26, జనవరి 2017, గురువారం

సమస్య - 2264 (భారత గణతంత్రము...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భారత గణతంత్రము జనభారం బయ్యెన్"
లేదా...
"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"
[జనభారము = జనులకు భారము]
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

 1. కౌరవ పాండవ రణముల
  ధారా వాహిక పురాణ ధారల వోలెన్
  పారా వారమ్ము మహా
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరాభరణ సమస్యా పూరణ ప్రక్రియ:

   రోజంతా ఎదుటనున్న కుర్చీపై కాళ్ళు జాపి సోఫాలో చేరగిలి స్మార్టు ఫోను ఒడిలో ఉంచి తూగుతుండడం. రాత్రి పదకొండున్నర కాగానే లేచి బాత్రూములో నాలుగు మగ్గుల చన్నీటి స్నానం చేసి వేడి వేడి తేనీరు త్రాగి సోఫాలో పద్మాసనం వేసి 12.02 కోసం ఆదుర్దాతో వేచియుండం. పరీక్ష ఘంట కొట్టగానే దడదడ కొట్టే గుండెతో ఆనాటి పరీక్షా పత్రం విప్పడం. ఏమిచేయాలో తెలియక విస్తుపోవడం. రెండు నిమిషాల తర్వాత "వేవురు", "బొలతి" లాంటి పదాల అర్ధాల కోసం గూగులమ్మకు మ్రొక్కడం. ఎలాగో ఒకలా కందాన్ని కానీ తేటగీతిని కానీ కిట్టించి పదిసార్లు గణ యతి ప్రాసలను తనిఖీ చేసి మెల్లిమెల్లిగా మనసులో దణ్ణం పెట్టి "ప్రచురించు" మీట నొక్కి నిట్టూర్పు విడిచి ఏదో ఘనకార్యం సాధించినట్లు భుజాలు ఎగరేసి చల్లటి మజ్జిగ త్రాగి పక్క ఎక్కడం. మెలకువరాగానే రాజేశ్వరి గారూ జిలేబి గారూ ఏమి వ్రాశారో తనిఖీ చేయడం. దినమంతా ఘంటఘంటకీ బ్లాగు తెరిచి పొరిగింటి పుల్లకూరలను రుచిచూస్తూ ఆనందించడం. 11.30 కి శ్రీయుతులు కామేశ్వర రావు గారి పద్యాలను కుంటుకుంటూ చదివి నమస్కరించడం. రాత్రి 11.30 కు మేలుకొని పది మగ్గులు....

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   కొద్ది రోజులుగా మానసిక ఆందోళనలో ఉండి నిర్వేదంలో, నిరుత్సాహంలో మునిగి ఉన్న నా రోగానికి మీ 'పూరణ ప్రక్రియా వివరణ' చక్కని మందులా పని చేసింది. నాలో నూతనోత్సాహాన్ని నింపింది. కర్తవ్యబోధ చేసింది. ధన్యవాదాలు!

   తొలగించండి
  3. శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. హ! హ! శాస్త్రి గారు మనసారా నవ్వించారు! తస్మాదపరిహార్యే౽ర్థే న త్వం శోచితుమర్హసి|

   తొలగించండి


  5. నడిరేయి వేళ గబగబ
   దడదడ లాడుచు సమస్య 'దంగల్ ' గానన్
   గడగడ గణముల పదముల
   సుడిగుండము వోలె వేయుచుంటిమి సుమ్మీ :)

   తొలగించండి

 2. గణతంత్ర దిన శుభాకాంక్షలతో


  సారము మెండుగ గలదౌ
  భారత గణతంత్రము, జనభారం బయ్యెన్
  సారథుల దుష్ట చేష్టల
  తో రాసులుపోసుకున్న తుచ్చులతోడన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా
  హారతులంతర్జాలపు
  బేరాలకు పెట్టుబడుల పేదరికముకున్
  ఘోర రియాయితులకు నీ
  భారత గణతంత్రము జన భారంబయ్యెన్
  సారము లేని సాయములు చాలుకు రూకలబోయు సేద్యముల్
  పౌరుల చేతి సంస్థలకు బారిన విద్దెల బేరసారముల్
  భైరవ యంత్ర జాలముల పైన ఘటిల్లు నుపాధి హీనతల్
  గౌరవమెన్న పెట్టుబడి గవ్వలకమ్మెడి దేశ భావనల్
  భారత దేశమందు జన భారమగున్ గణతంత్రమన్నచో

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  మొదటి పూరణలో"రియాయతులకు" అని సవరించి స్వీకరరించ ప్రార్థన.జర్నలిస్టుల పదము వాడుకగొన్నది.తెలుగు లో అందరికి తెలిసినదే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
   'పేదరికముకు' ... 'పేదరికమునకు' అనడం సాధువు.

   తొలగించండి
  2. డా.పిట్టా
   ఆర్యా, పెట్టుబడుల పేలవమునకున్..అని సరిచేసినాను.కృతజ్ఞతలు

   తొలగించండి
 5. మారెడి పద్ధతు లందున
  దూరని మనదేశభక్తి దూరముగాగా|
  చేరని నాయకులండచె
  భారత గణతంత్రము జనభారంబయ్యెన్|
  2.ప్రేరణ లేని నాయకులపెత్తన మందున స్వార్థ చింతనే
  జేరియు|”లోకులన్న తగు చేరిక లేకను మానవాళికిన్
  కోరిన కోర్కెలన్నియును కొంటెగ మాటల మూటలుంచగా”?
  భారత దేశ మందు జన భారమగున్ గణతంత్ర మన్నచో|  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'అండచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగంచరాదు. 'అండను' (తృతీయార్థంలో ద్వితీయ) అనండి.

   తొలగించండి
 6. కోరుతు నూతన దేశము
  చేరుతు దాయాది చెంత చేటున కాశ్మీర్
  పౌరులు మీరగ హద్దులు
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కోరుచు, చేరుచు' అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
   కోరుచు నూతన దేశము
   చేరుచు దాయాది చెంత చేటున కాశ్మీర్
   పౌరులు మీరగ హద్దులు
   భారత గణతంత్రము జనభారం బయ్యెన్

   తొలగించండి
  3. గురువు గారూ!
   నిన్నటి సమస్యపూరణము దయచేసి చూడగలరు.🙏🏻🙏🏻🙏🏻
   కారడివిన జింకయ్యెను
   మారీచుఁడు ;రక్షకుండు మహిఁ బ్రాణులకున్
   శ్రీరాముని వంచించన్
   కోరగ లంకాధిపతియె కుత్సిత బుద్దిన్

   తొలగించండి
  4. నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది.
   అడవి ఇకారాంత పద్యం. దీనికి ద్వితీయలో 'ని' వస్తుంది. 'జింక+అయ్యెను' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "కారడవిని జింక యయెను" అనండి.

   తొలగించండి
  5. గురుభ్యోం నమః!🙏🏻🙏🏻🙏🏻🙏🏻
   కారడవిని జింకయయెను
   మారీచుఁడు ;రక్షకుండు మహిఁ బ్రాణులకున్
   శ్రీరాముని వంచించన్
   కోరగ లంకాధిపతియె
   కుత్సిత బుద్దిన్

   తొలగించండి
 7. దూర తలంపునన్ జనుల తోడుగ నీడగ నిల్పు భావనన్
  కోరిరి భారతంబునను కూరిమి యీ గణతంత్ర మార్గమున్
  పేరు రిపబ్లికయ్యె--పదవీ చెదలేర్పడె జాతికంతకున్--
  భారత దేశమందు జనభారమగగున్ గణతంత్రమన్నచో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కూరిమి నీ గణతంత్ర...' అనండి. 'పదవీ చెదలు' అనడం దుష్టసమాసం. "పదవీప్సిత మేర్పడె..." అందామా?

   తొలగించండి
 8. అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ....

  క్రూరులు ముష్కరాధములు కూల్చెదమంచు భయంబు జూపగా
  సారెకు బాంబుదాడులను సల్పుచు భీతిని గొల్పు చుండ గం
  భీరత శత్రుసైన్యముల పీచ మడంచెడి యోచనంబుతో
  భారతదేశమందు జన భారమగున్ గణతంత్ర మన్నచో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంజయ్య గౌడ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "భయంబు గొల్పగా" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 9. మైలవరపు మురళీకృష్ణ గారి (వాట్సప్) పూరణ...

  ధీర సమస్త సైన్యగణ దీధితులొక్కట, బాలబాలికా
  తోరణమొక్కచోట , పరితోషిత శాకట పంక్తి యొక్కచో,
  వారలు నేతలందరొకవైపు , కనుంగొన నేత్రపర్వమౌ!
  భారతదేశమందుఁజన భార మగున్ గణతంత్ర మన్నచో !!

  (భారతదేశము! అందుఁ జనన్ భార మగున్ గణతంత్ర మన్నచో !!)

  రిప్లయితొలగించండి

 10. కూరిమి గూర్చు నొరులకును
  భారత గణతంత్రము; జన భారంబయ్యెన్
  కోరని ముష్కర వంచన
  తీరును‌ జూడంగ నేడు దేశమునందున్!

  (సవరణతో)

  రిప్లయితొలగించండి
 11. వీరాగ్రేసర త్యాగము
  చోరాగ్రేసరులపాలి చుట్టంబైనన్
  నీరస పడిపోవుచు మన
  భారత గణతంత్రము జన భారంబయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ఉ.వీరులు త్యాగ శీలురున్ మనకు వేసిరి బాటలు లక్ష్య సిద్ధికై
  వారల చిత్తశుద్ధియే జనుల వైఖరి కావలె సాధనమ్మునన్
  ఊరక సంఖ్య మాత్రమున నున్నతి పొండుట యెట్టులౌనొకో?
  "భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, రెండవ పాదాలలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 13. హారతు లీయ భారత వి
  యత్తల మంతయు కాంతులీన, నా
  వీర జవాను శక్తికిని,
  విశ్వమనోజ్ఞ సమంచిత ప్రభన్
  దీరెడు నాపతాకకును,
  దిక్కుల దీధితు లొప్పి నేడు, నా
  భారతదేశమందు జన
  భారమగున్ గణతంత్ర మన్నచో!

  రిప్లయితొలగించండి
 14. పారావారత్రయ పరి
  వారిత ధరణీ తల పరిపాలక కువ్యా
  పారావగ్రహణకరణ
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్


  వేరుగ బీదసాదలకుఁ బెన్నిధి నింపుగఁ గూర్పు నేర్పులన్
  పేరిమి శాస్త్ర సంకలిత విద్యల సాధ్య పురోభి వృద్ధినిన్
  ధారుణి నున్న దేశముల దౌత్యము నర్మిలి సల్ప నేవిధిన్
  భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో?


  బారియ బీదసాదలకుఁ బండుగ పాలక పంక్తి కిద్ధరం
  జేరవు నిత్య మర్హులకు క్షేమదపుం బథకమ్ము లెల్లయున్
  బారులు తీరి మ్రగ్గినను బన్నుగఁ బొందుదు రస్మదీయులే
  భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో

  రిప్లయితొలగించండి
 15. చోరులు నాయకులై కడు
  ఘోరముగా ప్రజలసొమ్ము కొల్లపఱచగన్
  నేరస్థులపాలుబడిన
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 16. పౌరుల జీవితమ్ములకు భద్రతనిచ్చెదమంచు నాయకుల్
  సారపు నిర్ణయమ్ములను చక్కగఁ జెప్పుచు గద్దెలెక్కుచున్
  నేరములన్ చెలంగుచును, నేర్పుగ దోచజనమ్ముసంపదల్
  భారత దేశమందు జన భారమగున్ గణతంత్రమన్నచో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. వీరోచిత కార్యముల
  స్వారాజ్యంబును గడించి సంబర పడగన్
  పేరాశయె పాలకులౌ
  భారత గణతంత్రము జన భారంబయ్యన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారికి నమస్కారము!
   రెండవ పాదంలో స్వారాజ్యం పదం వల్ల మొదటి పాదం చివరి అక్షరం గురువు అవుతుందనుకున్నాను! కాని స్వ అనేది తెలుగు పదం కనుక గురువు కాదని మా అన్నయ్య ద్వారా తెలిసింది! కనుక నా మార్చిన పూరణ క్రింది విధంగా గ్రహించ గలరు!


   వీరోచిత కార్యమ్ముల
   స్వారాజ్యంబును గడించి సంబర పడగన్
   పేరాశయె పాలకులౌ
   భారత గణతంత్రము జన భారంబయ్యెన్!

   తొలగించండి
  2. "కార్యముల స్వారాజ్యంబును":

   "స్వారాజ్య" సంస్క్రుత పదం. "కార్యముల" తెలుగు పదం. వీటికి సంధి లేదు. అందుకని "ల" లఘువని కామేశ్వర రావు గారు గతంలో ఉవాచ.

   తొలగించండి
  3. తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదములు!!

   తొలగించండి
  4. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. చేరుచు రాజకీయమున చిక్కగ నాపదవీ ప్రతిష్ఠలున్
  కోరుచు వారసత్వమును గుహ్యము గాగ స్వకీయ లబ్ది కై
  పోరున యోధునింబలె నభూతగతిన్ చరియించ నాయకుల్
  భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో

  రిప్లయితొలగించండి
 19. పూరాస్వార్ధముతోడను
  నేరాలకుబాలుపడుచునేతలుమిగులన్
  జూరగొనంగనుసంపద
  భారతగణతంత్రముజనభారంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 20. సర్వులుదాముగానిపుడుశస్త్రచికిత్సలుచేసికోనిచో
  భారతేశదేమందుజనభారమగున్ ,గణతంత్రమన్నచో
  పౌరులచేతనేనికనుబౌరులశ్రేయముగూర్చియేసుమా
  పౌరులకేర్పడెన్నిదియపూర్వపునాయకులెల్లమెచ్చగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పూరా' అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.
   ఉత్పలమాల మొదటిపాదంలో ప్రాస తప్పింది. 'చేసికోనిచో' అని గ్రామ్యం. "చేతనే యికను" అనండి.

   తొలగించండి
 21. 🍀 *శంకరాభరణం*🍀

  🌷 *సమస్య పూరణం* 🌷

  🍀 కవిః- *విరించి* 🍀

  🌷 సమస్యః *భారత గణతంత్రము జనభారం బయ్యెన్*
  లేదా...
  *భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో*

  చోరులవినీతి పరులును
  నేరములనుజేయువారె నేతలు కాగా
  పోరాడి గెల్చు కొన్నను
  భారత గణతంత్రము జనభారంబయ్యెన్

  బారులు తీరిచేరెదరు భారత భాగ్యవిధాత శోకమున్
  గోరుతు, తీవ్రవాదులిట గుట్రలు పన్నగ వాటితోడుగన్
  పౌరులనేలుపాలకుల పాపపు కృత్యములెన్నియో గనన్
  భారతదేశమందు జనభారమగున్ గణతంత్రమన్నచో .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   (మీరు కేవలం పూరణలను పోస్ట్ చేయండి. మిగతా వివరాలు అక్కరలేదు).

   తొలగించండి
 22. మీరిరి కోర్టుల తీర్పులు
  మీరిరి మన చట్ట సభలమేలగు తీర్పుల్
  మీరుచునుండిరి నీతులు
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  --------------------------------------
  ఘోరము కలియుగ వింతలు
  భారత గణతంత్రము జనభారం బయ్యెన్
  తీరము దొరకదు మనసుకు
  సారము లేనట్టి బ్రతుకు జరగదు వెలితిన్
  ---------------------------------

  రెండు రోజులనుంచీ మనసు బాగుండక ఎమీ రాయలేక ఊరుకున్నాను . సోదరులు శాస్త్రిగారి ప్రక్రియ చదివాక రాయాలని పించింది.శాస్త్రి గారు చెప్పింది అక్షరాల నిజం. మాకు పగలు 1.30 కి [లంచ్ తిన్నాక సమస్య చూడటం] [అప్పుడు వస్తుంది]. కాసేపు ఎమీ తోచక తరవాత దెవుణ్ణితల్చుకుని కుస్తీ పట్టడం.గురువులు శంకరయ్యగాగు కనబడక పోతె అదికుడా మానేయ్యడం .ఇదీ దినచర్య . శాస్త్రిగారు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి

 24. పిన్నక నాగేశ్వరరావు.

  నేరస్థులె పాలకులవ

  వీరుల త్యాగంపు ఫలము వృధయై పోగా

  పౌరుల భద్రత కరవై

  భారత గణతంత్రము జన భారంబయ్యెన్.

  ***********************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. వీరుల త్యాగాల ఫలమె
  భారత గణ తంత్రము! జనభారంబయ్యె
  న్నీ రాజకీయమేలెడి
  వారల యవినీతి కూడు పాలన మిచటన్!

  రిప్లయితొలగించండి
 26. భూరిగ,పరిదానములిడి
  నేరములకు దండన లిడ నేరక వారిన్
  సైరించుచు వచ్చిన యీ
  భారత గణతంత్రము జనభారంబయ్యెన్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 27. వర్షము రాని వర్షమున పంటలు బండక నన్నదాతలున్
  హర్ష విహీనులై యమిత యాతన జెందుదు, రప్పుడప్పడున్
  వర్షపు టుగ్ర రూపమున పంటలు నాశన మొందు,నిత్తరిన్
  వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్ర దుఃఖమున్

  రిప్లయితొలగించండి
 28. *సహస్రకవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *కవిమిత్రులారా!*


  *"భారత గణతంత్రము జనభారం బయ్యెన్"*
  లేదా...
  *"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"*

  పోరినవీరులెల్లరటుపోయిరిస్వర్గముచేరనప్పుడే
  దారులజూపిస్వీయగణతంత్రపుపాలనచేకొనంగస
  ర్కారులనున్నవారలకుకాంచకృతజ్ఞతసూన్యమౌటనీ
  *"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో*

  *సహస్రకవిరత్న,కవిభూషణ*
  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 29. బారులు స్మార్టుఫోనులును బంగరు స్మగ్లురు లిండిగోలునున్
  కోరికలన్ని తీర్చెడివి గొప్పటి మాలులు రాహ్లుబాబలున్
  కారులు మేడలున్ క్రెడిటు కార్డులు రాగను నెవ్విధమ్మునన్
  "భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"?

  రిప్లయితొలగించండి