డా. పిట్టా సత్యనారాయణ గారూ, మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పూరణలో నేనిచ్చిన సమస్యపాదంలో యతిదోషం ఉంది. తరువాత సవరించాను. మీరు ఈలోగా యతిదోషాన్ని గమనించకుండా పూరణ పంపారు. సవరించిన సమస్యతో మరొక పూరణ చేయండి.
కవి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో...మన తెలుగు చంద్రశేఖర్. ఒక సందేహము - ఈ మధ్య విడుదలైన చిత్రం పేరు "గౌతమిపుత్ర శాతకర్ణి" అని చూస్తున్నాను. కానీ అది "గౌతమీపుత్ర ..." అనికదా ఉండవలసినది. "మ" కు దీర్ఘము లేనిచో షష్ట్టీ తత్పురుష సమాసం అవ్వదుకదా! తెలిసినవారు చెప్పగలరు. రెండూ సరియైనచో, సూత్రము ఏమి?
గొంగడిలో తింటూ... అన్న సామెత ఒకటుంది. సినిమావారి భాషలో తప్పులు వెదకటం వలన ఉపయోగం లేదేమో. మొన్ననే కదా, 'నాగభరణం' అని ఒక సినిమా వచ్చింది. అసలు సినిమాలన్నీ కృతకవ్యవహారాలు. సినిమా వాళ్ళ నడక నడత భాష అన్నీ కృతకాలే. ఆ సినిమాల్లోని కథలూ కథనాలూ ఊళ్ళూ పేర్లూ మాటా మంతీ అంతా కృతకమే. వాటిలో కనిపించే వినిపించే సర్వమూ కృతకమే ఐనప్పుడు వాటిని తిప్పికొట్టే పూచీ ప్రేక్షకులు తీసుకొనే దాకా వాళ్ళాడింది ఆట వాళ్ళు పాడింది పాట. ప్రతి దిక్కుమాలిన సినిమానూ వేలకొద్దీ థియేటర్లలో ఒకేసారి విడుదల చెయటం. జనం ఛీ అనే లోపలనే అత్రపడి చూసిని అమాయకల వద్ద నొక్కేసిన డబ్బుతో లాభాలు దండుకోవటం - అవే ముఖ్యం కాని ఈ సినిమాలకు ఏ విలువలతోను పనిలేదు. ఎవడైనా ఒక మంచి సినిమాను తాపత్రయపడి తీసినా దానికి థియేటర్లు దొరకవు - వారసుల సినిమాల ఊకదంపుడు గోలలమథ్య దాని ఊసుకూడా మీడియాలో రానేరాదు. ఈ వెకిలితనాలకు కాలం మూడే దాకా వేచి చూడటం తప్ప చేయగలిగింది కనిపించటం లేదు.
మిత్రులు శ్యామలరావుగారు స్పందించినందులకు కృతజ్ఞతలు. వారి భావం అర్థమయింది. నాకు తెలియని భాషారహస్యం ఏదైనా ఉన్నదేమో అని అడగటం జరిగింది. మరీ ఇంత మర్యాదలేకుండా పోవటం శోచనీయం.
కామేశ్వర రావు గారూ, ద్విపద సమాసంగా ఉన్నపుడు గౌతమిపుత్రుడు, గౌతమీపుత్రుడు రెండూ సాధువులే. "గౌతమీపుత్ర శాతకర్ణి" అని బహుపద సమాసంలో మాత్రం గౌతమి శబ్దం దీర్ఘాంతమై ఉండాలి.
పోచిరాజు వారి వ్యాఖ్య దానిపై మాస్టారు గారి వివరణలతో ఎక్కడో మూలనున్న సందేహం తీరింది. ఒక్కమాట మాత్రం నిజం - ప్రస్తుతానికి టీవీ, రేడియో, సినిమా మాధ్యమాలలో "నా తెలుగు నా ఇష్టం", "నా సినిమా నా ఇష్టం" అనే ధోరణి బాగా ప్రబలుతోంది. అన్యదేశాల వారితో అను నిత్యం మాట్లాడే వాడిగా చెబుతున్నాను...ఫ్రాన్సు, బ్రిటన్, పోలాండ్ దేశాలతో సహా చాలా దేశస్థులకు భాషాభిమానం మనకన్నా చాలా ఎక్కువ. వారు దాని ఆయువు పట్టును కోల్పోవటానికి ఇష్టపడరు. మనకు అది తగ్గి పోతోంది. శోచనీయము. చరిత్రకారులను, పండితులను సంప్రదించకుండా అటువంటి సినిమా తీయటం, శ్యామలీయం గారన్నట్లు, వారి వ్యాపారాత్మక ధోరణిని చాటి చెబుతోంది. మాస్టారూ మన్నిచండి, ఇక్కడి కవితాప్రపంచానికి ఇది విషయాంతరమే, అప్రస్తుతముకూడానేమో!
నిత్య వికాస యోజన వినిర్మిత సౌర కుటుంబమంతట న్నత్యనురక్తిగూడి జగమంతట కాంతిని బంచువాడవై ప్రత్యణురూప జీవన విభాతము గూర్తువు వత్సరమ్ములో సత్యము నిన్ను మించిన విచారణ శీలుడు లేడు భానుడా!
గురువు గారికి మరియు కవిమిత్రు లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు . పగలు రేయనక ప్రయాస పడిన కాని పెట్టుబడి పెరిగి యసలు గిట్టనపుడు, రాజనాల పంటకు వె ల రాక పోవ రైతు దుఃఖియించు మకర సంక్రాంతి నాడు. (దుఃఖియించు టైపాటు ).
గురువు గారికి నమస్కారములు...
రిప్లయితొలగించండిమకర సంక్రాంతి శుభాకాంక్షలు...
రైతులు..........సంక్రమ..... యతి కుదిరిందంటారా గురువుగారూ!
విరించి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
నిజమే యతి తప్పింది. సవరిస్తాను.
"కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
రిప్లయితొలగించండిబిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?"
కరువు కాలము లోననో కడుపు మండె
ధరణి కరుణించి పండెనో
ధరలు కూలె
అప్పు లిచ్చిన యాసామి కప్పు కూల్చె
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశ్రీనాథుని చాటువును ప్రస్తావిస్తూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండికవి ప్రజాపతి యన్నను కనెడి సుఖము
తల్లిదండ్రులు ముదిమిని దనరు సుఖము
పంతులయ్యల వేదాల పఠన సుఖము
రాజనగ రైతె యనెడి సరాగ సుఖము
ఎండమావుల జలముల నెన్ను గతులె
రైతు దుఃఖించు మకర సంక్రాంతి నాడు
కైతలకేమి లోటు ఘన కార్యము నేతలదంచు సేద్యమున్
మాతల జేర్చినాము యభిమానము జూపియు నప్పులన్నిటి
న్నూతల దీర్చినామనగ నూర్చిన పంటల లెక్కలేయగా
చేతికి వచ్చెనే మిగులు చిల్లర నైనను సంబరాలనన్?!
రైతుల రోదనల్ మకర సంక్రమణమ్మున హెచ్చు నెల్లెడన్
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పూరణలో నేనిచ్చిన సమస్యపాదంలో యతిదోషం ఉంది. తరువాత సవరించాను. మీరు ఈలోగా యతిదోషాన్ని గమనించకుండా పూరణ పంపారు. సవరించిన సమస్యతో మరొక పూరణ చేయండి.
పంట లొచ్చెను నింటికి భాగ్య మనగ
రిప్లయితొలగించండికొత్త యల్లుడు కోరెను చిత్త మలర
అలుక తీరిన నమ్మాయి చిలికె నవ్వు
రైతు దు:ఖించు మకర సంక్రాంతి నాడు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒచ్చెను.. అన్నారు. 'పంట వచ్చెను' అనండి.
రిప్లయితొలగించండిశుభోదయం !
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షల తో !
பொங்கலோ பொங்கல் !
జల్లి కట్టు పందెములను జడ్జి వలదు
వలదని హుకూము జేయగ, వచ్చు చున్న
ది మరి యచ్చేదినమని మోది పలుకగను,
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసమకాలీనాంశాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో...మన తెలుగు చంద్రశేఖర్.
రిప్లయితొలగించండిఒక సందేహము - ఈ మధ్య విడుదలైన చిత్రం పేరు "గౌతమిపుత్ర శాతకర్ణి" అని చూస్తున్నాను. కానీ అది "గౌతమీపుత్ర ..." అనికదా ఉండవలసినది. "మ" కు దీర్ఘము లేనిచో షష్ట్టీ తత్పురుష సమాసం అవ్వదుకదా! తెలిసినవారు చెప్పగలరు. రెండూ సరియైనచో, సూత్రము ఏమి?
గొంగడిలో తింటూ... అన్న సామెత ఒకటుంది. సినిమావారి భాషలో తప్పులు వెదకటం వలన ఉపయోగం లేదేమో. మొన్ననే కదా, 'నాగభరణం' అని ఒక సినిమా వచ్చింది. అసలు సినిమాలన్నీ కృతకవ్యవహారాలు. సినిమా వాళ్ళ నడక నడత భాష అన్నీ కృతకాలే. ఆ సినిమాల్లోని కథలూ కథనాలూ ఊళ్ళూ పేర్లూ మాటా మంతీ అంతా కృతకమే. వాటిలో కనిపించే వినిపించే సర్వమూ కృతకమే ఐనప్పుడు వాటిని తిప్పికొట్టే పూచీ ప్రేక్షకులు తీసుకొనే దాకా వాళ్ళాడింది ఆట వాళ్ళు పాడింది పాట. ప్రతి దిక్కుమాలిన సినిమానూ వేలకొద్దీ థియేటర్లలో ఒకేసారి విడుదల చెయటం. జనం ఛీ అనే లోపలనే అత్రపడి చూసిని అమాయకల వద్ద నొక్కేసిన డబ్బుతో లాభాలు దండుకోవటం - అవే ముఖ్యం కాని ఈ సినిమాలకు ఏ విలువలతోను పనిలేదు. ఎవడైనా ఒక మంచి సినిమాను తాపత్రయపడి తీసినా దానికి థియేటర్లు దొరకవు - వారసుల సినిమాల ఊకదంపుడు గోలలమథ్య దాని ఊసుకూడా మీడియాలో రానేరాదు. ఈ వెకిలితనాలకు కాలం మూడే దాకా వేచి చూడటం తప్ప చేయగలిగింది కనిపించటం లేదు.
తొలగించండిశ్యామలీయం గారూ,
తొలగించండిధన్యవాదాలు!
చంద్రశేఖర్ గారూ,
తొలగించండిమీ సందేహానికి సమాధానం క్రిష్ గారు చెప్పారు. క్రింది లంకెలో 27:20 వద్ద చూడగలరు.
https://youtu.be/aFDuCoa3CbI
వంశీ
వంశీ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువుగారికి,సుకవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
మకర రాశిలోన మార్తాండు డుదయించె
నుత్తరాయణంపు క్రొత్త కాంతి
కలిమి కలుగజేసి కాపాడు సంక్రాంతి
గడప గడప లోన కదలి వచ్చి
కరములను జాచి దీవించు గురువు వోలె
సిరుల నిచ్చును జగతికి స్థిరముగాను
రక్ష జేయును లోక సంరక్షకుండు
సూర్యనారాయణుడు దివ్య శోభ లిడుచు.
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు, ధన్యవాదాలు!
గురువులకు మిత్రులకు మకరసంక్రమణమహాపర్వ శుభకామనలు.
రిప్లయితొలగించండిరంగుల రంగవల్లులను రాజిలు గొబ్బెల పట్టుపావడాల్
హంగుగ దాల్చి కన్నియలు నందముగా నడయాడు శోభలన్
రంగహరీ యటంచు ఘన రాగములన్ చరియించు దాసులన్
ముంగిట గంగిరెడ్లు బుడబుక్కలు సందడి మించు లెంచెదన్.
రంగుల రంగవల్లులను రాజిలు గొబ్బెల పట్టుపావడాల్
హంగుగ దాల్చి కన్నియలు నందముగా నడయాడు శోభలన్
రంగహరీ యటంచు ఘన రాగములన్ చరియించు దాసులన్
ముంగిట గంగిరెడ్లు బుడబుక్కలు సందడి మించు లెంచెదన్.
పితృదేవతలను దలచుచు
సతతము మము గావుడంచు సదమలభక్తిన్
స్తుతియించి పూజజేయుచు
మతిమంతులు మించుదినము మహనీయంబౌ.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
ె
రిప్లయితొలగించండిె
.......………………………………
గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గు రు వ ర్యు ల కు &
క వి మి త్రు ల కు న మ స్కా ర ము లు
మరియు స ౦ క్రా ౦ తి శు భా కా ౦ క్ష లు
-----------------------------------------------
* స ౦ క్రా ౦ తి * స ౦ బ రా లు *
-----------------------------------------------
.......................
ఎచ్చోట జూచిన ని౦పుగ హరిదాసు
. . కీర్తనతో జేయు నర్తనములె
ఎచ్చోట జూచిన నెసగి , మధుర మగు
. . జానపదుల లోని గాన సుధలె
ె
ఎచ్చోట జూచిన నచ్చెర వొసగును
. . కోలాట రవముల మేలు గతులె
ఎచ్చోట జూచిన హెచ్చైన స్థాయిలో
. . చెక్కభజనల యొక్క చెలగు ధ్వనులె
ె
ర౦గు ర౦గుల ర౦గ వల్లరుల కా౦తి
ర౦గరి౦చగ న౦గనల్ ప్రా౦గణమున ,
కర్షకులు తడియగ హర్ష వర్ష మ౦దు ,
ి
వచ్చె స౦క్రా౦తి లక్ష్మి శోభాయముగను |
మకర స౦క్రా౦తి మనకిడె నికరముగను =
సకల శుభముల సుఖముల స౦తసముల
ె
{ గతి = తాళము ; స్థాయి = శ్రుతి ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్యామలరావుగారు స్పందించినందులకు కృతజ్ఞతలు. వారి భావం అర్థమయింది. నాకు తెలియని భాషారహస్యం ఏదైనా ఉన్నదేమో అని అడగటం జరిగింది. మరీ ఇంత మర్యాదలేకుండా పోవటం శోచనీయం.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
తొలగించండిసినిమా, టివీ చానెల్ వాళ్ళ భాషామర్యాదల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది! 'గౌతమీపుత్ర' అనడమే సాధువు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి వందనములు. "గౌతమి" తత్సమము, పుత్రుడు తత్సమము. గౌతమి యొక్క పుత్రుఁడు సమసించిన "గౌతమిపుత్రుడు" సాధ్యసమాసముగా పరిగణించిన సాధువగును కదా! రాజు యొక్క ఆజ్ఞ : రాజునాజ్ఞ వలె. "రతిపతి", "ధరణిపతి" యిత్యాదులు సాధువులే కదా!
తొలగించండిఇది నాయభిప్రాయము.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిద్విపద సమాసంగా ఉన్నపుడు గౌతమిపుత్రుడు, గౌతమీపుత్రుడు రెండూ సాధువులే. "గౌతమీపుత్ర శాతకర్ణి" అని బహుపద సమాసంలో మాత్రం గౌతమి శబ్దం దీర్ఘాంతమై ఉండాలి.
అవునండి నేనూ అదే అనుకున్నాను. అందుకే గౌతమిపుత్రుడు సాధ్యసమాసమన్నాను. ఆపద్ధర్మముగా చలనచిత్ర నామము "గౌతమిపుత్ర! శాతకర్ణి" గా భావించ వచ్చును.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపోచిరాజు వారి వ్యాఖ్య దానిపై మాస్టారు గారి వివరణలతో ఎక్కడో మూలనున్న సందేహం తీరింది. ఒక్కమాట మాత్రం నిజం - ప్రస్తుతానికి టీవీ, రేడియో, సినిమా మాధ్యమాలలో "నా తెలుగు నా ఇష్టం", "నా సినిమా నా ఇష్టం" అనే ధోరణి బాగా ప్రబలుతోంది. అన్యదేశాల వారితో అను నిత్యం మాట్లాడే వాడిగా చెబుతున్నాను...ఫ్రాన్సు, బ్రిటన్, పోలాండ్ దేశాలతో సహా చాలా దేశస్థులకు భాషాభిమానం మనకన్నా చాలా ఎక్కువ. వారు దాని ఆయువు పట్టును కోల్పోవటానికి ఇష్టపడరు. మనకు అది తగ్గి పోతోంది. శోచనీయము. చరిత్రకారులను, పండితులను సంప్రదించకుండా అటువంటి సినిమా తీయటం, శ్యామలీయం గారన్నట్లు, వారి వ్యాపారాత్మక ధోరణిని చాటి చెబుతోంది.
తొలగించండిమాస్టారూ మన్నిచండి, ఇక్కడి కవితాప్రపంచానికి ఇది విషయాంతరమే, అప్రస్తుతముకూడానేమో!
"శంకరాభరణం" నిర్వాహకులకు, పాల్గొనుచున్న కవివరేణ్యులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు...!
రిప్లయితొలగించండిశిష్ట్లా వారూ,
తొలగించండిధన్యవాదాలు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండితేటగీతి:
నింగినున్నట్టి చుక్కలే నేలబడగ
మెరుపుతీగెలు వాటినే మేలు గలుప
రంగులేడుగ జల్లగా రవికిరణము
వెలిగె సంక్రాంతి ముగ్గులై తెలుగు నేల.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిసంక్రాంతి ముగ్గుల గురించి ఉదాత్తంగా భావించి చక్కని వర్ణన చేశారు. అభినందనలు.
మకర సంక్రాంతి:
రిప్లయితొలగించండినిత్య వికాస యోజన వినిర్మిత సౌర కుటుంబమంతట
న్నత్యనురక్తిగూడి జగమంతట కాంతిని బంచువాడవై
ప్రత్యణురూప జీవన విభాతము గూర్తువు వత్సరమ్ములో
సత్యము నిన్ను మించిన విచారణ శీలుడు లేడు భానుడా!
ఋతువులు, మాసముల్, దినము, రేయిబవల్, ఘడియల్, నిమేషముల్
జతగొని నీదు చంక్రమణ సామ్యత తోడ చరించు గాదహో!
యతి నియమంబునన్ చలనమందెడి భూగ్రహ రాశులన్నిటన్
సతతము సాగగన్ మకర సంక్రమణమ్మున పర్వమై జనున్!
.......శిష్ట్లా వి.యల్.యన్.శర్మ
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిఅద్భుతమైన పద్యాలు. అభినందనలు.
దయచేసి మీ పూర్తి పేరు చెప్పండి. (శిష్ట్లా వేంకట నరసింహ/నారాయణ శర్మ?)
గురువుగారూ....నమస్సులు. నా పూర్తి పేరు శిష్ట్లా వేంకట లక్ష్మీ నరసింహ శర్మ.
తొలగించండిశర్మ గారు మనోహరముగా భాను ప్రాశస్త్యమును చాటి చెప్పారు. అబినందనలు.
తొలగించండికవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు. ధన్యవాదములు. మకరసంక్రాంతి శుభాకాంక్షలు.
తొలగించండిరైతు సోదరులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపిల్లపాపలతో రైతు చల్లగుండ
"రైతు దుఃఖించు మకర సంక్రాంతినాడ"
టంచు పలుకగ నెటుల నోరాడె నయ్య?
కష్టముల మరువ నిమ్ము సంక్రాంతి నాడు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ (చదివి నాలో నేను నవ్వుకున్నాను కూడా!). అభినందనలు.
గురువర్యులకు ప్రణామములు సహృదయముతో అందరూ ఆనందముగా ఉండాలని
తొలగించండినా ఆకాంక్ష.
రైతు దుఃఖించు మ కర సంక్రాంతి నాడు
రిప్లయితొలగించండిసంత సించును సంక్రాతి సంబర ముల
జేసి కొనుచును రైతన్న చెలువు మీర
ధాన్య లక్ష్మిని జూచుచు దడవ తడవ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడలేదనుకుంటాను!
సంకటమేకదామకరసంక్రమణమ్మునరైతులేడ్వగన్
రిప్లయితొలగించండిశంకయదియేలగలిగెశంకరభక్తుడ!మీకుగానిటన్
సంకటమేమియున్మకరసంక్రమణంబునలేదురైతుకున్
పంకజనాభునిన్దయనుభార్యయుబిల్లలుహాయిగుందురే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముందుగా, మిత్రబృందం అందరకూ వారివారి బంధుమిత్రగణసహితంగా మకరసంక్రాతి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఇక నా పూరణ:
చింత దీర్చెడు పంటకు సంతసించు
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు
దాతయగు మంచియోగంబు తప్పి ప్రతిగృ
హీత యగువాడు దుర్విధి వ్రాతనెంచి
శ్యామల రావు గారూ,
తొలగించండిబహుకాలానికి చక్కని పూరణ నందించారు. సంతోషం! అభినందనలు.
"రైతు దుఃఖించు మకర సంక్రాంతి నాడు"
రిప్లయితొలగించండినిజమ?! నమ్మను నేనిది, ప్రజల కెపుడు
నన్నమిడు నాత డెప్పుడు నున్నదనుచు
తనదు కష్టాల మరచుచు తనివి దీర!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దండిగ ధననిధిఁ దనదు ధనము మూల్గ
రిప్లయితొలగించండిధన విహీనత కరమునఁ దనను వేఁచ
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు
నేడు ధర్మమూర్తులె చూడ నేత లెల్ల!
జంకక యీతిబాధలకుఁ జక్కగ నాఁగటి దున్నిభూమినిం
డంకము పాఱ కత్తులు కుఠారము లూని కృషిన్నొనర్చి తాఁ
డంకము లందు దృష్టి నిడ డాయు కుసీదికు నత్తరిం గనన్
సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్
[టంకము = 1. గడ్డపాఱ , 2. డబ్బు; కుసీదికుఁడు = వడ్డీవ్యాపారి]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిముదిమినిన్ దనరు ...
చేతికి వచ్చెనా...గా సవరించుకున్నాను. ద.చే.సరిచూడ ప్రార్థన,ఆర్యా!
పిట్టా వారూ,
తొలగించండిమీ సవరణలు బాగున్నవి. సంతోషం!
ఆరుగాలముఁ బనిచేసి తీరుగాను
రిప్లయితొలగించండిపంటనంతయుఁ గొనితెచ్చి యింటనుంచ
వెల పతనమైక్రయమ్ములు నిలచిపోవ
రైతు దు:ఖించు మకర సంక్రాంతి నాడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువర్యులకు ధన్యవాదములు.
తొలగించండిఅందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండినేటి పూరణ :
చినుకు రాలక పంటలు చివికి పోవ
ప్రభుత భీమా ధనమొసంగు పంట కనుచు
నమ్మి యెదురు చూపులనుండి సొమ్ము రాక
రైతు దుఃఖించు మకర సంక్రాంతి నాడు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వాన దేవర యలిగిన ఫలము తరుగు |
వరుణ దేవుడు కరుణి౦చి ప౦ట నొసగ
విరివిగా , నొక్క సారిగ ధరలు కూలు |
స౦తస౦ బెప్పు డున్నది సైరికునకు ?
రైతు దు : ఖి౦చు మకరస౦క్రా౦తి నాడు !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
చలిబెట్టు గిలిగింత చంచల తత్వంబు
రిప్లయితొలగించండి---------------గగనానికంపినా? గాలిపటము
ముంగిట ముగ్గులు మురిపాలు గాంచియు
---------గంగిరెద్దులయాట గంతులిడినా?
హరిదాసు కీర్తనల్ మరిమరి బాడంగ
-------మనసున చింతలే మందగించ
బంధు వర్గాలతో విందు వినోదాలు
-------సందడులందున సాగుచున్న?
ఉత్తరాయణసంక్రాంతి యూహలన్ని?
దక్షిణాలకు యల్లుళ్ళు దాసులవగ
తూర్పు దండాలె మామకు మార్పు లేవి?
పశ్చిమాద్రికి జేరగ పంటధరలు|
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు|
2.కంకికి సుంకు భీజమగు|గాంచగ రైతుకు పంట బండినా
లింకున హెచ్చుగాను ధరలీనగ లాభములందు?రాజుయౌ|
బింకముమాన్పె యుల్లిధర బీదగజేసె టమోటముంచగా?
సంకటమే కదా మకర సంక్రమణమ్మునరైతులేడ్వగన్
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కొన్ని టైపు దోషాలున్నవి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచలిపినదగు సేద్యమునందు సరియగునగు
ఫలము నిలువని వేళను బలువిడిగను
నళియకు సపర్యలెంచ లేననెడి తొగను
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సరియగు' తరువాత మళ్ళీ 'అగు' ఎందుకు?
క్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండిగురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సవరించాను. పరిశీలించండి.
చలిపినదగు సేద్యమునందు చక్కనైన
ఫలము నిలువని వేళను బలువిడిగను
నళియకు సపర్యలెంచ లేననెడి తొగను
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు.
శ్రీకందిశంకరయ్య గురువర్యులకు ,కవిపండితులకు వందన చందనాలతోసంక్రాంతిశుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపంటలన్నియు జేరగ నింట, బాల
రిప్లయితొలగించండిలాటపాటల నానందమందు మునుగ
రైతు, దుఃఖించు మకరసంక్రాంతి నాడు
"శాతకర్ణి " ని గనలేక మోతు బరియె
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ చమత్కారభరితంగా ఉంది. అభినందనలు.
శంకలులేక నెమ్మి వ్యవ సాయము చేయుచు హాలికుల్ సదా
రిప్లయితొలగించండిబింకముగా ప్రవర్తిలుచుఁ బ్రీతి వసించుచు నుండ పల్లెలన్
వంకరబుద్ధితోడుతను పంటపొలమ్ములఁ దస్కరించగా
సంకరమౌ ప్రభుత్వములు సాగుకు భూమికొరంత యేర్పడన్
సంకటమే కదా మకర సంక్రమణమ్మున రైతు లేడ్వగన్
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పంచపాది పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు, కవిమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిపంకజనాభుధార ధర వాసిగనమ్మిన కర్షకెంద్రులన్
రిప్లయితొలగించండివంకరబుద్ధితోడ పరిపాలకులెల్లరు విస్మరింపగన్
సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతులేడ్వగన్
శంకయె లేదు నష్టమది జాతికి, గాంచుడి యన్నదాతలన్
వాన కురియక కరువుతో పంటలెండె
రిప్లయితొలగించండివరద పోటెత్త నీసారి పైరు మునిగె
నాలుబిడ్డలు మరియుతానాదరించె
పాడి పశువులపోషణే భారమవగ
రైతు దుఃఖించు మకరసంక్రాంతినాడు
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పంకజనాభు ధార ధర'...?
పంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది పంంకజనాభున్ దార ధర విష్ణువు భార్య భూమి అనే అర్థంంతో వాడాను గురువు గారు
తొలగించండిపంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది పంంకజనాభున్ దార ధర విష్ణువు భార్య భూమి అనే అర్థంంతో వాడాను గురువు గారు
తొలగించండివిరించి గారూ, వివరణకు ధన్యవాదాలు
తొలగించండిసుంకము లేమి సేద్య మిడుసొమ్ము పయిన్యను శాసనమ్ముతో
రిప్లయితొలగించండిబ్యాంకుఋణమ్ము మాఫులును ప్లావన మందున పంట పాడవన్
పొంకపు టిన్సురన్సులును పొందుచునుండినరైతు రాజుకున్
సంకటమే గదా మకర సంక్రమణమ్మున రైతు లేడ్వగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ అన్యదేశ్యాలతో పూరణ బాగుంది. అభినందనలు.
పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి సీతాదేవి సంక్రాంతి శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండినమస్కారం. శుభాకాంక్షలు!
వేంకటనాథ నీకృపను వేసినపంటలు చేదికంది యా
రిప్లయితొలగించండిటంకముదీరినన్ తగినడబ్బుల నీయరు షాహుకారులు న్నింకను సొమ్ముయంత్రమది యీయదు కోరిన రూప్యముల్ కటా సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్.
మిస్సన్న గారూ,
తొలగించండిఎటియం ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి మరియు కవిమిత్రు లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిపగలు రేయనక ప్రయాస పడిన కాని
పెట్టుబడి పెరిగి యసలు గిట్టనపుడు,
రాజనాల పంటకు వె ల రాక పోవ
రైతు దుఃఖియించు మకర సంక్రాంతి నాడు.
(దుఃఖియించు టైపాటు ).
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండినేటి పూరణ :
చినుకు రాలక పంటలు చివికి పోవ
ప్రభుత భీమా ధనమొసంగు పంట కనుచు
నమ్మి యెదురు చూపులనుండి సొమ్ము రాక
రైతు దుఃఖించు మకర సంక్రాంతి నాడు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పర్వమొచ్చెననుకొనుచు పత్తినమ్మ
రిప్లయితొలగించండితాను మదిలోన గట్టిగా తలచు కొనగ
విపిణి లోధర తగ్గిన విషయము విని
రైతుదుఃఖించు మకరసంక్రాంతి నాడు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె'ను 'ఒచ్చె' అన్నారు. "పర్వమే వచ్చె ననుకొని ప్రత్తి నమ్మ" అనండి.
సంక్రాంతి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి===================
శ్రీ కంది శంకరయ్య గారికి,సమస్యా పూరణ,కవులకు కవయిత్రులకు,శుభాభి వందనాలతో శుభాకాంక్షలు
మంగళంబుల వర్షించి మంజులముగ
మహిత దీవన లందించి మానవులకు
మకర సంక్రాంతి లక్ష్మిమా మానసముల
నుల్ల సిల్లగ జేయుమా యున్నతముగ.
సమస్యా పూరణ: రైతు దు:ఖించు మకర సంక్రాంతి నాడు:
+++++++++++++++++++++++++++++++
పెద్ద నోటుల రద్డుతో పేద రైతు
లమిత బాధల బడలేక యలమ టించ్రి.
మకర సంక్రాంతి జేయగ మమత దీర
రైతు దు:ఖించె మకర సంక్రాంతి నాడు.
విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరువై.ఎస్.ఆర్.కడప జిల్లా.
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిమీ సంక్రాంతి పద్యం, పూరణ బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిశంకరునాజ్ఞలన్ సతిని శాంభవినిన్ గొలువంగ యాగమున్
పొంకముగా నొనర్చె పరి పూర్ణ సువర్షము హర్షమున్గనన్
చంకలనున్న సత్సరుల స్వాగత వాక్యము లుల్లసిల్ల వే
టంకెల నప్పు దప్పగనుటౌనని లేమిని బాపె కేసియార్!
సంకటమే కదా మకర సంక్రమణమ్మున రైతులేడ్వగన్
పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంకను బిడ్డనెత్తుకొని చక్కగ బోవగ కోళ్ళపందెమున్
రిప్లయితొలగించండిజంకును లేకయే కనగ జాస్తియొ కొంచెము నాటలాడుచో
పొంకము లేని పోలిసులు పోరుచు నెట్టుచు పోరపొమ్మనన్
సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్!