3, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2242 (అంది యందని యందమె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అంది యందని యందమే విం దొసంగు"
లేదా...
"అందియు నందనట్టిదగు నందమె విం దొసఁగున్ బ్రజాళికిన్"

54 కామెంట్‌లు:

 1. అడగక మనసు దెలిపిన పడతి వంటి
  అంది యందని యందమే విందొ సంగు
  కనుల భాషల సునిసిత కాంతు లకట
  కలల మైకము నందున కలత సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సునిశిత'... టైపాటు...

   తొలగించండి
 2. ఎందరో సతులుండగ వంద లాది
  సత్యభామ రుక్మిణి మరి జాంబవతియు
  ఎందరు సతులున్నను హృదియందు రాధ
  కందియందని యందమే విందొసంగు!

  రిప్లయితొలగించండి
 3. పందెము వేయుచున్ బ్రజలు పాలక వర్గము వారినమ్ము చున్
  సందియ మేమిలే దనుచు సాహస మందున బెట్లుక ట్టుచున్
  వందన మంచుదేవునికి వాసిగ పూజల యందుమున్ గుచున్
  అందియు నందనట్టిదగు నందమె విందొసగున్ బ్రజాళికిన్

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  'కంది'కవితావితానము గట్టు జేర్చు
  విమల యభ్యాసమని వేయి విద్యలందు
  పద్య విద్యను బట్టిన ప్రాకులాట
  అందియందని యందమే విందొసంగు!
  "సందియమేల యందరికి చక్కగ బంచెద నల్లడబ్బు నా
  పందెమిదంటె పందె"మనిబాహువు జాచిన'మోది'మాటతో
  నందు శ్రమల్ వినా ధనపు టాశయె నాకస పుష్ప రాజమై
  అందియు నందనట్టిదగు నందమె విందొసగున్ బ్రజాళికిన్!!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  అందరమాశనాశ్రితులమైనను పుంఖిత దాన రాశి నీ
  చందము బ్రోత్సహించుటయె సర్వ సహంపు స్వతంత్ర భారతిన్?
  ఎందరొ చేయి జాచుటయె హీనత యంచని యెంచరేలకో?!
  అందియు నందనట్టిదగు నందమె విందొసగున్ బ్రజాళికిన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'విమల+అభ్యాసము=విమలాభ్యాసము' అవుతుంది కదా! 'అంటే' అనడం వ్యావహారికం. 'పందెమిదన్న' అనండి.

   తొలగించండి
  2. ఆర్యా,డా.పిట్టానుండి సవరణలు..స్వకీయము
   విలమభ్యాసమని..మొదటి పూరణలో
   పందెముసుమ్మి పందెమని..మరోపూరణ లో స్వీకరించగలరు

   తొలగించండి
 6. తే.గీ. విరిసి విరియని విరి కను విందగుగద
  పండి పండని దగు దోర పండు మేలు
  నిండి నిండని విధముగ తిండి చాలు
  "అంది యందని యందమే విం దొసంగు"

  రిప్లయితొలగించండి
 7. విరిసివిరియనిపుష్పమ్మువిందుగొలుపు
  పండిపండనికాయయేప్రమదమిచ్చు
  వచ్చిరానట్టిపలుకులుబలుకశిశువు
  ముదముగలిగించువిధముగముదితయొక్క
  యందియందనియందమేవిందొసంగు

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. అత్త తాతను పాపల నత్తి నుడులు
   గండు శిలలైన దూరపుఁ గొండ లన్ని
   అంద కుండగఁ గన్పట్టు చందమామ
   యంది యందని యందమే విం దొసంగు


   విందము దయ్యముల్ నిలిచి వేదము లన్నియు వల్లె వేయగన్
   మందిని మోస పుచ్చి పలుమారులు నేతల మంచుఁ బల్కు రా
   బందుల రాజకీయ ఘన భార విధానము లెంచిఁ జూడ నీ
   యందియు నందనట్టిదగు నందమె విం దొసఁగుం బ్రజాళికిన్

   [అందము = విధము ; విందు = బహుమానము]

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ఆహా! కామేశ్వర రావు గారు:

   పాత శంకరాభరణం పుటలు తిరగవేస్తూ మీ పద్మావతీ శ్రీనివాసము చూసి ఆనందించాను. మీరు సవ్యసాచి సమానులు!!!

   తెలుగు రాదు...క్షమించండి...

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   శాస్త్రి గారు మీకు నా పద్మావతీ శ్రీనివాసము ద్విపద కావ్యము నచ్చినందులకు మహదానందముగా నున్నది. మీ వంటి విద్యాధికులకు మాతృ భాషావగతమునం జేసి తెలుగు రాక పోవడమంటూ యుండదు.

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అడగక నొసగిన మనసే అరుస మొసగు
  తెలిసి తెలియని మమతయే తీపి గలుపు
  అంది యందని యందమే విందొ సంగు
  సతము రహినెంచు వారికీ జగతి నందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. సందియములేదు లేప్రాయ మందు చిందు
  లేయు నవనవోన్మేషమౌ యెదల పొంగు
  లంది యందని యందమే విం దొసంగు
  సత్య దూరము కాదిది సమ్మతంబె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మంచు కొండల నడుమను మాటు నుండి
  మహిని జనులను మహిమతో మనుపు చుండి
  అందుకో నొడగూడని నఖిల గురుని
  అంది యందని యందమే విందొ సంగు

  రిప్లయితొలగించండి
 12. చక్కనమ్మయుచితముగ చిక్కినపుడు
  యెట్టి యాకర్షము కలుగదీ ధరిత్రి
  సతత మూరించి యుడికించి సకియ చూపు
  అంది యందని యందమే విందొ సంగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అపుడు+ఎట్టి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'చిక్కినప్పు। డెట్టి..' అనండి.

   తొలగించండి
 13. చిన్నికృష్ణయ్య మురిపాలఁ జిలికినంత
  తనివితీరదట యశోద తల్లి మదికి
  దొరకకుండగ పరుగెత్తు దుడుకు వాని
  యంది యందని యందమే విందొసంగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. సందియమేమియున్వలదుశంకరుసాక్షిగజెప్పుచుంటినే
  పందెముగూడవేయుదునుబాతికరోజులలోపలన్సదా
  విందుగరూప్యముల్దొరకువేలకువేలుగజూడుడీయన
  న్నందియునందనట్టిదగునందమెవిందొసగున్బ్రజాళికిన్

  రిప్లయితొలగించండి
 15. గగన మందున జల్లని కాంతులిడుచు
  కరముకందెడు భావనన్ గలుగ జేయు
  చక్కనైనట్టిమనమామ చందమామ
  అంది యందని యందమే విం దొసంగు


  చందురుడంతరిక్షమున జల్లని వెన్నెల కాంతులీనగా
  నందగ వచ్చునంచుగద యల్లరి చెసెడు వేళపెద్దలా
  కందువు నూరడింతురట, కాముకులైనను వృద్ధుకైన నా
  సుందరుడౌ శశాంకుడను జూచిన జాలదె మోదమొప్పునా
  యందియు నందనట్టిదగు నందమె విం దొసఁగున్ బ్రజాళికిన్

  రిప్లయితొలగించండి
 16. వద్దు వద్దను మురిపెమే ముద్దొస౦గు
  చేదు చేదను చిలిపియే మోదమొసగు
  కాదు కాదను కౌగిలే కమ్మతనము
  నంది యందని యందమే విందొసంగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. గురువు గారికి, కవిమిత్రులకు మఱియు బ్లాగు వీక్షకులందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  నడక నేర్చు వారల బుడి బుడి యడుగులు,
  ఊరి యూరక రుచులూరు నూరుగాయ
  పేరి పేరక యూరించు పెరుగు వోలె
  యంది యందని యందమే విందొసంగు!

  రిప్లయితొలగించండి
 18. సందియమేల యప్పనగ చక్కనిచుక్క లభించి తృప్తితో
  నందము నారబోసినను వ్యక్తుల రంజిలఁ జేయనేర్చునే
  సుందరమైన రూపమును చూపిన నిత్యము పాక్షికమ్ముగా
  నందియు నందనట్టిదగు నందమె విందొసగున్ బ్రజాళికిన్

  రిప్లయితొలగించండి
 19. ముందరి కాలమందు తలపోయని సౌఖ్యములందజేతు మే
  మందర మంచు నెన్నికల యందున మాటలు కోట దాటు రూ
  పొందగ లేని వాక్కులవి ముందర ఎన్నికలందు జెప్పరే
  యందియు నందనట్టి దగు యందమె విందొసగున్ బ్రజాళికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. విరిసి విరియని పుష్పమ్ము విరివి గాంచు
  కురిసి కురియని వర్షమ్ము గురుతు లలరు
  పిలచి పిలువని వలపున తలపు మెండు
  అంది యందని యందమే విందొసంగు!

  రిప్లయితొలగించండి
 21. పచ్చి కాయలు పింజలై పంచ వగరు ,
  ముగ్గి ముదిరిన పండ్లలో తగ్గు రుచులు ;
  పలక బారిన యంతనే పసను జూపు !
  నంది యందని యందమే విం దొసంగు

  రిప్లయితొలగించండి
 22. నేటిసినిమాలు,టీవీలు చాటుచున్న
  అర్ధనగ్నత దృశ్యాల అందమన్న?
  అంది యందని యందమేవిందొసంగు
  యనెడిజిజ్ఞాశ ప్రేక్షకుల్ నధిక మైరి.
  2.అందియు నందనట్టిదగు నందమె విందొసగున్ బ్రజాళికిన్
  చిందులువేయు సోయగము చిత్ర విచిత్రపు నాట్య భంగిమల్
  విందు,వినోదముల్ గనగ?వేదన మాన్పునుసంకురాత్రియే
  అందపు రంగవల్లియలనాదర ణంబగు జాతి సంస్కృతుల్|


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. యందుకొనబోవనధరాలనడ్డుచెప్పి
   సందెవేళను నినువీడ సుందరాంగి
   అంది యందని యందమే విం దొసంగు
   నందు వేమిర శుంఠ! నీ బొందవిందు!

   తొలగించండి
  2. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   *****
   చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 23. భర్త చెంతకు రమ్మన భార్య దూర

  మగుచు నాట పట్టించుచు మరల మరల

  తుదకు చేరగ భర్త సంతోష పడెను

  నంది యందని యందమే విందొసంగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. మరో సమస్య.....
  డా.పిట్టానుండి
  కొక్కొరొ కో యటంచునట కోతులు కూసెను రాత్రి వేళలోన్
  లేదా
  కొక్కొరొకో యనుచు కోతి కూటము కూసెన్

  రిప్లయితొలగించండి
 25. పూర్తిగ విరియనట్టి పూ పుడమిలోన
  కనులకిటు విందు కల్గించు కమ్మగాను
  నందమైన యతివ కన నచ్చెరువగు
  నంది యందని యందమే విందొసంగు.

  గగనమున చేతికందక గబగబమని
  సాగు తరణి బింబము గన సతము ముదము
  కలుగు గాని నెప్పుడు కర గతము కాదు
  నంది యందని యందమె విందొసంగు.


  రిప్లయితొలగించండి
 26. చందురు బాబుగారచట చప్పున పప్పును కౌగలించగా
  సందడి చేయకే ఘనుడు చల్లగ నెన్నిక ముందులాగగా
  జందెము లేకయే వరుడు చక్కగ పట్టగ హేమమాలినిన్...
  అందియు నందనట్టిదగు నందమె విం దొసఁగున్ బ్రజాళికిన్

  రిప్లయితొలగించండి