27, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2265 (వర్ష మిచ్చుఁ జింత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు"
లేదా...
"వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. నాల్గు నెలల కలల నట్టేట ముంచంగ
   వాగులన్ని పొంగి వరదలవగ
   కోతకొచ్చు పంట క్రుంగి పోవునటుల
   వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చు'ను 'ఒచ్చు' అన్నారు. "కోత కైన పంట..." అందామా?

   తొలగించండి
 2. డా.పిట్టా
  ఋణములెల్ల నేడు రిత్తయై జెలగెను
  పనికి గూళులివ్వ బ్రతుకు నడుచు
  భూములెండ నింక బొక్కస వరములు
  వర్షమిచ్చు జింత కర్షకునకు
  కర్షక పక్షపాతి యగు కాలము పాలకులెల్లవోటు నా
  కర్షిత యూతమివ్వగను గష్టపు జేత హుళక్కి యుర్విపై
  ఘర్షణ జేయ బత్తెములు ఘల్లునరాలు,కృషిన్ ఘటించు నా
  వర్ష మొసంగు రైతునకవారిత చింతను దీవ్ర దుఃఖమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'ఆకర్షిత యూతము' అన్నది దుష్టమాససం.

   తొలగించండి
 3. పంట చేతి కందు బాధలన్ని దొలఁగు
  నప్పు దీరి నల్లుడలుక వీడు
  ననెడు నాశలుడుగ నవని రాలు నకాల
  వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...యప్పు దీరి యల్లు డలుక..." అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

   పంట చేతి కందు బాధలన్ని దొలఁగు
   యప్పు దీరి యల్లుడలుక వీడు
   ననెడు నాశలుడుగ నవని రాలు నకాల
   వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు

   తొలగించండి
 4. మేలు పంట పండ మేలిమి తనయింట
  సంత సించు రైతు జంకు లేక
  కనుల విందు జేసి కలతబా పెడివేళ
  వర్ష మిచ్చుఁ జింత కర్ష కునకు

  రిప్లయితొలగించండి


 5. కాలము సరి గాని కాలము లోవచ్చు
  వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు,
  మేలు జేయ గాను మేటిగ యుపయోగ
  కారి గాను రమ్మ, గావ మొగిలు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మేటిగ నుపయోగ...' అనండి.

   తొలగించండి
 6. అప్పు జేసి రైతు అహరహమును నిద్ర
  మాని తెచ్చె నాఱు మమతతోడ
  నంతలోన మేఘమల్లదే కనుపింప
  వర్షమిచ్చెఁజింత కర్షకునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రైతు+అహరహము' అన్నపుడు సంధి నిత్యం. "అప్పు రైతు చేసి యహరహమును..." అనండి.

   తొలగించండి
 7. ………………………………………………………

  గు రు మూ ర్తి ఆ చా రి

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  శీర్షము లెత్తజాలక నశి౦చెను

  …………… మొన్నటి యేట బీజముల్ ,

  వర్షము మె౦డుగా గురియ || వాగులు

  ……………… వ౦కలు నె౦డిపోయగా

  కర్షువు లాగిపోయినవిగా నిక

  … ……… నిన్నటి యేట చుక్కయున్

  వర్షము లేక || " వర్షము - నవర్షము "

  ……………… నాశము చేయు కర్షకున్ ||

  వర్ష మొస౦గు రైతున కవారిత చి౦తను

  ………………… తీవ్ర దు : ఖమున్


  ్{ శీర్ణములెత్తజాలక = మొలకెత్తలేక ;

  క ర్షు వు = న దీ ప్ర వా హ ము ;

  అవర్షము = వాన లేమి }

  రిప్లయితొలగించండి
 8. వర్ష మిచ్చు జింత కర్షకునకు నిల
  బాగు బాగు జక్క పలికి తిరిగ
  వర్ష మిచ్చు నెపుడు కర్షకు నకుసంత
  సంబు గా నెఱుగుడు శంక రార్య !

  రిప్లయితొలగించండి
 9. కోత కొచ్చె పంట చేతికి జిక్కును
  కూతు పెండ్లి జేయ రైతు జూడ
  ఎచట నుండి వచ్చె నేమొ గాని యకాల
  వర్శమిచ్చు చింత కర్షకునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒచ్చె' అనడం గ్రామ్యం. "కోత కమరె పంట..." అనండి.

   తొలగించండి
  2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
   కోత కమరె పంట చేతికి జిక్కును
   కూతు పెండ్లి జేయ రైతు జూడ
   ఎచట నుండి వచ్చె నేమొ గాని యకాల
   వర్శమిచ్చు చింత కర్షకునకు

   తొలగించండి
 10. వరుణ దేవుని కనికరము నందని ప్రతి
  వర్ష మిచ్చు జింత కర్షకునకు!
  రైతు నాదుకొనగ రాజ్యాధినేతలు
  నదుల గలుపు పనికి నాంది యనిరి!
  (వర్షము = సంవత్సరము)

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువుగారికి నమస్కారములు. మూడు రోజుల సమస్యాపూరణలు పరిశీలించగలరు.

  25-01-2017:

  శ్రీరాముని భూపుత్రికి
  దూరమొనర్చి కమితుడగు దుర్మార్గు0డౌ
  యా రావణవధ కారక
  మారీచుడు రక్షకుండు మహిబ్రాణులకున్

  26-01-2017:

  హారితులౌ నాంగ్లేయుల
  పారుపఱచి నిలుపుకున్న పావన భావ
  స్వైరిత రాజ్యాంగోత్సవ
  భారత గణతంత్రము జనభారంబయ్యెన్

  27-01-2017:

  సేద్యమందు వలయు సేపులందునగాని
  వర్షమిచ్చు జింత కర్షకునకు;
  నమిత వాన దెచ్చు నష్టముల వలన
  పంట లొరిగి నీట పాయ నగును


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. దొరలనొప్పు పదవి దొరకించుకొను నేటి
  సంతు బహుళజాతి సంస్థలందు
  వసుధ నమ్ము కొలువు వ్యర్థమను భరత
  వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు ||

  రిప్లయితొలగించండి
 13. శ్రీగురుభ్యోనమః
  వార్షిక ఖర్చులున్ పెరిగె పంటలు జీడలు పట్టి పోయె సం
  ఘర్షణ హెచ్చె పెట్టుబడిగా నొక యింతయు పైకమియ్యరే
  కర్షక జాతికిన్ మిగుల కష్టము గల్గ నకాలమందునన్
  వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీపతిశాస్త్రి గారు చక్కటి పూరణ చేశారు. వార్షిక సంస్కృత పదము ఖర్చు హిందీ పదము రెంటి సమాసము దుష్టము."వార్షిక విత్తభారమెస" అనిన సరిపోవును.

   తొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ****
   కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు!

   తొలగించండి
  3. గురువర్యులు శ్రీ కామ్మేశ్వర రావు గారికి, శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. చక్కని సవరణ సూచించినారు. ధన్యవాదములు.
   సవరించిన పద్యము
   వార్షిక విత్తబారమెస పంటలు జీడలు పట్టి పోయె సం
   ఘర్షణ హెచ్చె పెట్టుబడిగా తగు పైకము నైన యీయరే
   కర్షక జాతికిన్ మిగుల కష్టము గల్గ నకాలమందునన్
   వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్

   తొలగించండి
 14. వర్షములెక్కువైభువినిపంటలునాశనమొందుచోనికన్
  వర్షమొసంగురైతునకవారితచింతనుదీవ్రదుఃఖముల్
  వర్షములెప్పుడున్మనకుబాధలులేనివిధంబునన్సదా
  కర్షువులేవియున్జెడకకాపులునుండగగుర్వమేలుగా

  రిప్లయితొలగించండి
 15. ఆకాశ వీధిని నసమాన విద్యుల్లతా తతి తోరణవ్రాత మనగ
  పద్మాకరమ్ముల ప్రవిమల ధవళంపు ముత్యాల రతనాల ముగ్గు లనగ
  ధరణీ తలము వనార్ద్రస్ఫటిక విభవ జలపూర సమతల ఫలక మనగ
  సప్త సాగరముల ఝషరాశి భీతిలి వేగంబ పాతాళ మేగె ననగఁ

  బురులు విప్పి యాడ ముదిత శిఖిగణము
  బెకబెక నినదములు పృథ్విఁ జెలగ
  హర్ష మీయవాన యనఁ దగ దివ్విధి
  వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు!


  ఘర్షణ హీన మానస వికాసిత మాన ధనుం డచింత్య దు
  ర్ధర్ష జనాభిమాని పరితప్త కుటుంబియు సేద్యకర్మ ని
  ష్కర్ష మనోభిలాషి పరిఘాత హలార్తుఁడు దుర్భర మ్మనా
  వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవివర్యులు కామేశ్వర రావు గారికి వందనములు. చాలా రోజుల తర్వాత తళతళ మెరిసే సీస పద్యం ప్రసాదించారు. చాలా చాలా బాగుంది.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా సీసం మనోహరం. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 16. ఘర్షణ లేక విత్తులు సకాలమున౦దున గత్తమేర్పడన్
  కర్షణ మందు జంత్ర మడకల్ సమకూరగ హెచ్చు పంటతో
  హర్షము నొందగా కృషికు డంతట పంట వినాశ కారియౌ
  వర్ష మొసంగు రైతునకవారిత చింతను దీవ్ర దుఃఖమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. అప్పు మీద యప్పు యాశగా గైకొని
  దుక్కి దున్ని పంట దొంత బెట్ట
  దిక్కు లెర్ర బారి దీవ్రత దోడుగా
  వర్షమిచ్చు చింత కర్షకునకు!

  రిప్లయితొలగించండి
 18. కర్షక లోకమంతటికి
  కామితమైన ఫలాల కాంతులన్
  వర్షమొసంగు; రైతున క
  వారిత చింతను దీవ్ర దుఃఖమున్
  ధర్షితమానమై యొసగు
  దారుణమైన తుఫాను వేళళున్
  హర్షము ద్రుంచు నాతడు ని
  రాశ్రయమొంది తపింప జేయుగా!

  రిప్లయితొలగించండి
 19. మితిని మీరి యేది యతి చేయగా రాదు
  మితిని మీరె నేని గతియు తప్పు
  పదును నేల పైన నదును తప్పి పడిన
  "వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు"

  రిప్లయితొలగించండి
 20. అదను నందు కురియ వంబుధారల నెంచ
  కురిసిన యది మిగుల గ్రుమ్మరించు
  సమయమందు తగిన సలిలంబు గానక
  వర్ష మిచ్చు చింత కర్షకునికి!

  రిప్లయితొలగించండి
 21. పాడిపంట కొరకు ప్రకృతి సమకూర్చ?
  వర్షమిచ్చు|”జింతకర్షకునకు
  తగినసమయమందు ధరకుంచువానలు
  గురువకున్న”?రైతు క్రుంగుటేగ?
  2.హర్ష పటుత్వ శక్తి ,సహాయముజేసెడి మూలయుక్తిగా
  వర్ష మొసంగు|”రైతున కవారిత చింతన దీవ్ర దుఃఖమున్
  శీర్షిక లేక జేయగల చిత్ర విచిత్రపురక్తి పంటకున్,
  కర్షక దైవమౌచినుకు”| కాటక మన్నది లేకజేయులే|

  రిప్లయితొలగించండి
 22. అప్పు పుట్టదాయె యాచించ నెవ్వారి
  విత్తనంబు లెరువు విఫణి కరవు
  యమ్మబోవ ధరలు యల్పంబు లేనిత్య
  వర్ష మిచ్చు చింత కర్షకునకు


  వర్షము =సంవత్సరము

  రిప్లయితొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  పంట బాగ పండె బాధలన్ని తొలగు

  ననుచు రైతు మురియు నంతలోనె

  పంట నాశనమవ వరద రూపమ్మున

  వర్షమిచ్చు జింత కర్షకునకు.

  రిప్లయితొలగించండి


 24. పదునుజేయ పొలము నదనులో బడునని
  కునుకు వదలి జూడ చినుకు కొరకు
  మబ్బులోననుండి మరినేల గురవని
  వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారు సరియైన యదను లో పదునైన పద్యము చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. Beautiful!

   King James Bible

   Whoso boasteth himself of a false gift is like clouds and wind without rain

   తొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. వర్షము రాని వర్షమున పంటలు బండక నన్నదాతలున్
  హర్ష విహీనులై యమిత యాతన జెందుదు, రప్పుడప్పడున్
  వర్షపు టుగ్ర రూపమున పంటలు నాశన మొందు,నిత్తరిన్
  వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్ర దుఃఖమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. 🍀 *శంకరాభరణం*🍀

  🌷 *సమస్య పూరణం* 🌷

  🍀 కవిః- *విరించి* 🍀

  🌷 సమస్యః *వర్షమిచ్చు జింత కర్షకునకు*

  లేదా...

  *వర్షమొసంగు రైతునకవారిత చింతను దీవ్రదుఃఖమున్*

  ఆరుగాలమందు నవిరళ కృషిజేయ
  నందవచ్చె పంట యనుచు మురియు
  వేళ పరిహసింప విధియె యవాంచిత
  *వర్షమిచ్చు జింత కర్షకునకు*

  వర్షము పాటుగా కృషిని వాసిగ జేయ ఫలించు పంటయే
  హర్షము నందజేయగను యాతన మర్చిచరింతురీ భువిన్
  కర్షకులెల్లరుల్ విధివికారపు చేష్టలవాంచితమ్మె యౌ
  *వర్షమొసంగురైతునకవారిత చింతను దీవ్రదుఃఖమున్*

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు
  1. మంచివిత్తనమ్ములెంచి పైరునుపెంచి
   నిక్కమైన పంట దక్కు ననుచు
   పంటనూర్చబోవ వెంట దగిలినట్టి
   వర్ష మిచ్చు జింత కర్షకునకు

   తొలగించండి
  2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. అప్పు చేసి నాటె నవనిలో రైతన్న
  మంచిపంట పండ మనసు మురిసె
  పంట కోతకొచ్చు పచ్చని సమయాన
  వర్షమిచ్చు చింత కర్షకునకు.

  పంట చేతికొచ్చు పండునెల్లకలల
  టంచు వేచి యచట నన్నదాత
  సుతకు పెండ్లి చేయు శుభముగా దలవంగ
  వర్షమిచ్చు చింత కర్షకునకు.

  చెరుకు పంట ఫలము చేతికందెడి వేళ
  వర్షమిచ్చె చింత కర్షకునకు
  ధరయు తగ్గిపోగ తాపము హెచ్చాయె
  నప్పు నెట్లు తీర్తు నంచు నడలె.

  రిప్లయితొలగించండి
 29. వర్షము దండిగా కురియ పండెను బంగరు పంట రైతుభూమిలో
  హర్షముతోడుతన్ వెడలి యందిన పంటను కోయబోవగా
  కర్షక గుండె గల్లనన కాలపు మబ్బులు క్రమ్మి పడ్డ ఆ
  వర్షమొసంగు రైతున క వారిత చింతను దీవ్ర దు : ఖమున్

  రిప్లయితొలగించండి
 30. వర్షము లన్నియున్ ఋతుల వారిగ వచ్చుచు పోవుచుండగా
  కర్షకు లెల్లరున్ మురిసి ఘాటుగ త్రాగుచు విందుజేయగా
  ఘర్షణ లేకయే ధరలు కమ్మగ భూమిని కూలద్రోసెడా
  వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్ :)

  రిప్లయితొలగించండి