29, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2267 (భండనమ్మునఁ బాఱెను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భండనమ్మునఁ బాఱెను భార్గవుండు"
లేదా...
"భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు: 1. అండ పిండ బ్రహ్మాండము నందు విశ్వ
  భండనమ్మునఁ బాఱెను భార్గవుండు,
  చంద్రుడు జిలేబి, తారలు సర్వ జీవ
  కోటి సంద్రములు నదులు కొండలున్ను !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భార్గవ = శుక్రాచార్యుని (భార్గవుడు - భర్గుని పుత్రుడు, శుక్రుడు)?

   తొలగించండి
  2. జిలేబీ గారు,
   మీ పూరణ వైవిధ్యముగా అలరారుచున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. రాము డెందున జంపెను రావణుడను?
  ఏమి జేసెను జింక శ్రీరాము జూసి?
  తల్లి నెవ్వరు జంపెను తండ్రి యాన?
  భండనమ్మునఁ, బాఱెను, భార్గవుండు.


  పూజ్యులు శంకరయ్య గారికి మనవి:
  అర్ధానుస్వారములు నా సిలబసులో లేవు...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రావణుడిని' అనండి. లేదా "రాము డెందుకు చంపెను రావణాఖ్యు। నేమి చేసెను..." అనండి.

   తొలగించండి
  2. కట కటా! సంధిపరిచ్ఛేదము లోని ప్రధమ సూత్రమునే విస్మరించితిని కదా! క్షంతవ్యుడను.

   తొలగించండి
 3. ఉరువున రుధిరమోడిన వెఱపు లేక
  సేవఁజేసెడు క్షత్రియ చేవనెఱిగి
  వదల మనుచు రాధేయుని మదిఁజెలగెడు
  భండనమ్మునఁ బాఱెను భార్గవుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'క్షత్రియ చేవ' అన్నది దుష్ట సమాసం. 'సేవఁ జేయు క్షత్రియజాతి చేవ నెఱిగి' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించమనవి:

   ఉరువున రుధిరమోడిన వెఱపు లేక
   సేవఁ జేయఁగ క్షత్రియ శిష్యు నెఱిగి
   వదల మనుచు రాధేయుని మదిఁజెలగెడు
   భండనమ్మునఁ బాఱెను భార్గవుండు

   తొలగించండి
 4. డా.పిట్టా
  "చండ ప్రచండ వేగమున సాగెను పాకుల పైన యుద్ధమా
  ఖండలు దీప్తి సైనికులు కార్గిలు లో మెడ వంచ;వంచనన్
  రండలవోలె హద్దుల పరాకున జొత్తురు సిగ్గులేక యే
  అండల జూచంకొంటిరొ నయయ్యవిభారత నీతి మెచ్చెరా!
  పొండిక బుద్ధిరా దిపుడె పోకుడి వత్తున"టన్నముఖ్యుడా
  భండనమందు భార్గవుడు, పారెను భీత మనస్కుడై వడిన్!!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  శాంత్యహింసల పెంపున సాగె గాంధి
  "రుధిర మోడ్చుడి నే నిత్తు రూఢిగాను
  దేశ గణతంత్ర మనుచు "సందేశమిచ్చె
  స్థైర్య సంధాత నేతాజి సలిపె పోరు
  కూడగట్ట విదేశాల గోప్యముగను
  భండనమ్మున బారెను భార్గవుండు!

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు మా బావమరది సంవత్సరీకానికి కరీంనగర్ వెళ్తున్నాను. కనుక మీ పూరణలను సమీక్షించడానికి అవకాశం దొరకదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  అండల జూచుకొంటిరొ.గాచదువ గలరు.ం చ.కు.వచ్చింది.టైపా.కు సారీ,ఆర్యా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. కండలు పెంచి క్షాత్రమున కావరమేర్పడ కార్తవీర్యుడున్
  ఖండము ఖండమై నఱికెగా జమదగ్నిని----కోపమందె తా
  భండనమందు భార్గవుడు----పాఱెను భీత మనస్కుడై వడిన్
  గండము దాటెనంచు వగఁగల్గిన వాడయి కార్తవీర్యుడున్

  రిప్లయితొలగించండి
 9. విగతజీవులజేసెను విస్మయంబు
  గొలుపరాముడురాక్షసకులమునంత
  భండనమ్మున,పారెనుభార్గవుండు
  భస్ముధాటికిభయపడిపరుగులిడుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఘోష యాత్రలో ధైర్యము కోలుపోయి
  కురువిభుని వీడి రయమున హరిసుతుండు
  భండనమ్మునఁ, బాఱెను, భార్గవుండు
  అర్కుని కుమారుని శపించె నాగ్రహించి
  హరిః సూర్యుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. కండలుబెంచినంతయవికావుబలంబులుగెల్వగాసుమా
  భండనమందు,భార్గవుడుపారెనుభీతమనస్కుడైవడి
  న్నండనుసోమునిన్గనుచునాశివునేతరుమన్నెకాయెకి
  న్నొండదిచేయలేకయికనుస్సురుగొంచునువిష్ణుపాలికిన్

  రిప్లయితొలగించండి
 12. దండిగ రాజులన్ తునిమె తల్లికొసంగిన మాటకోసమై
  భండనమందు భార్గవుఁడు, పాఱెను భీత మనస్కుఁడై వడిన్
  గండరగండడౌ విజయు కర్కశ మౌప్రభ ప్రజ్వరిల్లగన్
  మండలిసూనుడార్కియు ప్రమాదము గాంచుచు ఘోషయాత్రలో
  మండలిః సూర్యుడు, ఆర్కిః కర్ణుడు

  రిప్లయితొలగించండి
 13. గండ్రగొడ్డలిఁ బూని భీకర సమర వి
  లోలుడై సర్వ రాజన్య లోక పరమ
  వధకుఁ గోపాతురుండునై బ్రాహ్మణ కుల
  భండనమ్మునఁ బాఱెను భార్గవుండు

  [భండనము = దుశ్చేష్ట]


  గండము దీర్చ నింపుగ ముకుందుడు, దానము గీనమేల బ్ర
  హ్మాండము నెల్ల నిండు వలదంచు విరోచన సూనుఁ గావఁ దా
  నండగ నుండ నెంచి యకృతార్థ మనస్కుడు నేత్రనాశుడై
  భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్

  [భండనము = దుశ్చేష్ట; భార్గవుఁడు = శుక్రాచార్యుడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుభ్యోం నమః🙏🏻🙏🏻
   గురువులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములు !
   దయచేసి నా పద్యము చూడగలరని మనవి!

   రాముడెవ్వరో నెరుగకా రాజద్వేషి
   మిధిల జేరెనాగ్రహమున మృథము గోరి!
   యుగసమాప్తిధర్మమెరిగి యుక్తినెంచి
   భండనమ్మునఁ బాఱెను భార్గవుండు!!

   తొలగించండి
  2. సునీల్ బాబు గారు మీ పూరణ బాగుంది. ..వ్వరో యెరుగకా ..యడాగమము సాధువు. రాజద్వేషి రెండు తత్సమములే కనుక ద్వే కి పూర్వాక్షరము జ గురువయి గణ దోషము. సవరించండి. యుగసమాప్తము కాదు గదా. "తనదు పాత్ర ముగియ గలదని తలంచి" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   పోచిరాజు వారి సూచనలను గమనించండి.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  6. నా వృత్తములో యతి దోషము గమనించలేదు నేను క్షమించండి. సవరణ:

   గండము దీర్చ నెమ్మి సిరికాంతుడు, దానము గీనమేల బ్ర
   హ్మాండము నెల్ల నిండు వలదంచు విరోచన సూనుఁ గావఁ దా
   నండగ నుండ నెంచి యకృతార్థ మనస్కుడు నేత్రనాశుడై
   భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్

   తొలగించండి
  7. గురుభ్యోం నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻
   రాముడెవ్వరో యెరుగక లాతమొదలి
   మిధిల జేరెనాగ్రహమున మృథము గోరి!
   తనదు పాత్ర ముగియగలదని తలంచి
   భండనమ్మున బాఱెను భార్గవుండు!!

   తొలగించండి
  8. బాగుందండి. వదలి ని ఒదలి అన్నారు. రాజద్వేషి కి బదులు రాజవైరి యన్న సరిపోతుంది.

   తొలగించండి
  9. గురుభ్యోం నమః
   🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
   రాముడెవ్వరో యెరుగక రాజవైరి
   మిధిల జేరెనాగ్రహమున మృథము గోరి!
   తనదు పాత్ర ముగియగలదని తలంచి
   భండనమ్మునఁ బాఱెను భార్గవుండు!!

   తొలగించండి
 14. కొల్ల గొట్టంగ ధనపతి కోశమునను
  మొరలిడంగనా ముక్కంటి మ్రోలనతడు
  శంభు నాగ్రహంబది యెంత సైపలేక
  భండనమ్మున బారెను భార్గవుండు


  భార్గవుడు=శుక్రుడు

  రిప్లయితొలగించండి
 15. భార్గ‌వుడు యోగ‌బ‌లంచేత కుబేరుణ్ణి సుల‌భంగా మోస‌పుచ్చి అత‌ని ధనం లాక్కున్నాడు. కుబేరుడు విచార‌ప‌డి పోయి శివుడితో చెప్పుకున్నాడు. శివుడికి ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చింది. క‌న్నుల నిప్పులు రాల్చాడు. శూలం యెత్తి ఏడీ భార్గ‌వుడు ఎక్క‌డ ఉన్నాడు ? అంటూ మ‌హోగ్రంగా వ‌చ్చాడు.

  భార్గ‌వుడు భ‌య‌ప‌డి చాలా దూరం పారిపోయి గ‌జ‌గ‌జ వ‌ణుకుతూ నిల‌బ‌డ్డాడు. కాని అలాగ ఎంతోసేపు నిలుక‌వ‌లేక‌పోయాడు. అత‌ని చిత్తం త‌ల్ల‌డిల్లింది. మిక్కిలి వేగంగావ‌చ్చి శివుడి చేతిలో ప‌డ్డాడు.శివుడు అత‌ణ్ణి గుటుక్కున మ్రింగేశాడు. క‌డుపులో ఉన్న భార్గ‌వుడు బ‌య‌టకు రాకుండా ఉండేట‌ట్లు త్రోవ‌ల‌న్నీ మూసివేసి, ఒక్క శిశ్న‌ము మాత్రం మూయ‌క‌, ఆత్రోవ‌వెంట వెడ‌ల‌మ‌ని శివుడు అత‌నికి తెరువు చూపించాడు. భార్గ‌వుడు ఆ మార్గాన బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతా దేవి గారు క్రొత్త విషయాన్ని తెలిపారు. ఇది యే పురాణములో నున్నది? భృగుమహర్షి వంశస్థులు భార్గవులని తెలుసు.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారము! భార్గవుడు అని గూగుల్ లోశోధించగా కనిపించింది! శాయనభారతము అనే శీర్షిక క్రింద! శాయన సాహితి. కామ్ లో! గూగుల్ యెంత వరకు నమ్మదగినదో నాకు తెలియదు!
   తప్పయితే క్షమించండి!

   తొలగించండి
 16. కులము, మతము ప్రాంతమనుచు క్రుళ్ళి పోవ
  నేటి రాజకీయమ్మవినీతి నెదురు
  భండనమ్మున బాఱెను! భార్గవుండు
  నడచినదె నేడు మేలనె నక్సలైట్లు!

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువుగారికి నమస్కారములు. నిన్నటి పురాణాల్లో తమరి క్రింది సూచనతో పద్యంలో ఆపడాలను కొద్దిమార్పు చేసి వ్రాసాను. సరిపోతుందా?

  'వాట్ల, బూంచుచు'...?

  భేషజమేమియుంబడక పిల్లులు కుక్కలు మూషికమ్ములన్
  దోషములేని చందమున దొడ్డగ బెంచుచు వాటి నాతఁడున్
  పోషణ జేయుచున్ననుగు బోధల నాటల నుంచ నొక్క దా
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ……………………………………………………

  గు రు మూ ర్తి ఆ చా రి

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  చ౦డతరాశనీ నిశిత చక్ర - పినాక -

  …………………మహాస్త్ర యైన ను

  చ్చ౦డ పరాక్ర మాకృతిని చ౦డిని కాళిని

  ……………… కా౦చి న౦తనే

  భ౦డన మ౦దు భార్గవుడు పారెను

  ………… భీత మనస్కుడై వడిన్ ||

  ఖ౦డన జేసి దైత్యులను గ్రైవముగా

  ……………… ధరియి౦చె ము౦డముల్  { అశని = వజ్రాయుధము ; పినాకము =

  శూలము ; ఉచ్చ౦డ = ఆగ్రహము గల ;

  భార్గవుడు = శుక్రుడు ; గ్రైవము =

  హారము ; ము౦డము = త ల }

  రిప్లయితొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అంబ కిచ్చినట్టి పలుకు ననుసరించి
  గాంగుని బిలిచి నామెను కైకొనమన
  నాగడించిన యతనిపై నడపినదగు
  భండనమ్మునఁ బాఱెను భార్గవుండు

  రిప్లయితొలగించండి
 20. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువుగారికి నమస్కారములు. నేటితో మీరు నిర్వహించే అమూల్యమైన ఈ " శంకరాభరణం " బ్లాగులో మీ విలువైన సూచనలతో 200 పద్యపూరణలను నిరాటంకంగా చేయగలిగినాను. మీరు మరియు పూజ్యులైన కవిమిత్రులు నన్ను ఈలాగుననే ఈప్రక్రియను మరింత అర్థవంతముగా కొనసాగించుటకు ఆశీర్వదించవలసినదిగా కోరుతున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారు మీకు నా హృదయపూర్వకాభినందనలు.

   తొలగించండి
  2. పెద్దలు పూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారికి హృదయపూర్వక నమస్కారములు.

   తొలగించండి
  3. రాజారావు గారూ,
   సంతోషం. అభినందనలు.

   తొలగించండి
 21. శ్రీగురుభ్యోనమః
  ఖండన జేసె క్షత్రియుల గావరమెల్ల తొలంగిపోపగా
  భండనమందు భార్గవుఁడు, పాఱెను భీత మనస్కుఁడై వడిన్
  గండము నెంచి యుత్తరుడు కౌరవ సేనల జూచినంతట
  న్నండగ నిల్చె నర్జునుడు యాతన దీర్చి జయంబు గూర్చుచున్

  రిప్లయితొలగించండి
 22. 🍀 *శంకరాభరణం*🍀

  🌷 *సమస్య పూరణం* 🌷

  🍀 కవిః- *విరించి* 🍀

  🌷 సమస్యః *భండనమ్మున బాఱెను భార్గవుండు*

  కవ్వడెచ్చోట పడగొట్టె కర్ణుడ నరి
  సేన గాంచియుత్తరుడట చేసెనేమి?
  తరుణి దేవయానిని గన్న తండ్రియెవరు
  *భండనమ్మున, బాఱెను, భార్గవుండు*

  మరోసమస్య

  *భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్*

  గుండెను జీల్చి భీముడెట ఘోరముగా రుధిరమ్ముగ్రోలెనో
  తండిరి యానతిన్ గొనుచుతల్లిని జంపినతాపసెవ్వడో
  దండి విరాటపుత్రు డరిదండును జూడగ నేమిజేసెనో
  భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్
  ........ ......... ....విరించి

  రిప్లయితొలగించండి
 23. 🍀 *శంకరాభరణం*🍀

  🌷 *సమస్య పూరణం* 🌷

  🍀 కవిః- *విరించి* 🍀

  🌷 సమస్యః *భండనమ్మున బాఱెను భార్గవుండు*

  కవ్వడెచ్చోట పడగొట్టె కర్ణుడ నరి
  సేన గాంచియుత్తరుడట చేసెనేమి?
  తరుణి దేవయానిని గన్న తండ్రియెవరు
  *భండనమ్మున, బాఱెను, భార్గవుండు*

  మరోసమస్య

  *భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్*

  గుండెను జీల్చి భీముడెట ఘోరముగా రుధిరమ్ముగ్రోలెనో
  తండిరి యానతిన్ గొనుచుతల్లిని జంపినతాపసెవ్వడో
  దండి విరాటపుత్రు డరిదండును జూడగ నేమిజేసెనో
  భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్
  ........ ......... ....విరించి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'కర్ణుని నరి।సేన..' అనండి.
   రెండవ పూరణలో 'తండ్రి'ని 'తండిరి' అన్నారు.

   తొలగించండి

 24. పిన్నక నాగేశ్వరరావు.

  రాముడెచ్చోట జంపెను రావణుడిని ?

  సేన గని యుత్తరుండేమి చేసెననిని ?

  తండ్రి యాజ్ఞతో జంపెను తల్లినెవరు ?

  భండనమ్మున; బాఱెను ; భార్గవుండు.

  ***********************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. భక్తియందున మోసమ్ము బయలుబడగ?
  వరములంది భస్మాసుర మరణమునకు
  భండనమ్మున బాఱెనుభార్గవుండు|
  మోహినీ రూపమందునసాహసాన
  నాట్యమాడుచు విష్ణువే నలిపె నతని|
  నిండు మనస్సునన్ తపము నిత్యము జేయగ?సంతసాన తా
  నండగ రావణాసురుని కాత్మయు లింగమె నంటగట్టినా?
  చండి తనంబునన్ శివునిసంగ తెరుంగక వెంటనంటగా?
  భండనమందు భార్గవుడు పాఱెను భీతమనస్కుడై వడిన్|
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో కొంత అన్వయలోపం ఉంది.

   తొలగించండి
 26. అంబనున్ పరిణయ మాడు మన్న గురువు
  జామదగ్నియాజ్ఞను నిరసనము సేయ
  శిష్యుడౌ శాంతనవుని శాసింప జేయు
  భండనమ్మునఁ బాఱెను భార్గవుండు

  రిప్లయితొలగించండి