11, జనవరి 2017, బుధవారం

సమస్య - 2250 (ఖరమునుఁ గనినంత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఖరమునుఁ గనినంత నాకుఁ గడు  సంతసమౌ"
లేదా....
"ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

68 కామెంట్‌లు:

  1. మా నెల్లూరు గాడిద ప్రశంస (వేదం వేంకటరాయ శాస్త్రిగారి వర్ణన) :

    శుక్లాంభరధరం = తెల్లని దుస్తులను మోసెడిది
    విష్ణుం = వీధి వీధిన కనిపించేది
    శశి వర్ణం = తెల్లని ఛాయ గలది
    చతుర్భుజం = నాలుగు భుజములు గలది
    ప్రసన్న వదనం = ప్రసన్నమైన ముఖము గలది (వెనుక తాపులు తన్నగలది)


    వరముల నడగక విరివిగ
    బరువులు మోయుచు కరవక పరుగులిడక స్థా
    వరముగ నిలబడు నెల్లూర్
    ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      వేదం వారి వివరణతో చమత్కార భరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  2. బరువులు మోయుచు నిరతము
    నిరసన తెలుపదు తాను నీరస మందున్
    దురుసుగ తన్నని మౌనపు
    ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో గణదోషం. 'నిరసనను తెలుపదు తాను' అంటే సరి!

      తొలగించండి


  3. నరవర ! మునివర! కులశే
    ఖర! మునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ,
    వరమీయ వయ్య మార్పే
    ల, రమ్ము ముదమున లతాంగి లక్ష్యము గనుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. హరినామముస్మరించుచు
    పరమాత్ముని దర్శనమ్మె పావన మనుచున్
    తిరుమల జేరి యట గుడి శి
    ఖరమును గనినంతనాకు గడుసంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      'శిఖరము'తో మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో గణదోషం. 'హరినామమ్ము స్మరించుచు/ హరినామమును స్మరించుచు' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు మీ సూచన శిరోధార్యమ్
      సవరించిన పద్యము

      హరినామమ్ము స్మరించుచు
      పరమాత్ముని దర్శనమ్మె పావన మనుచున్
      తిరుమల జేరి యట గుడి శి
      ఖరమును గనినంతనాకు గడుసంతసమౌ

      తొలగించండి
    3. గురువుగారికి నమస్కారములు మీ సూచన శిరోధార్యమ్
      సవరించిన పద్యము

      హరినామమ్ము స్మరించుచు
      పరమాత్ముని దర్శనమ్మె పావన మనుచున్
      తిరుమల జేరి యట గుడి శి
      ఖరమును గనినంతనాకు గడుసంతసమౌ

      తొలగించండి
  5. హరహర మహదేవ యనుచు
    పరమేశ్వరు దర్శనమ్ము వాంఛించుచు నే
    పరుగిడనా శ్రీశైల శి
    ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      'శ్రీశైల శిఖరము'తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. శ్రీగురుభ్యోనమః
    కురిసె తుషార మంతట నగోచరమయ్యెను బాటలన్నియున్
    ధర చలి హెచ్చె నంత దరి దాపుల దాచిన ప్రాత చక్రముల్
    విరివిగ పుల్లలన్ కలిపి వేడిరగల్చిన మంటలందునన్
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి
  7. ……………………………

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఇరుగడ శ౦ఖము - చక్రము ,

    వరలెడు తిరునామ మాహ ఫాలము న౦దున్

    మరియు తిరుమలేశుని శే

    ఖరమును కనిన౦త నాకు గడు స౦తస మౌ

    { శే ఖ ర ము = సి గ ద ౦ డ }

    రిప్లయితొలగించండి
  8. నిరతము భక్తిని మంగళ
    గిరిలో నరసింహు నిష్ఠ కీర్తించుచు సు
    స్థిరమగుమతి నాలయపు శి
    ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రెడ్డి గారూ ఆణిముత్యము వంటి పద్యము హృద్యఙ్గమముగా చెప్పారు.అభినందనలు.
      "నరసింహు నిష్ఠఁ గీర్తించుచు" లేక "నరసింహు నిష్టిఁ గీర్తించుచు" అనండి.

      తొలగించండి
    3. జనార్థన రావుగారికి, కామేశ్వర రావుగారికి, గురువర్యులకు ధన్యవాదములు.మంగళగిరిప్రక్క గ్రామములో పుట్టి పెరిగాను. మాయింటి వద్ద నుండి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ శిఖరము నిత్యము కనబడుతుంది. కామేశ్వర రావు రావుగారి సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
  9. కం. వరముగ నాకు లభించిన
    యరమరికలు లేని వాడు నందఱి వాడౌ
    చిరకాల మిత్రుడగు శే
    "ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ"

    రిప్లయితొలగించండి
  10. కురియగ మంచు బిందువులు కోవెల మాటున కోమలంబుగన్
    విరిసిన యుత్పలంబు లతి వేడుక నుండగ రాత్రివేళలన్
    శరదృతువున్ సరోవరపు సన్నిధి పౌర్ణమి నాడు చంద్రశే
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ తాతా గారూ,
      మీ పూరణ బాగుంది.
      'శంభుశేఖరమును' అంటే అన్వయం కుదిరేది.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. దోషం అవగతమయినది. సవరణకి ధన్యవాదములు.

      తొలగించండి
  11. వర వైకుంఠ సమప్రభ
    సురవర సేవిత మురారి శోభిత నగముం
    బరమము తిరుమల పృథుశే
    ఖరమునుఁ గనినంత నాకుఁ గడు సంతసమౌ

    [పృథుశేఖరము = కొండ]


    శరనిధి మానసోల్లసన సంజన కాంశు విరాజమానుడున్
    వర సరసీ కవేల చయ వైభవ కారక దీప్తిమంతుడున్
    శరదృతు చంద్రికా భరిత చారు నభస్స్థిత భవ్య శంభుశే
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    [శంభుశేఖరము = చంద్రుడు; కవేలము = కలువ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. శరదమలాంబరమణియై
    సురుచిర చంద్రికలఁ గురిసి సుందరముఖ సు
    స్థిరసామ్యము గల శివశే
    ఖరమును గనినంత నాకుఁ గడు సంతసమౌ.
    (శివశేఖరము = చంద్రబింబము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండవ పూరణను ముందే చూసి ఉంటే నా యీ పూరణను పెట్టకపోయేవాణ్ణి!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అట్లయిననీ విశాల శంకరాభరణ నభో వీధిని ముగ్ధ మనోహర సుంద రామందానంద కంద తారామణి వెలుగుండేది కాదు.

      తొలగించండి
  13. అరిగితిని నేను రామే
    శ్వరముకు నట నొక్క విపణి శాలను ఘనమౌ
    హరణములును ముత్యములు ము
    ఖరమును గని నంత నాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామేశ్వరమున కట నొక్క...' అనండి.

      తొలగించండి
    2. గురువర్యులసూచన మేరకు సవరించిన పద్యము
      అరిగితిని నేను రామే
      శ్వరమున కట నొక్క విపణి శాలను ఘనమౌ
      హరణములును ముత్యములు ము
      ఖరమును గని నంత నాకు గడు సంతసమౌ .

      తొలగించండి
  14. హరహర శంభో యనుచును
    శిరమున గైమోడ్పు లిడుచు శివుని న్గనగన్
    మెరసెడి దేవా లయపు శి
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. చిఱచిఱలాడబోక కడు చిత్రముగా తలనూపుచుండి , భీ
    కరముగ జూడ బోక తన కంఠము బెంచక శ్వేతవస్త్రమున్
    నిరతము దాల్చుచున్ సభల నిత్యముదర్శనమిచ్చు చంద్ర శే
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి
  16. హరినామ స్మరణముచే
    తిరుమలగిరినెక్కి దేవదేవుని గనుచున్
    హరుషముతో నాలయపు శి
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
  17. కరములు మోడ్చివినయముగ
    శిరసును వంచి హృదయమున శివుని కొలచుచున్
    మురియుచు శ్రీ శైలమునశి
    ఖరమును గనినంతనాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిన్నటి పూరణ:

    ఆరాటమ్మును గూడి వాజజములన్నార్జించు టాటోటునిన్
    కారాగారమునం బిగించు వడి నా కైలాటకాడద్దరిన్
    బారానన్విభవమ్ము బంచి దొరలాప్యాయమ్ము నొందగగా
    కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదంబొప్పఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. పరమపవిత్రమై సతము భాసిలు పట్టణమందు కొండపై
    నిరతముఁ గొంచు పానకము నెమ్మిక భక్తుల కోర్కె దీర్చునా
    నరహరి పుణ్య కేతనమునన్ చరియించుచు గండ దీప శే
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండు పూరణలలోను మీ జన్మస్థల అభిమానాన్ని చాటుకున్నారు.

      తొలగించండి
  20. నిరతము భక్తుల నరయుచు
    నొరవుగ మహిమను బఱచెడి నభయం
    కరుడగు శంకరుని గుడిశి
    ఖరమును గనినంతనాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిరతము చాకలి సుబ్బడు
    బరువుగ వీపున బఱచెడి బట్టల మూటల్
    వరుసగ రేవుకు జేర్చెడి
    ఖరమును గనినంతనాకు గడు సంతసమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  22. ఖరమునుగాంచినంతమదిగమ్మనిభావముపొంగులెత్తెడిన్
    ఖరమదిమోయుమూటలనుగావిడివోలెనుదాభుజంబుపై
    నిరతముబాధనోర్చుచునునేరముగాదలంచకనెప్పుడున్
    నరుడునుదానెరుంగవలెనాలుకలేనిదిమూగజీవిగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'నేరముగా దలపోయ కెప్పుడున్' అనండి.

      తొలగించండి
  23. ఖరమొకటి మగది , తన స్త్రీ
    ఖరమును గనినంత నాకు - గడు సంతసమౌ
    ఖర యజమాని రజకునకు
    ఖరమొక్కటి నీను తనదు ఖర మని తలచున్
    (నాకు= నాకుట)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఖర యజమాని' వైరి సమాసం అనుకుంటాను. యజమానుడు/యజమాని అనగా యజ్ఞం చేసేవాడు, చేస్తున్నవాడు. (యజమానుడు సరైన శబ్దం. ఇది ఎలాగో పరిణామం చెంది యజమానిగా వాడుకలోకి వచ్చింది.) - పారమార్థిక పదకోశం.

      తొలగించండి
    2. అయ్యా ! ఖరయజమాని వైరి సమాసం కాదనుకుంటాను. రెండూ సంస్కృత పదాలే కనుక. యజమాని అనేది సరైనది కాక యజమానుడు సరైనది కావచ్చును. మీరన్నట్లు యజమానుడు అంటే యజ్ఞం చేయించేవాడే కానీ కాలక్రమేణ స్వంత దారుకి, ఓనర్ అనే పదానికి ఇది సమానార్థక మైపోయింది కనుక దానికి అచ్చమైన తెలుగు పదం రాలేదు కనుక నాకు తెలిసినా ఇదే వాడేశాను. పద్యాన్ని ఇలా మారుస్తాను. పరిశీలించండి .
      ఖరమొకటి మగది తన స్త్రీ
      ఖరమును దరి జేరి నాకు- కడు సంతసిలెన్
      ఖరయజమానుడు రజకుడు
      ఖరమొక్కటి నీను తనదు ఖరమని తలచెన్.
      (మూడవ పాదం ఖరమును సాకెడు రజకుడు అని కూడా మార్చవచ్చును)

      తొలగించండి
  24. గరళము గ్రోలిలోకమును గాచిన వాడు దయాసముద్రుడౌ
    పురహరు గొల్వగన్ గలిగె బుత్రుడనంచును బావ యే ననున్
    మురిపెము తోడ బిల్వగను మోదము మీరగ బోయి చంద్రశే
    ఖరమును గాంచినంతమది గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి
  25. కరమగు హంపిని గాంచగ
    మరి మరి కోరిక కలుగును మానస మందున్!
    స్వరములనిడు పాషాణ ము
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ!
    (స్వరములనిడు పాషాణ ముఖరము= సరిగమలను ధ్వనించు రాయి)

    గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
    శ్రీరమణియు నట చదువుల
    సారము నెఱిగిన గుణవతి సరసన పతిగా
    చేరగ, నా సతి వలపుల
    కారాగారమున ఘన సుఖంబులు దక్కున్!

    రిప్లయితొలగించండి

  26. వరములనిడు భోళా శం

    కరునిన్ దర్శించ నేగు కాలంబందున్

    దరి దాపున శ్రీశైల శి

    ఖరమునుగనినంత నాకు గడు సంతసమౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్యాల సవ్వడి'లో మీ సమీక్షలు చూస్తున్నాను. బాగుంటున్నవి. సంతోషం. అలాగే మన బ్లాగులోను సమీక్షిస్తూ నాకు కొంత శ్రమ తగ్గించవచ్చు కదా!

      తొలగించండి
  27. వరముల నొసగెడిశివునికి
    శిరమున శశి బింబమట్లు చిత్రంబుగ యే
    మరువని శ్రీ శైలమున శి
    ఖరమును గనినంత నాకుగడు సంతసమౌ|

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా
    ఆర్యా,నెట్ మొరాయించినందున నిన్నటి సమస్య నేడు స్వీకరించ మనవి.
    గురు లఘు యతి గతి ప్రాసల
    సరసమునౌ పద్య పఠన సరళిని మరువన్
    బెరిగె వి లయ కంఠ ద్ధృతి
    ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ
    భరమగు సంప్రదాయగత బాణియె;పాటల చిత్ర రంగమం
    దరమర లేకకంఠముల నప్పటి కప్పుడె మార్చి పాడు మే
    లరయగ నెంత మోదము హలా!"స్వర మెన్నగ నాది "యన్న నా
    ఖరమును గాంచినంత మది కమ్మనిభావము పొంగులెత్తెడిన్
    ఈ ఉవాచ ఒక చెలిది.చెలికత్తె తో తన మనో భావమును పంచుకున్న తీరిది.ఆధునిక సినిమాలలో గొంతు మరుసటి చరణంలో మార్చటం ముచ్చటగా స్వీకరిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  29. బరువులు మ్రోయుచుండినను భారపు మేతను కోరకుండెడిన్
    పరువులు పెట్టుచుండినను పండుగ కానుక కోరకుండెడిన్
    కరములు నాల్గు యుండినను గాజులు మెండుగ కోరకుండెడిన్
    ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్

    రిప్లయితొలగించండి