10, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2249 (కారాగారమునందు లభ్యమగు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే"
లేదా...
"కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

40 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. రారాజుల వలె నేతలు
   భారీ గాధనము దోచి భక్తి నటించున్
   కోరిన భోగము లందగ
   కారా గారమున ఘన సుఖంబులు దక్కున్

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. "Jawaharlal may be said to have taken the fullest possible advantage of his prison life by voluntarily courting imprisonment, by generally obeying jail rules, by spending enough time to introspection, by reading a lot, and, what has proved of the greatest advantage to the world, by engaging himself in writing all his major works, while undergoing imprisonment."


   పోరాటము రాత్రి పగలు
   వారము వర్జ్యమును లేక భారము కాగా
   తీరుగ ప్రశాంతి నిలయము 
   కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

   తొలగించండి
 3. శ్రీరామదాసుకున్, మన
  భారత స్వాతంత్ర్య సమర భటులకు దక్కన్
  భారీ దోపిడి గాళ్లకు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 4. ఘోరాలన్నియు వర్జనీయమని యుద్ఘోషించు యోగీశులన్
  నేరారోపణ జేసి రాక్షసులు దుర్నీతిన్నిబంధించగన్
  సౌరత్వంబున భక్తకోటి మదినా శౌరిన్నుపాసించగన్
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబెన్నఁగా సాధ్యమే

  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పఁగన్ సమస్య ఇదివరలో ఇచ్చి యున్నారు కదా, దానినే ఆఖరిపాదం మార్చి యున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారు అవునండి సమస్య పునరావృతమైనది (కించిద్భేదముతో). అయిన పూరణ భేదము చూప నాస్కారము కలదు కదా! ప్రయత్నించండి.

   తొలగించండి
  2. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. నిజానికి సమస్య పునరావృతం అయినా కూడా నేను వేరొక పూరణ ప్రయత్నించి ఉండెడి వాడను. కానీ ఈ మధ్య కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలనను, అమెరికా దేశానికి వచ్చి ఉండడం వలననూ సమస్యలు చూడడం సాధ్యం కావటం లేదు. సమయం చిక్కినప్పుడు వీలైనంతలో పూరించే ప్రయత్నం చేస్తాను.

   తొలగించండి
 5. డా.పిట్టా
  ఘోర తపస్సుకు సరియై
  మారెను చెరసాల బ్రతుకు మహిమాన్వితగా
  కూరెను గణతంత్రోర్వియు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్
  "పారావారము బోలు నాత్మల నొరే! బట్టంగ లేవెప్పుడున్
  దారాదత్తము జేయకుంటిమనియే దండింపగా నెంచితో
  పోరా!భారత మాత శృంఖలములన్ బోనాడు దీక్షన్ గొనన్

  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నగన్ సాధ్యమే?!"....అని సమర యోధుల సవాలు జేసిరి.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
  ఉల్లమున వలపు తలపు లూగి తూగ,
  సేవ లందించు మరదలు సిగ్గులొలక
  నరుడు సంతస మందుచు నల్లనయ్య
  చెల్లెలిని పెండ్లి యాడ మెచ్చెను జగమ్ము!

  రిప్లయితొలగించండి


 7. పోరీ జిలేబి ,మొక్కుము
  భారీ గా వెంకటేశు భాగ్య విధాతౌ !
  హేరా ఫేరీ యైనా
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. కారాగారము నందున
  నేరాలకు శిక్షయుండు నిక్కముసామీ !
  నేరాల నేతలకు మఱి
  కారాగారము న ఘన సుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 9. శ్రీరామదాసుకున్, మన
  భారత స్వాతంత్ర్య సమర భటులకు దక్కన్
  భారీ దోపిడి గాళ్లకు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 10. …………………………………

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నేరచరితులు సమానము

  కారా ? గారమున ఘనసుఖ౦బులు దక్కున్ ,

  కారాగారము న౦దున

  నేరమ్ములు చేసి నట్టి నేతల కెల్లన్ ! !


  { గారమున ( న్ ) = ప్రేమ తో }

  రిప్లయితొలగించండి
 11. భారీపేరట చెర్లపల్లి గదికింపౌ సెల్లుఫోన్లింక నా
  కేరింతల్ వినరాగ గోప్యమగు సాకేయుండగా
  ధారాళంబుగ తెల్లమౌ మనకు మొద్దబ్బాయి సూరీడు కా
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁ గా సాధ్యమే!

  రిప్లయితొలగించండి
 12. కారుం గూతలు గావు సుమ్మి యవి సత్కారార్హ గానమ్ములే
  వీరావేశము మిన్ను ముట్టగను సంప్రీతిన్ వడిం బాడెడిన్
  ధారాపాతపు గాన పుంజములు నిత్యంబౌ విశాలాంగసం
  స్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే

  [అంగసంస్కార+ఆగారము = అంగసంస్కారాగారము:స్నానశాల; అంగసంస్కారము = స్నానము]


  ధారాళపు ధనమున నే
  యారాటము లేక ఘనపు టపరాధులకున్
  గారాబము దోడ సతముఁ
  గారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 3 నవంబరు 2016 నాటి పూరణలు:

   లేరే కార్మికు లప్పురంబునను వారిం జూచితే నీ వికన్
   వేరే రీతిఁ దలంప నేల వినుమా విస్తారపుం బల్కులన్
   దూరం బైనను నేమి సంతసము దాఁ దోడై శ్రమింపంగ నా
   కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్

   [కార = యత్నము,ఉద్యోగము; కారాగారము = ఉద్యోగము చేయు చోటు, కర్మాగారము]


   నీరారాతి విధూమాం
   గారక మిచ్చు ఘన శీతకమ్మున ముదమున్
   ఘోర తర నిధాగమ్మున
   కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

   [కార+ఆగారము = కారాగారము; కార = మంచుకొండ; మంచుకొండలలో యిల్లు]

   తొలగించండి
 13. పారావారము సరి సం
  సారము నీదాడ లేక సణుగుట కంటెన్
  చేరిన దేశముకొరకై
  కారా గారమున, ఘన సుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  . "కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

  నేరము లెంచుచు నుండెడి
  తీరును గూడిన ధనికుడు దిట్టతనమునన్
  దా రూకలు వెదజల్లగ
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్‌.

  రిప్లయితొలగించండి
 15. కారాగార మధర్మవర్తనల సౌకర్యార్థమై నిల్వగా?
  ధారావాహిక లందజేయు కథలా ధర్మంబువిచ్చిన్నమై
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబెన్నగా సాధ్యమే
  ఆరాదింతురు లంచగొండులట యన్యాయంబులెక్కించకన్|
  2.నేరంబన్నది నేస్త గాళ్ళ వలలో నేర్పించు దుర్బుద్దియే
  సారంబంచును సాగదీయ నది విశ్వాసంబునే ముంచుగా|
  ప్రారబ్దంబన లంచగొండు లిలలోప్రాప్తించగా మిత్రులై
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబెన్నగా సాధ్యమే|
  3.కారాగారపు సంతకు
  ఆరాధితులమ్మకాన అంగడి సరుకై
  ప్రేరణ గొల్పగ లంచము
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్|
  4.కారాగారము నందున
  కోరిన కోర్కెలను దీర్చుకుత్చిత మతులే
  ప్రేరణ నింపగ దోషికి
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్|
  రిప్లయితొలగించండి
 16. మారీచులకును,మాయల
  మారులకును,రాజకీయ మాంత్రికతెగకున్
  ఘోరనరకమును జూపెడి
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్|

  రిప్లయితొలగించండి
 17. మారీచులకును,మాయల
  మారులకును,రాజకీయ మాంత్రికతెగకున్
  ఘోరనరకమును జూపెడి
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్|

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆరాటమ్మును గూడి వాజజములన్నార్జించు టాటోటునిన్
  కారాగారమునం బిగించు వడి నా కైలాటకాడద్దరిన్
  బారానన్విభవమ్ము బంచి దొరలాప్యాయమ్ము నొందగగా
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పఁగన్.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారికి వందనములు.

  ప్రారబ్ధంబులఁ నుజ్జగింపక ఘన ప్రాశస్త్యముల్ గంటి సం
  స్కారాధిక్యత జూపితిన్ జటిలమౌ శాస్త్రంబులన్ నేర్చితిన్
  మీరున్ మీరలు, నాకొసంగిన మహామేయంబులౌ సన్నుతిన్,
  కారా! గారము నందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే

  మీరన్ మీరులు కారా ! గారము (వి ) గౌరవము (ప్ర)

  రిప్లయితొలగించండి
 20. పోరగ జీవిక కొఱకై
  యీరోజులలోన బ్రతుకు యిడుముల కడలే ;
  చోరీ నెపమున దూరగ
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి

 21. భారీ కబ్జా లైనను

  నేరారోపణ జరిగిన నేతల కెల్లన్

  కోరిన వన్నియు నిత్తురు

  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 22. దూరంబౌ నాత్మీయత
  దూరంబౌ సుఖము శాంతి, దూరము గాకన్
  గౌరవముగ నున్నను సహ
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్

  రిప్లయితొలగించండి
 23. కవిమిత్రులకు నమస్కృతులు.
  కొన్ని ముఖ్యమైన పనులవల్ల రోజంతా వ్యస్తుణ్ణై మీ పూరణలను సమీక్షించలేదు. ఇప్పుడు పూర్తిగా అలసి ఉన్నాను. రేపు ఉదయం మీ పద్యాలను పరిశీలించి నా స్పందనను తెలియజేస్తాను.
  ఈనాటి సమస్యకు పూరణ లందించిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  మతిమరుపు వల్ల గతంలో ఇచ్చిన సమస్యనే ఈరోజు ఇచ్చాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి

 24. నిన్నటి పద్యాలోసారి చూడండి అన్నయ్యగారూ.

  మనసు పడివలచినయట్టి మగువ తెగువ
  గాంచి కృష్ణుడు ముదమున కదలి వచ్చి
  రాక్షస వివాహమున తాను రక్తిఁరుక్మి
  చెల్లెలిని బెండ్లి యాడ మెచ్చె జగము.

  యాత్రలకటంచు వెడలిన యర్జునుండు
  కపట యతిరూపుతో ద్వారకపురి చేరి
  మనసుపడివలచిన యట్టి మారజనకు
  చెల్లెలిని బెండ్లి యాడ మెచ్చెను జగమ్ము.

  క్రూరపు పనులను చేయుచు
  ధారాళముగ వెదజల్లి ధరలో ధనమున్
  నేరము లెన్నో చేసిన
  కారాగారమున ఘనసుఖంబులు దక్కున్.

  రిప్లయితొలగించండి
 25. నేరస్థులె యుందురుగద
  కారాగారమున, ఘనసుఖంబులు దక్కున్
  వైరాగ్యము తోడ సదా
  శ్రీరామునినామజపము చేసిన చాలున్

  రిప్లయితొలగించండి
 26. నేరస్థులె యుందురుగద
  కారాగారమున, ఘనసుఖంబులు దక్కున్
  వైరాగ్యము తోడ సదా
  శ్రీరామునినామజపము చేసిన చాలున్

  రిప్లయితొలగించండి
 27. శ్రీగురుభ్యోనమః

  పూరింపన్ ఘనపద్యపాదముల దప్పుల్ జూపలేనట్లుగా
  సారింతున్ విధిపత్ని భిక్ష కొరకై చాంచల్యమౌ చిత్తమున్
  కారుణ్యామృత మింతజిల్కి కవితా కాసారమున్ నిల్ప హృ
  ద్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే

  రిప్లయితొలగించండి
 28. సారావర్తకమందు నిచ్చ గొనుచున్ సంపాదనన్ మత్తులై
  నేరాలెన్నియొ చేసి తాము ధృతినా నేరమ్ములన్ చేరగన్
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబెన్నఁగా సాధ్యమే
  యారాటమ్మున నాయకుల్ కడుసహాయమ్మిచ్చి కాపాడగన్

  రిప్లయితొలగించండి
 29. శ్రీరమణియు నట చదువుల
  సారము నెఱిగిన గుణవతి సరసన పతిగా
  చేరగ, నా సతి వలపుల
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!

  3 నవంబర్ 2016 నాటి నా పూరణ:
  ధీరోదాత్తుడు, మానస
  చోరుడు కోరి మనువాడె చోద్యము గొలుపన్!
  గారాల మగని హృదయపు
  కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!

  రిప్లయితొలగించండి
 30. వారేనేతలమాత్యులై వెలుగుచున్ స్వార్థమ్ముతో ధాత్రిలో
  నేరాలెన్నియొ జేయుచు న్నవనిలో నిర్దోషులై వెల్గెడిన్
  వారిన్ జైలుకు పంపనేమి యదియున్ స్వర్గమ్ముగా మారదే
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబెన్నగా సాధ్యమే?

  రిప్లయితొలగించండి
 31. వారేనేతలమాత్యులై వెలుగుచున్ స్వార్థమ్ముతో ధాత్రిలో
  నేరాలెన్నియొ జేయుచు న్నవనిలో నిర్దోషులై వెల్గెడిన్
  వారిన్ జైలుకు పంపనేమి యదియున్ స్వర్గమ్ముగా మారదే
  కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబెన్నగా సాధ్యమే?

  రిప్లయితొలగించండి
 32. కం: ఊరక ధనమిడ సరియా ?
  గారాబము చేయ నిచ్చు కాంత సుఖములన్!
  మీరలు కవులే సరసులు
  కారా ! గారమున ఘనసుఖమ్ములు దక్కున్

  రిప్లయితొలగించండి
 33. వేరే వ్యాపక మెద్దిలేక నొకచో వీసంపు కందమ్ముతో
  చేరంగానిట శంకరాభరణనున్ చేతమ్ము రంజిల్లుచున్
  పోరున్ జేసియు వీడ జాలనిదియౌ పొన్నారి పింజ్రీని వోల్
  కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే!

  పింజ్రీ = పంజరము

  రిప్లయితొలగించండి