9, జనవరి 2017, సోమవారం

కృష్ణ స్మరణ

రచన: కామేశ్వర రావు పోచిరాజు
శంఖ చక్ర గదా ధరమ్ కౌస్తుభ మణి భూషితమ్|
శ్రీరమా సుమనోహరమ్  స్మరామి సతతమ్ హరిమ్||                   1
నీలాంబుదనిభశ్యామం నీరజపత్రలోచనం |
శిఖిపింఛధరం కృష్ణం స్మరామిమురళీధరం ||                               2                                  
తృణీకృత తృణావర్తం పూతనా ప్రాణ హారిణం |
అర్జున మోక్ష దాతారం స్మరామి బక మర్దనం ||                           3
కాళీయఫణ సంత్రాసమ్ అఘాసుర విదారిణం |
మత్త కుంజర హంతారం స్మరామి నందనందనం ||                       4

9 కామెంట్‌లు:

 1. అష్టమి రోహిణి పొద్దున
  న ష్టమ గర్భుడు గ పుట్టె కృ ష్ణుడు మహిలో
  న్ని ష్టముగ పూ జ చేసిన
  కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్
  శ్రీ కృష్ణుడు భగవానుడు
  శ్రీ కృష్ణుడు మనకు నిచ్చు సిరి సం ప ద లున్
  శ్రీ కృష్ణుని సేవించిన
  శ్రీ కృష్ణు డె మనల పంపు మోక్షము దరికిన్ .


  కిష్ట య దేవకి కడుపున
  అష్టమినా డుద్భవించ య ష్ట మ శి శు గాన్
  ఇష్టముగ ప ల్లె వా సులు
  కష్టము లిక తొలగె న ను ఛు గంతులు వేసెన్.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. పూజ్యులు గురువు గారి సలహా మేరకు మొదటి శ్లోకమును యీ విధముగా సవరించితిని.


   శ్రీరమా సుమనోనాథం కౌస్తుభ మణి భూషితమ్ |
   శంఖ చక్ర గదాహస్తం స్మరామి సతతమ్ హరిమ్||

   తొలగించండి
  2. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ కృష్ణ స్మరణ అత్యద్భుతంగా నున్నది. ఎవరయినా తెలియని వారు చదివితే ఏ వ్యాస భగవానుడో శంకర భగవత్పాదులో వ్రాశారు అనుకోవడం తథ్యం.

   తొలగించండి
  3. ఫణి కుమార్ గారు మీ యభిమానమునకు, ప్రశంసకు ధన్యవాదములు.

   తొలగించండి
 3. శ్రీగురుభ్యోనమః

  శ్రీకవితా గానముతో
  శ్రీకృష్ణ స్తుతిని జేసె శ్రియములు కలుగన్
  శ్రీ కామేశ్వర ధీమణి
  మీకివె నా వందనములు మేరు సమానా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీపతిశాస్త్రి గారు మీరందమైన కందముతో మదీయ శ్లోక స్తోత్రమును పఠించి ప్రస్తుతించి నందులకు ధన్యవాదములు. ఈ శ్లోకములు “అనుష్టుప్ ఛందములో కూర్పబడినవి.

   తొలగించండి