31, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1279 (భ్రూణహత్యలఁ జేయుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును.

30, డిసెంబర్ 2013, సోమవారం

దత్తపది - 36 (చెక్కు-సైను-మనీ-డ్రా)

కవిమిత్రులారా!
చెక్కు - సైను - మనీ - డ్రా
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

29, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1278 (తరుణికి నందమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

28, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1277 (శంకరుఁ డుమ కొఱకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

27, డిసెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1276 (రాముఁడు విన నియ్యకొనఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

26, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1275 (చదువు రానివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
చదువు రానివాఁడు శాస్త్రవేత్త.

25, డిసెంబర్ 2013, బుధవారం

క్రీస్తు జన్మదినోత్సవ (క్రిస్టమస్) శుభాకాంక్షలు!

Jesus_Christ_Image_344.jpg (9880 bytes) 
  సీ. శ్రీదుండు, వరదుండు, చిన్మయాకారుండు
               కరుణామయుండౌట నిరుపముండు,
     మరియాంబ గర్భాన మహితతేజముతోడ
               జన్మించి మానవజన్మములకు
     సార్థకత్వము గూర్చ సవ్యమార్గము నేర్పి
               రక్షకుండాయె నా రమ్యగుణుడు,
     తులలేని క్షమతోడ శిలువ మోసినయట్టి
               మహనీయ చరితుడై యిహమునందు
     ఖ్యాతి కెక్కినవాడు, నీతిమార్గము శిష్య
               కోటి కందించిన మేటి యతడు,
     దేవదూత వచ్చి దైవమై వెలుగొంది
               విశ్వమందంతట వెలుగునింపె
     పరిశుద్ధమై యొప్పు భగవదర్చనమందు
               బుద్ధినిల్పుండంచు భూజనాళి
     కందించి సందేశ మవనివారలకెల్ల
               పాపాలు నశియించి తాపముడుగు
     బోధనంబులు చేసి పుణ్యకార్యములందు
               నండగా నిల్చినయట్టి ఘనుడు
     శాంతికాముకుడౌచు సంతతానందంబు
                జగతికి బంచిన సాధుశీలి
     నాల్గువార్తలలోన నానావిధంబుగా
               కీర్తింపబడిన సన్మూర్తి యతడు
     శిలువకాహుతియౌచు జీవనంబును వీడి
               మరలజీవంబందు గురువరుండు
 తే.గీ.  సుజనవర్యుండు, శుద్ధాత్మ, సుగుణధనుడు,
         త్యాగమయజీవి, శ్రేష్ఠుడౌ యోగి నిజము
         లోకకల్యాణకార్యంబు స్వీకరించు
         ధన్యుడింకేమి సర్వథా మాన్యుడతడు.

తే.గీ.  ఏసుక్రీస్తంచు ప్రజలంద రింపుమీర
         నంజలించెడి ఘనుడాత డమరవరుడు
         భువిని క్రైస్తవధర్మంపు పవనములను
         వీచగాజేసి పుణ్యాత్ముడౌచు వెలిగె.

తే.గీ.  అతని దైవాంశ సంభూతు నహరహమ్ము
         తలచుచుండుచు తద్దత్త ధర్మమార్గ
         మనుసరించెడివారికీ యవనిలోన
         నలఘు సౌభాగ్యసంపత్తి కలుగు గాత.

సీ.   క్రీస్తు జన్మపువేళ వాస్తవంబైనట్టి
                   హర్షమందెడివారలందరకును
       క్రిస్మసాఖ్యంబిద్ది యస్మదీయంబైన
                    పర్వరాజంబంచు బహుళగతుల
       నంబరంబును దాకు సంబరంబులు చేసి
                     మోదమందెడు విశ్వ సోదరులకు
        క్రైస్తవంబును బూని కమనీయచరితులై
                     జగతిలో చరియించు సన్మతులకు
తే.గీ.   క్రీస్తు కనుయాయులౌచు సతీర్తినంది
          సంఘసేవానురక్తులై సర్వగతుల
          ఖ్యాతినందుచు నుండెడి క్రైస్తవులకు
          కావ్యమయమైన సత్ శుభాకాంక్షలిపుడు.
రచన :
హరి వేంకట సత్యనారాయణ మూర్తి

సమస్యాపూరణం - 1274 (క్రిస్మస్ నాఁ డవతరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
క్రిస్మస్ నాఁ డవతరించెఁ గృష్ణుఁడు భువిపై.

24, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1273 (కర్ణపేయమ్ముగాఁ బాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

23, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1272 (భువిని శాత్రవు లెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

22, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1271 (మాతను బెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
మాతను బెండ్లియాడి జనమాన్యుఁ డనంబడి పొందె సన్నుతుల్.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

21, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1270 (తాపసులకుఁ బూజ్యుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

20, డిసెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1269 (కట్టుఁ డేనుఁగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కట్టుఁ డేనుఁగున్ వెంపలిచెట్టునకును.

19, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1268 (కప్పను గాపాడె నొక్క)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కప్పను గాపాడె నొక్క కాకోదరమే.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

18, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1267 (తరువులఁ బడఁగొట్ట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య.
ఈ సమస్యకు స్ఫూర్తి మొన్నటి బెంగుళూరు భువనవిజయంలో ఇచ్చిన సమస్య.

17, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1266 (పదవీ విరమణము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పదవీ విరమణము గొప్ప వర మగునుగదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

16, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1265 (హనుమంతుఁడు పూజనీయుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

15, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1264 (సంజ నిద్దుర చేకూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సంజ నిద్దుర చేకూర్చు సంపదలను.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

14, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1263 (సుర లసురులు గూడి రొకట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

13, డిసెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1262 (ముఱుగు కూపమున మునుఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ముఱుగు కూపమున మునుఁగ ముక్తి గల్గు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12, డిసెంబర్ 2013, గురువారం

(టివిడాల్) వేంకటేశ్వర సుప్రభాతము


(టివిడాల్) వేంకటేశ్వర సుప్రభాతము
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

మత్తకోకిల:
మేలుకో కమలా మనోహర! మేలుకో పురుషోత్తమా!
మేలుకో సరసీరుహేక్షణ! మేలుకో మధుసూదనా!
మేలుకో భువనాధినాయక! మేలుకో శుభదర్శనా!
మేలుకో హరి! సుప్రభాతము మేలుకో టివిడాల్ పతీ!

తరలము:
సరసిజాప్తుడు కన్నువిందుగ స్వర్ణదీప్తుల జొక్కగా
కరము వెల్గె జగమ్ము లెల్లను కంజముల్ వికసించె నో
పరమ పూరుష! నీదు సేవకు వచ్చిరొప్పుగ వేలుపుల్
సురవరస్తుత! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

విజయ భూషణ! పాడుచుండిరి వేదసూక్తుల భూసురుల్
గజవరావన! నిన్ను గొల్వగ కంజజుం డరుదెంచె నో
త్రిజగదీశ్వర!  పద్మినీప్రియ! దివ్య మంగళ విగ్రహా!
సుజనపాలక! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

నిగమ శీర్ష వనీవిహార! వినీల గాత్ర సుశోభితా!
ప్రగతి దాయక! దేవ దేవ! శుభంకరా! కరుణాకరా!
ఖగవరాంచిత వాహనా! శ్రిత కల్పభూరుహ! శ్రీధరా!
సుగుణ రాజిత! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

శుభ గుణోజ్జ్వల! పుష్కరేక్షణ! సూరిబృంద సువందితా!
అభయదాయక! భక్త లోక సమర్చితాంఘ్రి సరోరుహా! 
త్రిభువనాధిప! శిష్టరక్షక! శ్రీరమారమణీ ప్రియా!
శుభ నికేతన! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో 

సమస్యాపూరణం - 1261 (శలభంబుల్ బడబాగ్ని నార్పె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్ము వెల్గొందఁగన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

11, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1260 (కారమె సుఖశాంతు లొసఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కారమె సుఖశాంతు లొసఁగు కష్టముఁ దీర్చున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

10, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1259 (గంగానది తెలుఁగునాఁట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
గంగానది తెలుఁగునాఁట గలగల పాఱున్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

9, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1258 (భక్తి లేనివాఁఢు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భక్తి లేనివాఁఢు పరమ భక్తుఁఢు గద!
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

8, డిసెంబర్ 2013, ఆదివారం

నెల్సన్ మండేలాకు నివాళి

నెల్సన్ మండేలాకు నివాళి
విశ్వమాత కనుల వెంట దుఃఖాశ్రువుల్
కారు చుండె గనుడు ధారగాను
నల్ల జాతి వెలుగు నవ్వుల సూరీడు
గ్రుంకె నన్న వార్త క్రుంగ దీసె.

జాత్యహంకార ప్రభువుల జాడ్య మేమొ
సాటి మానవుల యెడన్ జాలి లేక
నల్ల వారని హింసించి తెల్లవారు
బానిసల జేసి రక్కటా బాధపెట్టి.

పెద్ద సంఖ్యలో నుండియు పేదవారు
నల్ల వారైన కతమున నాణ్యమైన
బ్రతుకు తెరువును పొందక పరువు మాసి
దొరల కాళ్ళను పట్టెడి దుర్గతేల.

కలల నైన తమకు కార్లు సౌధమ్ములు
కోరినారె వారు కూటి కొఱకు
మోము వాచి పసుల పోలిక గొలుసుల
బంది లగుచు మ్రగ్గు బ్రతుకదేల..

వారును కారె మానవులు వారికి నాకలి దప్పులుండవే
వారి నరాల పారు రుధిరమ్మరుణమ్మది కాదె వారినిన్
క్రూరత జేసి బానిసల, కొద్ది జనుల్ తెలుపైన వారిలన్,
దూరుచు నంట రారనుచు ద్రోహము జేతురె ఘోర మక్కటా.

వర్ణవివక్షకున్ భరత వాక్యము పల్కిన గాని గుండెలో
నర్ణవ మైన వేదనకు నంతము లేదని యెంచి దీక్షతో
పర్ణములే భుజించి తపమున్ పచరించెడు మౌని పోలికన్
నిర్ణయ మూని డెందమున నీవు తపించితివయ్య మండెలా.

దేశ ద్రోహి వటంచు తెల్ల ప్రభువుల్ తీర్మానమున్ జేసినన్
లేశంబైనను జాలి లేక యొక జైలే సృష్టిగా మార్చినన్
ఆశల్ జూపిన గాని లొంగ వకటా ఆత్మీయ జాత్యర్థమై
క్లేశంబుల్ భరియించి నావు జన సంక్షేమంబు కై దీక్షతో.

యౌవన మంతయు జారిన
నే వెల్గులు లేని రీతి నిరుకగు జైలున్
చేవ నశింపక పోరిన
యో వీరా నిన్ను దలతు నుల్లము పొంగన్.

పండెను నీకల! నలుపుల
గుండెల చల్లారె మంట! కూరిమి నేళ్ళున్
నిండెను నూరును దొరలకు,
మండేలా! వందనములు, మరిమరి నుతులున్.

భువిని విడచి పెట్టి దివికి నీవేగినన్
నీదు పోరు బాట నిలిచి చూపు
మంచి మానవత్వ మెంచగ విజయమ్ము
నొందు దారి మాకు నో మహాత్మ!

రచన
దువ్వూరి వి.యన్. సుబ్బారావు (మిస్సన్న)

సమస్యాపూరణం - 1257 (రామునిం జంపె రణమున రావణుండు.

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రామునిం జంపె రణమున రావణుండు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

7, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1256 (భ్రష్టుండగువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. 

6, డిసెంబర్ 2013, శుక్రవారం

టివిడాల్ వేంకటేశ్వర స్తోత్రము


టివిడాల్ వేంకటేశ్వర స్తోత్రము
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు.
శ్రీ వల్లభాయ కరుణారస సాగరాయ
దామోదరాయ శరణాగత వత్సలాయ |
విశ్వాయ విశ్వగురవే పురుషోత్తమాయ
ధాత్రే నమోస్తు టివిడాల్ నిలయాయ తుభ్యం || 

శ్రీకేశవాయ వరదాయ జనార్దనాయ
నారాయణాయ సరసీరుహ లోచనాయ  |
పద్మావతీ హృదయ వారిజ భాస్కరాయ
పాత్రే నమోస్తు టివిడాల్ నిలయాయ తుభ్యం ||

ధ్యాయామి భక్తవరదం హృది వాసుదేవం
మౌనీంద్ర బృంద వినుతం కమలాసమేతం |
బ్రహ్మేంద్ర ముఖ్య సుర పూజిత పాదయుగ్మం
బ్రహ్మాండనాయక మహం కరుణా సుధాబ్ధిం ||  


శ్రీనివాసాయ దేవాయ
గోవిందాయ నమోనమః |
పద్మావతీ హృదీశాయ
వేంకటేశాయ తే నమః ||

సర్వ లోకాధినాథాయ
సచ్చిదానంద మూర్తయే |
వేదవేదాంత వేద్యాయ
వేంకటేశాయ తే నమః ||

సత్యాయ వేదవేద్యాయ
నిత్యాయ పరమాత్మనే |
దివ్యాయ పద్మనాభాయ
వేంకటేశాయ తే నమః ||

సంకర్షణాయ శాంతాయ
వాసుదేవాయ విష్ణవే |
ప్రద్యుమ్నాయ ముకుందాయ
వేంకటేశాయ తే నమః ||

విశ్వమోహన రూపాయ
కళ్యాణ గుణ సింధవే |
మేఘశ్యామల గాత్రాయ
వేంకటేశాయ తే నమః ||

సమస్యాపూరణం - 1255 (పాండు కుమారులు నలుగురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.

5, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1254 (పాలను గ్రోలిన మనుజుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్.

4, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1253 (సైంధవుఁడు చంపె భీముని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సైంధవుఁడు చంపె భీముని సమరమందు.

3, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1252 (కాలచక్రము నాఁపుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కాలచక్రము నాఁపుట కడు సులభము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

2, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1251 (పిట్టకూఁతకు దిశలెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పిట్టకూఁతకు దిశలెల్ల బిట్టు వడఁకె.

1, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1250 (కాల కూట విషము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కాల కూట విషము మేలు జేయు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.