26, డిసెంబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 181 (ముండై యుండుట)

కవి మిత్రులారా,
ఈ వారం పూరించ వలసిన సమస్య ఇది ......
ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.
ఈ సమస్యను పంపిన `ఫణి ప్రసన్న కుమార్ ` గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. పండున్ జీవితమెల్ల నిర్మల మనోభావమ్ములన్ గల్గ ; బ్ర
    హ్మాండమ్మెల్ల ప్రశంసలన్ గురియు సమ్యక్ శీల సౌందర్యముల్
    నిండారన్ సుగుణాభిరాముడయి , వర్ణింపంగ సాక్షాత్తు - రా
    ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  2. గండంబుల్ పలు రానిపోని ,ధరలో గర్వాంధులన్ ద్రుంచ,భీ
    ముండైయండగ నుండు వాడు,మదిలొ మ్రోగించ రాగంబు కృ
    ష్ణుండై,తోడును వీడకుండ నెపుడున్ శోకంబు దీర్పంగ,రా
    ముండై యుండుట మేలుగాదె జగతిన్ ముత్తైదువుల్ మెచ్చగన్!!!.

    రిప్లయితొలగించండి
  3. మెండై, పండిత పామరాళి పొగడన్ మేలౌ యశోవంతుడై,
    నిండై, బంధుజనంబునందు తలలో నిక్కంపు మాణిక్యమై,
    రెండై యుండని మాటగల్గి మగడే ప్రేమైక సౌశీల్య రా
    ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  4. గూండాలందరు రాజకీయ జగతిన్ గూర్చుండి దేశాన్ని దో
    చం డాయంగ , వివేక వంతుడు మహా శక్తుండు గా "ఓటరుం"
    డుండీలేని యచేతన స్థితి గతిన్ - ఓహో! మహా శాంతి కా
    ముండై యుండుట మేలు గాదె ? జగతిన్ ముత్తైదువల్ మెచ్చగన్

    --వెంకట రాజా రావు . లక్కాకుల
    బ్లాగు పేరు: సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  5. దయ చేసి నా భావాల్ని చందోబద్దం చేయరూ?

    ఋషి పత్నుల మోహించుచు
    కృషి సేయక క్షీణించు అగ్ని జూసిన స్వాహా
    అఋషుని మెప్పించె క్షణమున ,పతి ఉత్త
    ముండై ఉండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చగన్

    యముండ యముండని బలుకుచు
    తానుండు నెలవు వీడి ధరకేతెంచెన్, అధ
    ముండై బాలుని ప్రాణములను గొను కంటెను ఉత్త
    ముండై ఉండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  6. గురు వర్యా! ఆఋషుడు/అఋషుడనిన అగ్నియేనా?

    రిప్లయితొలగించండి
  7. రాజారావు గారూ మీ పద్యం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  8. "రండో నాసుతు సేయ పెండ్లి కొమరున్ రాలేను నేనిత్తరిన్
    ముండై యుండుట, మేలు గాదె జగతిన్ ముత్తైదువల్? మెచ్చఁగన్
    అండై యుండుడు" యిట్లు తల్లి పలుకన్, ఆవేదనన్ పుత్రు "డా-
    గండీ అమ్మయె పుణ్యశీల" యనియెన్ కన్నీరు చిప్పిల్లగన్.

    రిప్లయితొలగించండి
  9. పద్యం సరిగ్గా కుదరలేదు, అయినా ఓ ప్రయత్నం :-

    "బండల్వారెను దేహమే వయసు దాపంజాలగాఁ శక్యమే?
    దండంబాయె కచేరికొల్వు యిక వార్ధక్యంబుఁ దండెత్తెఁ బో"
    చెండాడున్ సతి ఊసుఁ విన్న, మయి యిస్త్రీషర్టు, సెంటున్, శిర
    మ్ముం "డై" యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  10. రవి గారి పూరణ బలే తమాషాగా ఉంది. బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. కవి మిత్రులారా,
    మహదానందం! వారాంతపు సమస్యాపూరణానికి మొదటిరోజే ఇంత స్పందనను నేను ఊహించలేదు. ఒకరిని మించి మరొకరు మనోజ్ఞమైన పూరణ లందించారు. అందరికీ ధన్యవాదాలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    మనోహరమైన పూరణ మీది. సాధికారంగా శబ్దాలను ధారాశుద్ధితో ప్రయోగించే మీ పద్య రచనా నైపుణ్యానికి నమోవాకాలు.

    మంద పీతాంబర్ గారూ,
    వృత్త రచనలోనూ మీరు సిద్ధహస్తులే. పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    ఫణిప్రసన్న కుమార్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రస్తుత కాలోచితమైన విషయంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    ఎన్నెల గారూ,
    అది శార్దూల వృత్త పాదం కదా. మూడవ పాదం చివర "ఉత్త" పెట్టడం కుదరదు. అయినా మీ భావానికి పద్య రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ సాయంత్రంలోగా.
    అరుషుడు/అరూషుడు శబ్దాలకు మాత్రం "సూర్యుడు" అనే అర్థం ఉంది.

    మిస్సన్న గారూ,
    ఆర్ద్రమైన భావంతో మనోహరంగా సమస్యను పూరించారు. ధన్యవాదాలు.

    రవి గారూ,
    సరిగా కుదరక పోవడమా? మీ పూరణ చమత్కారభరితమై చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అందఱూ చక్కని పూరణలు చేసారు. రవి గారూ మీ పూరణ అద్భుతము. మీరు ' డై' వేసుకోవడముతో సరి బెట్టారు. ఆ రంగు వేయడానికి తగినంత కేశ సంపద లేనప్పుడు యీ అగచాట్లు :
    సరే, రోజూ ఆట వెలదులతోనేనా నృత్యము, యీ రోజు పులితో ఆటాడాలని ,

    రౌండున్ జంద్రుని బోలియుండు శిఖపై రమ్యంబునౌ బట్టనున్
    రెండున్ బ్రక్కల నుండి దెచ్చి నెరులన్ రెట్టింపుగా గప్పగా
    గుండాకోరులె పుత్రులున్ సఖియు నా కొండే విలాసంబ సో
    ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చగా !!

    రిప్లయితొలగించండి
  13. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వృత్తాన్ని కూడా సమర్థంగా వ్రాసారు. అభినందనలు.
    మొదటి పాదం ఇలా ఉంటే ఎలా ఉంటుంది?
    "రౌండై చంద్రుని వోలె బట్టతలయే రమ్యమ్ముగా దోచగన్"

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ మీ సూచన ఎంతో బాగుంది. ధన్యవాదములు.
    మిస్సన్నగారూ ధన్యవాదములు. దీనినే ' భ్రామర కీటక న్యాయము ' అంటారు.

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్య గారూ,
    ఈ సమస్య నేను పంపినట్టుగా పోస్ట్ అయింది.
    కాని, నేను పంపలేదు. వీలు చూసికుని దానిని సవరించ గలరు.

    విద్యాసాగర్

    రిప్లయితొలగించండి
  16. విద్యాసాగర్ గారూ,
    నిజమే. నేను పొరబడ్డాను. దానిని పంపించింది `ఫణి ప్రసన్న కుమార్` గారు, `తురుపుముక్క` కోడీహళ్ళి మురళీ మోహన్ గారి అనుజులు. బెంగుళురు వాసి. సవరించాను.

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్య గారూ,
    ఇంతవరకు నేను కొన్ని తేట గీతులు ఆట వెలదులు రాసేను.
    కంద పద్యం రాయటానికి మొదలు పెట్టి, 'హరి యను రెండక్షరములు' అనే పద్యాన్ని ప్రేరణ గా తీసుకుని
    మొదటి సారిగా కంద పద్యం రాసేను. ఆ పద్య పాదాన్నే మీ బ్లాగ్ లో 180 వ సమస్య గా పోస్ట్ చేసి నా పద్యాని కి ఎంతో విలువ నిచ్చారు,
    చాలా సంతోషం.
    రవి గారూ, మీ పద్యం బాగుంది, కాని, రెండో పాదం లో 'దండంబాయె కచేరి కొల్వు' అన్నమాట ని ఉద్యోగం వార్ధక్యం లో తోడు వస్తోందని అర్ధం వచ్చేలా వాడేరా? నా అజ్ఞానాన్ని మన్నిచండి,

    విద్యాసాగర్ అందవోలు

    రిప్లయితొలగించండి
  18. @విద్యాసాగర్ గారు: దండంబు - ఆసరా అని మీ ఊహ బావుంది. కానీ, నా ఉద్దేశ్యం ఉద్యోగం దండగ - వార్ధక్యం వల్ల న్యాయం చేయలేకపోతున్నందుకు అనండి.

    ఇక్కడ జ్ఞానులెవరూ లేరండి. మనందరమూ విద్యార్థులమే. :)

    రిప్లయితొలగించండి
  19. నరసింహ మూర్తి గారూ సందర్భాను సారంగా చతురోక్తి విసిరారు కానీ,భ్రమర కీటక న్యాయం కీటకాలకి అనుకూలంగా చెప్పారు గానీ భ్రమరాలు సహజంగానే భ్రమరాలు. అయినా దగ్గులు నేర్చిన తాతగారికి వేరొకళ్ళు క్రొత్తగా నేర్పే దేముంటుంది? పద్య రచనలో పరిపూర్నులయ్యారు.చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి
  20. విబుధ వరులకు వందనములు.
    జోదులకు కై జోతలు.
    విఙ్ఞులకు విన్నపములు.

    వృత్తము వ్రాయుట యందిది
    నా ప్రధమ ప్రయత్నము.
    గుణ , దోష విచారణ
    చేయుడని ప్రార్థన.

    01)
    ___________________________________________
    దండై , రాక్షస మూకలెల్ల , దనపై - దండెత్త , దుర్మత్త వే
    దండంబున్ గడతేర్చు , సింగము వలెన్ - ధారాళ , దీవ్రాహతిన్
    చెండాడించిన యట్టి వీరు , పగిదిన్ - జేజేలు బొందంగ,రా
    ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్.
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  21. మిత్ర వర్యా! కిశోర్ జీ అద్భుతంగా ఉంది. శభాష్ !!!

    రిప్లయితొలగించండి
  22. ధన్యవాదములు
    మూర్తి గారూ.

    మీ , మీ , ప్రోత్సాహము
    గురువు గారి ఆశీస్సులు
    నాకు కొండంత బలం.

    రిప్లయితొలగించండి
  23. Sankarayya gaarikee, blaagmitrulandarikee nutana samvatsara Subhaakaankshalu
    Ennela

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు.
    గురువుగారి
    మెరుగులను
    తిరిగి ప్రచురించడమైనది.

    ఇక్కడ ఉంటేనే బాగుంటుందని
    అంతే.
    ___________________________________________

    కంది శంకరయ్య చెప్పారు...
    వసంత్ కిశోర్ గారూ,
    వృత్త రచనలోను సిద్ధహస్తు లయ్యారు. సంతోషం!
    పూరణ బాగుంది. అభినందనలు.
    "ఫల పుష్పా వృక్ష" అనేకంటే "ఫల పుష్ప క్ష్మాజ" అంటే బాగుంటుంది.
    వారాంతపు సమస్యాపూరణం 181 చూసాను. మీ పూరణ బాగుంది. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. మొదటి ప్రయత్నంలోనే అదరగొట్టారు. గుణాధిక్యత వల్ల అల్పదోషాలు లెక్కకు రావు. "ధారాళ దీవ్రాహతిన్" అన్నదే దోషం. "ధారాళ బాణాహతిన్" అంటే సరిపోతుందేమో?!
    18 జనవరి 2011 6:55 ఉ ____________________________________________

    రిప్లయితొలగించండి
  25. పండౌచుండగ సర్వ పాపములహో ప్రారబ్ధ కర్మంబునన్
    చండాలమ్మవ రాజకీయ ఘనతల్ జంబమ్ము కోల్పోవుచున్
    గుండైయుండగ కాంగ్రెసంత నహహో కూర్చుండి కుందించుచున్
    ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి