కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై"
లేదా...
"కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై"
లేదా...
"కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
కం. హింసించెడి రక్కసులను
రిప్లయితొలగించండిధ్వంసమొనర్పగను బూని ధరణికి వెలుగౌ
హంస సమానుడు; నిర్జిత
"కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై"
నిర్జిత కంసుడు = శ్రీకృష్ణుడు.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"హతో వా ప్రాప్స్యసి స్వర్గం"
రిప్లయితొలగించండిహంసలును పరమహంసలు
సంసారము వీడిజేయు సాధనలు వినా
ధ్వంసమ్మై హరిజేరిన
కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంసయము వలదు జనులకు
రిప్లయితొలగించండిహింసించెడి మృగము గాదు నెయ్యపు రేడే
హంసల దీవిని హంసట
కంసుడు మిము బ్రోచుగాత కరుణా మయుఁడై.
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని పూరణ అర్థం కాలేదు.
నమస్కారములు
తొలగించండికంసుడు అంటే అంత దుర్మార్గుడు కాదు ,హంసలతో ఉన్నప్పుడు హంసలాంటి వాడు ,అవుసరాన్ని బట్టి దుష్టుడు అని " దేవకి పిల్లల్ని వసుదేవుడు ముందుగా తెచ్చినప్పుడు చంపకుండా వద్దన్నాడుగా పాపం .అదన్నమాట
రిప్లయితొలగించండిహింసా ప్రవృత్తి వాడౌ
కంసుఁడు! మిము బ్రోచుగాత కరుణామయుఁడై
వంశోద్ధారక మహనీ
యాంశుడు మాకన్నడతని యంతము జేయన్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంశయ మేటికి? దుష్టుడు
రిప్లయితొలగించండికంసుడు, మిము బ్రోచుగాత కరుణా మయుడై
వంశీ ధరుడతడే ని
శ్శంసయముగ శిష్టలోక సంరక్షకుడే
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండికంసము బంగారంబును
హింసయు వైరంపు భక్తు లిల నొకరూపై
హంసగ గృష్ణుని గలిసిన
కంసుడు మిము బ్రోచుగాత కరుణామయుడై!
హింసా పూరిత వాసి మామలకిడన్ యీభూమినిన్ దుష్ట యా
శంసాల్ నిర్గతమైన బ్రేమలకవే శాపాలుగా మారవే?
హంసల్,చిల్కలు, ముద్దు మూటలనుచున్ హ్లాదంబునన్ బొంగు నా
కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్!
(నేడు విదేశాల్లో గడిస్తూ మేన మామలుగా విశిష్ట భూమికను పోషిస్తున్నారు.తల్లిదండ్రులకు బాసటలౌతున్నారు.కంసాన్నిబంగారంగా మార్చే మేనమామలకు ఈ అంతర్దేశీయ వేదికపై కృతజ్ఞలతో డా.పిట్టా)
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఇడన్+ఈ' అన్నపుడు యడాగమం రాదు. 'మామల కిడ న్నీభూమినిన్' అనండి.
హంసగమన జనకుఁడు, వి
రిప్లయితొలగించండిధ్వంసిత సకలామరారి, ధార్మిక జన మీ
మాంసా లక్ష్యుఁడును, విజిత
కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై.
పూరణ మనోహరము ! అభినందనలు !
తొలగించండిహింసించె నెల్ల జనులను
రిప్లయితొలగించండికంసుడు ,మిము బ్రోచుగాత కరుణా మయుడై
కంసారి యెల్ల వేళల
సంసారము నిండ యుండు శంకరు కరుణన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి గారి పూరణ.....
రిప్లయితొలగించండి{కృష్ణుడు జన్మి౦చిన తర్వాత వసుదేవుడు దేవకితో అన్న మాటలు :-}
హి౦సార౦భకు డౌ త్వదగ్రజు డిక న్నీ బిడ్డ ప్రాణమ్ములన్
ద్వ౦స౦బు న్నొనరి౦చ నె౦చు నకటా పాలి౦చు వారెవ్వరో
క౦సు౦డే మిము బ్రోచు గాత తనదౌ కారుణ్యము౦ జూపుచున్
హ౦సీయాన! త ద౦ఘ్రియుగ్మమె శరణ్య౦బౌ గదా దేవకీ !
స౦సేవి౦పుము వానినే | మన యదృష్ట౦ బెట్టు లో యట్టు లౌ
{ మిము బ్రోచుగాత = నిన్ను నీ బిడ్డను రక్షి౦చు గాక ; హ౦సి = ఆడహ౦స }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
సంసారాబ్ధి తరణి బృహ
రిప్లయితొలగించండిదంస విరాజిత శరీరి దనుజ నిచయ వి
ధ్వంసుడు వంశుడు ఖండిత
కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై
కంసారాతిగఁ బేరు గాంచ హరి సంకాశుండు భోజేంద్రునిన్
హంసశ్వేత సుతూలికాస్తరను దేహాంతంబు గావించి వి
ధ్వంసంబై తనరారు మంచమున విభ్రాంతాత్ముడై యుండ నా
కంసుండే, మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యముం జూపుచున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిధింసా నృత్యము జూచిన
రిప్లయితొలగించండికంసుండను వాడు కనలి గదనెత్తంగా
హంసలు నడకల తోననె
"కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై"
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హింసన్ బెంచుచు సాధు సజ్జనుల దా హింసిన్చుచున్ దుష్టులే
రిప్లయితొలగించండిసంసేవించెడి రాజు చెంత కకటా సౌందర్య వారాశులై
శంసల్బొందిన బాలలూ చనగ మీ సంతోష మేమౌనొ ఆ
కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాలలూ' అనడం వ్యావహారికం. 'బాలలున్' అనండి.
బాలలూఅనిసంబోధనపరంగాప్రయోగించానండీ. మధురానగరివీధుల్లో నడుస్తూవెడుతున్న రామకృష్లుణులనుచూచి పురవాసులనుకొంటున్నట్లుగా.
తొలగించండికెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ....
రిప్లయితొలగించండికం.సు.డ .న కంచి.సుముఖు. డు
'హంసధ్వని ' ప్రియుడు మాపు నవరోధములన్
సంసిధ్ధినొసగుదేవుడు
కం.సు.డు.మిము బ్రోచు గాత కరుణామయుడై.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు నమస్కారము! నా పేరు గుఱ్ఱం సీతాదేవి! శ్రీ దేవి కాదు!
రిప్లయితొలగించండివంశీధరుండు యాదవ
వంశోద్భవుడా మునిజన బంధువు హరియే
హంసుడు జీవుల, మర్దిత
కంసుడు మిముబ్రోచుగాత కరుణామయుడై!
మనవడి మీ సూచనలను గ్రహంచాను! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమన్నించండి! టైపు దోషము! నిన్నటి మీ సూచనలను గ్రహించాను!ధన్యవాదములు!
రిప్లయితొలగించండిగుఱ్ఱం సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హంసుడు జీవులకు, విజిత\కంసుడు...' అనండి. అన్వయం కుదురుతుంది.
(జనార్దన రావు గారికి మీరేమవుతారు?)
పూజ్యులు శంకరయ్య గారికి గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి వందనములు.
తొలగించండిగుఱ్ఱం సీతా దేవి నా సహోదరి. కొన్నాళ్ళక్రితం మీరిచ్చిన న్యస్తాక్షరికి సీతా దేవి ఉత్పలమాల పూరణను నేను తనపేరున శంకరాభరణం లో ప్రచురించాను. మీరూ శ్రీ కామేశ్వర రావు గారు సహృదయతో స్పందించి ప్రొత్సహించారు. మొత్తానికి నా రాకతో శంకరాభరణ వేదికలో గుఱ్ఱాల జనాభా త్రిగుణీకృతం అయినది ;)
హింసలు తొలగు త్వరితముగ
రిప్లయితొలగించండిద్వంసము నిశ్చయము సుమ్మువైరి తతులకున్
హంసుడు, దోర్బల నిర్మద
కంసుఁడు మిము బ్రోచుగాత కరుణామయుఁడై
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హింసకు మఱియొక నామమె
రిప్లయితొలగించండికంసుడు ! మిము బ్రోచు గాత కరుణామయుడై
హంసుడు తిరముగ నెదల న
హింసను నిలుపుచు బ్రతుకుల హేమము సేయన్!
శ్రీధర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ! నమస్కారములు.
రిప్లయితొలగించండినిన్నటి పూరణ-
కరగిన కాలము నెంచక
పరువడి నొందిన మనీషి వగుచు కపర్దిన్
పరపున గొలుచుచు నుండగ
తరుణాతీతకృత కర్మత తతులిడు శుభముల్.
నేటి పూరణ-
పాంసనుడై మెలగెనుగా
కంసుడు; మిము బ్రోచు గాత కరుణామయుడై
కంసారతి ననురతితో
సంసిద్ధిని గూర్చెగా భజనల కలరుచున్.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్
రిప్లయితొలగించండిహింసన్ మానును|”నమ్మిగొల్వగనె| దేహీయన్న దీనాత్ములున్
ద్వంసంబెంచడు, మీరకన్ విధియనే ధ్యానించుడీ కంసునే
సంసేవింపకయున్న ముప్పుయగులే సన్యాసమున్ వీడుడీ.
2,హింసకు పనిగల్పించడు
ద్వంసంబొనరించ బోడు తనమాట వినన్
సం సేవించెడి వారిని
కంసుడు మిము బ్రోచుగాత కరుణా మయుడై|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'విధి యనే'... 'అనే' అనడం వ్యావహారికం. ముప్పు+అగులే... అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
హంసయె పుట్టెను గదనీ
రిప్లయితొలగించండివంశమ్మున, వచ్చునిటకు భయమింకేలా!
వంశీధరుచే జచ్చును
కంసుడు, మిము బ్రోచుగాత కరుణామయుడై
(గురువు గారికి నమస్కారములు ఈ రోజు మానాన్న గారి ఆబ్దికం అసలు తీరిక దొరకలేదు. వృత్తాన్ని రేపు ప్రచురించగలను)
కంసా ! చావిక తప్పదంచు వినె నాకాశమ్ము పల్కంగ నే
రిప్లయితొలగించండిహింసించెన్ తను మూఢుడై నృపుడు తా హీనుండుగామారె నా
కంసుడే, మిముబ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్
హంసైపుట్టిన దేవకీసుతుడు, మాయా లీలలన్ జూపుచున్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హింసలు చేసెడి వాడా
రిప్లయితొలగించండికంసుడు!మిముబ్రోచు గాత కరుణామయుడై
హంసుడు శిష్ఠుల కాచుచు
పాంశుల నణచుచు సతతము వసుధలో వెలుగున్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వసుధను వెలుగున్' అనండి. వసుధలో.. అంటే గణదోషం. వసుధలొ అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు కదా!
హంసను బోలిన కృష్ణుడు
రిప్లయితొలగించండిధ్వంసము జేసెను దెలియుచు దైత్యుల నెల్లన్
హింసల గూలి విజయమిడ
కంసుడు, మిము బ్రోచు గాత కరుణామయుడై
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి*సహస్రకవిరత్న కవిభూషణ*
*సందిత బెంగుళూరు*
*ధ్వంసంబాయెనునాటకస్థలిమహావర్షప్రభావంబుచే*
*సంసారస్థితస్వస్థలంబరయకంసాహార్యుడౌవ్యక్తికిన్*
*హంసాగ్రామముప్రక్కయూరగుట స్నేహంబెంచి తాఁబల్కె నీ*
*కంసుండేమిముబ్రోచుగాతకారుణ్యమున్ జూపుచున్*
*🙏సందిత బెంగుళూరు🙏*
కరుణంటే ఎరుగని కర్కశుడైన కంసుని వేషం వేస్తున్న నేనే (ఈ కంసుండే) మిమ్మల్ని కాపాడతాడని తోటి నటీనట బృందంతో సరదాగా
అన్నాడని అన్వయం
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.