15, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2254 (తరుణము మించఁ గార్యములు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్"
లేదా...
"తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

 1. "God sees the truth but waits"...Tolstoy


  కరిగినగాని కొలిమిలో
  విరిగిన లోహములతకవు వింతది గాదే
  కరిరాజ మోక్షకథ వలె
  తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'వింత+అది' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. "వింత యది కదా" అంటే సరి!

   తొలగించండి


 2. వరుణుని రాకను జూచుచు
  నరుడా దున్నగ పుడమిని నమ్ముము సుఖము
  ల్లరయగలవు తద్విముఖపు
  తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్ ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'సుఖముల్+అరయ' అన్నపుడు లకార ద్విత్వం రాదు. అది కేవలం ద్రుతానికే పరిమితం. "సుఖముల్। ది(తి)రమగును తద్విముఖపు...' అనండి.

   తొలగించండి
 3. సరసము లాడగ చతురుని
  మురిసెను ప్రేమే యనుకొని మోహము నందున్
  నరకము దారా సుతుడట
  తరుణాతీత కృత కర్మ తతులిడు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పూరణ బాగుంది.
   'ప్రేమయె' అనండి. అలాగే 'దారయు సుతుడట/ దారాసుతులట' అనండి.

   తొలగించండి
 4. డా.పిట్టా
  బరువునుగని గొను బాధ్యత
  పరువునుగను పాత్రతయును బహిరంతస్థ
  స్థిరతను బూనిన యోచన
  తరుణాతీత కృతకర్మ తతులిడు శుభముల్
  తరుణి యొకర్తె పాణిగత "దవ్వుల వాణి"కి నైనయంత్రమున్
  మరపున జార్చె క్రిందకట మర్మబ్రవాహపు వాగు లోపలన్
  పరుగున నీట దూకెనొక ప్రౌఢవయస్కుడు నీదనేర్వడా
  కరణిని నొక్కలిప్తనట గాంచడు నాజలమందె మ్రగ్గెపో!
  తరుణము మించ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరిన్
  ఆర్యా,
  "....సంబరమెన్నజాలరా॥రైతుల రోదనల్ మకర రాశి రవీంద్రుని కర్పణంబయెన్"అని సవరించుకుంటే సరి. సమస్యలోని వైరుధ్య భావనను పోషించినట్లౌతుంది.పూరణలో అప్పుడే కష్టం ఎదురౌతుంది.C challenge is the life of wit.సంపాదించే వాని కంటే అందులోని కష్టాలెరుగని కుటుంబ సభ్యుల(పిల్లల)కే సంబరాలు.వాని వెనుక నున్న యజమానికి రోదనలతో కూడిన భావనలు సహజం.బాల్యంలో పొందిన తండ్రిచాటు పిల్లలముగా పొందిన ఆనందం నిజానికి అద్వితీయము.ఇది పెద్దలందరకూ అనుభవైక వేద్యము.కావున నేను ఆ యతిని భావ గతికి ఆటంకంగా గమనించలేక పోయినాను.గురు వాక్యం కర్తవ్యమే కదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   సమస్య సవరణను గురించిన మీ వివరణ ఆమోదయోగ్యమే. ధన్యవాదాలు.

   తొలగించండి
 5. కవిమిత్రులకు కనుమపండుగ శుభాకాంక్షలు.

  బలమగు శూలమున్ వెదురు బద్దలు కంకర మొగ్గ దండియల్
  లలితమనోజ్ఞ వర్ణమయ రాజిత కాంతుల నొప్పునట్లుగా
  పలువురు గూడి మోదమున భవ్య ప్రభల్ రచియించి మించగా
  నలరు ప్రభాఖ్య తీర్థముల నశ్శరభా సునినాద మెన్నెదన్.

  బాల్యము మాసిపోయినను భావమునన్ కదలాడి గుండియన్
  లౌల్యము రేపుచుండినది రమ్మని చెంతకు నాటి క్రీడకున్
  శల్యము లౌచు చిక్కి మన సంస్కృతులున్ కళ దప్పె జాతి కై
  వల్యము సాంప్రదాయ ప్రతిపాలనలో హవళించు నెంచగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   తిరునాళ్ళలో ప్రభను గురించిన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

   తొలగించండి
  2. మిస్సన్న గారు ప్రభలతీర్థ వర్ణన మమోఘముగా నున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. కురిసెడి మబ్బుల బట్టగ
  ధరపై నెవ్వరి తరమగు దారుల లోనన్
  వరమయి దోచెడి విధమయి
  తరుణాతీత కృత కర్మ తతులిడు శుభముల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా వేంకట లక్ష్మీనరసింహ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. హరునిగృపగలుగునెడలను
  తరుణాతీతకృతకర్మతతులిడుశుభముల్
  హరహరయనుచుంబలికిన
  హరుడేకాపాడుమనలనహర్నిశంబుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదంలో గణదోషం. 'హరుడే కాపాడగల డహర్నిశము మమున్' అందామా?

   తొలగించండి
 8. రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
   “తరుణాతీత” మని నేను వాడిన సంధి కాలాతీత మను నర్థమున నసాధువుకదా? తరుణము సమయమను నర్థములో దేశ్యము కదా.
   తత్సమమైనపుడు యౌవనము గలది యను నర్థము వచ్చును.
   “తరుణము మించు పను లిడు సతమ్మిల శుభముల్” అనిన నెట్లుండును?
   నా పొరపాటును క్షమించ మనవి.

   తొలగించండి
  2. త్వరపడి యుద్యమింప నతి దారుణ పర్యవసాన మౌను బ్రే
   మరస విలోక నానుచర మానిత చర్యలొసంగు సౌఖ్యముల్
   గురుతర కోప కాలమునఁ గూర్చ నొకింత ప్రశాంత చిత్తముం
   దరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   నేను అంతదూరం ఆలోచించలేదు. సాధారణంగా మనం వృత్తం, జాత్యుపజాతుల్లో ఇచ్చే సమస్యలు ఒకే బావాన్ని కలిగి ఉంటున్నాయి. మీ సమస్యావృత్తపాదంలో 'సమయ'మనే అర్థం వస్తే, కందపాదంలో వయస్సు, యౌవనం అనే అర్థాలు వస్తున్నాయి. మిత్రులు కూడా లోతుల్లోకి వెళ్ళకుండా రెండూ ఒకే అర్థంగా పొరబడి పూరణలు చేస్తున్నారు.
   మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూడడం వల్ల, ఇప్పటికే పెక్కురు పూరణలు చేసినందువల్ల మీరు సమస్యలో సూచించిన సవరణను చేయలేకపోయాను. మన్నించండి. ఇప్పటికిలా కానివ్వండి.
   *****
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. త్వరపడి జేసినంత మరి తప్పులు దొర్లుట సాజమే కదా !
  అరకొరగా నగున్ బనులు నాతురతన్నిల జేసినంతనే
  సరియగు యోచనన్సలుప సర్వము తిన్నగ చక్కబెట్టనౌ
  "తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్"

  రిప్లయితొలగించండి
 10. తరుణము మించ గా ర్యము లుదద్దయు మేలొనరించు నిధ్ధరన్
  తరుణము మించ గా ర్యము లుదద్దయుమేలొనరించ వెప్పుడున్
  ద రుణము జూసియే నిలను దానొనగూరగజేయుటొప్పగున్
  గరము నిగూఢమౌ విధము గాతర మొందకనుండు కార్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణలో మొదటి రెండు పాదాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా అన్వయం కుదరకుండా ఉన్నాయి. 'జూపియే యిలను' అనండి.

   తొలగించండి
 11. పూజ్యులు శంకరయ్య గారికి నమస్సులు!
  పరువమ్మున నాహారవి
  హరణమ్ములు జనులకు బ్రియంబగు వేడ్కన్
  హరిహరులను బూజించే
  తరుణాతీత కృత కర్మతతు లిడు శుభముల్!

  రిప్లయితొలగించండి
 12. జనులకుం బ్రియంబగు అని వ్రాయాలి? వివరించండి! ప్రధమప్రయత్నం .తప్పులు మన్నించగలరు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం శ్రీదేవి గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ ప్రథమ ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యారు. ప్రశంసార్హం.
   రెండవ పాదంలో ఉన్నదీ, మీరు సూచించిన సవరణ రెండింటిలోను గణదోషం. "హరణమ్ములు జనులకును బ్రియంబగు వేడ్కన్" అనండి. 'పూజించే' అనడం వ్యావహారికం. '...బూజించెడి' అనండి.

   తొలగించండి
 13. అరయుచు ప్రతి వత్సరము పి
  తరుల మృతాహమున శ్రాధ్ధ తర్పణ విధులన్
  జరుపుకొనగ మధ్యాహ్నపు
  తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. పరమౌచిత్య పు కధలను
  గురుతుల్యులు సకలశాస్త్ర కోవిదులెపుడో
  వరముగ తమ కధల ననిరి
  తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్

  రిప్లయితొలగించండి
 15. అరవిందాసను వ్రాతయు
  నరవిందాక్షుని కరుణయు హైమునభయముల్
  దరినుండిన పుణ్యాత్ముల
  తరుణాతీత కృత కర్మ తతులిడు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. మరువక భక్తితోడ మహిమాన్వితుడౌ పరమాత్ముడే సదా
  కరుణను జూపువాడు నరకాంత
  కుడన్ మదినమ్మి కొల్చినన్
  కురుసభలోన ద్రౌపది దుకూలములిచ్చుచుబ్రోచినట్లుగా
  *తరుణము మించ గార్యములుదద్దయు మేలొన రించునిద్ధరిన్*


  కరుణాలయుడౌ మాధవ
  చరణాలనువేడ జాలు సత్కృత మదియే
  హరి కరిని బ్రోచినట్లుగ
  *తరుణాతీతకృత కర్మ తతు లిడు శుభముల్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'నరకాంతకు నెమ్మది నమ్మి...' అనండి.

   తొలగించండి
 17. కరమగుభక్తితోడుతను కంజదళాక్షు భజించుచున్ సదా
  జరిపిన కార్యముల్ కలుగు సక్రమమైన ఫలమ్మవశ్యమున్
  కరుణనుఁ జూపి మాధవుడు కైటభవైరి, సహాయమివ్వగన్
  తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్

  రిప్లయితొలగించండి
 18. నిరతము భక్తినిఁ గొలిచిన
  పరమేశ్వరుడు కరుణించి వరముల నిడగన్
  నరులకు నసాధ్యము కలదె
  తరుణా తీత కృత కర్మతతు లిడు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 19. మరువక రామనామజపమంత్రపు తంత్రమె కీర్తనల్|సదా
  సరళముగానుపాడ చెరసాలయు నందున రామదాసు|యే
  మరువరు రామలక్ష్మణులమర్మము.లెంచగసాధ్య మౌనటే?
  తరుణముమించ గార్యములుదద్దయు మెలోనరించునిద్ధరిన్|
  2.ఉరుములు మెరుపులు గలసిన
  తరుణాతీత కృతకర్మతతులిడు శుభముల్
  కురిపించెడి వానలతో
  కరుణించిన జల్లులేగ కలిమియు నొసగున్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'చెరసాలను మ్రగ్గుచు రామదాసుడే మరువడు...' అనండి.

   తొలగించండి
 20. అరసి సమస్త జీవులకు నారడి యౌటను సృష్టి నాదిలో
  కరములు వేయి దాల్చి యుషకాంతుడు నిత్యము స్వర్ణకాన్తులన్
  బరచుచు ధ్వాంత రాశులను బాపుచునుండెను భాస్కరాఖ్యుడై
  తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్.

  రిప్లయితొలగించండి
 21. "తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"
  ఇది ఒక అవధానంలో ఇచ్చిన సమస్య. తల్లీకూతుర్లను పెళ్ళాడితే అపకీర్తి వస్తుంది కానీ కీర్తి వస్తుందా? అయితే శతావధాని శ్రీ సీ.వీ. సుబ్బన్న దీనిని అత్యద్భుతంగా పూరించటానికి పురాణ ప్రసక్తిని ఆశ్రయించాడు.
  వరాహావతారంలో శ్రీహరి భూదేవిని చేపట్టినాడు. మరల రామావతారంలో భూదేవి పుత్రిక శ్రీదేవిని చేపట్టినాడు.
  అయితే ఇవి జన్మాంతర ,దేహాంతర సంబంధాలు.
  ఆయన పూరణ ఇది :
  కం.అల్లన కిటియై ధరణిన్
  విల్లు విఱిచి సీతనేలి ప్రేమ కళా
  సంపల్లీల విష్ణు దేవుడు
  "తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   ధన్యవాదాలు! ఇది నాకు తెలిసినదే... అయినా కవిమిత్రులకు మార్గదర్శకంగా ఉంటుంది.

   తొలగించండి
 22. సవరణ:
  కం.అల్లన కిటియై ధరణిన్
  విల్లు విఱిచి సీతనేలి ప్రేమ కళాసం
  పల్లీల విష్ణు దేవుడు
  "తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్"

  రిప్లయితొలగించండి
 23. కరములు కాలనావలను కన్నుల నీరున నాకుపట్టుటన్
  పురములు కాలనావలను పొందుగ బావిని త్రవ్వబోవుటన్
  తరువులు కూల్చనావలను తన్నుకు చచ్చుచు నీడకోరుటన్
  తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్!
  కరుణను దేవదేవుడును కష్టము తీర్చునె చంద్రబాబుదిన్?

  రిప్లయితొలగించండి