కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముఁడే నా హితుండనె రావణుండు"
లేదా...
"రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముఁడే నా హితుండనె రావణుండు"
లేదా...
"రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
తమ్ముడా విభీషణుడా గతమ్ము గాంచు!
రిప్లయితొలగించండిశూర్పణఖక కెవరు దేహశుధ్ధి జేసె?
మామ మారీచుడ నెవరు మంట గలిపె?
రాముఁడేనా? హితుండనె! రావణుండు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. కాని చివరిపాదంలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది.
శాస్త్రి గారూ,
తొలగించండి'అట్టి రాముడేనా హితుడు?" అని రావణుడు ప్రశ్నించినట్లుగా అర్థం తీసుకుంటే అన్వయలోపం తొలగిపోయింది. బాగుంది.
__/\__
తొలగించండిగురువర్యులకు నమస్సులు.
తొలగించండినా పూరణలో నున్న మూడు ??? రాముని పరంగా, రెండు !! విభీషణుని పరంగా ఎంచితిని. హితుండు + అనె = హితుండనె. "విభీషణుడా! నా హితుండనుచుంటివి!" అని నా కల్పన...
రిప్లయితొలగించండిరాముడు మంచివాడు, నన్ను విడిచి యతని శరణు పొందు, అని చెప్పిన సీతమ్మ తో రావణుని పలుకులు
వాలిని హతమొనర్చిన వాడు మాటు
న నిలబడి, విభీషణునికి, నమ్మ దగని
వాడికి శరణు నిచ్చె, యవనిజ, వాడు
రాముడేనా హితుండనె రావణుండు !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీత తనను మరచిపొమ్మని నిందించి నపుడు రావణుని మాటలు
తొలగించండి-------------------------------
నార చీరలు ధరియించి యడవు లందు
రాజ యోగము లేకను తేజ మేది
భోగ భాగ్యము లేనట్టి పురుషు డతడు
రాముడేనా ? హితుండనె రావ ణుండు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిపందికొక్కుల బగబూని పాతిపెట్ట
చకచకా త్రవ్వు కలుగుల సారమెరుగు
క్రొత్త నోటుల నిధులను గూర్చి మనరె
మోది చర్యలు ధనికుల "మోదకములు"
మాయ సీత ధనమ్మను మనన జెలగ
రాముడే నా హితుండనె రావణుండు!
బాముల వెట్ట నా ధనిక బాబుల నోట్లను బట్టివేయగా
సామము మాని మోది బలు సాకుల రావణ బ్రహ్మలో యనన్
నీమము దప్పి మార్చిరట నేర్పున ప్రాతను గ్రొత్తజేసి "మా
కామితమౌ భలే నిధుల గాంచగ యెంతయొ మేలు జేసె సు
త్రాములు వాహనాల్ నడుపుదార్ఢ్యపు చోదకులార!"యంచనన్
రాముడు నా హితుండనుచు రావణుడంగదు తోడ జెప్పడే!?☺
డా.పిట్టా
రిప్లయితొలగించండిసామము మానె..గా చదువ ప్రార్థన..ఆర్యా,
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిసమకాలీనమైన అంశంతో మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా
తొలగించండిఆర్యా, కృతజ్ఞతల.
కామము తోడ రావణుడు కామునిఁ దల్లిని వెంటదెచ్చినన్
రిప్లయితొలగించండిక్షేమము జెప్ప నెంచి దరిజేరిన దూతను గారవించకన్
రాముడు పత్నినిన్ మరచి లంకను వీడిన నిశ్చయంబుగన్
రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
…………………………………………
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాయబారి యగు న౦గదుని తో రావణుడు పలికిన మాటలు :--
________________________________
క౦టి రెప్ప విధ౦బున న౦టి యు౦డి
నన్ను గాచు నట్టి " సులోచనా మనోభి
రాముడే " నా హితు౦ డనె రావణు౦డు |
రాము డేమి చేయు ననుచు ప్రశ్న వేసె
{ సులోచనామనోభిరాముడు = ఇ౦ద్రజిత్తు
హితుడు = హితము గోరు వాడు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మనోహరమైన పూరణ! __/\__
తొలగించండి"బ్రహ్మ వంశంబు పేరును బడయు నటుల
రిప్లయితొలగించండిసర్వ జగముల గెలిచితి శౌర్య మలర
నేడు దేహంబు చాలించ నిలిచి తీను
రాముఁడే నా హితుండ" నె రావణుండు.
(రావణునికి అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమయినదని
తెలిసి సంగ్రామానికి వెళ్తున్నప్పుడు ఇంద్రజిత్తు తో పలికిన పలుకులు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిలిచి తీను'...?
కోరిన వరముల నొసంగి కూర్మితోడ
రిప్లయితొలగించండికాచి సతతము కాపాడు కాటి రేడు
శిఖరవాసిని,నగజాత శివ మనోభి
రాముడే నా హితుండనె రావణుండు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిభీషణునితో రావణుండు:
తొలగించండితనదు తమ్ముడు తోడుండ మనెడు వాడు
వాలి సుగ్రీవ వైరమ్ము వాడి నేడు
మనల విడదీయ వచ్చిన మానవుండు
రాముడేనా హితుండనె? రావణుండు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముడొకవేళ విష్ణ్వంశ ప్రభవుడనగ
రిప్లయితొలగించండినతని గెల్చిన సత్కీర్తి,అంతమవగ
ముక్తి గల్గును,గాన నో ముదిత వినుము
రాముడే నా హితుండనె రావణుండు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆమునులిచ్చినట్టి యగడంది జనించితి రక్కసుండనై
రిప్లయితొలగించండినామనసెప్పుడున్నజుని నామమునే జపియించు చుండెడిన్
భూమి జనించె నచ్యుతుడుబ్రోవననున్ నరజన్మమందు నా
రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడులోకాల ప్రభువునై ముదిత! వలచి
రిప్లయితొలగించండినీదుహితమును గోరెడి నేనువలదె?
కానలంబడి తిరిగెడి దీనుడైన
రాముడేనా హితుం? డనె రావణుండు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజ్యకాంక్షను వీడిన రాము డిప్పు
రిప్లయితొలగించండిడవని జాతను కోరడ య్యదియు నిజము,
రాజ్యమును రమణిని పొంద రణమునకు వి
రాముఁడే నా హితుండనె రావణుండు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాము పంపున రాయబారమును జేయ
రిప్లయితొలగించండివ్రాల లంకాధిపతి మ్రోల వాలి పుత్రు
నంగదుం గని పల్కె వనేంగ! నీకు
రాముఁడేనా? హితుం డనె రావణుండు
[వనేంగము = వనచరము, కోతి]
భీమ పరాక్రమద్యుతిని వెల్గెడి వీరుడు కుంభకర్ణుఁ డు
ద్దామ బలాన్వి తాసుర వితానము నాకు బలంబ యిద్ధరన్
కాముడె యా విభీషణుడు గల్లరి రావణి పీడ్యమాన సు
త్రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే
శ్రీ కామేశ్వర రావుగారికి వందనములు. చిన్నప్పుడు మా ఇంగ్లీషు పుస్తుకంలో రాజగోపాలాచారి గారి రామాయణం నుంచీ తీసికొన బడిన పాఠం ఒకటి ఉండేది:
తొలగించండి"Rama learns statecraft from Ravana"
http://www.mindauthor.com/philosophy/ravana-the-politician/
ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నదా లేదా అని నా సందేహం. దయజేసి తెలుపగోరెదను. నమస్సులు.
శాస్త్రి గారు మీరు చెప్పిన యీ యంశము వాల్మీకి రామాయణములో లేదు. యుద్ధ కాండ 111 వ సర్గ లో రావణ వథ మాతలి వచనానుసారము బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా జరుగుతుంది. బ్రహ్మాస్త్రము తిరిగి రామ తూణీరము చేరుకుంటుంది.
తొలగించండి__/\__
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసూరి శౌరులొక్కటి యను సూక్ష్మ మదియ
నిజమగుచు దోచె, నాకింక నేమి వలయు?
పోరులో గూల్చి శివమిడు పురహరి శివ
రాముడే నాహితుండనె రావణుండు
సీత విషయమై నన తోడ చిరమరబడి
తమ్ముడా విభీషుణుడట దైవ సముడు
రాముడే నాహితుండనె; రావణుండు
కనలి నాతని సభనుండి కడవబెట్టె
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'చిరమరబడి'...?
తమ్ములను, తనయుల, తాత తండ్రి గోలు
రిప్లయితొలగించండిపోయి మరుభూమి బోలగ పురములెల్ల
బంధుజనులు లేని బ్రదుకు బరువు గాదె!
యమరపురిని నావారి చేయందు కొనగ
రాముడే నా హితుండనె రావణుండు
గుఱ్ఱం సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామునితోడ వైరమును రావణ మంచిదిగాదు నీకు నీ
రిప్లయితొలగించండిక్షేమము గూర్చి చెప్చితిని సీతను రాముని చెంత జేర్చు మా
రాముడు నీ హితుండువిను రాక్షస నాధుడ చెప్పిపంపెనన్
"రాముఁడె నా? హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే"
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరముగ స్వయం వరము సీతెరుగమగడు
రిప్లయితొలగించండిరాముడే|”నాహితుండనె రావణుండు
కుంభ కర్ణని రాముని కుమ్మగలడు|
అన్నదమ్ములనెడురించటంతసులువ?
2.క్రమాలంకారము
ప్రేమను పెంపు జేయగల పేర్మికి మూలము సీతనెంచగా?
క్షేమమ నింపుచున్ సతము కీర్తికి మూలము నాంజనేయుడే|
కామము నాశనంబుకని గర్వమువీడుటమంచి మార్గమా?
1.రాముడే2.నాహితుండనుచు3.రావణుడంగద తోడ జెప్పడే?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సీత+ఎరుగు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
జలమున నగ్నిపుట్టెనని.................
రిప్లయితొలగించండివిలసిత పాండునందనులు విజ్ఞతతో చరియించిి ధర్మమున్
నిలుపగ-యోధులయ్యు-అవనిన్ కడు శాంతినిఁజూప పూనరే
తెలిసి దోసమంచు-రణధీరులుగా చెలరేగు పట్టునన్
జలమున నగ్నిపుట్టటెనని సంతసమందెను మీనజాలముల్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెలిసియు'లో యు టైపు కాలేదు.