కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్"
లేదా...
"ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్"
లేదా...
"ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
బాల్యమునన నెరిగి తన బాధ్య తలను
రిప్లయితొలగించండితల్లి యాన లేక మదిని తల్లడిల్ల
శంకరుండు మురిసెగా మొసలికి జిక్క-
ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు
ననుచు నమ్మ వలదు సుమీ నట్ట నడిమి
దారిన నిను ముంచి వెడలి తాను చక్క
బోవు నమ్మ జిలేబి యబ్బురముగాను
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిపాపము!నాడు రాజులిట బడ్గుల సైన్యమునొడ్డి గెల్వరే
స్థాపన జేయ రాజ్యముల, సంపదలున్న వరిష్ఠ మూకలే
ఆపిరెవారి కృత్యముల? నార్తిని బంచిరి,దీన వర్గమే
ఆపదలంద; మానవుల యాశలు దీరును సత్వరమ్మునన్
సుఖము కోసము బడుగుల స్రుక్క జేయ
వారి ప్రగతియ యాశలా వరల నిచట?
ఆశలను కుదించెడి పేద లార్యులందు
ఆపదలు మానవుల యాశలన్ని తీర్చు!
ఆర్యా,
రిప్లయితొలగించండిడా.పిట్టానుండి
సత్వరమ్మునన్ అనే మాటతో సమస్య సమస్యగామారింది.ఎంతో కష్ట పడితే కొందరికి లభ్యమైంది విజయం.అది సత్వరం వచ్చినట్లుకాదు.అదే"సక్రమమ్ముగన్"ఐయుంటే పెద్దల జీవితాల నుండి యేర్పడిన సూక్తి ఔతుంది.కావున కవి ఆలోచించ వలసి వచ్చింది.బాగుంది!
డా.పిట్టా
రిప్లయితొలగించండి"ఆశలంగుదించెడి పేద లార్యులందు" గా గణ సవరణ చేసితిని.
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇచ్చిన సమస్యను మార్చరాదు. మార్చితే అది మరొక సమస్య అవుతుంది. మరొకసారి వినియోగించుకోవచ్చు. ధన్యవాదాలు!
రాజు పడిపోయి మరణించ రాణి మురిసె;
రిప్లయితొలగించండిఆరు పడిపోయి మరణించ నైదు మురిసె;
రాజకీయము పేకాట రణము - పరుల -
ఆపదలు మానవుల యాశ లన్నితీర్చు!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉ.కోపము తాపముల్ విడిచి కొద్దిగ తాలిమి జింత జేసిన
రిప్లయితొలగించండిన్నూపుల నిచ్చునట్టివిగ ! యుర్విని నాపద లెంచి జూడగన్
ఆ పర మాత్మయే మనకు నండగ నుండియు దారి జూపుగా !
"ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్"
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.పాండవు లిడుమల బడియు పాదుకొనుట
రిప్లయితొలగించండిరాము డడవుల పాలయి సోముడగుట
తెలియ జెప్పును పరమాత్మ తీరు తెన్ను
"ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండికోపము రాదు దఃఖమున క్రుంగుచు బాధల విన్నవించుచున్
శ్రీపతిపాద చింతనము చిత్తమునందున నిల్పి భక్తితోన్
బాపుమటంచు మ్రొక్కెదరు వచ్చిన కష్టము తొల్గి పోవగా
ఆపద లంద, మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్
ఆపదలు కలిగినపుడు కాపాడమని దైవమును మ్రొక్కుచుందురు. ఇతరములైన కోర్కెలు ఆ సమయమున గుర్తుకు రావు. దేవుడు ఏ విధముగా కాపాడవలెనో ఆవిధముగా అనుగ్రహిస్తాడు. సత్వరముగ ఆశలు నెరవేరుతాయని నా భావన.
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాపిడి కల్గ జేయునఁట రాతిని నుష్ణము విస్మయమ్ముగన్
రిప్లయితొలగించండితాపము వాపు చిత్తధృతి ధైర్యముఁ బెంచు నుపద్రవమ్ములే
రూపము నిచ్చి యూహలకు రోయ నుపాయము లెల్ల దాంతులై
యాపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్
అగ్ర పత్రోపసంహర ణాది చర్య
లను గొని తలచి రిట్లు కల్మషపు జనుల
యాపదలు, మానవుల యాశ లన్ని తీర్చు
దలఁచ నొక్కటి మరి ఫలితమ్మె యొండు!
[ఆపు+అదలు = ఆపదలు; ఆపు = అండ; అదలు = తొలఁగు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు
రిప్లయితొలగించండిననుట సరికాదు మిత్రమా !యాశ లవియ
తీరు నవియ కా దనిశము గోరు చుండు
ధరను గ్రొత్తవి సెలయేరు ఝ రుల వోలె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యః ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు
రిప్లయితొలగించండికష్టసుఖములు పయనించు కలసి మెలసి
యవసరపు కాలమందున నంతరించు
నాపదలు మానవుల యాశ లన్ని తీర్చు
శాంతి నొసగును మనసుకు సత్వరముగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆపర మేశ్వరు న్స తము బ్రార్ధన జేతుర యెల్ల వారలు
రిప్లయితొలగించండిన్నా పదలంద ,మానవుల యాశలు దీరును సత్వరంబు గన్
శ్రీ పద సీతయై భువిని శ్రీలను దా కురి పించుచో మరిన్
దీపగు నాశలే యికను దీరును నెప్పుడు ఖచ్చితంబు గన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మరిన్' పదప్రయోగం మానరా?
పాపపు కార్యముల్ గత భవమ్మున నుండి పరిక్రమించుచున్
రిప్లయితొలగించండిచూపును మీదిజన్మమున చోడుమ కర్మము కాల్చుచుండ నా
యాపదలంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్
పాపము రూపుమాయగను పావనుడౌ హరి సేవనమ్ములన్
చోడుమః కష్టము, పరిక్రమించుః బయలుదేరు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాపము తోడ కృంగుచు వ్యధాభరితుండవడే నరుండిల
రిప్లయితొలగించండిన్నాపదలందు, మానవుల యాశలు దీరును సత్వరమగున్
గోపము మాని శాంతమును కూరిమి తోడజరంగు వారికిన్
దాపున జేరుసంపదలు, ధైర్యము నిచ్చుచు స్ఫూర్తినిచ్చినన్ .
దురితములకు కారణమగు, దుఃఖమిచ్చు
బాధలెన్నియొ గలిగించు వ్యధమిగుల్చు
నాపదలు, మానవుల యాశలన్ని తీర్చు
వినయసద్గుణసంపదల్ విజ్ఞతయును.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'అవడే' అన్నచోట 'భరితుం డగులే..' అనండి. 'తోడజరంగు'..?
గురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింంచు టైైపాటుతో అలా జరంంగు అయింంది క్షమింంచంండి
తొలగించండిగురువు గారికి నమస్కారములు....ధన్యవాదములు తోడ జరింంచు టైైపాటుతో అలా జరంంగు అయింంది క్షమింంచంండి
తొలగించండికష్టములు గూర్చు మనిషికి సృష్టికర్త
రిప్లయితొలగించండిదైవమును తల్చు కొనగ, నా తరుణ మందు
స్మరణజేయగ నార్తితో, తరణమొసగు
నాపదలు మానవుల యాశ లన్ని తీర్చు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా పని గాకయున్న యది నాకిల నష్టములేదు గాని నీ
రిప్లయితొలగించండికేపని గాకయున్ననది యేగద సంతసమిచ్చునంచు దు
ష్టాపరతంత్ర దుర్మతుల సఖ్యము గల్గిన వారు, కొండొకం
డాపద లంద మానవుల, యాశలు దీరును సత్వరమ్ముగన్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో '...గాకయున్న నది...' అనండి. (రెండవపాదంలో అన్నట్టు!)
ధన్యోస్మి గురువుగారు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినాస్తికుండై హరిని నమ్మనంచు ననెడి
వానికాపద లొచ్చిన వడి ననువున
హరిని మది దల్చి దెసనొంది తిరువడయ్యె
నాపదలు మానవుల యాశ లన్ని తీర్చు
(తిరువడి = భక్తుడు)
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దైవ నామ స్మరణ జేయ తప్పకుండ
రిప్లయితొలగించండిప్రభువు తోడుండి మనకిచ్చు నభయమదియె,
తొలుత జాగరూకులయిన తొలగి కొన్ని
యాపదలు, మానవుల యాశలన్ని దీర్చు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
రిప్లయితొలగించండినాపదలు! మానవుల యాశలన్ని దీర్చు
యంత్రముగ నీశు దలపక నహము తోడ
కర్మ ఫలము వీడుటె గీత మర్మ మందు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాపము నందహల్య శిల సత్వర మందునరామపాదమే
రిప్లయితొలగించండిరూపముతీర్చి దిద్దెగద?రోదన మాన్పెను రామదాసుదే
ఆ|పదరామనామ జపమందున భక్తులమంచిగూర్చగా
ఆపదలంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్|
2.కనక మన్నది నిప్పులోగాలినపుడె?
వన్నె దేలును|కష్టాలు బడిన వారి
ఆపదలు మానవులయాశలన్నితీర్చు
నమ్ముకొన్నట్టి దైవము సమ్మతించ|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమ శివుని ధ్యానించగ తఱగి పోవు
తొలగించండినాపదలు! మానవుల యాశలన్ని దీర్చు
యంత్రముగ నీశు దలపక నహము తోడ
కర్మ ఫలము వీడు నతడె కర్త యగును!
శ్రీధర రావు గారూ,
తొలగించండిచివరి పాదం సవరించిన ఈ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆపదలు కల్గినంతనే మానవాళి
రిప్లయితొలగించండిఆపదలు బాపుకో వలెకావునా స
దాకలియుగాన రామమే దాటజేయు
ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు
గురుదేవులకు నమస్కారములు పద్యం అర్ధం మిస్ అయింది క్షమించండి రామనామము అనివ్రాయవలసింది మిస్ అయింది మన్నించండి
రిప్లయితొలగించండివడ్డూరి రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో యతిదోషం. ఆపదలు... పునరుక్తమయింది. 'కావునా' అనడం సాధువు కాదు. 'కావునన్' అనండి. 'స।దా కలిని రామనామమే దాటఁ జేయు' అనండి. మొదటి పాదాన్ని 'ఆపదలు గల్గినంతనే యఖిలజనులు' అనండి. మీ పద్యానికి నా సవరణ....
ఆపదలు గల్గినంతనే యఖిలజనులు
వానిఁ బాపుకోవలె గాన వారలను స
దా కలిని రామనామమే దాటవేయు
నాపదలు మానవుల యాశలన్ని తీర్చు.
గురువుగారికి నమస్కారములు మీ సవరణ చాలా బాగుంది ధన్యవాదములు
తొలగించండిపాపులు దుష్టులున్ పరులు బాధలనున్న హసించువారు ము
రిప్లయితొలగించండిక్కోపులు మంచివారిపొడ కూడనివారును క్రూరకర్ము లీ క్ష్మాపయి దానవుల్ దలప సజ్జనవైరులు చిక్క సాటివా రాపదలం దమానవుల యాసలుదీరును సత్వరమ్ముగన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపము వచ్చువారలకు కూరిమి లేకయె మండువార్లకున్
రిప్లయితొలగించండిశాపము లిచ్చువారలకు శాంతము లేకయె తిట్టువార్లకున్
పాపము చేయువారలకు పాకుల చీనుల నేతలంద్రకిన్...
ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్ :)