9, జనవరి 2017, సోమవారం

సమస్య - 2248 (చెల్లెలినిఁ బెండ్లియాడ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము"
లేదా...
"చెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే"

40 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమః

    అల్లన యా సుభద్ర మది నాశలు రేపగ మౌని వోలె తాన్
    మెల్లగ జేరె ద్వారకను మిక్కుటమౌ విరహంపు బాధ రం
    జిల్లగ యుక్తితోడ సడి చేయక గైకొని వాసుదేవునిన్
    చెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అల్లన నా సుభద్ర...' అనండి.

      తొలగించండి
  2. లక్ష్మణుడు:

    భర్త యానతి బాలించి బాధ నోర్చి
    కనుల వేదన నోర్వక కనులు మూసి
    నిదుర వోయిన ప్రేయసిని - తన వదిన
    జెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా ఆచారంలో వదిన చెల్లెలిని పెండ్లాడం నిషిధ్ధము!

      తొలగించండి


    2. ఒకే కుంపటి నించి రెండు "ప్రమా(మ)దా" లెందుకని నిషిద్ధం చేసి ఉంటా రేమో :)

      జిలేబి

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని పెళ్ళాడిన తరువాత కదా ఆమె నిదురపోయింది! మీరు నిద్రపోయిన ప్రేయసిని పెళ్ళాడా డన్నారు.

      తొలగించండి
    4. సార్! పెళ్ళి యాడిన తరువాత కూడా భార్యలు (కొందరు) ప్రేయసులు గానే ఉంటారు గదా...ముఖ్యంగా చెప్పిన మాటలు వినేవారైతే!!!

      తొలగించండి
  3. తపము జేయగ గెలిచిన తనయ హైమ
    మశన మందున దిరిగెడి శశి ధరుండు
    పాల కడలిని శయనించు బాహు భేది
    చెల్లెలినిఁ బెండ్లి యాడ మెచ్చెను జగమ్ము
    ----------------------------
    బాహుభేది = విష్ణు

    రిప్లయితొలగించండి


  4. అల్లుడిని రమ్మని బిలువ యంద గత్తె
    మరదలగు సుభద్రను గాంచి మదిని వలచె,
    బావ చెలువముల కిరీటి బాగు బాగు
    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...బిలువ నందగత్తె' అనండి.

      తొలగించండి
  5. డా.పిట్టా
    రూపయౌవన సంపన్న రూఢి వరుడు
    గుణము పద్మిని జాతిదౌ గురుతు లెన్ని
    అక్క పెళ్ళి చూపులను దివ్యాంగయైన
    చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జగమ్ము!
    "అల్లము","సున్నము"ల్లనెడు నప్పటి వంశపు మేళవంబనన్
    బెల్లపు వక్కయౌ(ను)యువిధ బెండ్లికి నెద్గిన కూతు, దాపునన్
    చెల్లెడు యాకు వంటిదగు చెల్లెలు మూగ;వరుండు నెంచి యా
    చెల్లెలి బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే!
    ("ఏం జరిగింది?"
    "ఆ..నాకేం తెలుసు,/అల్లం బెల్లం ఆకుల సున్నం/?" /జాతీయం కలదు.)
    " రూప యౌవన సంపన్నమ్ విశాలాత్కుల సంభవ/విద్యాహీనమ్ నశోభంతే ఫలాశ కుసుమమ్ వృధా"ఆర్యోక్తి
    అల్లము సున్నముల్ యనెడు నప్పటివంశపు మేళవంబనన్
    బెల్లపు వక్కయౌ(ను)యువిధ బెండ్లికి నెద్గిన కూతు దాపునన్
    చెల్లెడు యాకు వంటిదగు చెల్లెలు మూగ;వరుండు నెంచి యా
    చల్లెలి బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వక్కయౌ నువిద' అనడమే సాధువు. 'ఎదిగిన'ను 'ఎద్గిన' అనడం సరికాదు. 'చెల్లెడు నాకు...' అనండి.

      తొలగించండి
  6. భీమసేను డరణ్యము భీకరమగు
    బవరమునఁ జంపి వెస హిడింబాసురు తన
    చెల్లెలినిఁ బెండ్లి యాడ మెచ్చెను జగమ్ము
    తల్లియానతిఁ దీర్చిన తనయు గాంచి

    రిప్లయితొలగించండి
  7. ప్రల్లదులైన కౌరవులు పాల్పడి లక్కగృహమ్ముఁ గాల్చగన్
    నల్లనివాని యాదరణ నాడు బయల్పడి, కాననమ్ములో
    పెల్లిదమైనకోపమున భీముఁడు తున్మి హిడింబునిన్, రహిన్
    చెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అతని చెల్లెలిని' అనవలసింది 'తన చెల్లెలిని' అన్నారు. 'హిండింబాఖ్యు నతని' అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు ధన్యవాదములు. వృత్తములో కూడా తున్మి హిడింబు వానిదౌ / చెల్లెలి - ఆంటే సరిపోతుందా. తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
  8. కల్ల సేసి కన్న కలలు గొల్లమేటి
    మగఁడు రుక్మికి ఘన చైద్య మగధ సేన
    లెల్ల నుల్లమ్ములను దల్ల డిల్ల రుక్మి
    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము


    చల్లని చిత్త మున్న మరి చాలదె యందము గూడు వెట్టునే
    కల్లలు గాక నిత్యములె కాయపు టందము లెంచి చూచినన్
    నల్లని దంచుఁ దా దొర తనమ్మునఁ బక్కనఁ బెట్టి యక్కనుం
    జెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా నున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. జగము నాడించు బోషించు జంపు కృష్ణు
    చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జగమ్ము
    పార్ధు నెంతయో పరిణయం బాడు కత న
    కృష్ణు డనగను సాక్షాత్తు విష్ణు వుగద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. తేజము,పరాక్రమమున నా దీట టంచు

    నన్న బలరాము నొప్పించె వెన్నదొంగ

    మాయ యతి వేషమున నున్న మఘవుసుతుడు

    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. అల్లదె యెంత పాపమగు హర్ష కుమారుడ ! లేకవావియున్
    చెల్లెలి బెండ్లి యాడిన ,విశేషముగా జన మెల్ల మెచ్చరే
    పాలును నీరులా కలిసిభవ్యము గానిక గల్సియుం డి న
    న్గా లుని నానతిన్ దనుక కాపుర మట్లుగ జేయుటొప్పగున్

    రిప్లయితొలగించండి
  12. అక్క చెల్లెండ్రు చక్కని చుక్కలైన
    నక్క గర్విష్టి, తూలుచు నిక్కుచుండు ;
    చెల్లి మృదుభాషి, చేతన శీలి యొకడు
    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  13. విల్లును చేతబట్టి యరి వీరుల గూల్చెడు సవ్యసాచియే
    కల్లతనమ్ము తోడ మునిగా తన రూపము మార్చియే గదా
    యుల్లము నందు నిల్పిన మహోన్నత సద్గుణ శీలి కృష్ణకున్
    జెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే

    యాత్రనెపమున వెడలిన యర్జునుండు
    మారువేశమ్ము ధరియించి మనసు గొన్న
    కోమలి, తన సఖుడు యదుకులతిలకుని
    చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జనమ్ము.

    రిప్లయితొలగించండి
  14. Suguna Rupanagudi‎
    to
    Telugu Brahmins
    3 hrs ·

    ఒక సారి అవధానం లో ఈ క్రింది నాలుగుఆంగ్ల పదాలు యిచ్చిభారతార్థం వచ్చేట్టుగా శ్లోకం చెప్ప మన్నారు..సంస్కృత దత్తపది.డా.మాడుగుల నాగఫణి గారి పూరణ.
    దత్తపది : స్టాప్, లిజన్ , అండ్, ప్రొసీడ్ ఈ పదాలు యిచ్చి చెప్ప మన్నారు.

    ఇష్టా పూర్తీ రిహాస్తుతే జనవర ప్రౌఢ ప్రియం భావుక
    బ్రహ్మాండ స్థిర వర్ణ నీయ ఘటనా వ్యాపార లీలాస్పదా
    కేలీజన్మ విహార ధారణా కళా దివ్య ప్రభావాంగ
    హే! విప్రోసీడ్య గుణార్ణ వ స్తుతి పరాకాష్టా స్థితే తే నమః
    అర్థము:--ఓ భగవాన్! నీవు మాకందరికీ ప్రియమైన బావమరిదివి.ఈ బ్రహ్మాండా న్నంతటినీ పాలించే ఘటనా
    ఘటనా సామర్థ్యము కల వాడివి.నీ అవతారాలన్నీ దివ్య ప్రభావము లను చూపే ఆటల వంటివి.నీవు విప్రుడవు అంటే జ్ఞానివి. యీడ్యగుణా ర్ణుడవు= పొగడదగినట్టి గుణములకు సముద్రము వంటి వాడవు స్తుతి పరాకాష్టకు యోగ్యుడైన నీకు నమస్కరిస్తున్నాను ఇష్టా పూర్తీ లో స్టాప్,బ్రహ్మా౦డం లో అండ్, కేలీ జన్మలో లిజన్,
    విప్రః +అసి+ఈడ్య విప్రోసీడ్య లో ప్రొసీడ్ అనే పదము వచ్చాయి. ఇలాగ ఆంగ్లపదములను సంస్కృతం లో మిళాయించి మంచి శార్దూల వృత్తం చెప్పారు.అవధాని గారు.
    1 Comment

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మంచి దత్తపదిని పరిచయం చేశారు. ముఖపుస్తకంలో ప్రకటించిన రూపనగుడి సుగుణ గారికి, దీనిని బ్లాగులో షేర్ చేసిన మీకు ధన్యవాదాలు!

      తొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ప్రాణుల లయకారకుడౌచు వఱలు నట్టి
    శంకరుండు స్మరమున నా శైలసుతను,
    సకల జీవులను పోషించు చక్రధరుని
    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  16. తల్లి దండ్రుల నెదిరించి తనకు నచ్చి

    నట్టి సద్గుణ రాశి దివ్యాంగులైన

    నున్నతంబగు వ్యక్తిత్వమున్న హితుని

    చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జగమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మనసు పడివలచినయట్టి మగువ తెగువ
    గాంచి కృష్ణుడు ముదమున కదలి వచ్చి
    రాక్షస వివాహమున తాను రక్తిఁరుక్మి
    చెల్లెలిని బెండ్లి యాడ మెచ్చె జగము.

    యాత్రలకటంచు వెడలిన యర్జునుండు
    కపట యతిరూపుతో ద్వారకపురి చేరి
    మనసుపడివలచిన యట్టి మారజనకు
    చెల్లెలిని బెండ్లి యాడ మెచ్చెను జగమ్ము.

    రిప్లయితొలగించండి
  18. అక్క కన్నట్టి బిడ్డలు నమ్మయనుచుఁ
    గాళ్లఁ జుట్ట వాత్సల్యమ్ము గ్రమ్మినంత
    తల్లి లేని లోటున్ దీర్చఁ దండ్రి,యామె
    చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  19. చెల్లిలి పెండ్లికై వరుని చెన్నుగ కన్గొని పల్కరించ, "నా
    చెల్లిని నీవు చేకొనిన చేసెద శ్రేష్ఠపు కుండమార్పులన్
    పిల్లలు పెద్దలున్ మురియ పేరిమి నుందుము", తాననంగ, నా
    చెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే!

    రిప్లయితొలగించండి