6, డిసెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1255 (పాండు కుమారులు నలుగురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  "అర్జునుని దక్క నన్యుల విడిచెదను
  మిగిలేది అర్జునుడో ? నేనో ?
  నీకు మాత్రం ఐదుగురూ ఉంటారు "
  పంచపాండవుల నేమీ చెయ్యవద్దని వరము కోరిన కుంతితో కర్ణుడు :

  01)
  ___________________________________

  నిండుగ నైదుగురు సుతులు
  భండనమున మిగులు గాదె - పార్థుడొ ? నేనో ?
  చెండాడను నను పెనగిన
  పాండుకుమారులు నలుగురు - పదుగురు మెచ్చన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 2. "కానుకైనా కబళమైనా అందరూ పంచుకోండి"
  శ్రీకృష్ణపాండవీయం సినిమాలో, ద్రౌపదిని దాచిపెట్టి
  అమ్మా ఒక కానుక తెచ్చానన్న అర్జునునితో కుంతి :

  02)
  ___________________________________

  పండువలె బంచు సమముగ
  దండుకొనిన దాని నెల్ల - ధర్మయుతముగా
  నిండుమనంబున నీవును
  పాండుకుమారులు నలుగురు - పదుగురు మెచ్చన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి

 3. వాండ్రు ఐదుగురు, జగద్గురు తోడి ఉపవాస
  ముండు,అమరులై , 'సఖ' సహ కీర్తి
  మెండుగ , గడించిరి ధర్మార్థ కామ మోక్ష గతిన
  పాండు కుమారులు, నలుగురు పదుగురు మెచ్చన్.!!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. నిండైన మనము తోడను
  ఎండను వానను విడువక నెన్నడు నీడై
  యండగ నిలిచిరి యన్నకు
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 5. కొండను పిండిగ జేసెడి
  భండన భీముడ నంగ బలికె నుద్రేకంబున్
  వండెద షడ్రుచులన్ గలిపి
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 6. మిత్రులకు శుభాశీస్సులు.
  ఈనాటి కొన్ని పొరణలను చూద్దాము.
  అందరికీ అభినందనలు.

  శ్రీ వసంత కిశోర్ గారు:
  మీ పద్యములు బాగుగ నున్నవి.
  నిండుగ నైదుగురు సుతులు అని బహువచనముతో మొదలు పెట్టేరు - కనుక మిగులు అనరాదు మిగుల గలరు అంటే బాగుగ నుండును. మీ 2 పద్యములలోను సమస్యకు తగినట్లుగా అన్వయము మరికొంచెము స్ఫుటముగా ఉండాలి.

  శ్రెమతి లక్ష్మీదేవి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది.
  నిండైన మనము తోడుత నెండను అని మార్చుదాము.

  శ్రెమతి రాజేశ్వరి గారు:
  మీ పద్యము ప్రాత్నము బాగుగ నున్నది. ఇలాగ మార్చుదాం:

  కొండను పిండిగ జేసెడి
  భండన భీముండు లెస్స పలికెన్ వేడ్కన్
  వండెద షడ్రసయుతముగ
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 7. అండగ హరితా నుండగ
  గండము లెన్నైననురాని గాండీవముతో
  చెండాడుదుడీ పార్ధుడు
  పాండుకుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 8. అండగ నుండిరి యన్నకు
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్
  భండనము నందు మిగులను
  గండ రు గండరుల బోలి కను విందాయెన్ .

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  ది : 25/05/2013 హోస కోటే అను గ్రామము నందు శ్రీ ద్రౌపది మాత కరగ మహోత్సవము జరిగినది,నేను ఆ మహోత్సవము జూచి వచ్చితిని, ఇక్కడ ఓ గ్రామము నందు పాండవుల(కుటుంబ )నామములు ప్రతీ యింటి నందు గలవు. అవి
  =============*================
  పాండవ పురమున కుంతికి
  పాండు కుమారులు నలుగురు,పదుగురు మెచ్చన్
  తాండవమును జేయుదురు క
  మండలములు బట్టి వారు మంచిని బంచన్ !

  రిప్లయితొలగించండి
 10. కుంతితో ..భీముడు..

  కొండను పిండిని జేసెడి
  భండన భీముండునుండ భయమును విడుమా
  చెండాడి వచ్చెద బకుడిని
  పాండుకుమారులు నలుగురు - పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 11. సహదేవుడు అతి సుకుమారుడు మిగిలిన వారు వీరులని
  ==============*==============
  కండలు గలిగిన ఘనులగు
  పాండు కుమారులు నలుగురు,పదుగురు మెచ్చన్
  మండితముగ బలికెద నని
  పాండవుల గథను జదివిన పాఠకుడ నియెన్!

  రిప్లయితొలగించండి
 12. అందరి పూరణలు అలరిముచున్నవి. అందరికీ అభినందనలు.

  శ్రీమతి శైలజగారు:
  మీ పద్యములు బాగుగ నున్నవి. వానిలో కొన్ని మార్పులు:
  1వ పద్యములో:
  2వ పాదములో: గండము లెన్నైన గాని అందాము.
  3వ పాదము: చెండాడును గద పార్థుడు అందాము.

  2వ పద్యము: 3వ పాదము: చెండాడి వత్తు బకునిన్ అందాము.

  శ్రీ సుబ్బా రావు గారు:
  మీ పద్యము బాగుగ నున్నది.

  శ్రీ వరప్రసాద్ గారు:మీ 2 పద్యములు బాగుగ నున్నవి.
  చిన్న సవరణ: పాండవుల కథను అందాము.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు
  : పెండిలి యాడిరి నొకసతి
  అండగ సుఖ దుఃఖ మందు అగ్రజు తోడ
  న్ను౦డిరి స్వర్గపు బాటను
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్
  భాగవతుల కృష్ణారావు గారిపూరణ
  పాండవ దూతగ జను తరి
  కొండొకచో భీము డలిగి కోపోక్తు లిడన్
  మెండుగ హరిని నుతించిరి
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు నమస్కృతులు.
  నాలుగు రోజుల తరువాత ఈరోజు బ్లాగు చూసే అవకాశం దొరికింది.
  మంచి పూరణలు చేస్తున్న మిత్రులకు అభినందనలు.
  నా అనుపస్థితిలో గుణదోష విచారణ చేస్తూ, తగిన సలహాల నిస్తున్న పండిత నేమాని వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
  ఆదివారం వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను. పునర్దర్శనం సోమవారం.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ తిమ్మాజీ రావు గారు:

  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొద్ది సవరణలతో:

  పెండిలి యాడిరి యొక సతి
  నండగ సుఖ దుఃఖములను నయి యగ్రజుతో
  నుండిరి .............
  ..................

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 16. ఉండగ ధర్మజుడే తా
  నండగ ధర్మంబు తోడు నగ్రజుడగుచున్
  మండెడి గుండెలనాపిరి
  పాండు కుమారులు నలుగురు, పదుగురు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మండెడి భవనము జూచుచు
  పండుగ జేయంగ కుంతి పరిపరి విధముల్
  భండన భీముని నెక్కిరి
  పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి


 19. భాండమ్ముల నింపిరహో
  చెండాడుచు రాజులను సుచేతులగుచు మా
  ర్తాండుల వలె భళి భళిరా
  పాండు కుమారులు, నలుగురు పదుగురు మెచ్చన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి