ఆర్యా డా.పిట్టానుండి స్వార్థ బుద్ధిన పొడి పొడి చేయండని మీరు భావించినారు.తరవాతి పదాలలో యోధులను (సరి)హద్దులలో యోధుల ప్రశ్న. మానవుని పొడిచివేయడం కాదు అని కత్తితో పొడిచేయుటను ఉటంకించానని తృప్తి చెందాను.మీరు ఈ పదాన్ని వ్యవహారికంగా భావించినారు .ధర ఖల్వాటు డొకడు ఎవరో కాదు.నేనే.కోపంలోపొడిచి వేస్తా అని నింపాదిగా అంటారేమో.ఇలాంటి ప్రయోగాలుజంధ్యాలవారి కృతుల లో నాకు కనిపించినవి.జ్ఞాపకం జేసుకొని మీకు తరువాత విన్నవిస్తాను.
ఉత్తర కుమారుడు రధసారధి లేడని పలికిన పలుకులు -------------------------------------- జడిగొనె కౌరవ సేనలు పొడి చీకటి రాక ముందె పొంకము నణతున్ గడియగ సారధి లేకను కుడిపింతును మట్టి భువిని కురు వీరులనే
కుడి యెడ మంచు దల్పకనె కుత్సిత కౌరవ సేన గూల్చి, యం గడి గల పొల్లురీతి నని గాల్చుచు కాల్వలజేర్చువాడ, నే జడియను వైరి వీరులకు, చక్కని సారధి సాయమున్న చో పొడి చెద ఖీష్మ కర్ణులను భీకర పోరున ఫల్గుణ ట్లుగన్
గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు ! మా గురువులు శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారి శిష్యరికము మరియూ ప్రోత్సాహముతో సమస్యా పూరణ చేసియుంటిని. తప్పులను మన్నించగలరు .
సునీల్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు నిస్సందేహంగా పూరణలు పంపిస్తూ ఉండండి. మార్గదర్శనం చేయడానికి ఇక్కడ ఎందరో సహృదయలు ఉన్నారు. స్వస్తి!
ఉత్తర గోగ్రహణము వీధి నాటకము:
రిప్లయితొలగించండిగడిచెను పదమూడేళ్ళల
జడిచేయకుమో కుమార! జాప్యంబేలా!
పొడిచెదర కౌరవ యశము
కుడిపించెద నీరు నేడు కురు సేనల నే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిపోకుడి దుష్ట మార్గముల బూర్ణ యశస్సుల నంగడిన్ గనన్
సాకులు జెప్పి సత్కృతిని జార్చగ నీతియునోజ డిగ్గెడిన్
బాకులు దూయగా క్షతియె భారత యుద్ధమె సాక్షి, భాగ్యముల్
చేకురు స్వార్థబుద్ధి బొడిచేయుడి యోధులగాదు; హద్దులన్!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పొడి' శబ్దాన్ని మాత్రం స్వార్థంలో వినియోగించారు.
ఆర్యా డా.పిట్టానుండి
తొలగించండిస్వార్థ బుద్ధిన పొడి పొడి చేయండని మీరు భావించినారు.తరవాతి పదాలలో యోధులను (సరి)హద్దులలో యోధుల ప్రశ్న. మానవుని పొడిచివేయడం కాదు అని కత్తితో పొడిచేయుటను ఉటంకించానని తృప్తి చెందాను.మీరు ఈ పదాన్ని వ్యవహారికంగా భావించినారు .ధర ఖల్వాటు డొకడు ఎవరో కాదు.నేనే.కోపంలోపొడిచి వేస్తా అని నింపాదిగా అంటారేమో.ఇలాంటి ప్రయోగాలుజంధ్యాలవారి కృతుల లో నాకు కనిపించినవి.జ్ఞాపకం జేసుకొని మీకు తరువాత విన్నవిస్తాను.
డా.పిట్టా కృతజ్ఞతలు
తొలగించండిఉత్తర కుమారుడు రధసారధి లేడని పలికిన పలుకులు
రిప్లయితొలగించండి--------------------------------------
జడిగొనె కౌరవ సేనలు
పొడి చీకటి రాక ముందె పొంకము నణతున్
గడియగ సారధి లేకను
కుడిపింతును మట్టి భువిని కురు వీరులనే
అక్కయ్యా,
తొలగించండిబాగుంది మీ పూరణ. కాని 'పొడి' శబ్దాన్ని స్వార్థంలో ప్రయోగించారు.
guruvulaku dhanya vaadamulu
తొలగించండికుడియెడమల నెఱుగుచు నిక
రిప్లయితొలగించండిజడిజేయక నిమ్ము పాలు సాదర మొప్పన్
బొడిచెద రీ యక పోయిన
గడిచెను బదునాలు గేండ్లు కౌరవ నాధా !
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని 'కుడి' శబ్దాన్ని స్వార్థంలో ప్రయోగించారు. 'జడి' ఏ అర్థంలో ప్రయోగించారు. సడి అంటే శబ్దం.
కుడితిలో బడ్డ యెలుకలా జడియనేల?
రిప్లయితొలగించండికటిక చీకట్ల బంధంపు గడియతీయ
గీత వెలుగులు పొడిచెను,గెలుపు నమ్మి
రణము నెంచుము ఫల్గుణ ప్రాభవమున
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుడిచె బండిిిలోని కూడంతయును తానె
రిప్లయితొలగించండిగడిపె బకుని కొఱకు గంటసేపు
జడిమ విడచి లేచె చయ్యన గని వాని
పొడిచె భీము డపుడు పొట్టలోన.
మిస్సన్న గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
అన్యుల కుడిగము గడిఁ దిగ
రిప్లయితొలగించండివిన్యస్తంబయె నలజడి వెలది ద్రుపద స
త్కన్యకుఁ దప్పొడి కట్టితి
నన్యాయపు జూద మందు నక్కట వెఱ్ఱిన్
[ఉడిగము = ఊడిగము; కడిది= అధికము; అలజడి = క్లేశము]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిదత్తపదాలను అద్భుతంగా పద్యంలో పొదిగి ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండివ్యాకరణ దోష పరిహారార్థము చిన్న సవరణ:
తొలగించండిఅన్యుల కుడిగము గడిఁ దిగ
విన్యస్తంబయి యలజడి వెలది ద్రుపద స
త్కన్యకుఁ దప్పొడి కట్టితి
నన్యాయపు జూద మందు నక్కట వెఱ్ఱిన్
రాయబారానికి వెళ్ళేముందు భీముడు శ్రీ కృష్ణునితో:
రిప్లయితొలగించండివెఱవకుడి యుద్ధమనగను
తిరముగ తెగడిన నలజడి తీరగ బోదే
పొరబడకు ధరను పొడి పొడి
చరణంబులు పొసగ వెపుడు సంధికి జూడన్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొగడి శల్యుని కౌరవుల్ తగువిధముగ
రిప్లయితొలగించండిప్రొద్దుపొడిచిన వెంటనే బుద్ధిమార్చి
కుడిపి మృష్టాన్నముల కడు కూర్మితోడ
నలజడి పడజేసిరి పాండు నందనులను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువర్యులకు ధన్యవాదములు.
తొలగించండికుడిపించిరి విషమాన్నము
రిప్లయితొలగించండిజడిపించిరి లక్కయింటి జ్వాలలచేతన్
పొడిసేయగ పాండవులను
గడియింపగ రాజ్యలక్ష్మి కౌరవ పుత్రుల్
గుఱ్ఱం సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెగడి కర్ణుని సూటిగా జగడమందు
రిప్లయితొలగించండిపొడిసె శల్యుడు లలి వెన్నుపోటు దురము
కట్టికుడిపెను గతజన్మ కర్మలపుడు
యలజడి పడిరి కురుసేన లాహవమున
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'పొడిచె... కర్మలప్పు। డలజడి...' అనండి.
గురువర్యుల సవరణలకు ధన్యవాదములు.
తొలగించండిజడిపించుట కాద ని నొక
రిప్లయితొలగించండిగడియను నీ వారిని జముకాణాచికి పు
ప్పొడివన్నెలు గను భీముం
డడచును తలపకుడి యుద్ధ మనె కృష్ణు౦డే
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాదని యొక' అనండి.
గురువర్యులకు నమస్కారముములు కాదు+అనిన్+ఒక =కాదనినొకఅని వ్రాసితిని
తొలగించండితమరుసూచించినటులపద్యమును మార్చుచున్నాను
జడిపించుట కాద ని యొక
గడియను నీ వారిని జముకాణాచికి పు
ప్పొడివన్నెలు గను భీముం
డడచును తలపకుడి యుద్ధ మనె కృష్ణు౦డే
ద్రౌపది అరణ్య,అజ్ఞాత వాసాలలోగడిపిన కాలము!
రిప్లయితొలగించండిగడిపెను కాలము విషమము
రిప్లయితొలగించండిపొడిబారిన యెడదతోను పోరాటమునన్
జడియక బాధల నోర్చుచు
పోడిమితో యాజ్ఞికుడిని పూజించుచునే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*సహస్ర కవిరత్న,సహస్రకవిభూషణ*
రిప్లయితొలగించండి*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*ఈనాటి సమస్య దత్తపది...*.
*కుడి - గడి - జడి - పొడి*
పై పదాలను *అన్యార్థంలో* ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
*చంపకమాల*
*కుడిచితి సూతమాతకుచకుంభపయస్సుల బాల్యమందునన్*
*గడిపితిరాజ్యపాలనముకౌరవరాడ్విభుమైత్రినందుచున్*
*జడియకనీతిబాహ్యముగసాయముసేతునె కుంతి పుత్రునై*
*పొడియదెపశ్చిమంబునటుప్రొద్దదికర్ణుడు నీతిదప్పినన్*
*🙏శ్రీమతి జి సందిత బెంగుళూరు🙏*
కర్ణుని కుంతీపుత్రునిగా పాండవ పక్షమున చేరుమని కోరిన సమయంలో రాధేయుని జవాబు🙏🙏🙏🙏🙏
శ్రీమతి జి సందిత గారూ- మీబిరుదులు, సమస్యను గురించి, మీ భావం వ్రాయవలసిన పనిలేదు. పద్యం చదవంగానే అందరికి అర్థం అవుతుంది. పద్యం మాత్రమే వ్రాయ ప్రార్థన.
తొలగించండిసందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెడ్డి గారి సూచనను పాటించండి.
పెద్దలసూచనలు తప్పకుంండా పాటిస్తాను పైై నా పద్యంం
తొలగించండిమొదటి పాదములో సూతమాతృృకుచ కుంంభపయస్సులు గా నాసవరణను స్వీకరింంచ ప్రార్థన
పెద్దలసూచనలను పాటింంచ గలను.నాపద్యంం మొదటి పాదంం లో సూతమాతృృకుచకుంంభ పయస్సులు గా నా చిన్న సవరణను అనుమతింంచ ప్రార్థన
తొలగించండికడుపార కుడిచి నా వల
రిప్లయితొలగించండిలుడు పొడి చీకటి గడియలలో కీచకు పై
పిడి గుద్దుల గురియుచు నల
జడి జొనుపగ యమపురి దిశ జనె ఖలుడంతన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుద్దమునశ్రీకృష్ణుడు అర్జునితోపలికినపలుకులు
రిప్లయితొలగించండిదూకు-డిల్లబడకు సాకులు జెప్పకు
యుద్దమందు గడియ యూహ లుడుగ
అలజడి నినుగూల్చు అర్జునా “వైరిని
తడబడక పొడి సహితంబది విను”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుడి యెడ మంచు దల్పకనె కుత్సిత కౌరవ సేన గూల్చి, యం
రిప్లయితొలగించండిగడి గల పొల్లురీతి నని గాల్చుచు కాల్వలజేర్చువాడ, నే
జడియను వైరి వీరులకు, చక్కని సారధి సాయమున్న చో
పొడి చెద ఖీష్మ కర్ణులను భీకర పోరున ఫల్గుణ ట్లుగన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఫల్గుణు నట్లుగన్' అనాలి. అక్కడ 'ఫల్గుణుం డనన్' అనండి బాగుంటుంది.
గడిపిరె వనముల యందున్
రిప్లయితొలగించండికుడిచెరె యాకులలములను కుంతీ పుత్రుల్
పొడిచెరె కౌరవ వీరుల
నడవగ సేనలు రణమున నలజడి జేయన్!!
సునీల్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
కుడిచిరె, పొడిచిరె..లలో 'చి'ని 'చె'గా టైపు చేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికంసహింసకుడిని దాను గడియయైన
వీడకుండిన పార్థుడు పెనకువ నట
కౌరవుల కడజడి గూర్చి కఱకు దోడ
నిట్టపొడిచి రణము నందు నేల బెట్టె.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొడిచిన యెండకు నెండుచు
రిప్లయితొలగించండిజడివానల తడిసి వనము సైచితి మికపై
గడిపెదమజ్ఞాతమ్మును
కుడియెడమగ తీరిపోయి కూలును వెతలే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రణమున రిపులన్ కుడి ఎడమ చేతుల
రిప్లయితొలగించండితోశరముల వానతోగడివలె
సవ్యసాచి రిపులసరి పొడి చేసెను
అలజడిగని అలసిరి రిపులుగద
వడ్డూరి రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగున్నది.
రెండవ, నాల్గవ పాదాలలో యతిదోషం. సవరించండి.
గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు !
రిప్లయితొలగించండిమా గురువులు శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారి శిష్యరికము మరియూ ప్రోత్సాహముతో సమస్యా పూరణ చేసియుంటిని.
తప్పులను మన్నించగలరు .
''గడిపిరి వనముల యందున్
కుడిచిరి యాకులలములను కుంతీ పుత్రుల్
పొడిచిరి కౌరవ వీరుల
విడవక నెవరిని రణమున విజయము నొందన్!!''
సునీల్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు నిస్సందేహంగా పూరణలు పంపిస్తూ ఉండండి. మార్గదర్శనం చేయడానికి ఇక్కడ ఎందరో సహృదయలు ఉన్నారు. స్వస్తి!
సునీల్ గారూ - జడి విడిచినారు. గమనించి సరిచేయండి.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసీ.
కుడిచి కూర్చుండక క్రూర కౌరవ యుద్ధ
కేళీ విలాసాన కేఁగఁ బూని,
"గడియించితిని నేను ఘనుఁడ" నంటిని నాఁడు
వారల ముందు గర్వంపుటుక్తి;
జడియ బృహన్నల సైన్యంపు శౌర్యమ్ముఁ
దెలుప "సారథికై యడలితిఁ గాని,
పొడిచెద నందఱఁ బోరి యుద్ధమ్మున
సారథి యున్న" నంచనఁగ నతఁడు
గీ.
నచటి కాంతల కోర్కిపై నాకు సార
థిగను మాఱి, తెచ్చె సమరోద్దేశమునకు!
నేమి సేయుదు నక్కటా! యిపుడు నేను?
దారిఁ జూపుమ దైవమా! దండ మిడుదు!!
స్వస్తి
పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమూకలు కూల్చిన విధానాన్ని ఊహిస్తూ
రిప్లయితొలగించండిజడిసిరి యువకుడి రణకౌశల్యమునకు
శత్రు సంగడి, దుష్టులు జయము గోరి
చాటునుండిసారధి గూల్చి చక్రములను
విరిచి పొడిచిరీటెలతోడ వెనుకనుండి.
...............................విరించి
పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమూకలు కూల్చిన విధానాన్ని ఊహిస్తూ
రిప్లయితొలగించండిజడిసిరి యువకుడి రణకౌశల్యమునకు
శత్రు సంగడి, దుష్టులు జయము గోరి
చాటునుండిసారధి గూల్చి చక్రములను
విరిచి పొడిచిరీటెలతోడ వెనుకనుండి.
...............................విరించి