8, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2247 (సోదరు లిర్వురున్ మిగుల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్."
లేదా...
"సోదరులు రెండు కథలకు శోభ నిడిరి"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

 1. కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి తన సోదరుడు కొప్పరపు వేంకటరమణ కవితో కలిసి కొప్పరపు సోదర కవులు పేరుతో జంట కవిత్వం చెప్పాడు...


  కొప్పరపు సోదర కవులు గొప్ప వారు
  అష్టశత యవధానము లన్ని జేసి
  లవ కుశుల సోదరుల గాధ లవని జెప్పి
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భారత మొకటి మరొకటి భాగవతము
   సోదరులు యాదవకుల మహోదయులును
   కంసవధ యొకటి మరియు కర్ణవధర!
   సోదరులు రెండు కథలకు శోభ నిడిరి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'గొప్పవారు + అష్ట' అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు. 'శత+అవధానములు' అన్నపుడు సవర్ణదీర్ఘసంధి జరగాలి కావాలి కదా! "గొప్పవార। లష్ట శత వధానమ్ముల నన్ని చేసి" అనండి. అవధానమును వధానము అని కూడా అంటారు కదా!
   రెండవ పూరణలో 'కర్ణవధయు' అనండి.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు:

   "అష్ట శతావధానములు" అని సంధిజేసి వ్రాద్దామని అనుకున్నాను. కానీ అలా వ్రాస్తే "అష్ట" శబ్దము "శత" శబ్దమునకు విశేషణమవు తుందని శంక కలిగి గాలిలో వదిలేశాను. నా బాధ గ్రహించి మీరు అద్భుతమైన సవరణ చేసినందులకు కృతజ్ఞుడను.

   తొలగించండి
 2. వాదుకు తావు లేదుగద ! భారత, రామకథల్ ప్రశస్తికిన్
  ఆదట మీరగన్ తొలుత అంజన పుత్రుడు నాంజనేయుడున్
  ఔదల దాల్చుచున్ తనదు యగ్రజు నాజ్ఞను భీమసేనుడున్
  "సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్."

  రిప్లయితొలగించండి
 3. శ్రీగురుభ్యోనమః
  వాదనలందు వారలను పట్ట నసాధ్యము,పద్యవిద్యకే
  చోదకులైరి కొప్పొరపు శోభను ఖ్యాతిని పెంపు జేయుచున్
  మోదము గూర్చువారు తమ ముంగిటనిల్వ వధానవిద్యతో
  సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్.

  రిప్లయితొలగించండి

 4. రాముని చరితమును సరి రాణి సీత
  కథను వీనుల విందుగ గాన ములన
  ‍‍‌లవ కుశలు వాడవాడల లబ్జు గనుచు
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లబ్జు' శబ్దాన్ని శ్రీహరి నిఘంటువు పేర్కొన్నా దాని సాధుత్వం సందేహమే!

   తొలగించండి
 5. ఆగ కుండగ నొకగంట నేక ధాటి
  అష్ట శతముల పద్యాలు కష్ట మనక
  కొప్పరపు వారి ఘనతను చెప్పు కొనగ
  సోదరులు రెండు కధలకు శోభ నిడిరి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  ఒకని కడ వండితిన నూక లుండకుండు
  నొకడు లంపటుడై భార్య నూని దిరుగు
  తల్లి దండ్రి వృద్ధాశ్రమ దయన బ్రతుకు
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి!
  ఖేదము మాని రాజ్యమును ఖిన్నుడునై విడ పితృనాజ్ఞమై
  మోదము మాని రాము ననుమోదము బొందియు సేవ జేయగా
  లేదిల సామి లక్ష్మణ బలీయ సుబంధము త్యాగ బుద్ధియున్
  సోదరులిద్దరున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'దయను' అనడం సాధువు. 'పితృ' అన్నపుడు 'పి' లఘువే. 'తండ్రి యాజ్ఞమై' అంటే సరి!

   తొలగించండి
 7. ……………… ……………

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  మేదిని య౦దునన్ బ్రజలు మృత్యు భయాన

  ……………… వడ౦కి పోవుచున్

  రోదన మ౦ద , చక్రముఖి రూపమునన్

  …………… హరి చ౦పె నొక్కనిన్ |

  " వాదన మేల ? మాను హరి భక్తి "

  ……… నట౦చును హి౦స వెట్ట - ప్ర

  హ్లాదుని , నారసి౦హుడగు చా హరి

  ……………… చీల్చె గదా మరొక్కనిన్ |

  సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి

  …………………… రె౦డు గాథలన్ |


  { చ క్ర ము ఖి = వ రా హ ము }

  రిప్లయితొలగించండి
 8. మేదిని సూర్య చంద్ర కుల మేరు ధరాధర సన్నిభప్రభా
  వేదులు భాతృ భావ రత విజ్ఞులు జ్యేష్ట వచోనువర్తి స
  న్నాదము రామ భారత కథా ద్యుతి పూరిత వైభవమ్ములన్
  సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్.

  [సోదరులిర్వురు = రాఘవపాండవ సోదరద్వయము]


  హరి కథాశ్రవణము భవ తరణ మెంచ
  శైవకథ లెల్ల మోక్షంపు సాధనములు
  హరిహరు లిరువురు నిల మహత్కృపా ర
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి

  [కృపారస +ఉదరులు = కృపారసోదరులు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారు:

   నమోనమః

   వైకుంఠ ఏకాదశి నాడు "పద్మావతీ శ్రీనివాసము" ప్రతులు తీసి బంధుమిత్రులకు పంపే సన్నాహం పూర్తయినది. వందనములు...

   తొలగించండి
  2. శాస్త్రి గారు నమస్సులు. సంతోషకరమైన మాట చెప్పారు. ధన్యవాదములు.

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   అద్భుతమైన మీ పూరణలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలై అలరారుతున్నవి. సముచిత శబ్ద ప్రయోగం.. దాని ననుసరించే చక్కని భావసంపద... గంగాప్రవాహం వంటి ధార! శంకరాభరణం బ్లాగుకు వాగ్దేవి ప్రసాదించిన ఒక వరం మీరు. అభినందనలు, ధన్యవాదాలు!
   *****
   శాస్త్రి గారూ,
   మీ చర్య ప్రశంసార్హం!

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
   సాతిశయోక్తాభిమాన భరిత మీ వాగమృత ధారతో నా నయనమ్ము లానందాశ్రు పూరితము లైనవి. శతాధిక వందనములు.
   నేను రోజు చదివే వాల్మీకి రామాయణము, భాగవత, భారతముల ప్రభావము నాకు తెలియకుండానే నా కవనముపై పడు చున్నదని నా సంశయము.


   శాస్త్రి గారు యీ క్రింది ముద్రణ దోషములను మీ ప్రతుల లో సవరించ గోర్తాను.
   ఆశ్వాసము 3: పద్యము. 64 మరియు ఆశ్వా. 4 లో పద్యములు:101, 104: ద్రుటి (దృటి కి బదులు).
   ఆశ్వా. 4లో 80: నేత్ర (నేత్రి కి బదులు).

   తొలగించండి
 9. ఇనకులజులగు రామలక్ష్మణులిరువురు
  పాండు భూపతి తనయుల పంచకమ్ము
  త్రేత ద్వాపర యుగపు ప్రతీతి కెక్కు
  సోదరులు, రెండు కథలకు శోభ నిడిరి !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 10. మనసు కౌరవులను జేర పెనగు లాడ
  పాండ వేయుల , కౌరవ పక్షమనక
  తపము బలరాము డెంచుచు తరలిపోవ
  పార్ధ సారధి గానయ్యె పద్మనాభు
  డనిని; దలుపగ నయ్యదే యద్భుతమ్ము
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పూర్వ జన్మకర్మల చేత భువిని కలుగు
  నాపదలు; మానవుల యాశ లన్ని తీర్చు
  ననవరత మనంతుని స్మరణమ్ము చేయ ,
  చేరి పరమాత్మ పాదముల చెంత గడుప

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హరిహర పరమాత్మ ద్వయి నవని యందు
  విష్ణు శివ పురాణమ్ముల వెలుగు లిడుచు
  లలినగు నెఱి పరిఢవించ చలుపు చుండి
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. దాశరథి వంశ జులు వారు వాసిగాను
  పద్య గద్య గ్రంథాలనే వ్రాసినారు
  మాయజలతారు వచనరామాయణముల
  సోదరులు రెండు కథలకు శోభనిడిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

   తొలగించండి
 13. బద్ధ శత్రువు లైనట్టి యిద్దరైన
  చిత్రముల కథానాయక శ్రేష్ఠులకును
  పలుకులన్ గూర్చ వారి చేవ, పరుచూరి
  సోదరులు రెండు కథలకు శోభనిడిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   పరుచూరి సోదరులను గురించిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 14. పేదలజీవితాల గని వేదన జెంది నిజాము పాలనన్
  గాదని జెప్పు గొప్పవగు గ్రంథము లెన్నొరచించిరే
  మోదుగుపూలు, పాఠకులు మోదము నొందిన యగ్నిధారలన్
  సోదరులిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. 'రచించి మించిరే' అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి కృృతజ్ఞతలు....మీరు సూచింంచిన దే నేను వ్రాసుకున్నాను వ్రాతప్రతిలో ....కాని టైైపు చేసేటపుడు తొంందరపాటున జరిగిన పొరపాటు

   . *సవరింంచినపద్యము*

   పేదలజీవితాల గని వేదన జెంది నిజాము పాలనన్
   గాదని జెప్పు గొప్పవగు గ్రంథము లెన్నొరచించిమించిరే
   మోదుగుపూలు, పాఠకుల మోదము నొందిన యగ్నిధారలన్
   సోదరులిద్దరున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్

   తొలగించండి
  3. గురువు గారికి కృృతజ్ఞతలు....మీరు సూచింంచిన దే నేను వ్రాసుకున్నాను వ్రాతప్రతిలో ....కాని టైైపు చేసేటపుడు తొంందరపాటున జరిగిన పొరపాటు

   . *సవరింంచినపద్యము*

   పేదలజీవితాల గని వేదన జెంది నిజాము పాలనన్
   గాదని జెప్పు గొప్పవగు గ్రంథము లెన్నొరచించిమించిరే
   మోదుగుపూలు, పాఠకుల మోదము నొందిన యగ్నిధారలన్
   సోదరులిద్దరున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్

   తొలగించండి
 15. కొప్పరపు వారి పుత్రుల గొప్పదనము
  భారతమ్మును నింకను భాగవ తపు
  కధలు జదువంగ దెలియును ,గమ్మగా ను
  సోదరులు రెండు కధలకు శోభ నిడిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. సోదరులే గదా భువిని జూడగ గొప్పర వంశ జ న్ములా
  సోదరు లిర్వురున్మి గుల శోభిల జేసిరి రెండు గాథ ల
  న్నా దరమొప్పగా ధరను భారత భా గవతాది గా ధలన్
  వేదపు వాక్కులా యనగ వేత్తలు మిక్కిలి మెచ్చు నట్లుగన్

  రిప్లయితొలగించండి
 17. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కాదనలేరు లోకులిల కామిత సిద్దిగ సీత మాతకున్
  మోదమునింపుటాదరణ మోహమునింపగ రామచంద్రుడున్,
  వాదన లేని లక్ష్మణుడు|వాక్కునుదాటనికీర్తి వంతులా
  సోదరులిర్వురున్ మిగులశోభిల జేసిరిరెండు గాథలున్|
  2.ధర్మరాజుధర్మము|కర్ణ దానగుణము
  మార్గ మేదేని కీర్తితో మసలిరిపుడు|
  కుంతి పుత్రుల స్ఫూర్తిని చింతజేయ
  సోదరులు రెండుకథలకు శోభ నిడిరి|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 19. బాధలు లేవటంచు బహు భాషల తీరు గనంగ చోద్యమౌ
  వాదన లేలచూ డగను భారత మాతకు కొప్పరుల్ యటన్
  వేధము లందునన్ గురియు వేలకు వేలుగ ధర్మసూత్రముల్
  సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాధలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కొప్పరుల్+అటన్' అన్నపుడు యడాగమం రాదు. 'కొప్పరుల్ గదా' అందామా?

   తొలగించండి
 20. భారతీయ గాథలు మహా భారతమ్ము
  మఱియు రామాయణమ్ముల మరపు రాని
  పాత్రలనగ నా దశరధ పాండు సుతులె
  సోదరులు రెండు కథలకు శోభ నిడిరి!

  రిప్లయితొలగించండి
 21. సోదర సోదరీమణుల! సోయగ మొప్పిన కండ్లవిందులో
  వాదన లేకయే మురియు వందల వందల తెల్గుసిన్మలన్
  మాదియు మీదియున్ననక మాయ బజారున పెండ్ల రెంటిలో
  సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్

  రిప్లయితొలగించండి