23, జనవరి 2017, సోమవారం

సమస్య - 2261 (ఇంతుల నెల్ల....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్"
లేదా...
"భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు"

37 కామెంట్‌లు:

  1. కామాత్ క్రోధో௨భిజాయతే
    క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
    స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి

    ...భగవద్గీత



    కామమున క్రోధ, మోహమ్ము గలుగు, వాని
    వలన బుధ్ధినాశము, నందు వలన హాని -
    కామము ధన, ధాన్యమ్ముల, కనక, భూమి,
    భామినుల, నంతమొందించువాఁడె ఘనుఁడు!

    రిప్లయితొలగించండి
  2. నేటి కలియుగ మందున మేటి యువత
    ఘోర కృత్యము చేయగ వెఱపు లేక
    ప్రేమ పేరున పగబూని ప్రియము గాను
    భామినుల నంతమొందిచు వాఁడె ఘనుడు

    రిప్లయితొలగించండి


  3. చురచుర యనెడి వాల్జడ చుర్రు మనుచు
    నటునిటు విసిరి రుసరుస నడత జూచి
    ముదము గాను రమ్మనిబిల్చి ముద్దు లాడి
    భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా

    నాటకాలను నాటల బాటలందు
    నవ్యయుగమున నారి ననన్య రీతి
    నాటబొమ్మను జేసియు నాటి స్త్రీల
    బుద్ధులకు చెవి యొగ్గకు పుణ్య పురుష!
    జారిణుల నల్పమతియుత జాతి నెన్ను
    భామినుల నంతమొందించు వాడె ఘనుడు!
    చెంతనె మంత్రివంటి సతి చింతల బాపును పద్మినీ తెగన్
    వంతల పాలు జేయుచు సవాలుగ మారును చిత్తినీ ధృతిన్
    కొంతను వింతనౌ రగడ గూర్చును శంఖిణి జాతి జాగ్రతన్
    సొంతపు నాత్మబుద్ధి గను! శూర్ఫణఖాదుల వర్గమెన్ను వే
    లింతుల నెల్ల నంత మొనరించెడువాడె ఘనుండు వీరుడున్!!
    (ఆత్మబుద్ధిః సుఖంచైవ స్త్రీ బుద్ధి ప్రళయంకరీ..నీతిచంద్రిక?)

    రిప్లయితొలగించండి
  5. "బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు"


    కళ్ళు పండగ రైతుల కష్ట ఫలము
    పంట పండి కోతకు వచ్చు పైర్ల పైన
    దండ యాత్ర జేసెడి దండ్ల దండ్ల గొల్ల
    భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు

    రిప్లయితొలగించండి
  6. ……………………………………………
    గురుమూర్తి ఆచారి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఎ౦తయు గౌరవి౦ప వలె హెచ్చగు స౦స్కృతి

    …………… తోడ పూరుషు౦

    డి౦తుల నెల్ల | న౦త మొనరి౦చెడు వాడె

    ……………… ఘను౦డు వీరుడున్ ,

    స్వా౦తము న౦దునన్ సతము వారి పయి౦

    ……..... గల ద్వేష భావమున్ |


    కా౦తయె నీ కొస౦గును సుఖమ్ము

    ……... జయమ్ము శుభమ్ము మోదమున్

    రిప్లయితొలగించండి
  7. కొంతయు సభ్యతన్ఁగనక కొంటె తనాన చరించు వారలన్
    సంతత వక్రమార్గులపసవ్యులు నవ్య విలాసవంతులన్
    వింతగు పోకడల్ఁగలిగి వీవిజృంభణ చేయువారలన్
    ఇతులనెల్ల నంతమొనరించెడువాడె ఘనుండు వీరుడన్

    రిప్లయితొలగించండి
  8. భామినుల నంత మొందించు వాడె ఘనుడు
    ఘనుడు కాడా ర్య !పరమనీచు నిగ జూడ
    వలయు మఱియును వెలివేయ వలయు నతని
    నింతి యనగనుసా క్షా త్తు శక్తి రూపు

    రిప్లయితొలగించండి
  9. వనమునందున బాధలు మునులవెట్టు
    పిల్లవాండ్రకు పాలతో విషమునిచ్చు
    తాటకయు పూతనలబోటి దయలులేని
    భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు

    రిప్లయితొలగించండి
  10. తాటకాంతక! నీకునా దండమయ్య!
    పూని పూతనన్ జంపిన పుణ్యపురుష!
    వేడగ వెంటనె గాచునట్టి విష్ణు మూర్తి!
    భామినులనంత మొందించు వాఁడెఘనుఁడు

    రిప్లయితొలగించండి
  11. మోహినీవేషమును దాల్చిద్రోహ బుద్ది
    మరులు గొల్పుచు మనుజుల మాయ జీసి
    నెత్రుద్రావి మాంసమును తినెడిపిశాచ
    భామినుల నంత మొందించువాడె ఘనుడు

    రిప్లయితొలగించండి
  12. శాంతిని దేశ మందున విచక్షణుడై నెలకొల్పుచున్ సదా
    ప్రాంత సురక్షణార్థము నుపాయ విభూతిని సంచరించి వి
    క్రాంతిని శత్రు భూవర నికాయము, వీడి దయార్ద్ర చిత్తుడై
    యింతుల నెల్ల, నంత మొనరించెడు వాఁడె ఘనుండు వీరుఁడున్


    యింతి కన్నీరు గార్చిన యింట లచ్చి
    యుండ నొల్లదు కీడౌను మెండు గాను
    రాగ మతిశయిల్లగ వెతలఁ గరుణించి
    భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు

    రిప్లయితొలగించండి
  13. స్నిగ్ధ సౌందర్య రూపసి చిద్విలాసి
    కాంత కలభాషిణిగ కాక కలహభాషి
    ణిగ మహిళలలో శోకము నింపు వేశ్య
    భామినుల, నంతమొందించువాఁడె ఘనుఁడు

    రిప్లయితొలగించండి
  14. ఇంతుల నెల్ల నంత మొనరించెడు వాడె ఘనుండు వీరుడు
    న్నింతుల సంహరించుటిల నెంతయొ గొప్పను భావ మొందుట
    న్నంతగ మంచి గాదనుట నందఱు నేర్వగ నొప్పునౌ గదా
    యింతి య శక్తి రూ పిణి గ నెల్లజ నంబుల రక్షజేసెడిన్

    రిప్లయితొలగించండి
  15. భామ, భాగ్యమ్ము బ్రదుకను భ్రాంతి తోడ
    కూడ బెట్టంగ కనకమ్ము కూర్మి తోను
    విబుథ జనుల వచనముల వినిన యంత
    కాంక్ష దొలగంగ మదియందు కామములను,
    భామినుల నంతమొందించు వాడె ఘనుడు!


    యోగి వేమన!

    రిప్లయితొలగించండి
  16. చెంతన జేరిపూరుషుల చిత్తము నందు వికారభావనల్
    వింతగ నాటి మెండుగను విత్తము దోచదలంచు నీచ పూ
    బంతులు వారకాంతలవలబంధము జిక్కక నట్టివేశ్యలౌ
    యింతులనెల్లనంతమొనరించెడు వాడె ఘనుండు వీరుడున్

    భోగపు వనితలను జేరి భోగ లాల
    సుండు సర్వమ్ము గోల్పోయి శోకమందు
    పలికె నీరీతి గన్ వార వనిత లైన
    భామినులనంత మొందించు వాడె ఘనుడు.

    రిప్లయితొలగించండి
  17. చెంతన జేరిపూరుషుల చిత్తము నందు వికారభావనల్
    వింతగ నాటి మెండుగను విత్తము దోచదలంచు నీచ పూ
    బంతులు వారకాంతలవలబంధము జిక్కక నట్టివేశ్యలౌ
    యింతులనెల్లనంతమొనరించెడు వాడె ఘనుండు వీరుడున్

    భోగపు వనితలను జేరి భోగ లాల
    సుండు సర్వమ్ము గోల్పోయి శోకమందు
    పలికె నీరీతి గన్ వార వనిత లైన
    భామినులనంత మొందించు వాడె ఘనుడు.

    రిప్లయితొలగించండి
  18. *సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్"*
    లేదా...
    *"భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు"*

    *కాంతలలోనసూయలవి క్రమ్ముచునుండునుమించిపొంచి యే*
    *కాంతమునన్ సుతుండు తన కాంతను మించిన ప్రేమజూచినన్*
    *శాంతముగా సహించలేరసహజంబగునట్టియసూయమాయ నీ*
    *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండువీరుఁడున్*

    *సహస్రకవిరత్న,కవిభూషణ*
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్త్రీ లలో అసహంంగా నెలకొనియున్న అసూయాభావాలను అనునయవాక్యాలతో చంంపగలిగిన వివేకియైైన కుమారుడు భర్త స్థానంంలో యున్న పురుషుడే వీరుడని భావంం

      తొలగించండి
    2. *సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*


      *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్"*
      లేదా...
      *"భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు"*

      *కాంతలలోనసూయలవి క్రమ్ముచునుండునుమించిపొంచి యే*
      *కాంతమునన్ సుతుండు తన కాంతను మించిన ప్రేమజూచినన్*
      *శాంతముగా సహించలేరసహజంబగునట్టియసూయమాయ నీ*
      *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండువీరుఁడున్*

      *సహస్రకవిరత్న,కవిభూషణ*
      *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

      తొలగించండి
  19. PM
    స్త్రీ లలో అసహంంగా నెలకొనియున్న అసూయాభావాలను అనునయవాక్యాలతో చంంపగలిగిన వివేకియైైన కుమారుడు భర్త స్థానంంలో యున్న పురుషుడే వీరుడని భావంం

    తొలగించు

    రిప్లయితొలగించండి
  20. *సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్"*
    లేదా...
    *"భామినులనంతమొందించువాఁడె ఘనుఁడు"*

    *సొగసులన్ దిద్దుకొనుచును చోద్యముగను*
    *చేయుచుందురాలస్యంబు స్త్రీలెయెపుడు*

    *నిట్టి లక్షణమునెదుగనీయ బోకఁ*
    *భామినులనంతమొందించువాఁడె ఘనుఁడు*

    ******

    *కాంతలలోనసూయలవి క్రమ్ముచునుండునుమించిపొంచి యే*
    *కాంతమునన్ సుతుండు తన కాంతను మించిన ప్రేమజూచినన్*
    *శాంతముగా సహించలేరసహజంబగునట్టియసూయఁమాయ నీ*
    *"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండువీరుఁడున్*

    *సహస్రకవిరత్న,కవిభూషణ*
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  21. స్వాంతమునందు నమ్ముదురు సజ్జను లెల్లరు స్త్రీల నెవ్వడు
    న్నంతము చేయగూడదని, యందురు పాపము సోకునంచు, చీ
    కాంతల సానియైన కులకాంతల సద్గణ హీన లైన యా
    యింతుల నెల్ల నంతమొనరించెడి వాడె ఘనుండు వీరుడున్.

    రిప్లయితొలగించండి
  22. అంతములేనిదీ జగమనంతము|నందున ఆడజాతినే
    అంతమొనర్చ?పుట్టుకల కంతమె|మానవజాతి నిల్చునా?
    ఇంతుల నెల్లనంత మొనరించెడువాడె”ఘనుండు,వీరుడున్,
    వింతగు మూర్ఖుడే యగును| విజ్ఞత సూన్యుడు,జాతి వైరియౌ|
    2.అమ్మలక్కలుచెల్లెండ్రు,ఆలి,అత్త
    భామినిల నంత మొందించువాడె ఘనుడు
    యనుటదోషంబు తరుణుల మనుగడందె
    జాతి నభివృద్ధి నీతి సజావుగుండు|
    మెదడు లేనట్టి బ్రతుకౌను|సుదతిలేక

    రిప్లయితొలగించండి
  23. సీత, ద్రౌపది శోకించ చిచ్చు రగుల
    రామ,కృష్ణుల దయతోన ప్రమదమమరె
    దుష్టులు చెలఁగ రక్షించ దొరతనమున
    భామినుల, నంతమొందించు వాఁడె ఘనుఁడు

    రిప్లయితొలగించండి
  24. ⁠కవిమిత్రులకు నమస్కృతులు.
    ఎందుకో నిన్నటినుండి మనసంతా చిరాకుగా ఉంది. కారణం తెలియదు కాని భయం భయంగా ఉంది. ఏపనీ చేయలేకున్నాను. మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారి నమస్కారములు మీరు ఎందుకు భయపడుతున్నారో గాని మీరు ప్రతి క్షణం ఈ శ్లోకాన్ని మనసులో ధ్యానం చేయండి భయం తొలగి పోతుంది [ నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కరు శాంతిం ప్రాయశ్చమే!] [ ఓం నమో భగవతే సాయి నాధాయ అమృత వాక్య వర్షాయ సకల లోకపూజితాయ సర్వదోష నివారణాయ షిరిడి నివాసాయ సాయి నాధాయతే నమః ] రోజుకు 9 సార్లు గాని 18 సార్లు గాని 27 సార్లు గాని 36 సార్లు గాని 45 సార్లు గాని స్మరిస్తే సర్వ బాధలూ నివారణ కలుగుతుంది ] 9 total వచ్చే లాగున స్మరణ చేస్తే మంచిది .

      తొలగించండి
  25. అంతటరామలక్ష్మణులుఅంతముచేసిరితాటకాదిదై
    త్యాంతకకాంతలన్ మరియుత్యాగముచేసిరిరెందరోగదా
    అంతముజేసెకృష్ణుడునుఅంగనపూతనపాలుత్రాగియా
    ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్

    రిప్లయితొలగించండి
  26. తిరముుగ నామనంబున యధేచ్ఛగ శాశ్వతమున్నదానివే
    వరమగు నాకు నీదు సహవాసము-ఎన్ని సపర్యలందితో
    చెరిసగమై జగంబున నశేష సుఖంబుల పొందినాము-ఓ
    రమణిరొ పుత్రివో మనుమరాలవొ చెల్లివొ ధర్మపత్నివో

    రిప్లయితొలగించండి
  27. "ధీర సమీరే యమునా తీరే...

    గంతలు కట్టుచున్ కనుల గట్టిగ ముద్దులు నొక్కి పెట్టుచున్
    చింతలు జేయకే నొలిచి చీరలు చెట్టున దాచిపెట్టుచున్
    కొంతయు సిగ్గులేక తమ గుబ్బల సిగ్గుల త్రోసివేయుచు
    న్నింతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్ :)

    రిప్లయితొలగించండి