కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.
ఇష్టము శివునకు వింతలు
రిప్లయితొలగించండినిష్టగ పూజించు నటుడు నీతిని విడచున్
కష్టము దేవుని కొలువగ
బ్రష్టుం డగు వాఁ డె పరమ పదమునఁ దనరున్
శిష్టాచారము లొదిలిన
రిప్లయితొలగించండిభ్రష్టుడ, నే తెలిసికొంటి రాజుల మతులన్!
స్పష్టత చేకొన పదవీ
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్!
దుష్కరమైన ప్రాస ఇచ్చారు...
రిప్లయితొలగించండినిష్టగ యుండెడి తండ్రికి
కష్టము దెచ్చెను గుణనిధి, కానగ యకటా!
సృష్టిన వింతయె జూడగ
బ్రష్టుం డగు వాఁ డె పరమ పదమునఁ దనరున్
రాజేశ్వరి గారూ... పద్యాలు చాలా బాగా రాస్తున్నారు!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభ్రష్టులయిరి బలవంతులు
రిప్లయితొలగించండిభ్రష్టులె గదభరతమాత భాగ్యపు రాశుల్
దుష్టపు బుధ్దిని విడచిన
భ్రష్టుండగువాడె పరమ పదమున దనరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసృష్టికి మూలము నెరుగక
రిప్లయితొలగించండినష్టము గలిగించు పనులు నాశము గోరున్
నిష్టగ దేవుని గొలువగ
భ్రష్టుండగువాడె పరమపదమున దనరున్
నిష్ట కలవాడు శ్రీ హరి
రిప్లయితొలగించండినిష్టముతో గొలచువాడు నీ ధరలోనన్
శిష్ట గుణాన్వితు డధర్మ
బ్రష్టుం డగు వాఁ డె, పరమ పదమునఁ దనరున్
కష్టముల బాలు జేయును
రిప్లయితొలగించండిభ్రష్టుండగు వాడె , పరమ పదమున దనరున్
అష్టమ గర్భుని దలచిన
కష్టములే దొలగి పోయి కనబడి దివియున్
అష్టాంగయోగ విధములు
రిప్లయితొలగించండిశిష్టాచారముల నడతఁ జేయుచు ధరణిన్
బ్రష్టపు దుష్కర్మచయ
బ్రష్టుండగు వాఁడె పరమపదమునఁ దనరున్.
మిత్రులందరీ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాడు దుష్కర ప్రాసతో సమస్య శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి సూచన మేరకు నీయబడినది. శ్రీ శాస్త్రి గారి పూరణను వేచి చూద్దాము. ముందుగా అందరికి శుభాభినందనలు.
శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము బాగున్నది. సమస్య మాత్రము పరిష్కరించ లేదు.
శ్రీ చంద్రశేఖర్ గారు:
మీ పద్యము బాగుగ నున్నది. శిష్టాచారము విడిచిన అందాము.
శ్రె వెంకటప్పయ్య గారు:
మీ పద్యము బాగుగ నున్నది. నిష్టగ, కానగ తరువాత నుగాగమము చేయండి. సృష్టిన కి బదులుగా సృష్టిన్ అందాము.
శ్రీమతి శైలజ గారు:
మీ 2 పద్యములు బాగుగ నున్నవి.
శ్రీ లక్ష్మీనారాయణ గారు:
మీ పద్యము బాగుగ ఉన్నది.
శ్రీ సుబ్బా రావు గారు:
మీ పద్యము బాగుగ నున్నది. అస్టమ గర్భుడు అని శ్రీకృష్ణునికి ప్రసిద్ధమైన నామము లేదు. మార్చండి.
కష్టముల బాలు జేయును
రిప్లయితొలగించండిభ్రష్టుండగు వాడె , పరమ పదమున దనరున్
అష్టమ గర్భుని కృష్ణుని
ఇష్టముతో కొలిచి నేని నిహమున్దివినిన్
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికివందనములు
దుష్టుడజామిళుడు తుదిని
నష్ట ప్రాణుడయి పిలిచె నారాయణనన్
యిష్ట సుతు నామ మహిమను
భ్రష్టు౦డగువాడె పరమపదమున దనరున్
మరియొక పూరణ
దాష్టికము జేసి పీడలు
శిష్టుల కొనరించు దుష్ట శీలుని కైనా
నిష్టగ ననుశయమందిన
భ్రష్టు౦డగువాడె.పరమపదమున దనరున్
నిష్టుండయి మండేలా
రిప్లయితొలగించండికష్టించెను నల్లవారి గౌరవమునకై
యిష్టత, గిట్టని వారికి
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్
నెల్సన్ మండేలాకు నివాళి:
రిప్లయితొలగించండివిశ్వమాత కనుల వెంట దుఃఖాశ్రువుల్
కారు చుండె గనుడు ధారగాను
నల్ల జాతి వెలుగు నవ్వుల సూరీడు
గ్రుంకె నన్న వార్త క్రుంగ దీసె.
జాత్యహంకార ప్రభువుల జాడ్య మేమొ
సాటి మానవుల యెడన్ జాలి లేక
నల్ల వారని హింసించి తెల్లవారు
బానిసల జేసి రక్కటా బాధపెట్టి.
పెద్ద సంఖ్యలో నుండియు పేదవారు
నల్ల వారైన కతమున నాణ్యమైన
బ్రతుకు తెరువును పొందక పరువు మాసి
దొరల కాళ్ళను పట్టెడి దుర్గతేల.
కలల నైన తమకు కార్లు సౌధమ్ములు
కోరినారె వారు కూటి కొఱకు
మోము వాచి పసుల పోలిక గొలుసుల
బంది లగుచు మ్రగ్గు బ్రతుకదేల..
వారును కారె మానవులు వారికి నాకలి దప్పులుండవే
వారి నరాల పారు రుధిరమ్మరుణమ్మది కాదె వారినిన్
క్రూరత జేసి బానిసల, కొద్ది జనుల్ తెలుపైన వారిలన్,
దూరుచు నంట రారనుచు ద్రోహము జేతురె ఘోర మక్కటా.
వర్ణవివక్షకున్ భరత వాక్యము పల్కిన గాని గుండెలో
నర్ణవ మైన వేదనకు నంతము లేదని యెంచి దీక్షతో
పర్ణములే భుజించి తపమున్ పచరించెడు మౌని పోలికన్
నిర్ణయ మూని డెందమున నీవు తపించితివయ్య మండెలా.
దేశ ద్రోహి వటంచు తెల్ల ప్రభువుల్ తీర్మానమున్ జేసినన్
లేశంబైనను జాలి లేక యొక జైలే సృష్టిగా మార్చినన్
ఆశల్ జూపిన గాని లొంగ వకటా ఆత్మీయ జాత్యర్థమై
క్లేశంబుల్ భరియించి నావు జన సంక్షేమంబు కై దీక్షతో.
యౌవన మంతయు జారిన
నే వెల్గులు లేని రీతి నిరుకగు జైలున్
చేవ నశింపక పోరిన
యో వీరా నిన్ను దలతు నుల్లము పొంగన్.
పండెను నీకల! నలుపుల
గుండెల చల్లారె మంట! కూరిమి నేళ్ళున్
నిండెను నూరును దొరలకు,
మండేలా! వందనములు, మరిమరి నుతులున్.
భువిని విడచి పెట్టి దివికి నీవేగినన్
నీదు పోరు బాట నిలిచి చూపు
మంచి మానవత్వ మెంచగ విజయమ్ము
నొందు దారి మాకు నో మహాత్మ!
మిత్రులార! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యను పూరించుటకు ప్రయత్నము చేయుటే ప్రశంసనీయము. దుష్కరమైన ప్రాస చిన్న కంద పద్యము ఎక్కువ అవకాశములు లేకుండుట వలన, ఈనాడు పాల్గొనిన మీ అందరికి ప్రశంసలు - స్వస్తి.
శిష్టత తప్పి మునులకొక
రిప్లయితొలగించండికష్టము కలిగించిన తరి కర్కశులగుచో
నష్టమొకో, హరి భటులకు?
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్
అష్టమ గర్భుని గొలిచిన
రిప్లయితొలగించండినిష్టగ మనమందు హరిని నిలుపుచు, వినరా
శిష్టులె కాదిక కనగను
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.
మిస్సన్న గారూ ! మీరు వ్రాసిన మండేలా నివాళి మనసుకు హత్తుకుండేలా ఉంది..
రిప్లయితొలగించండిఅయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిచిక్కని భావముతో గడు
చక్కని ఖండికను మాకొసంగితివి సుధీ!
చొక్కెడు మండేలా పయి
మక్కువతో బొగడుదును సుమతి మిస్సన్నా!
నమస్కారములు
రిప్లయితొలగించండిధన్య వాదములు వెంకటప్పయ్య గారూ ? ఇదంతా మీ ప్రోత్సాహము గురువుల కటాక్షము అందరికి ధన్య వాదములు
నేమాని పండితార్యా ధన్యవాద శతము.
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండినిజము శ్రీ మిస్సన్న గారూ శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు జెప్పినటుల మీరు వ్రాసిన మండేలా నివాళి మనసుకు హత్తుకుండేలా ఉంది..
===========*=========
శిష్టులకు బరగ శిక్షలు
కష్టములు గలుగుచు నుండ కలియుగ మందున్
శిష్టులు బలికిరి పుడమిని
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.
"అపి చే దపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
రిప్లయితొలగించండిసర్వం జ్ఞానప్లవే నైవ వృజినం సంతరిష్యసి"
ఇష్టముతో జేరియు కడు
కష్టముల ననుభవించి కడపటి దినమున్
దుష్టుల కూటమి పరిధుల
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్