1, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1250 (కాల కూట విషము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కాల కూట విషము మేలు జేయు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. కలియు గమ్ము నందు గలవు వింతలు మెండు
  మనుజ రూప మున్న దనుజు లంట
  మాయ జాల మేయు మౌని వరుల కంటె
  కాల కూట విషము మేలు జేయు

  రిప్లయితొలగించండి


 2. అమృతమందకుండ నందెగా హతవిధీ !
  కాల కూట విషము, మేలు జేయు
  మనుచు మ్రొక్కగాను దనుజులు సురలును
  గ్రోలి దాని జగతి శూలి బ్రోచె.

  రిప్లయితొలగించండి
 3. మ్రింగు మనియె సర్వ మంగళ పతి జూడ
  కాల కూట విషము, మేలు చేయు
  ప్రజల కనియు నమ్మి పరమేశు తాళిని
  ఆది దంపతులకు నంజలిడుదు

  రిప్లయితొలగించండి
 4. గౌరి తాళి మహిమ కనిపించె జనులకు
  ' గరళకంఠ ' పేరు హరుని జేరె
  అమృతమయపు ప్రేమలందెగా జగతికి
  ' కాల కూట విషము మేలు జేయు '

  రిప్లయితొలగించండి
 5. పాల కడలి జిలుక బయటపడ్డ విషము
  భయముగొల్పుచుండె ప్రజల కెల్ల
  శివుడు స్వీకరించ జీవజాతులకెల్ల
  కాలకూటవిషము మేలు జేయు

  రిప్లయితొలగించండి
 6. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  విరుపుతోను విరుపు లేకుండాను చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  "మ్రింగెడి వాఁడు విభుం డని
  మ్రింగెడిది గరళ మనియును మే లని ప్రజకున్
  మ్రింగు మనె సర్వమంగళ
  మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో?"
  పోతన పద్యభావాన్ని చక్కగా పూరణకు వినియోగించుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. గురువు గారికి, కవి మిత్రులందరికీ నమస్సులు.

  సుధను పాల సంద్ర మధనమ్ము వేళలో
  కూరి వెడలె కాల కూట విషము
  మేలు జేయుమనుచు వేలుపులు ప్రార్థింప
  గళమునందు శివుడు గట్టె విషము.
  (గట్టె = ధరించెను)

  రిప్లయితొలగించండి
 8. అమృతోత్పాదన సమయంలో సురాసురులు:

  శరణు శరణు పాహి శంకర! పరమేశ!
  భక్తలోక పాల! భయము గల్గె
  తాప మధిక మాయె దయతోడ మ్రింగుము
  కాల కూట విషము, మేలు జేయు.

  రిప్లయితొలగించండి
 9. మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందని నా సలహా.
  ‘సుధను గోరి వార్ధి మధియించు వేళలో"
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు

  అందమహము గల్గు నన్యదేశపుటాలి
  కన్నసొంత కులపు కన్నె మేలు
  బానిసత్వము లోన పడుపు కూటి కన్న
  కాలకూట విషము మేలు సేయు

  రిప్లయితొలగించండి
 11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ఆ పాదానికి నా సవరణ...
  ‘బానిసత్వమందు పడుపు గ్రాసము కన్న’

  రిప్లయితొలగించండి
 12. ఔషధమ్ములోన నల్పమ్ము కలిపిన
  రోగి బాధ తీర్చిభాగు పరచి
  ప్రాణ దాన మొసగి బ్రాణాoతకంబైన
  కాల కూట విషము మేలు జేయు.

  రిప్లయితొలగించండి
 13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. అమిత బాధలనిడు నట్టి వ్యాధుల కంటె
  కాలకూట విషము మేలు చేయు
  దైన్య హైన్య భరిత దారిద్ర్యముల కంటె
  కాలకూట విషము మేలు చేయు

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

  శ్రీ నేమాని గురుదేవులు శుభయాత్ర జేయుచూ మమ్ము ఆనందింప ప్రార్థన!
  అందరి పూరణలు అలరించు చున్నవి. అందరికీ ధన్యవాదములు
  కలియుగ రోగములకు భయంకరమైన విషములను వాడు చున్నారు!

  ===============*=================
  కలియుగమున గలవు కఠిన రోగమ్ములు,
  ఘోర కీటకములు, చోర తతులు,
  గూల్చి ధరణిజులకు గూర్మి నొసగ నేడు
  కాల కూట విషము మేలు జేయు!

  కాలకూటమును జూచి సురలు, దానవులు పరుగులిడగ శ్రీ హరి
  =========*================
  పాల సంద్రమునను పాలించు శ్రీ పతి !
  బలికె నంత మీకు భయము వలదు
  కాల కూట విషము మేలు జేయు నమృత
  ము నొసగు నిటులనె సముచితముగను!
  శివునితో శ్రీహరి
  =========*===========
  జగతి యందు లేడు శశిధర! నీవంటి
  మేలు కోరు వాడు, పాల వలెను
  ద్రాగి గావ వలెను ప్రమధాధి పతి నీవు
  కాల కూట విషము మేలు జేయు!

  కీడు వేడి యనుచు గిరిధర! శంకరా!
  కాల హరణ జేయ శూల పాణి
  ధరణి భస్మమగును ! ద్రాగిన యిప్పుడే!
  కాల కూట విషము మేలు జేయు!

  రిప్లయితొలగించండి
 16. పూజ్యగురుదేవులు శంకకయ్యగారికివందనములు గణభంగమునకు చింతిస్తున్నాను సవరణకు కృతజ్ఞతలు
  మరియోకపూరణ

  కాఫి టీలు కల్లు గంజాయి బీరును
  బ్రాంది విస్కి త్రాగి డ్రగ్సు తినుచు
  నరక బాధ లిడిన మరణము కన్నను
  కాలకూట విషము మేలు జేయు

  రిప్లయితొలగించండి
 17. శ్రీ తిమ్మాజీ రావుగారు గారూ,
  మీ పూరణ బాగుంది

  రిప్లయితొలగించండి
 18. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
  అమృతమునకు ముందు నావిర్భవించెను
  కాలకూటవిషము;మేలుజేయు
  గొఱకు శివుడు కరుణ మెరయ తా గ్రోలెను
  ముజ్జగములు నాశ మొంద కుండ

  రిప్లయితొలగించండి
 19. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి
  వందనములు

  మరియొక పూరణ
  "అమృతమస్తు';యనుచు ఆరగి౦పంగను
  కాలకూటవిషము మేలు సేయు
  ఆలసించిన౦త నమృతమైనను గాని
  హాహలమ్ము యౌచు హాని జేయు

  రిప్లయితొలగించండి
 20. శ్రీహరి తో శివుడు
  =============*===================
  ౫. కూట విషము మేలు జేయు ననుచు
  బలుకు చుంటి వేమి పరమ పురుష!
  పాల వలెను ద్రాగు పగిది దెలుపు మయ్య!
  యవని భరము మ్రొయు నాది దేవ !

  కౌలు రైతులు
  ============*===========
  ౬. వారమున కొక్క కష్టము వచ్చి పడగ
  కౌలు రైతుల కెల్లను కాల కూట
  విషము మేలు జేయును గద, విశ్వనాధ!
  మేలుకోరి యిమ్మువడిగ ! శూలపాణి!

  రాజకీయ నాయకుడు మనమున దేవునితో
  =============*========
  ౭. వేలుపు బలుకులను వినక యుండెను నేడు
  జనుల దరికి బోవ పనులు మాని
  తరుము చుండె జూడు, దారి గనని మాకు!
  కాల కూట విషము మేలు జేయు!

  రిప్లయితొలగించండి
 21. విషపు సర్పతతులు విషయవాసనలగు ,
  హరణజేయు "శక్తి" యారు యరులు-
  చావు పుటుక కన్న సంసారులకు నెల్ల
  కాల కూట విషము మేలు జేయు.

  రిప్లయితొలగించండి 22. చాల భీతి గొల్పు జ్వలియించుచున్నట్టి
  కాలకూటవిషము;మేలుజేయు
  మనగ దాని మ్రింగి యఖిలలోకమ్ముల
  బ్రోచె హరుడు దయను పుణ్యమూర్తి.

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ ఏడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘అమృతమస్తు’ పూరనలో ‘అస్తు + అనుచు’, ‘హాహలమ్ము? + ఔచు?" అన్నప్పుడు యడాగమం రాదు. ‘అమృతమ స్తటంచు, హాలహలము నగుచు’ అని నా సవరణ.
  *
  శ్రీ భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అమృతమునకు ముందె యావిర్భవించెను’ అనండి.
  అన్నట్టు మీ ఇంటిపేరు శ్రీభాగవతుల, భాగవతుల.. ఈరెంటిలో ఏది?
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పుటుక’ శబ్దం సాధువు కాదనుకుంటాను.
  *
  కమనీయం గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వందనములు మీరుచేసిన సవరణలకు ధన్యవాదములు

  వరప్రసాడుగారికి నా పూరణ మీకునచ్చినందుకు
  ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 25. గురువుగారూ,
  ధన్యవాదాలు. పుట్టు " సాధువే అనుకుంటున్నా.
  చావు పుట్టులున్న అని సవరిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 26. హరిని మరువని భక్త ప్రహ్లాదులకును -
  సృష్టి సత్యాల దెలుపు సోక్రెటిసులకును -
  శ్రేష్ఠులకు సేవలిడు కులశేఖరులకును -
  లీల - కాల కూట విషము మేలు జేయు!

  రిప్లయితొలగించండి
 27. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  ధన్యోస్మి! చాలా కాలానికి నన్ను కరుణించారు.
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. అన్ని పద్యాలు అలరిస్తున్నాయి . అందరికీ ధన్యవాదాలు / నమస్కారాలు.

  హోమియోపతి వైద్యంలో పాము విషంతో కాన్సర్, హృద్రోగాలకు మందులు తయారౌతాయి. వీటిపై ఎవరైనా పద్యం చెప్పవలసిందిగా ప్రార్థన

  రిప్లయితొలగించండి
 29. రమణ గారూ,
  ధన్యవాదాలు.
  ప్రాణహానిఁ జేయు పాము విషముతోడ
  పుట్టకురుపు మట్టుబెట్టునట్టి
  మందుఁ జేసెదరను మాట విందుము గాదె
  కాలకూటవిషము మేలుఁ జేయు.

  రిప్లయితొలగించండి
 30. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కాలకాలుని కరుణ :

  01)
  _______________________________

  పాలకడలిని చిలికెడి - కాల మందు
  కాలకూటము దిశలెల్ల - కమ్ముకొనగ
  కాలకాలుని వేడుచు - గావు మనిన
  కంఠమందున బంధించె - కరుణ గలిగి
  కాలకూట విషము; - మేలు జేయు
  నీలకంఠుడు జగతికి - నిక్కువముగ !
  _______________________________

  రిప్లయితొలగించండి