6, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2245 (నరుఁడయి జన్మనెత్తె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుం డయి చంద్రమౌళియే"
లేదా...
"నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి"

56 కామెంట్‌లు:

  1. సాక్షాత్ శంకరుని అవతారం ఆది శంకరుడు:

    దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
    సఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

    ...శివ రహస్యము


    బుధ్ధ దేవుని యనుచరుల్ హద్దు మీర
    వేద వేదాంగముల నెల్ల విస్మరించ
    శుధ్ధ వేదాంతమున్ పునరుధ్ధరించ
    నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్య లెన్నియో నేర్చియు పద్య రచన
      మారు మూలను బడిపోయి మరపురాగ
      శంకరాభరణమిడి నిశ్శంక గాను
      నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీరు అందించిన శ్లోకం, దాని అనువాదరూపమైన పూరణ బాగున్నవి. అభినందనలు.
      'శంకరాభరణం' ప్రస్తావనతో చేసిన పూరణకు ధన్యవాదాలు. కాని అతిశయోక్తి కాస్త ఎక్కువయింది.

      తొలగించండి
  2. దనుజ మూకల దునుమాడి ధరణి యందు
    సత్పురుషులగావగనెంచి చక్రధారి
    నరుఁడుగా జన్మనెత్తె, శంకరుఁడు గనలి
    వానరుండుగ బుట్టెనీ వసుధ యందు

    రిప్లయితొలగించండి
  3. దనుజ సంతతి దుశ్చర్య లినుమడించ
    జనుల బాధలఁ గమనించి దనుజ వైరి
    నరుఁడుగా జన్మనెత్తె, శంకరుఁడు గనలి
    యాంజనేయుని గా భువి నవతరించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి
      శక్తి పీఠము లనునిల్పె ముక్తి కొఱకు
      అద్వైత మతము బోధించె యాచ రించ
      మూడు పదులందు జీవించి మోక్ష మందె

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదం ప్రారంభంలో గణదోషం. "బోధ చేసె దా నద్వైతమును జనులకు" అందామా?

      తొలగించండి
  5. డా.పిట్టా
    దాస్య శృంఖలాల్ బాసిన తరుణమందు
    "నాది,నారాజ్య"మనిన మనాది విడని
    నాటి నైజాము పాలన నణచ "లోహ
    నరుడు"గా జన్మ నెత్తె శంకరుడు గనలి!
    పరులును నాత్మ పక్షమను భావము దప్పి వరమ్ములివ్వ బెం
    పరసియు సీత నెత్తుకొని బారు దశానను నొంచ నెంచి దా
    పరికము మాని మారుతిని బట్టె పరాక్రమమంద నాటి వా
    నరుడయి జన్మనెత్తె గరుణారహితుండయి చంద్రమౌళియే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,మీ పూరణ సందర్భోచితమై మనోహరముగా నున్నది.అభినందనలు.

      తొలగించండి
    2. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. హరిసతినిన్నుతించి తమయారడిిి బాపగ విప్రకాంత లో నరసి యతీశ్వరున్ శివునిగా, తలబోసినదిట్టిభంగి మా దురితచయమ్మునార్పి పటుదుఃఖము నంతముజేసినట్టి యీ నరునిగజన్మనెత్తె గరుణార హితుండయి చంద్రమౌళియే.

    రిప్లయితొలగించండి
  7. వరముల నీయగా భువిని భారత జాతికి భోగ భాగ్యముల్
    పరమత బేధముల్ విడచి భక్తిని మైత్రిగ నుండు రీతిగా
    కరుణను బీదసాదలను గావగ ప్రేమను పంచు చుండగన్
    నరుడయి జన్మనెత్తెఁ గరుణా రహితుండయి చంద్రమౌళియే

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమః

    స్థిరముగ ధర్మ రక్షణము జేయగ మాధవుడేమి జేసెనో ?
    దొరనని యా సుయోధనుడు ద్రోవది నీడ్చి యహంకరించెనే?
    వరములనిచ్చు వేల్పెవడు భక్తుల పాలిట నాది దైవమై?
    నరుఁడయి జన్మనెత్తెఁ, గరుణారహితుం డయి,చంద్రమౌళియే.

    రిప్లయితొలగించండి
  9. తరుణ మెరుగుచు జీవనోద్బోధనమున
    విరివి గొనగను తత్త్వము విపుల బరచ
    వేద వైభవోద్భాసిత వికసనమున
    నరుఁడుగా జన్మ నెత్తె "శంకరుఁడు" గనలి!

    నరుఁడు=ఋషి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. మొదటిపాదమున యతి సవరణతో:

      తరుణ మెరుగుచు కెరలు విధానమందు
      విరివి గొనగను తత్త్వము విపుల బరచ
      వేద వైభవోద్భాసిత వికసనమున
      నరుఁడుగా జన్మ నెత్తె "శంకరుఁడు" గనలి!

      నరుఁడు=ఋషి

      తొలగించండి
  10. ధర్మమే విగ్రహమ్మౌచు ధరణి నేల
    హరియె కోదండరాముడై యవతరించె
    నరుడుగా, జన్మనెత్తె శంకరుఁడు గనలి
    దుష్ట శక్తుల హనుమయై దునిమి వేయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. వరము నొసంగ నెంచి మదిఁ బన్నుగఁ గైతవ తాపసుండు నా
      నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుం డయి చంద్రమౌళియే
      గిరిసుతకుం బరీక్షలనఁ గింపురుషుండు శివుం డశౌచియై
      తిరిగెడు వానిఁ గోరకుము ధీమతి నన్ మునిమాన్యుఁ బెండ్లి యా
      డు రయమునన్ శుభంబగుఁ గ డున్నని పల్కెను సంభ్రమమ్ముగన్


      నరునకు నొసంగ నస్త్రము పర మనురతి
      నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు, గనలి
      క్రోడమునకుఁ బోరాడి నిగూఢముగను
      చెచ్చెర నొగిఁ బాశుపతము నిచ్చె మెచ్చి.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. దుష్ట రాక్షసు లందరిన్ దునుమ హరియ
    నరుడుగా జన్మ నెత్తె ,శంకరుడు గనలి
    భస్మ మగునట్లు జేసెను మన్మ ధునిల
    దనదు మూడవ కంటిని దనర దెఱచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేద విహిత ధర్మములను విస్మరించి
    సాగు నటుల జనుల మార్చి సంబర పడు
    వారి నద్వైతమును గూల్చి వసుధ నరయ
    నరుడుగా జన్మ నెత్తె శంకరుడు గనలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. అరసి వైదికవ్యతిరేక సరణి ధరణి
    నార్షధర్మానుయాయుల నాదుకొనుచు
    నణచ పాషండధర్మబోధనల తాను
    నరుడుగా జన్మనెత్తె శంకరుడు గనలి.

    రిప్లయితొలగించండి
  15. నరుడయి జన్మ నెత్తె గరుణారహితుండయి చంద్రమౌళియే
    నరుడుగజన్మ నెత్తె గ రుణా సహితుండయి రాముడి ధ్ధర
    న్నరయగ రాము శంకరు లయా చిత సంపద లేప్రజాళికి
    న్బ రమ పదంబు వోవగసబంధు సమే తముగాగనెత్తరిన్

    రిప్లయితొలగించండి
  16. నరుడుగా జన్మ నెత్తి శంకరుడు గనివి
    నొదలె మూకాసురాసురున్ దునుమ శరము
    శరముతో జీల్చె పార్ధుడు సగము మరల
    ఎఱుక లోకేశ్వరుండుగా నెఱిగె నరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సి. రామమోహన్ గారూ,
      మీ పూరణ బాగుంది. కాని సమస్య పాదం చివర కొంత మార్చారు. 'వదలె'ను 'ఒదలె' అన్నారు.

      తొలగించండి
  17. హరిహరులిద్దరున్ నొకటె|ఆశయ సిద్దియుగూర్చ నెంచియే
    వరములు గుప్పరించుచు,సవాలుగ రాక్షస కృత్యనాశనా
    పరముగ,లొకరక్షణగ,బాధ్యత లందున చట్ట బద్దమౌ
    నరుదయి జన్మ నెత్తె|కరుణా రహితుండయి చంద్ర మౌళియే|
    2.”రాముడయ్యెనువిష్ణువు రావణాసు
    రవధ నెంచియే నరుడిగ”|చూడవా
    నరుడుగాజన్మ నెత్తె శంకరుడు గనల
    లోకరక్షణ హరిహరపోకడనగ|




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. భరత భూమికి యే తెంచి వటుని గాగ
    ద్వైతమే లేదు దైవమద్వైత మొకటె
    మహిని ముక్తికి సాధన మనుచు దెలుప
    నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూమికి నేతెంచి' అనండి.

      తొలగించండి
  19. కవి మిత్రులకు నమస్సులు.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    ఉదయమే హైదరాబాదుకు వచ్చి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలను రేపు ఉదయం సమీక్షిస్తాను. అందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  20. వర మొసగి నార్యమ శివగురులకు కల
    నరుడుగా జన్మ నెత్తె శంకరుడు, గనలి
    వివిధ మతముల ఖండించి,శివము నంద
    జనులకద్వైత మొక్కటే సాధనమని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. హరుడు పరీక్ష చేయ తన యద్భుత భక్తుని భూతలంబు పై
    నరుఁడయి జన్మనెత్తెఁ, గరుణారహితుం డయి చంద్రమౌళియే
    పరమ పవిత్రుడైన తన భక్తుని శ్రీ సిరుతొండ రాజునే
    యరయఁగమాంస భోజనము నాత్మజు జంపిడు మంచు కోరెనే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ధరణిని ధర్మమున్ నిలిపి దానవమూకల సంహరింపగన్
    సరసిజ నాభుడే యవని జన్మము నెత్తగ గోరు కోర్కెలన్
    వరముగనిచ్చియున్ తనదు భక్తుని నాశము గోరి తానువా
    నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుం డయి చంద్రమౌళియే

    రిప్లయితొలగించండి
  23. 06.01.2017.
    సమస్య:నరుడుగా జన్మనెత్తె శంకరుడు గనలి
    పూరణ:వర మొసగి నార్యమ శివగురులకు కల
    నరుడుగా జన్మ నెత్తె శంకరుడు, గనలి
    వివిధ మతముల ఖండించి,శివము నంద
    జనులకద్వైత మొక్కటే సాధనమని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. అరచుచు బొజ్జ నిండగను నాంధ్రుల రెడ్డుల నాయుడమ్మలన్
    కరచుచు కాంగ్రెసాదులను కయ్యము నందున కాలుదువ్వుచున్
    చెరచుచు యుక్త రాష్ట్రమును చెన్నుగ తెచ్చుచు సొంతరాష్ట్రమున్
    నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుండయి చంద్రమౌళియే

    రిప్లయితొలగించండి