16, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1265 (హనుమంతుఁడు పూజనీయుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. వినుడీ విభీషణుని పా
    లనమున రాక్షస గణములు లంకానగరిన్
    వినయాఢ్యు లైరి యయ్యెడ
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  2. హను మంతుడు బలవం తుడు
    పనుపున సీతను కనుగొని ప్రణ మిల్లె ధరన్
    వినయముగ త్రిజట దలచెను
    హను మంతుడు పూజ నీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  3. తను వెదకి సీత జాడను
    వినుతించిన రామ చంద్రు వీరత వలనన్
    గను మూయగ నసుర గణము
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  4. ఘన వాయు పుత్రుడెవ్వరు ?
    కన గురువన్న వాడు కానగునెదియో ?
    విన శుక్రుడెవరి గురువగు ?
    హనుమంతుడు, పూజనీయు, డసురుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    చక్కని పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘హనుమంతుడు శ్రీరాముని/ పనుపున...’ అంటే ఇంకా బాగుంటుందేమో!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘కన గురువైనట్టివాడు...’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  6. మాస్టరు గారూ ! ధన్యవాదములు.. మీరు చూపిన దోష సవరణతో...

    ఘన వాయు పుత్రుడెవ్వరు ?
    కన గురువైనట్టివాడు కానగునెదియో ?
    విన శుక్రుడెవరి గురువగు ?
    హనుమంతుడు, పూజనీయు, డసురుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి నమస్సులు. ఒక ప్రయోగము మాత్రమే. తప్పైతే తెలుపగలరు. మరియొక ప్రయత్నము చేస్తాను.

    అనితరసాధ్యాసాధ్యము
    లనిచూడక జలధి దాటి యవనిజ యునికిన్
    కనుగొన్న మేటి ధీరుఁడు
    హనుమంతుడు పూజనీయుడ, సురులకెల్లన్.


    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    =============*==============
    అనిశమ్ము రామ నామము
    ఘనముగ బలికి,వశి తోడ గలబడి రణమున్
    కొన సాగించిన ధీరుడు,
    హనుమంతుడు పూజనీయుడ సురులకెల్లన్.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ ప్రయోగం ప్రశంసనీయమైనది. సరియైనదే. ‘పూజనీయుడే’ అనే అర్థంలో ‘పూజనీయుడ’ అని ప్రయోగించవచ్చు. చక్కని పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. వినుమనిలాత్ముండనగను,
    కనుమీ ధరయందు గురవ గౌరవ నీయుం,
    డనలాంబకుడే దైవము,
    హనుమంతుడు, పూజనీయు, డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    విభీషణుని హితవు

    వనచర విభుడగు సుగ్రీ
    వుని మంత్రియునినకులోద్భ వుడు దశరథ రా
    ముని దూతగ నేతెంచిన
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    అని తన రూపము మార్చక
    హనుమ రణమునందు గూల్చె నసురుల వారా
    యని మార్చియు తునియలయిరి
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    మరొక పూరణ

    హనుమొక్కడు నుక్కడచగ
    వని పెక్కురు రక్కసులకు వహ్ని రగిల్చెన్
    గని యసురులు ఱిచ్చ వడిరి
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  13. విను డం దరి భక్తులకును
    హనుమంతుడు పూజ నీయు, డసురుల కెల్లన్
    ననయము దడ గలి గించును
    హనుమంతుని బేరు వినిన నార్యా ! యెపుడున్

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీ పద్యానికి కొన్ని సవరణలు...
    విను మనిలాత్మజు డనగను,
    కనుమీ ధరయందు గురువు గౌరవనీయుం,
    డనలాంబకుడే దైవము,
    హనుమంతుడు, పూజనీయు, డసురుల కెల్లన్
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    కాని పూరణ సమర్థనీయంగా ఉన్నట్టు లేనట్టుంది.

    రిప్లయితొలగించండి
  15. సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘అసురుల కెల్ల/ న్ననయము’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు

    మొదటి పాదములో రెండవ పాదములో మీరు చేసిన సవరణకు ధన్యవాదములు. కాని
    రెండవ పాదములో ' గురవ' ను గురువు గా సవరించారు. 'గురువ' అను పదమును 'గురువే '
    అను అర్థముతో వ్రాశాను. దయచేసి వివిరించ ప్రార్థన .

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మినారాయణ గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యంలో ‘గురువ’ అని కాకుండా ‘గురవ’ అని పొరపాటున టైపు చేశారు. ‘గురువ’ అని ఉంటే నేను సవరణ చేసేవాడిని కాదు.

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    మరియొకపూరణ
    దనుజుల కారాధ్యుండగు
    త్రినేత్రుడౌ పరమశివుని దివ్యాంశమునన్
    జనియించినట్టి కపివరు
    హనుమంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  19. కనికరమును జూపగలుగు
    ఘనుడాతడు; కోర నభయకరమును దయతో
    గనునను యరియమి గాదా?
    హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.
    మూడవ పదాన్ని ‘జనియించిన కపివరుడగు’ అంటే అన్వయం చక్కగా కుదురుతుందని నా సలహా.

    రిప్లయితొలగించండి
  21. దనుజుల లంకను గాల్చగ
    హనుమంతుని బలము గన్న యసురులు మదిలో
    వినుతించి రతని బలమును
    హనుమంతుడు పూడనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    గనునను యరియమి ?
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొకపూరణ

    దనుజుల గురువగు భృగునం
    దనుబోధల ననుసరించి దశకంఠుడు తా
    నొనరించె తపము వృషవా
    హను మంతుడు పూజనీయు డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ,
    దయతో గనును " అనుట; యరియమి = తెలియకపోవుట
    దయతో గనే దైవమని వారికి తెలియదు గానీ హనుమంతుడందరికీ పూజనీయుడే అని చెప్పదల్చినాను. కానీ అన్వ యం సరిపోయినట్టు లేదు. మరల ప్రయత్నిస్తాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. కనికరమును జూపగలుగు
    ఘనుడాతడు; కోర నభయకరమును దయతో
    గని యిడునని తెలుసుకొనుము-
    హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  26. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ కొంత సందిగ్ధతను కలిగిస్తున్నది. ‘వృషవాహను మంతుడు"...?
    *
    లక్ష్మీదేవి గారూ,
    అది ‘అరయమి’. ఆ పాదాన్ని ‘గను నను నరయమి గాదా" అంటే సందేహాలకు తావుండదు.
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    రామునితో సురలు
    ============*==============
    ఘనమైన రామ నామము
    దనరుచు రుచి గాంచి నట్టి దనయుడు దేవా !
    యనుమాన మిక వలదు నీ
    హనుమంతుడు పూజనీయుడ సురులకెల్లన్.

    రిప్లయితొలగించండి
  28. వనమున దావానలమది
    ఘనమగు తరువులను మాడ్చి గరువము బెంచు
    న్నొనరగ లంకను కాల్చిన
    హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి


  29. విను రాముని భక్తుడుగద
    హనుమంతుఁడు ! పూజనీయుఁ డసురుల కెల్ల
    న్ననఘా లంకేశ్వరుడౌ
    మనసీతమ్మను జిలేబి‌ మాయన్ దేల్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. గరువుగారకి నమస్కారం.
    నా సమస్యాపూరణం:

    అని లంకాపురి దనుజుల/
    దునిమి జనన మరణ చక్ర దుఃఖము బాపెన్/
    అనఘు డనిలాత్మజుండగు/
    హనుమంతుడు వందనీయు డసురుల కెల్లన్.

    అయ్యా! ఇది నా తొలి కంద పద్య రచన.
    ఈ పద్యంలో నా భావం:
    రాక్షసులు శివభక్తులు. హనుమంతుడు శివాంశ సంభూతుడు. ఆయన చేతిలో మరణించిన అసురులకు శివసాన్నిధ్యం లభించి జన్మరాహిత్యం పొందుతారు కనుక వారందరికీ హనుమంతుడు వందనీయుడు.
    ఈ పద్యం పై మీ అభిప్రాయం, అమూల్యమైన సూచనలు తెలియజేయమని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారకి అని పొరపాటుగా టంకణమైనది.
      గురువు గారికి అని గ్రహించమని మనవి.

      తొలగించండి
    2. పై పద్యం వ్రాసిన నా పేరు ఇవటూరి శంకర రావు గా ప్రచురించమని మనవి.

      తొలగించండి
  31. పై పద్యాన్ని మరొక విధంగా కూడా మార్చి సమర్పిస్తున్నాను.

    అని లంకాపురి దనుజుల/
    దునిమి జనన మరణ చింత తొలగంగా జే/
    సిన శంకర తేజుండగు/
    హనుమంతుడు వందనీయుడసురులకెల్లన్.

    రిప్లయితొలగించండి
  32. తనువున డెంగిని తెచ్చెడి
    ఘనమగు దోమల కిరవయి గందరగోళౌ
    వనమును గాల్చిన వీరుడు
    హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్

    రిప్లయితొలగించండి