5, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1254 (పాలను గ్రోలిన మనుజుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్.

22 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా !
  ముందిది చదవండి


  గో ఘోష

  రచన : సుబ్బారావు
  సంగీతం మరియు గానం : ఘంటసాల

  (1) || తేటగీతి ||
  తూర్పు దిశ యందు సూర్యుండు - తొంగి చూడ
  నిదుర మేల్కాంచి ఆనాడు - నేను , వేగ
  పాలు పితుకంగ గోమాత - పాలి కరుగ
  పల్కె నిట్టుల నేత్ర బా - ష్పములు కురియ

  (2) || ఉత్పలమాల ||
  మా మగవారు , మీ రనెడి - మాటల నెల్ల సహించి నేర్పుతో
  భూమిని దున్నకున్నెడల - పొట్టలు నిండునె ? అట్టి మా పయిన్
  తామస మేల మీకు ? ఇది - ధర్మమె ? క్రూరపు బుద్ధితోడ మ
  మ్మీ మహి లోన గొట్టెదరు ! - మీ నర జాతికి జాలి యున్నదే ?

  (3) || ఉత్పలమాల ||
  పాలును త్రాగుమా చిరుత - పాపల జూచి సహింప లేక , న
  వ్వాలుకు ద్రోసి వేసియు చి - వాలున మా చనుబాలు పిండి , కం
  చాలను పోసి త్రావెదరు - చల్లగ , బొజ్జలు నిండ మీరు , మ
  మ్మేలను హింస బెట్టెదరు ? - మీ నర జాతికి జాలి యున్నదే ?

  (4) || తేటగీతి ||
  అంబ అంబా యటంచును - ఆకటి కిని
  అరచు మా బిడ్డలను గాంచి , - ఆత్మ లోన
  పాప మని సుంత యైనను - పలుక బోరు !
  జాలి లేనట్టి వారు మీ - జాతి వారు

  (5) || తేటగీతి ||
  కండ లందున్న సత్తువ - కరుగు నంచు
  భయము చే మీదు తల్లులు - పాలు నిడక
  యున్న తరి , మిమ్ము జూసి మే - మోర్వ లేక
  ప్రేమ తో మాదు పాలిడి - పెంచి నాము

  (6) || తేటగీతి ||
  బుద్ధు డుదయించి నట్టి యీ - భూమి లోన
  కలిగి నారలు మీకేల - కరుణ లేదు ?
  ఆ మహాత్ముడు నడచిన - అడుగు జాడ
  మాసి పోలేదు చూడుడీ - మహిని మీరు

  (7) || తేటగీతి ||
  అనుచు ఘోషించు చున్న ఆ - యమ్మ గాంచి
  కఠినమౌ నాదు హృదయమ్ము - కరగి పోయి
  చింత తో నే నికేమియు - జేయ లేక
  తిరిగి వచ్చితి యింటిలో - తెలియ జేయ

  (5) || తేటగీతి ||
  కండ లందున్న సత్తువ - కరుగు నంచు
  భయము చే మీదు తల్లులు - పాలు నిడక
  యున్న తరి , మిమ్ము జూసి మే - మోర్వ లేక
  ప్రేమ తో మాదు పాలిడి - పెంచి నాము

  (6) || తేటగీతి ||
  బుద్ధు డుదయించి నట్టి యీ - భూమి లోన
  కలిగి నారలు మీకేల - కరుణ లేదు ?
  ఆ మహాత్ముడు నడచిన - అడుగు జాడ
  మాసి పోలేదు చూడుడీ - మహిని మీరు

  (7) || తేటగీతి ||
  అనుచు ఘోషించు చున్న ఆ - యమ్మ గాంచి
  కఠినమౌ నాదు హృదయమ్ము - కరగి పోయి
  చింత తో నే నికేమియు - జేయ లేక
  తిరిగి వచ్చితి యింటిలో - తెలియ జేయ

  || సమాప్తం ||

  రిప్లయితొలగించండి
 3. దాని నిక్కడ వినండి

  http://ghantasala-amrutabhaandam.blogspot.in/2011_02_10_archive.html

  రిప్లయితొలగించండి
 4. పసిపశువుల పొట్ట కొట్టి త్రాగేవి పాలా?కాదు కాదు పాపాలే :

  01)
  ___________________________________

  పాలను త్రాగెడి దూడల
  వాలుగ దూరముగ లాగి - పశువుల వలెనే
  మేలగు పాత్రల బిండిన
  పాలను గ్రోలిన మనుజుఁడు - పాపాత్ముఁ డగున్ !
  ___________________________________
  వాలు = క్రూరము

  రిప్లయితొలగించండి
 5. తాటిపాలు(కల్లు)త్రాగి గోలజేస్తే పుణ్యాత్ముడౌతాడా :

  02)
  ___________________________________

  పాల వలె నుండు తెల్లని
  శాలల సీసాల నమ్ము , - సారా వలెనే
  గోలల జేయించు కల్తీ
  పాలను గ్రోలిన మనుజుఁడు - పాపాత్ముఁ డగున్ !
  ___________________________________
  గోల = రచ్చ

  రిప్లయితొలగించండి
 6. మేలగు ననిపసి వారికి
  కాలుని వలె పాలు పిండు కఠి నాత్ము డనన్
  జాలియె లేకను లేగల
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ము డగున్

  రిప్లయితొలగించండి
 7. పాలను ద్రాగగ దూడయె
  మ్రోలనెజేరంగ లాగి మోదుచు, పొదుగున్
  జాలిని జూపక పిండుక
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  బీహార్ రాష్ట్రములో నొకడు భార్య రక్తము ద్రాగు చుండెనట, ఆ పై బిడ్డ పుట్టిన తరువాత, బిడ్డకు గేద పాలు పట్టి,భార్య పాలను తాను ద్రాగు చుండెనట,బిడ్డకు తల్లి రక్తము తక్కువగా నున్నది కారణ మేమి యని ఆసుపత్రిలో నడుగగా తన వంటి పై నున్న చిరంజి ఘాట్లను జూపి భోరున యేడ్చేను.
  =============*================
  కాలుని వలె కష్టములన్
  మాలగ జేసి పతి వేయ,మణిగిన సతియున్
  మేలు మరచి మృగము వలెను
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్!

  రిప్లయితొలగించండి
 9. కాలుని భీతిని గాంచక
  వేలగు దుష్కర్మచయము విడువక మహిలోన్
  హేలాగతిఁ జేయుచు పా
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముఁడగున్.

  రిప్లయితొలగించండి
 10. తూలుచు లలనల తోడుగ
  కాలము గడపెను కటకట! కారా గృహమున్
  ఆలయ పూజకు నుంచిన
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్!

  రిప్లయితొలగించండి
 11. బాలల వసతి గృహంబున
  వాలిన పిల్లల కొసంగు పౌష్టకరంబౌ
  పాలను మళ్ళించుఛు నా
  పాలను గ్రోలెడు మనుజుఁడు పాపాత్ముడగున్

  రిప్లయితొలగించండి
 12. మేలగు శక్తిని బొందును
  పాలను గ్రోలిన మనుజుడు,పాపాత్ముడగున్
  పాలను త్రాగెడి దూడను
  కాలుని వలెమూతిగట్టి వదిలెడు వాడన్

  రిప్లయితొలగించండి
 13. ఏలనయాగోపాలా
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్
  చాలును నీపరిహాసము
  పాలను ద్రాగుమనమిటుల పలుకుట తగునా

  రిప్లయితొలగించండి
 14. బాలలకు పాలు నీయక
  పాలను లీటరులగొలది బట్టుకు పోతున్
  బాలల శరణాలయమున
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  ============*============
  శూలి వలె జనుల మధ్యన
  నీలాంబరుడయి దిరుగుచు నెయ్యపు నెరవున్
  వాలి వలె నేడు కర్షక
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్ !

  (శూలి= నక్క, నీలాంబరుడు= శని,వాలి= ఎదుటి వారి బలము (ధనము)పొందుచు, పాలు= రక్తము, భాగము

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  :ఆలను పెంచుచు దేశము
  పాలించిరి పాలు త్రాగి స్వర్గము వోలెన్
  తూలుచుపల్కిరి నేడిటు
  పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా! శుభాశీస్సులు.

  ఈనాటి మీ పూరణలన్నియును బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

  శ్రీ వసంత కిశోర్ గారు మంచి పద్యములను వ్రాసేరు - సుబ్బా రావు గారు వ్రాసిన ఖండికను అందించేరు.

  శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము బాగుగ నున్నది.

  శ్రీ నాగరాజు గారి 2 పద్యములును బాగుగ నున్నవి.

  శ్రె గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము బాగుగ నున్నది.

  శ్రీ వర ప్రసాద్ గారి 2 పద్యములును బాగుగ నున్నవి. 2వ పద్యములో కర్షక పాలను అనే సమాసము బాగుగ లేదు. రైతుల పాలను అందాము.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి పద్యము బాగుగ నున్నది.

  శ్రీ టేకుమళ్ళ వేంకటప్పయ్య గారి పద్యము బాగుగ నున్నది.
  2వ పాదమును ఇలాగ మార్చుదాము: కాలము కారాగృహమున గడపె కటకటా

  శ్రీ సహదేవుడు గారి పద్యము బాగుగ నున్నది.
  పౌష్టకరంబౌకి బదులుగా బలవర్ధకమౌ అందాము.

  శ్రీమతి శైలజ గారి 3 పద్యములు బాగుగనున్నవి.
  1వ పద్యము ఆఖరి పదము వాడున్ అని ఉండాలి - టైపు పొరపాటు కావచ్చు.
  3వ పద్యములో పట్టుకు పోతున్ కి బదులుగా పట్టుక జనుచున్ అందాము.

  శ్రీ తిమ్మాజీ రావు గారి పద్యము బాగుగ నున్నది.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.
  వేళకు బాలలు పాలను
  గ్రోలిన బలవంతులగుచు గొప్పగ యెదుగున్
  పాలను త్రాగెడి బాలల
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్!

  రిప్లయితొలగించండి
 19. నాలుగు గోడల మధ్యన
  తూలుచు త్రుళ్ళుచు పొరలుచు దోపిడి సారా
  గాలను లీటరుతో పీ
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్

  రిప్లయితొలగించండి
 20. కాలుని వాహన మనియెను
  వాలము త్రిప్పుచును మెండు వయ్యారమునన్:
  "జాలియు లేకయె దూడల
  పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్"

  రిప్లయితొలగించండి