్లయితొలగించండిహ్లాదు, డసురుడు నందరు- హరియె గాదొ ?
"హరుడు హరిగాచె తానుగా - హరిని జంపి!"
అనిన నేమాయె! సర్వము - హరియె గాన
హరుఁడు , ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
___________________________________
రిప్లయితొలగించండిమమకారము గల దొక్కటి
ముదమారగ పదము పాడ - మొదలిడ! మదిలో!
మదనారి, కరుణ వలనను
మదమాయెను నేడు శంక - రాభరణమునన్
__________________________________
(అదనాయెను )
(శ్రధనంబగు )
___________________________________
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిబహుకాలానికి నా బ్లాగును పావనం చేసారు. మనోజ్ఞమైన పూరణతో ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ,
సవరించిన తర్వాత మీ పూరణ సార్థక మయింది. చాలా బాగుంది. అభినందనలు.
డా. విష్ణు నందన్ గారూ,
అద్భుతమైన పూరణతో నా బ్లాగును అలంకరించారు. ధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
రాజేశ్వరి గారూ,
మీ పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.
సరస్వతీ పుత్రుల సలహా, సహకారాలు ఎల్లకాలం కొనసాగాలని ఆశిద్దాం. వారి పద్యాలు మనకు స్ఫూర్తిదాయకాలు. పద్య రచనలో ఔత్సాహికులకు పాఠ్యాంశాలు.
మిస్సన్న గారూ,
ఉత్తమమైన పూరణను అందించి ఎప్పటిలాగే ఆనందపరచారు. ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.