19, జనవరి 2017, గురువారం

సమస్య - 2257 (కాంచ గంధర్వనగరమ్ము...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

“కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము”
లేదా...
"కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు:

  1. మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని
    అవిద్యారచితస్వప్నగన్ధర్వనగరోపమమ్


    యుక్త వయసున నార్జించి భుక్తి కొఱకు
    వాంఛ లన్నియు దీరగ వయసు మీర
    కాటి కాపరి కలలలో కాన రాగ
    కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      'గంధర్వనగరన్యాయాన్ని' ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. శాస్త్రి గారు మనోజ్ఞమైన పూరణ. మీ యంతర్జాలశోధనమమోఘము!
      గంధర్వనగ రోద్బోధక శ్లోక పరిచయాన్ని కలిగించారు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. మీరిచ్చిన సమస్య పుణ్యాన మా నాన్నగారు గద్గద స్వరంతో చిన్నప్పుడు చెప్పిన ధ్రువుని కథ చదివే అవకాశం గూగులమ్మ కృపతో లభించినది. ధన్యవాదములు సార్!

      శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పన్నెండవ అధ్యాయం.

      http://srimadbhagavatasudha.blogspot.in/2013/02/blog-post_23.html?m=1

      తొలగించండి
    4. యీ శ్లోకమును పోతనామాత్యులు గద్యమున నిట్లు నాంధ్రీకరించెను.
      ... అవిద్యా రచిత స్వప్న గంధర్వ నగరోపమంబయిన దేహాదికంబగు భగవన్మాయారచితంబని యాత్మందలంచుచు వెండియు- భాగ. 4. 368.

      తొలగించండి
  2. మెఱుపు తీగలు గగనాన మరుల విరుపు
    మింట నంటిన చుక్కల కొంటె వలపు
    నలుక వీడిన నెలవంక పులక రింత
    కాంచ గంధర్వ నగరమ్ము కాపు రమ్ము

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    (గంధర్వము॥గుర్రము. గంధర్వుడు॥ పాటపాడువాడు)
    పంచ కధిపతివైతివో పరుగె పరుగు
    నెంచ గంధర్వ మనగనే నేమి నడుపు
    గుర్రమని గాదె మోయగా గొణుగుటేల?
    కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము!
    వినగా పాటను,కూనిరాగమున నా వింతైన సంతృప్తినిన్
    కని నీడన్ సినిమా ప్రపంచమున నీ కామంబునున్ బెంచుచున్
    మనగన్ డెక్కల చప్పుడే లయ యగున్ మాటేయుమా చింతలన్
    కన గంధర్వ పురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. వినుమోయీ జగమంత మిధ్య యని నేవేదంబులన్ దెల్పినన్
    మనమూ మేమను వాంఛలందు మునుగన్ మాయా వినోదంబులే
    నినదించన్ సరికాద టంచుమది నానీబేదముల్ వీడకన్
    కన గంధర్వ పురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా .

    రిప్లయితొలగించండి
  5. వనజాతాక్షి కరంబు బూనుట స్థిరవ్యాపార కార్యంబులన్
    ఘనమౌ ధాన్య ధనంబులొందుట నిరాఘాటంబుగా బంధులన్
    గని పోషించుట పుత్రికాసుతుల సౌకర్యంబులన్ జూచుటల్
    గన, గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా


    రిప్లయితొలగించండి
  6. నటనచేయ వలయు నడుపసంసారమ్ము
    చింతలమయము కద జీవితమ్ము
    ప్రేమమన్ననుత్త వ్యామోహమేకదా
    కాంచ గంధర్వ నగరమ్ము కాపు రమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులుక్షమించాలి. ఆటవెలది తేటగీతి కలసిపోయాయి. మారుస్తాను.

      తొలగించండి
    3. చింతలమయమ్ము సతతమీ జీవితమ్ము
      నటనఁ జేయ సంసారపు నౌకనడచు
      ప్రేమ గడన కలుగు వారి వెంట నడచు
      కాంచ గంధర్వ నగరమ్ము కాపు రమ్ము

      తొలగించండి
    4. నేనూ గమనించ లేదు. ఈ సవరణను పరిశీలించండి....

      నడుప సంసారమును జేయనగును నటన
      చింతల మయమ్మె కద మన జీవితమ్ము
      ప్రేమ యన నుత్త వ్యామోహమే మరువకు
      కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము.

      తొలగించండి
    5. గురువర్యులకు వందనములు. ఆట వెలదిని తేటగీతిగా అమోఘంగా అవలీలగా మార్చారు!

      తొలగించండి
  7. తనవారంచును వైరులంచుసతమున్ ధాత్రేయి పైతల్చుచున్
    ధనమున్ కూరిచి నిత్యమున్ కరము స్వార్థమ్మైన భావమ్ముతో
    వినయం బింతయు లేనివారలకు నైవేద్యంబుగానిచ్చుటే
    కననౌనానిజమైన ప్రేమమిలలో గాలించి వీక్షించినన్
    కన గంధర్వ పురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా

    రిప్లయితొలగించండి
  8. సంక్షిప్త భగ్నప్రేమ కథ:

    సీ. కష్టాల కడలిలో గరుణతో నింపుగఁ జుక్కానియై తాను జూపె దారి
    చిన్నారి చెల్లిని చిట్టితమ్మునిఁ బెంచ సంగీత శిష్యులఁ జక్కఁ బఱచె
    తోబుట్టువుల కంతఁ దోడు సేకూర్పంగఁ బవలును రేయియుఁ బాటుపడెను
    కంటికి నెప్పుడుఁ గాన రాకుండగఁ గంటికి రెప్పయ్యెఁ గలికి కలరి
    తే. చిన్నతనమున స్నేహంబు చిగురు దొడుగఁ
    గులమది నిలువ నడుమను గోడ వోలె
    కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము
    నిలిచె విధిలీల! వారికిఁ దలపు లంద.


    ధన సంపాదన కార్యసాధక మనో తంత్రజ్ఞ సంఘాతమున్
    వనితా కామ వికార చేష్ట వితతవ్యాపార కూటమ్ము నా
    ధుని కాంతర్య విలాస కారక ధృతిన్ దుర్వృత్త సంవర్గణాం
    కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా

    [సంఘాతము = నరకవిశేషము; సంవర్గణము = ఉపప్రలోభము ; అంకణము = ముద్ర; కాపురము = కుత్సితపురము]

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి దత్తపదికి నా పూరణ భేదము తిలకించ గోర్తాను.

    ఇచ్చిరి కుడి గడి జడి పొడి
    మెచ్చి పదము లిచ్చట నతి మెలకువ తోడం
    గచ్చిత మీ పద్యము విను
    మచ్చెరువగ నికఁ గృతార్థమగు నెల్లెడలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఈరకంగా కూడా పూరణ చేయవచ్చా? బాగుంది. ఔత్సాహిక కవుల కొక కొత్తపాఠం. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  10. వలపువలలోనజిక్కినవారిజాక్షి
    ప్రేమవిఫలమైకొరగానివెర్రివాని
    జేసికొనెనార్య!పెండ్లినిజేష్టలుడిగి
    కాంచగంధర్వనగరమ్ముకాపురమ్ము

    రిప్లయితొలగించండి
  11. తపసు జేయగ రాముని త్యాగరాజు
    యమ్మ కామాక్షి యానతి శ్యామశాస్త్రి
    ముత్తుస్వామి గొనెనె గురుమూర్తి యాన
    కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము!


    సంగీత మూర్తిత్రయం జన్మించిన తిరువారూరు గంధర్వ నగరము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్యాగరాజు+అమ్మ' అన్నపుడు యడాగమం రాదు. 'త్యాగరాజు। నమ్మ...' అనండి.

      తొలగించండి
  12. సమస్య

    కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము”
    లేదా...
    "కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా"

    ప్రేమతో నొక టైనట్టి ప్రేమజంట
    సరస సల్లాప క్రీడలో మురియు వేళ
    యడ్డు లేకుండనానంద మందుకొనగ
    గాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము


    వినుమోసుందర భూసురాన్వయమణీ వీక్షింపుమా నాదెసన్
    ననుగాంచన్ భయమేలరా, ప్రవరుడా! నన్నేల రమ్మంటి గా
    ఘనసౌఖ్యమువొందుచున్ కరుగ గన్ కౌగిళ్ళె ముఖ్యమ్మురా
    కనగంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకునింకేలరా!!

    .............. ......---- విరించి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'వేళ నడ్డు...' అనండి.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. 'ఘనసౌఖ్యమ్మును బొందుచున్...' అనండి.

      తొలగించండి
  13. వినుమోయీ గురుడెన్న వేలుపిలలో వేయేల సర్వస్వమున్
    క్షణమైన న్గురుసన్నిధి న్గడపుట ల్సౌభాగ్యమౌ నేరికిన్
    చని శ్రీదత్తుని దివ్యధామమున వాసంబుండుట ల్నాకమే
    కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా.

    (గంధర్వపురందత్తాత్రేయునిదివ్యధామమంటారని)

    రిప్లయితొలగించండి
  14. ఎముక చేతికి లేదని యెరుకబరచ
    దాన ధర్మములను జేసి ధరను వీడి
    పయనమైయసువుల తాను బాసి చేరె,
    కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి నమస్కారము! నావృత్తంలో మూడవ పాదంలో మొదటి గణము న' గణం పొరపాటుగా పడింది . సవరణ


    తూలిపొమ్మనకే మోవిని యని గ్రహించ గలరు!

    రిప్లయితొలగించండి
  16. వినుమో విప్రుడ యవ్వనంబు జనునే వేగంబుగన్ చాలక
    మ్మని పూదేనెను గ్రమ్మరం గొనుమ సమ్మానంబుగన్ తూలి పొ
    మ్మనకే మోవిని యాని నావలపు సమ్మర్పింపగన్ యేలవే
    కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా?

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      వృత్తరచనలో చాలావరకు కృతకృత్యులయ్యారు. బాగుంది.
      'సమ్మర్పింపగన్' పద్యం సందేహాస్పదం. దాని తర్వాత యడాగమం దోషమే. 'నా వలపు నే నర్పింపగా నేలనే' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి శతధా నమస్కారములు! ఏదో చిన్నతనంలో చదివిన వ్యాకరణం! చాలా ధైర్యం చేసి పద్యాలు వ్రాస్తున్నాను! ఇకపై వ్యాకరణము పై దృష్టి పెడతాను! ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు!

      తొలగించండి
  18. అర్జునునితో ఊర్వశి:

    కురువరా! నీదు కౌగిళి కోరి రాగ
    రసికతన్ జూప వేమిర ప్రాభవమున
    పాడియాడెద నందమున్ గూడ రార
    కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. వాంచలన్నియుదీర్చెడివన్నెలాడి
    వేశ్య .భార్యగమారునా?వేడుకట్లు|
    కాంచ గంధర్వ నగరమ్ముకాపురమ్ము
    పల్లెటూర్లకుసరిరాదు భాగ్యమున్న|
    2.కనగంధర్వ పురమ్ము”కాపురముశంకల్ నీకు నింకేలరా?
    మనసున్ ముంచెడి దానవత్వమట |సామాన్యుండు జీవించునా?
    ధనమే మానవతత్వమున్ దుడుపు సంధానమ్ము మోసమ్ముచే
    వినగా వింతల సంత పట్టణము ప్రావీణ్యాన ఖర్చుంచినా|


    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనురతిని గూడి నిచ్చలు నలవి దోడ
    నొకరికి నొకరై జీవిక నుత్తమముగ
    నిలుపు కొనుచుండు జంటల నినుపు దనము
    కాంచ గాంధర్వ నగరమ్ము కాపురమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    ఇర్వురు నొకరి కొకరు ప్రేమించు కొనుచు
    మూడు ముళ్లతో బంధమ్ము ముడివడంగ
    వలపు సామ్రాజ్యమందున కలలు గనుచు
    గాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. వర్తమానమ్ములోనున్న వాస్తవికత
    మఱచి యధునాతనమ్ముగ మనుగడకును
    నిచ్చెనలు వైచి దంపతుల్ మెచ్చుకొనుట
    గాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ధనమున్ ధాన్యము గోలుపోవగను నీ ధైర్యమ్ము మిన్నంటగా
    వినుమా నీవిట నప్పు చేయకనగా వెర్రోడ! మూర్ఖించితే...
    చనగా బిల్డరు జాడగానకను తా జయ్యమ్ము రయ్యమ్ముగా
    కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా!

    రిప్లయితొలగించండి