3, జనవరి 2017, మంగళవారం

నూతన సంవత్సరము

రచన - పోచిరాజు సుబ్బారావు

భారతీయుల నోముల పంటగాను
వచ్చె రెండువేల్ పదునేడు వత్సరమ్మె
యాయురారోగ్యసంపద లన్ని యిచ్చి
కాచు గావుత మనలను గరుణతోడ

పాడిపంటల వృధ్ధియె బహుళమగుచు
కూడుగుడ్డల కెప్పుడు కొదవలేక
యైకమత్యము దోడన నహరహమ్ము
పంచుకొందురు సంతోషపరిమళమును

తెలివితేటలయందున దెలివిమీరి
యేది మంచిది చెడ్డది యేది భువిని
దాన నెరుగుచు బ్రతియొక్క మానవుండు
మసలుచుండును నిరతము మాన్యుడగుచు

వత్సరమంతయు నరయగ
మత్సరములు వీడి జనులు మమతలతోడన్
నుత్సుకతలు గనబరచుచు
నుత్సవములు జేసికొందు రోపినగొలదిన్

అంతర్జాలము నేర్చిరి
వింతగ నీతరమునాటి పిల్లలు మిగులన్
పంతుళ్ళు వారు మనకిక
సంతసమున వారియొద్ద చట్టులు మనమే

సామరస్యము గలుగుచు సకలజనులు
వారు వారల వృత్తులు భవ్యముగను
జేయుచుందురు విడువక న్యాయ మెపుడు
సాలు మహిమయే యిట్లుండు సాంతముగను.

6 కామెంట్‌లు:

 1. అన్నయ్య నీ నూతన సంవత్సరాభి వర్ణన తో గూడిన పద్యకుసుమ సౌరభము మనోహ్లాదకరముగా విమలాభంగ తరంగ గోదావరీ నదీ ప్రవాహములా సాగింది. అభినందనలు.
  “..న్యాయ మెపుడు / నబ్ద మహిమయే యిట్లుండు సాంతముగను.” అనిన నన్యభాషాశ్రయము తొలగును కదా. అట్లే “మమతలతోడ/న్నుత్సుకతలు”.

  రిప్లయితొలగించండి

 2. *సహస్రకవిరత్న,కవిభూషణ* *సందిత బెంగుళూరు*

  *అంశము: *కార్తీకమాసప్రాశస్త్యము*

  *ఛందస్సు:*


  *వెలుగులన్ విరజిమ్ముచున్* *కనువిందుజేయగదీపముల్*
  *నలుదెసల్ శివకేశవ*
  *స్మరణంబులేనినదింపగన్*
  *కలిసియుండగనాథులన్*
  *వెలుగన్ గనుల్ గనదివ్వెలై*
  *నిలిచెఁగౌరియులక్ష్మిదేవియు* *నిండుగాగుడులందునన్*


  *జాగర్లపూడిశాస్త్రులు*
  *జాగున్ జేయకరచనలజదువుటజేతన్* *నేగణనీయతఁబొందితి*
  *నో గురుదేవ!నినుగొల్తునుజ్వలభక్తిన్*  *అరయగచిత్తములలరగ*
  *తరుణులపూజలగనుచునుతన్మయమగుచున్*
  *పరవశులగుటన్ భక్తికి*
  *నిరువురుముత్తైదువులుననేకులుగనగన్*


  *ముత్తైదువులందరుగ*
  *మ్మత్తైన విధమునదైవమందిరములలో*
  *చిత్తైభక్తులభక్తికి*
  *నొత్తైనశుభమ్ములిత్తురువిదలువేడన్*  *ప్రముఖులుఁజనశుభకృతిగనఁ*
  *ప్రముఖులనుసరించుచుంద్రుభావ్యంబనుచున్*
  *ప్రమదలనధికముగననది*
  *కమలోధ్భవురాణియత్తగారినిజేరున్*  *మువ్వురుముత్తైదువులటు*
  *నవ్వుచుచిత్తౌదురచటనాథులగనుచున్*
  *పువ్వగుచంద్రుడుశివునకు*
  *రివ్వుననక్షత్రకాంతలేగిరి పతికై*


  *హరికిన్ నేత్రము రవియౌ*
  *హరియుండినరవియునుండు హాయిగ గనుచున్*
  *మరిజేరునుఛాయాసతి*
  *పరికింపఁపతివ్రతాళి వరుసలు గట్టున్*


  *స్వాంతంబందునభక్తినిండఁమనసావాచా పతిన్ దల్చుచున్*
  *కాంతల్ జ్యోతులగంగలోన్ వదలినన్ కార్తీకమాసంబునన్*
  *చింతల్ దీరుఁబ్రమాదముల్ దొలగుఁనిశ్శేషించుదుష్ప్రాప్త్యముల్*
  *కాంతుల్ జేరఁఖగోళసంహితలఁసత్కామ్యంబులీడేరెడిన్*

  *🌹సందిత బెంగుళూరు🌹*

  రిప్లయితొలగించండి

 3. *సహస్రకవిరత్న,కవిభూషణ* *సందిత బెంగుళూరు*

  *అంశము: *కార్తీకమాసప్రాశస్త్యము*

  *ఛందస్సు:*


  *వెలుగులన్ విరజిమ్ముచున్* *కనువిందుజేయగదీపముల్*
  *నలుదెసల్ శివకేశవ*
  *స్మరణంబులేనినదింపగన్*
  *కలిసియుండగనాథులన్*
  *వెలుగన్ గనుల్ గనదివ్వెలై*
  *నిలిచెఁగౌరియులక్ష్మిదేవియు* *నిండుగాగుడులందునన్*


  *జాగర్లపూడిశాస్త్రులు*
  *జాగున్ జేయకరచనలజదువుటజేతన్* *నేగణనీయతఁబొందితి*
  *నో గురుదేవ!నినుగొల్తునుజ్వలభక్తిన్*  *అరయగచిత్తములలరగ*
  *తరుణులపూజలగనుచునుతన్మయమగుచున్*
  *పరవశులగుటన్ భక్తికి*
  *నిరువురుముత్తైదువులుననేకులుగనగన్*


  *ముత్తైదువులందరుగ*
  *మ్మత్తైన విధమునదైవమందిరములలో*
  *చిత్తైభక్తులభక్తికి*
  *నొత్తైనశుభమ్ములిత్తురువిదలువేడన్*  *ప్రముఖులుఁజనశుభకృతిగనఁ*
  *ప్రముఖులనుసరించుచుంద్రుభావ్యంబనుచున్*
  *ప్రమదలనధికముగననది*
  *కమలోధ్భవురాణియత్తగారినిజేరున్*  *మువ్వురుముత్తైదువులటు*
  *నవ్వుచుచిత్తౌదురచటనాథులగనుచున్*
  *పువ్వగుచంద్రుడుశివునకు*
  *రివ్వుననక్షత్రకాంతలేగిరి పతికై*


  *హరికిన్ నేత్రము రవియౌ*
  *హరియుండినరవియునుండు హాయిగ గనుచున్*
  *మరిజేరునుఛాయాసతి*
  *పరికింపఁపతివ్రతాళి వరుసలు గట్టున్*


  *స్వాంతంబందునభక్తినిండఁమనసావాచా పతిన్ దల్చుచున్*
  *కాంతల్ జ్యోతులగంగలోన్ వదలినన్ కార్తీకమాసంబునన్*
  *చింతల్ దీరుఁబ్రమాదముల్ దొలగుఁనిశ్శేషించుదుష్ప్రాప్త్యముల్*
  *కాంతుల్ జేరఁఖగోళసంహితలఁసత్కామ్యంబులీడేరెడిన్*

  *🌹సందిత బెంగుళూరు🌹*

  రిప్లయితొలగించండి
 4. సంది త కవివర సోదర !
  వందనములు నీకు జేతు వందల కొలదిన్
  విందుగ నుండెను వీనుల
  కందంబగు నీదు రచన నాస్వాదించన్

  కవన మియ్యది పంపుడు కంది శంక
  రార్యు లమెయిలు నకుమరి ,యాయనగద
  మనకు గురువులు ,పంపిన మరల పోస్టు
  చేతు రార్యులు బ్లాగున , వ్రాత జూచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులు సుబ్బారావు వారికి పాదాభివంందనములు నాకు విధానము తెలియక అలాపెట్టాను మార్గము చూపినంందులకు కృృతజ్ఞతాంంజలులు

   తొలగించండి
 5. నమస్కారములు
  అద్భుతముగా నున్నవి మీ పద్యరత్నములు .సుబ్బారావు గారు

  రిప్లయితొలగించండి