22, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2260 (పురుషుండే ప్రసివించి....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

 "పురుషుండే ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా" 
లేదా...
"పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్"

45 కామెంట్‌లు:

  1. "బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్..."

    "కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో..."



    ధరణిని దున్నుచు మనకవి
    వరుడా పోతన రచించి భాగవతమ్మున్
    వరులకు నమ్మక ఘనయుగ
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్

    పొలతి = భారతమాత

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారు వందనములు. మీ ఊహ అమోఘం మరియు అత్యద్భుతం.

    రిప్లయితొలగించండి

  3. చొరవయు వైద్యులు జేయన్
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగె
    న్నరయన్ కాలమహిమగద
    పరిణామ మిది నరుడాయె పడతి జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పరమేశుడు తలచు కొనగ
    విరబూయును వింత లెన్నొ వేవే లనగా
    మరులన్ గొని మణికంఠుని
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    బరితెగినది స్త్రీవాదము
    సరిహక్కుల బాధ్యతలను చాటుటలేదా?
    నరవరు జన్యువు మార్చదె?
    పురుషుడు ప్రసవించి శిశువు బొలతికొసంగెన్
    పరువే పోయెను య(అ)న్యదేశ ప్రజదౌ వ్యాపార పారీణతన్
    కరువై పోయెను రత్నగర్భ సుఖసంకాశమ్మునున్ కీర్తి దు
    ష్కరులాంగ్లేయుల భారపూరిత వెతన్ గాంచంగ బాలింత స
    త్వర యోగంబన, హింస గూర్చక ననిన్ వారించె గాంధీజి స
    త్పురుషుండై గణతంత్ర బాలిక గనెన్ పూర్ణుండు,దివ్యాత్మయై!
    పురుషుండే ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెంగదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పోయెను+అన్య' అన్నపుడు యడాగమం రాదు. 'పోయిన దన్యదేశ...' అనండి.

      తొలగించండి
  6. తరుణము సి జ రి న్ చే య గ
    స రి వచ్చిన ఙా గు లే క సా యు ధు డై చె
    చేరి సా గె ను గా డా కర్
    పురుషుడు.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      బాగున్నది మీ పూరణ.
      కందంలో రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. మొదటి పాదాన్ని లఘువుతో ప్రారంభిస్తే మిగిలిన పాదాలను లఘువుతోనే ప్రారంభించాలి. మీరు మూడవ పాదం మొదటి అక్షరం గురువు వేశారు. "సాయుధుడై చె।చ్చెర సాగెనుగా డాక్టర్..." అనండి.

      తొలగించండి
  7. నిరుపమ గుణ రంజితు సా
    దర ఘన గంభీరు ధీర ధౌరే యుండౌ
    వరుడు వివేకా నందున్
    పురుషుడు ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్!

    (శ్రీ రామకృష్ణ పరమ హంస తన బోధనలతో వివేకానందుని భరతమాత కందించాడనే భావనతో)

    రిప్లయితొలగించండి
  8. శిష్ట్లా శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ''ప్రజాప’తిశ్చరతి గర్భే’ అంతః | అజాయ’మానో బహుధా విజా’యతే |''


    గురువుల్ జెప్పగ సూక్తమ్
    చరాచర సమస్త జీవ జాతుల సృష్టిన్
    హరిహర బ్రహ్మాదులుగా
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్"

    రిప్లయితొలగించండి
  10. నరపతి యవనాశ్వుడు తా
    నరయక మంత్రజలములని నాస్వాదించన్
    ధరియించెను గర్భమ్మును
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్
    మాంధాతజననము

    రిప్లయితొలగించండి
  11. అరయుముజగతినివింతలు
    పురుషుడుప్రసవించిశిశువుబొలతికొసంగెన్
    వెరవదియాయెను,జన్యుల
    మారుపులైయుండునేమొమననముజేయన్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మూడవ పాదములో అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి సాధువేనా తెలుప గోర్తాను.


      హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్య సంఘాలకున్
      ధరణీ భారము దీర్ప నెంచి హరి సంధానమ్మ యిగ్గాథయే
      యరయన్ రాధకుఁ గుంతి కర్ణు, రవి సద్యోగర్భ మీయన్ మహా
      పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా


      తరుణి నిజ నాథునకు నా
      తురయై తన కూరిమి సఖి తోరపుఁ జెలిమిం,
      గర ముఱిమిన బాల యనుచుఁ
      బురుషుఁడు, ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్

      తొలగించండి
    2. యతి దోషమైనచో:

      హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్య సంఘాలకున్
      ధరణీ భారము దీర్ప నెంచి హరి సంధానమ్మ యిగ్గాథ యా
      తురతన్ రాధకుఁ గుంతి కర్ణు, రవి సద్యోగర్భ మీయన్ మహా
      పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా

      తొలగించండి
    3. 18 Oct. 2016 నాటి సమస్యా పూరణలు:

      తల్లి సేదదీఱగఁ దన తనువు నిమురఁ
      బ్రసవ వేదన భరియించి పడతి యపుడు
      చంద్రు డనుచుఁ బొగడ నత్త సంత సింప
      మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె


      జగతిం జూడగ నిట్టి వింతలు మహాశ్చర్యంబులై తోచవే
      మగువల్ మెచ్చరె యిట్టి భర్తలను సన్మానమ్ములుం జేయరే
      తగదీ దుర్భర బాధ నీకనుచు భర్తై యుండి స్వ్పప్నంబునన్
      మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్

      తొలగించండి
  13. నరుడే విధాత సముడన
    నరుదగు ప్రతిసృష్టిజేయ నద్భుత రీతిన్
    బరువేల వనిత కనుచునె
    పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. నా సమస్య ధరణికి గొప్ప కాన్కలయె తారలు వారల పున్నెమేమిటో
    లేక
    ధరణికిని గొప్ప కాన్కలు తారలయ్యె

    రిప్లయితొలగించండి
  16. పరవశమున నీతి సుధలు
    కురియగ కావ్యము ఘటించి కూతురనుచు తా
    మురిసి సతి కంకితమ్మనె!
    పురుషుడు ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్!

    18.10.2016న ఇదే భావంతో తేటగీతిలో మీరిచ్చిన సమస్యకు నాటి నా పూరణ:
    నీతి చంద్రికలు కురియు రీతి నతడు
    కావ్య మొక్కటి వెలయించి కన్న బిడ్డ
    యనుచు నిజ సతి కందించె నంకితమ్ము!
    మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె!

    గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
    భీకరమ్ముగ ననుజు విభీషణు గని
    " రాముడేనా హితుండ?"నె రావణుండు!
    హితవు వినని వాడై పర సతిని గోరి
    నరుల, వానరుల నడరి మరణ మందె!

    రిప్లయితొలగించండి
  17. పురుషుండేప్రసవించియాశిశువునంభోజాక్షికిచ్చెంగదా
    పురుషుండేప్రసవించుచోనికనునంభోజాక్షులన్దవ్వుగా
    నిరతంబుంచుటమేలుగాదెయికయోనెల్లూరురాజేశ్వరా!
    యరసింజెప్పుమనీవెయీప్రసవమాహాత్మ్యంబునిర్భీతిగా

    రిప్లయితొలగించండి
  18. ధరణి నిరదున్నునెవ్వరు?
    తరుణీ మణి మనసులోన తనియు నెటులనో?
    హరి వరముల నెవరికిడెన్?
    పురుషుఁడు, ప్రసవించి శిశువుఁ, బొలతి కొసంగెన్
    ఇరః భూమి, హరిః యముడు

    రిప్లయితొలగించండి
  19. తరుణిని గుర్విణి యనుచును
    పరుషముగానత్త పలుక భవుడను వేడన్
    కరుణను జూపింప పరమ
    పురుషుడె, ప్రసవించి శిశువు బొలతికొసంగెన్
    ................

    తరుణిన్ గుర్విణియంచు నత్తయిల సంతానమ్ము లేనందుకే
    పరుషాలాడుగ బాధతో బడతి తాప్రార్థించెవిశ్వేశ్వరున్
    శరణమ్మంచును భక్తితో గొలువగా సాక్షాత్కరించెన్ మహా
    పురుషుడే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెంగదా

    ................. ........ ...

    రిప్లయితొలగించండి
  20. తరుణిని గుర్విణి యనుచును
    పరుషముగానత్త పలుక భవుడను వేడన్
    కరుణను జూపింప పరమ
    పురుషుడె, ప్రసవించి శిశువు బొలతికొసంగెన్
    ................

    తరుణిన్ గుర్విణియంచు నత్తయిల సంతానమ్ము లేనందుకే
    పరుషాలాడుగ బాధతో బడతి తాప్రార్థించెవిశ్వేశ్వరున్
    శరణమ్మంచును భక్తితో గొలువగా సాక్షాత్కరించెన్ మహా
    పురుషుడే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెంగదా

    ................. ........ ...

    రిప్లయితొలగించండి
  21. అరయగ యాదవ కులమున
    దురితమగు నవజ్ఞచేత దుర్వాసునికిన్
    యరె! సాంబుడు గనె రోకలి
    పురుషుడు ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్!

    రిప్లయితొలగించండి
  22. హరి|మోహినిగాగా?గని
    పరమేశుని కాపురానవరములనొసగే
    కరుణా మయుడయ్యప్పను
    పురుషుడు ప్రసవించిశిశువు పొలతి కొసంగెన్| {హరి,హరుల పుత్రుడని నాపూరణ}
    2.స్థిరమే లేనిది జీవితాశయము నిస్తేజంబు యూహించగా
    చరితంబందున లేనివైన?విఠలాచార్యుండుజూపించెగా|
    మరువన్ జాలని చిత్రమౌ కథలసామర్థ్యంబువీక్షించగా?
    “పురుషుండే ప్రసవించి యాశిశువునంభోజాక్షికిచ్చెంగదా”|

    రిప్లయితొలగించండి

  23. పిన్నక నాగేశ్వరరావు.

    తరుణి నెల తప్పిన విషయ

    మెఱుగకయె పురుషునిగ తన యిచ్ఛను
    మారెన్
    తరుణము వచ్చిన తదుపరి

    పురుషుడు ప్రసవించి శిశువు బొలతి
    కొసంగెన్.
    ( ఇటీవలి వార్తాపత్రిక కథనం ప్రకారం ఒక
    స్త్రీ శస్త్ర చికిత్సతో పురుషునిగా మారి ప్రసవిం
    చిన విషయం చదివిన తర్వాత....)

    రిప్లయితొలగించండి
  24. తరియింతు చెలీ! తల్లిగ
    కరణించి కిరాయి కిమ్ము గర్భమనంగన్
    సరియనఁగ తాలి గట్టిన
    పురుషుడు, ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులారా,
    నమస్సులు. ఈరోజుకు నన్ను మన్నించాలి. ఎందుకో మధ్యాహ్నంనుండి మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో తెలియని భయం. ఏపనీ చేయాలనిపించడం లేదు. కనీసం బ్లాగులో పద్యాలను చూచే ఉత్సాహం లేదు. వీలైతే రేపు ఉదయం చూస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. నమస్కారములు
    మీరు తప్పక విశ్రాంతి తీసుకోవాలి పూరణలకు తొందర ఏముంది ? ఆరోగ్యం కంటె ముఖ్యం కాదుగదా ! సోదరులను దీవించి అక్క.

    రిప్లయితొలగించండి
  27. తరుణులు నరుసులు , వైద్యుడు
    పురుషుడు , ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్
    సరి యగు జాగ్రత్తలతో
    పరికింపగ తల్లి తనదు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
  28. ధనికొండ రవిప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. వరముల్ వచ్చును బావగారు తమదౌ బంగారు బాలామణిన్
    కరముల్ మోడ్చి నృపాలురం కిడుమనన్ గారాబు నాకన్యనున్
    పరమా నందము తోడుగా నిడెదనా వాగ్దేవికే నంచు నా
    పురుషుండే ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా!

    రిప్లయితొలగించండి