30, డిసెంబర్ 2013, సోమవారం

దత్తపది - 36 (చెక్కు-సైను-మనీ-డ్రా)

కవిమిత్రులారా!
చెక్కు - సైను - మనీ - డ్రా
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

39 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  శ్రీకృష్ణపాండవీయం సినిమాలో

  "చాంగురే బంగారు రాజా
  చాంగు చాంగురే బంగారు రాజా"

  పాటతో భీముణ్ణి కవ్వించిన హిడింబి
  పిదప కుంతి దరిజేరి శరణు కోరి
  నీకేం కావాలో యడుగు మన్న కుంతితో :

  01)
  _______________________________

  భీమ బలుడైన నితడొట్టి - పెంకివాడు !

  నొవ్వ జేసినను, మనసై; - నుంకు నుంటి !
  రమణి దరిజేర, వినడు గుం - డ్రాతి వోలె !
  నిజము వలచితి నోయమ - నీ కుమారు !
  చెక్కు లరుణిమ జెందగా - చెంత జేరి

  యింతి జెప్పెను కుంతితో - నీప్సితమును !
  _______________________________
  నుంకు = పస్తు

  రిప్లయితొలగించండి
 2. పస్తు అంటే ఆహారం స్వీకరించకుండా యుండుట
  అనగా
  సత్యాగ్రహం

  ఇది గాంధీగారితో మొదలైనది కాదు
  పూర్వం నుండీ ఉన్నదే !

  రిప్లయితొలగించండి
 3. వసంత మహోదయా! కుమ్మేసారు గదా! చాంగురే డాన్సు చేసిన అందగత్తె (నటి పేరు జ్ఞాపకం లేదు)ని తలపింపజేశారు.

  రిప్లయితొలగించండి
 4. చెక్కు చెదరని ధర్మమ్ము మిక్కు టముగ
  గుండె కోతను భరియించి గుండ్రాయి వలె
  తోడు నీడగ మనసై నుండు సతిని
  యడవి పాల్జేసి నమనీషి నలుడు గాదె

  రిప్లయితొలగించండి
 5. ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశం:

  చెక్కులదర నన్నాయని చెల్లి పిలువ
  పాండవులలుసై నుండ నిర్భాగ్యు లయ్యు
  లేమ నీతి నియమసార రీతు లెంచ
  పెద్ద గుండ్రాళ్ళ వలె సభఁ బెద్ద లుండ
  దీన జన బాంధవుఁడు గాచె మానమచట

  రిప్లయితొలగించండి
 6. పంచపాండవులఁ గన్న కుంతితో ఇంకను సంతానమును పొందని గాంధారి....

  శిశువు శిల్పమ్ము మదిలోన చెక్కుకొంటి
  సంతుపై మనసై నుడు వింతలేక
  లేమ నీకు కల్గిరి పుత్రులే యయిదుగు
  రిపుడు గొడ్రాలుగా లోక మెన్ను నన్ను!

  రిప్లయితొలగించండి
 7. వసంత కిశోర్ గారూ,
  మజ్జారే! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసార్హమైనది.
  రెండవ పాదంలో గణ, యతి దోషాలు.
  ‘మనసై + ఉండు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  సవరించండి.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘మనసై + ఉండ’ అన్నచోట యడాగమం వస్తుంది.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
  అందరి పూరణలూ అద్భుతముగా నున్నవి
  సరదాగా నా పూరణ
  =============*===============
  చెక్కుజెదరనట్టి కధను జెప్పు చుంటి కమనీయముగ
  జక్కగ వినవలె నండి సైనుకులవలె నీ దినము
  రక్కసి మూకల నెల్ల రయమున ద్రుంచిభీముండు
  జిక్కిన వీరుల నెల్ల జిల్చి జంపగ బిడ్డలున్న
  నొక్క సుతుడు లేక నామె యొప్పెను గొడ్రాలు గాను!

  రిప్లయితొలగించండి
 9. గురువుగారికి ధన్యవాదములు.
  రెండవ పాదాన్ని యిలా మారిస్తే సరిపోతుందా? పరిశీలించ ప్రార్థన :


  చెక్కులదర నన్నాయని చెల్లి పిలువ
  పాండవులలుసై నుడువ నిర్భాగ్యు లైన
  లేమ నీతి నియమసార రీతు లెంచ
  పెద్ద గుండ్రాళ్ళ వలె సభఁ బెద్ద లుండ
  దీన జన బాంధవుఁడు గాచె మానమచట

  రిప్లయితొలగించండి


 10. గురువుగారికి ప్రణామములు..దత్తపది ఇది రెండవసారి వ్రాయడం..తప్పులను మన్నించి సవరించ ప్రార్ధన..

  చెక్కు చెమరించె కుంతికి చింత తోడ
  సైను చీరను శిశువుపై సర్ది యుంచి
  కావుమ నీవైన శిశువుని గంగ మాత
  కుంతి గుండ్రాయిగామారి కొడుకు నొదిలి
  వీడుకోలును పలుకుచూ వేడు కొనెను


  రిప్లయితొలగించండి
 11. సహదేవుడు గారూ,
  ఇప్పుడు సరిపోయింది. సంతోషం!
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. మెచ్చదగిన ప్రయత్నం. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. అక్కడ ‘గంగ కావుమ నీవైన కన్నసుతుని’ అందామా?
  ‘ఒదిలి’ గ్రామ్యం. ‘కొడుకును విడి’ అనండి. ‘పలుకుచూ’ దీర్ఘాంతం దోషమే. ‘పలుకుచు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 12. సై,నునుపయిన గుండ్రాయి చక్క నెక్క
  పందెమంచెక్కుదమ నీవు పరుగులెత్తి
  రమ్మిటకటంచు బిలిచెనురామిగాడు,
  ఎక్కబోయి జారెను నేను వెక్కిరింప.

  రిప్లయితొలగించండి
 13. ఊర్వసిని నేను నీవె నా సర్వ మనియు
  చెక్కు టద్దాల నగుమోము చెలువమైన
  పడుచు దానిని మనసై నుడువుటకును
  వచ్చితిని పార్థ గుండ్రాయి వైతి వీవు !
  ఎంత జెప్పిన వినవు నేనేమి జేతు .

  రిప్లయితొలగించండి
 14. కమనీయం గారూ,
  మొదటి రెండు పాదాల్లోనే నాలుగు పదాలు వచ్చేట్లు చక్కగా వ్రాసారు. సంతోషం. కాని భారతార్థంలో వ్రాయమన్నాను కదా. అది మీరు గమనించినట్టు లేదు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. వరప్రసాద్ గారూ,
  మన్నించాలి. మీ పూరణపై వ్యాఖ్యానించడం మరిచిపోయాను.
  మీ పూరణ వైవిధ్యంగానూ, చక్కగానూ ఉంది. అభినందనలు.
  కాని ‘సైనికులు’... ‘సైనుకులు’ అయింది. ‘సై నిజమనుచు నీదినము..’ అందామా?

  రిప్లయితొలగించండి
 16. శంకరయ్యగారూ,నిజమే నేను గమనించలేదు.భారతార్థంలో అందుకే మరల రాస్తున్నాను.

  ' శక్రు నెదురించి యైన సై సైను బలుకు,
  చెక్కు చెదరంగ లేదయ్య చిన్ననాట
  జారె గుండ్రాతిపైన వజ్రాంగు డితడు
  కనుమ నీవేల యీ రీతి కలతజెంద.
  (బకాసురుని పైకి భీముని పంపించే సమయంలో
  కుంతీదేవి ధర్మరాజు తో మాట్లాడిన సందర్భంలో.)

  రిప్లయితొలగించండి
 17. శ్రీమహాదేవ! విశ్వేశ్వరా! వరద! యం
  ....చెక్కుడు భక్తితో హృదయ మలర
  ప్రాలేయ శైలరా డ్రాజిత మందిరా!
  ....గౌరీ మనోహరా! కాలకంఠ!
  సై నాగభూషణా! సై నుత గుణగణా!
  ....యని ప్రమథ గణంబు లాడుచుండ
  తాండవ ప్రియుడవై తనరు సర్వేశ్వరా!
  ....సోమ! నీ భక్తుని ప్రేమ మీర
  ప్రోవ రావయ్య! యనుచు శంభుని గురించి
  తపమొనర్చుచు పార్థుండు తనరుచుండ
  నతని యందతిప్రీతుడై యరుగుదెంచి
  నట్టి రుద్రు జగద్భద్రు నాత్మ దలతు

  రిప్లయితొలగించండి
 18. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  సైను పదము కొరకు సైనికులను సైనుకులను జేసితిని గురువుగారు ,

  మరియొక పూరణ హిడింబ భీమునికై యెదురు జూచుచు
  ==============*============
  చెక్కు కొంటి నీ రూపమ్ము స్థిరము గాను
  సైను చీర గట్టితి జూడు సరస హృదయ
  నీ కొరకు వెదకుచు నుండ నిండు కొనెను
  నెమ్మది, కలలలో కమనీయ మైన
  నీదు గుండ్రాతి రూపమ్ము నిలచె గనుల
  ముందు,నిజము జేయుము భీమ పొందు గాను !

  రిప్లయితొలగించండి
 19. (లక్కయింటి నిర్మాత ధర్మజునితో పలుకుతున్నమాటలు)

  చెక్కు చదరదు భవనంబు నిక్కముగ, మ
  సై నుసై పోదు, తడవదు, చలికి నోపు
  సార్వ భౌమ నీ మనసుకు శాంతి నొసగు
  విజయములనిడు నుండ్రా ళ్ళ వేల్పు మీకు !!!

  రిప్లయితొలగించండి
 20. మాకు భయమేల తమనీడ మమ్ముగావ
  చెక్కు చెదరక యుద్దము జేతు మంచు
  నొక్కి బావలు మనసై నుడువ గానె
  గెలుపునివ్వ గుండ్రాయియై కృష్ణు నిలుచె

  రిప్లయితొలగించండి
 21. కమనీయం గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అద్భుతమైన పూరణ చెప్పి అలరించారు. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  అయినా ఆకాలంలో ‘సైను’ చీరలెక్కడివి?
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కృష్ణు నిలువ’ అన్నదానిని ‘కృష్ణు డుండె’ అనండి.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  'సై' ను చేసెను కీచకుడైన గాని
  చెక్కు చెదరక ద్రౌపది చేర భీము,
  చూడుమా లేమనీకోర్కె సుంతయనుచు
  డ్రా లుగాగాక జంపె సంగ్రామమందు

  మరొక పూరణ

  చెక్కు చెదరకననుజులు, చెలియ రాగ
  నియమనీమము ధర్మజునే వరింప
  మనసు గుండ్రాయిగా జేసి మసలు చుండ
  కాముకుడు భార్యనేబట్ట భీముడలిగి
  యుగ్రుడయి జంపగ మనసైనుక్కడంచె

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  ఎడద బిరుసై నునుపు దేలె ని౦పొసంగ
  చెక్కులరుణిమ నీలమై చేతులెత్తి
  నరుని మెడ వైచె పా౦చాలి వరుని మెచ్చి
  రవిసుతాదులు చొక్క గుండ్రాళ్ళ వోలె

  రిప్లయితొలగించండి
 24. చెక్కు పై జారె కన్నీరు , చిన్నదాన!
  హ!యలుసై నుడివిన యధమాధముండు,-
  భీమ, నీ పతి దేవుడ, భీకరముగ
  రాల్చగలడని- యెఱుగలేడ్రామ! నిజము.

  రిప్లయితొలగించండి
 25. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘నియమము’నకు వికృతి ‘నీమము’ కదా. ఆ రెంటిని సమాసం చేశారు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘లేడు + రామ’ను ‘లేడ్రామ" అన్నారు.

  రిప్లయితొలగించండి
 27. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మధ్య మధ్య ఆ చిహ్నాలెందుకున్నాయి?

  రిప్లయితొలగించండి
 28. రవీందర్ గారూ,
  నేను బరహా, లేఖిని వాడుతున్నాను. వాటిలోను అండర్ లైన్ చేసే అవకాశం లేదు. అక్షరాలను బోల్డ్ చేయడం కూడా వీలుకాదు.
  అప్పుడప్పుడు సురవర కీబోర్డుతో యమ్మెస్ వర్డ్ లో టైపు చేస్తున్నాను.
  మీ రేది వాడుతున్నారు?

  రిప్లయితొలగించండి
 29. గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు, సవరణతో.

  మాకు భయమేల తమనీడ మమ్ముగావ
  చెక్కు చెదరక యుద్దము జేతు మంచు
  నొక్కి బావలు మనసై నుడువ గానె
  గెలుపునివ్వ గుండ్రాయియై కృష్ణు డుండె

  రిప్లయితొలగించండి
 30. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  నా రెండవ పూరణ పద్యములో రెండవ పాదమును క్రింది విధముగా సవరణ చేయడమైనది
  "పరమ నీమము ధర్మజు వంతు గాగ"

  రిప్లయితొలగించండి
 31. క్షమించాలి
  సవరణకు కిట్టించడం రావటల్లేదు ఐనా ఒక ప్రయత్నం

  చెక్కు చెదరని ధర్మమ్ము మిక్కు టముగ
  తోడు నీడగ మనసైను తోయ జాక్షి
  బండ బారిన గుండ్రాయి భాధ నొంది
  యడవి పాల్జేసిన మనీషి నలుడు సతిని
  +++++++++++++++++++++++++++
  లేమ నీయంద మెన్నగుం డ్రాయి వలెను
  భీమ సైనుడు బొగడెను ప్రీతి గాను
  చెక్కు లదరగ హిడింబ మక్కు వనుచు
  మనుజ లోకాన మనీషి మల హరుండ

  రిప్లయితొలగించండి
 32. చంద్రశేఖరా ! ధన్యవాదములు !
  శంకరార్యా ! ధన్యవాదములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రిప్లయితొలగించండి
 33. అభిమన్యుని మరణ వార్త విన్న అర్జునుని శపథం...

  ఇటుల సుతునెవడ్రా చంప నిచ్చె, వింటి
  సైంధవుండని వాడిని చంపకున్న
  వింటి విడుతును వినుమనీ మంటలోని
  కిట్టు వెడలెద నంచెక్కు పెట్టె విల్లు.

  రిప్లయితొలగించండి
 34. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి,పూజ్యులు నేమానివారికి, సాహితీ మిత్రులందరికి నమస్కృతులు...

  భాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగా, ద్రుపదమహారాజు అభినందించిన సందర్భము...

  "నేనె విలుకాఁడఁ జూడుఁ"డంచెక్కుపెట్టి,
  సొగసై, నునుపైన విశుద్ధ మత్స్య
  యంత్రమునుఁ గొట్ట, "నెంత నియమమ నీకు,
  బ్రాహ్మణా!"యనె ద్రుపదరా, డ్రాజసమున!

  (బ్రాహ్మణా!" యనె ద్రుపదరా, డ్రామ నిడుచు!)

  రిప్లయితొలగించండి
 35. మధుసూధన్ గారూ,
  రెండవ పాదం మొదటిలో గణభంగమేమో అని అనుమానమండీ

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 36. రామకృష్ణ గారూ,
  మీ రన్నది నిజమే. అక్కడ గణదోషం ఉంది. మధుసూదన్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 37. చక్కని స్వామివంచు మన(సై ను)తియించెద ప్రాణనాథ, నా
  (చెక్కు)ల గిల్లబోకు సరసీరుహముల్ నవి సున్నితంబుగన్
  మక్కువ మీర నొక్కవలె మాటల ముంచుచు ముద్దులి(మ్మనీ )
  ప్రక్కను వాలిపోయితిని (డ్రా)గను ఫ్రూటును మత్తు మత్తుగా!!

  రిప్లయితొలగించండి