27, డిసెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 182 (కాంతఁ జూచి మౌని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.

22 కామెంట్‌లు:

  1. కాంత తోడ జనియె కాశి నీశుని జూడ
    కదియు దొంగ గనుచు కాంతఁ జూచి
    మౌని కన్ను గొట్టె మగనాలు నో పెట్టు
    గట్టి పెట్ట దొంగ పట్టువడియె

    రిప్లయితొలగించండి
  2. ఆకలి దప్పికల, నహర్నిశులమరిచి,
    ఊపిరాపి కంటిపాప నిలిపి
    జేయు తపముఁ హళ్లిజేయ దిగిన ఐంద్ర
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.

    మాష్టారూ , ఒకటి మూడూ పాదాలలో ఏమైనా తప్పులుంటే జెప్పరూ
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  3. జడలు ముడియ గట్టి జపమాల చేబట్టి
    దొంగ స్వామి నగరి దూరి నంత
    చేరె చక్రధరుని చెల్లియే తనచెంత
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.

    రిప్లయితొలగించండి
  4. 1. యోగి యనుచు దలచి యోగము నేర్వగ;
    ముదితలంతజేరి మునిని గొల్వ
    రంజితెంతొ నచ్చి రమ్మనె లోనికి
    కాంత జూచి మౌని కన్ను గొట్టె.

    2. ఇంద్ర పదవి బోవు ఇహనాకు యనుకొని
    రంభ నంపె తపము రట్టు జేయ
    దీక్ష విడక మౌని దివ్య వరములంది
    కాంత జూచి మౌని కన్ను గొట్టె.

    రిప్లయితొలగించండి
  5. సదస్యులకు శుభాభినందనలు.
    మీ మీ పూరణలు బహు చక్కగ నున్నవి.
    _____________________________________
    01)
    దైవ శక్తి కతన - ద్వారక జేరెను
    బావ మాట నంప - పార్థు డంత
    భక్తి పూజ సేయ - బలరాము జెల్లెలు
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.
    ______________________________________

    రిప్లయితొలగించండి
  6. ఎంత వార లైన కాంత దాసులె కదా
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె-
    డునని పంత మూని చనుదెంచె నా రంభ
    శృంగి లొంగ డాయె భంగ పడెను.

    రిప్లయితొలగించండి
  7. కాంత జూచి మౌని కన్ను గొట్టు కథలు
    కాంత మౌని జూచి కన్ను గొట్టు
    వ్యధలు కవుల కేల వార్ధక్యమున వలదు
    కంది శంకరయ్య గారు ! మనకు
    -వెంకట రాజా రావు . లక్కాకుల
    బ్లాగు : స్రుజన-సృజన

    రిప్లయితొలగించండి
  8. హింస పెరిగె పరమ హంసలు కఱువైరి
    నీతి దప్పి కామ ప్రీతు లైరి,
    సత్య మైన పథము సాధువు జూపగా
    కాంత జూచి మౌని కన్ను గొట్టె!

    రిప్లయితొలగించండి
  9. సదస్యులకు శుభాభినందనలు.
    మీ మీ పూరణలు బహు చక్కగ నున్నవి.
    _______________________________

    వధువు పేరు కాంత - వరుడేమొ , మౌనియు
    పెండ్లి జరుగు చుండె - ప్రేపు నందు!
    సందు జూచి , కొంత - సల్లాప మొనరింప,
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.
    ________________________________
    ప్రేపు = ఉషఃకాలము
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. అర్థ రాత్రి వేళ - అమవస నిశి యందు
    తరుణి తోడ , దొంగ - తనము సేయ
    గుడిని జేరి నాడు - కపట మౌని యొకడు
    పాప భీతి లేని - పాపి యతడు


    సద్దు వినిన యంత - సరగున లేచిన

    ప్రజలు పరుగు లిడిరి -వారి బట్ట

    ఫలము లేక దొంగ - పార నుంకించుచు

    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.

    రిప్లయితొలగించండి
  11. ఎంత వారలైన కాంత దాసులనుట
    వింత కాదు మనకు పంత మేల ?
    తనదు పాద మంటి తబిసియౌ మ్రొక్కంగ
    కాంతఁజూచి మౌని కన్ను గొట్టె !

    తబిసియౌ = మునియై ఉంటాడని నా ఉద్దేశ్యము

    రిప్లయితొలగించండి
  12. ఏమి చెప్ప నగును ఈ కలి మహిమలు
    పరమ దైవ భక్తి, పరువు, కీర్తి
    అన్ని విడిచి నిత్య ఆనందమున దేలి
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

    రిప్లయితొలగించండి
  13. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. సమస్య పాదాన్ని పద్యం మధ్య రెండు పాదాలలో సర్దిన విధానం వినూత్నంగా ఉంది. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఒకటవ పాదంలో "అహర్నిశుల" కంటె "అహర్నిశము" అంటే బాగుంటుంది.
    మూడవ పాదంలో "హళ్ళి జేయు" ప్రయోగం విలక్షణంగా ఉంది.

    హరి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పద్యం మొదటి పాదంలో "ఇహ" శబ్దం గ్రామ్యమే. "నాకున్+అనుకొని" అన్నప్పుడు యడగమం రాదు. దానిని " ఇంద్రపదవి బోవు నిక నాకు ననుకొని"

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలును గడుంగడు ప్రశంసార్హంబులై యొప్పుచున్నవి. మీకు మూడు వీరతాళ్ళు!

    మిస్సన్న గారూ,
    సమస్య పాదాన్ని మధ్యకు జొప్పించి పూరించిన విధానం బాగుంది. అభినందనలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చమత్కారంగా చెప్పారు. నిజమే! వృద్ధులమైన మనకు ఆ కథలు గతస్మృతులే. గుర్తుకు తెచ్చుకొని సంబర పడడం తప్పు కాదు కదా? అయినా పూరణలు చేసే వారిలో నవ యువకులు, వసంత్ కిశోర్ లాంటి "శిశువులు" ఉన్నారు కదా. వారికోసం ...
    మంచి పూరణ .... అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. "తబిసి" శబ్దప్రయోగం బాగుంది. అభినందనలు.

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ పూరణ అన్ని విధాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా!

    మహా ప్రసాదం.

    మూడు వీరతాళ్ళు

    మెడను వేసుకుంటే

    మనసు వివశమై

    మహానంద పరవశయై

    సమ్మోదము నొందు చున్నది.

    మీకు కృతఙ్ఞతాభి వందనములు.

    రిప్లయితొలగించండి
  15. ఏమి చెప్ప నగును ఈ కలి మహిమలు
    పరమ దైవ భక్తి, పరువు, కీర్తి
    అన్ని విడిచి నిత్య ఆనందమున దేలి
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    ఆయన కలిసి ఉంటే కలదు సుఖమంటుంటే , మీరు విడగొడితే ఎలా ?
    "అన్నివిడచి నిత్యానందమందు దేలి" అంటే మందు కూడా జేరి ఆనందం రెట్టింపౌతుంది :)

    మాష్టారూ,
    రాత్రేదో పగలెదో తెలియకుండా అనటానికి అహర్నిశుల మరచి అన్నాను, మీరు చెప్పిన సూచన బావుంది. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  16. ____________________________________

    ముదమున, మీ దయ గాదొకొ
    సదమున సమరము , సతతము - సలుపన్ ! హృదిలో
    పదములు వదలను నిరతము
    హృదయంగమ మాయె నేడు ! - హృషితపు హృదయా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా!
    నా విన్నపము(స.పూ-182)
    నొకపరి తిలకించుడు.

    రిప్లయితొలగించండి
  18. ఒంటి కన్ను యున్న నొక్క ము నిని జూడ
    పండు చేత బట్టి వచ్చి నిలువ !
    మౌన వ్రతము గాన మంచిగా చేయెత్తి
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె !!

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కన్ను + ఉన్న‘ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కన్ను గలుగు’ అందాం. ‘మౌనవ్రతము’ అన్నచోట ‘న’ గురువవుతుంది. ‘మౌనదీక్ష’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు. మీ సూచన తో చిన్న సవరణ ...

    ఒంటి కంటి వాని నొక్క మునిని జూడ
    పండు చేత బట్టి వచ్చి నిలువ,
    మౌన దీక్ష గాన మంచిగా చేయెత్తి
    కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .

    రిప్లయితొలగించండి