కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రామునిం జంపె రణమున రావణుండు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రామునిం జంపె రణమున రావణుండు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
మోసమున బొందగా నెంచి భూమిసుతను
రిప్లయితొలగించండిమాయతో రామవిభు ప్రతిమను సృజించి
తలను నరకగా రాక్షసుల్ పలికి రిట్లు
రామునిన్ జంపె రణమున రావణుండు
రామునిం జంపె రణమున రావ ణుండు
రిప్లయితొలగించండియనుచు ముదమొందె లంకను దనుజు లంత
రాము జంపగ తరమేని సోము కైన
యవత రించిన దివినుండి హరిని గనక
రామ రావణ యుద్ధములో రావణుని చేతిలో చనిపోయిన ఒక కపి వీరుని భార్య పలికిన పలుకులు.
రిప్లయితొలగించండిరామదండున జేరుచు రాజసమున
పోరుసల్పగ వీరుడా పోయినావు
మనసు గెలిచిన పతి నిన్ను మతి మరువగ
రాము, నిన్ జంపె రణమున రావణుండు
అద్భుతం హనుమచ్చాస్త్రి గారు ! విరుపు బావుంది
రిప్లయితొలగించండికలను గంటిని రాతిరి కలత జెంది
రిప్లయితొలగించండిరాము నిం జంపె రణమున రావ ణుండు
భయము తోడన లేవగ , భ్రమగ నెఱి గి
సంత సించితి మదిలోన వంత లుడగ
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘రావణుండు + అనుచు’, ‘ఐనన్ + అవతరించిన’ అన్నప్పుడు యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ....
రామునిం జంపె రణమున రావణుండ
టంచు మురిసిరి లంకలో నసురు లంత
రాము జంపగ తరమౌనె సోము కైన
నవతరించెను దివినుండి హరి యతండు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వంశీకృష్ణ గారన్నట్టు మంచి విరుపు. చక్కని పూరణ. అభినందనలు.
*
పరుచూరి వంశీకృష్ణ గారూ,
ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిరాము నింజంపె రణమున రావణుండ
టంచు భయపెట్టె రక్కసి నతివలంత
కనుల నీరిడి జానకి కలత పడగ
ఊర డించెను త్రిజట ఉత్త దనుచు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ చెప్పారు. అభినందనలు.
అతివలు అన్నారు కనుక భయపెట్టిరి అనవలసింది. రక్కసి నతివలు అన్నది అన్వయం కుదరడం లేదు. నాల్గవ పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ......
రాము నింజంపె రణమున రావణుండ
టంచు దనుజకాంతలు భయమ్ముఁగూర్చ
కనుల నీరిడి జానకి కలత పడగ
నూరడించెను త్రిజట మృషోక్తి యనుచు.
మౌని వేసము గట్టిన మాయగాని
రిప్లయితొలగించండినమ్మి భిక్షనిడుటకయి నారి వచ్చె
నాటకమ్ము ఫలించగ నలువ కదలి రా; మునిం జంపె రణమున రావణుండు.
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశ౦కరయ్యగారికి వందనములు
సీత యెవ్వని పెండ్లాడె?వాతసుతుడు
దనుజులెదిరించ నేమి చేసెను? హతు౦ డె
వరు రఘువరు శరము చేత?నరసి చెపుమ
రామునిన్ జంపె రణమందు రావణుండు
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ విరుపు ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
కాని నలువ రాక, రావణుడు మునిని చంపడం అర్థం కాలేదు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువు గారూ,
రిప్లయితొలగించండినవల (స్త్రీ) అని వ్రాద్దామనుకున్నాను. చూసుకోలేదు .మన్నించండి. నవల కదలి రా(గ)ముని వేషాన్ని చంపి (తీసివేసి) నిజస్వ(రూప)భావము ప్రదర్శించినాడని నా ఊహ. నేను తొందరలో రణమున అనే సందర్భమును నా పూరణలో జొ్ప్పించనే లెదని ఇప్పుడే గమనించినాను.
రామునిం జంపె రణమున రావణుండు
రిప్లయితొలగించండినమ్ము మని రక్కసులు దెల్ప నవ్వి సీత
రాము నెదిరించ నెవరి తరమ్ము గాదు
మరలి పొండనె చాలించి మాయ బోధ.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండి‘ప్రమాదో ధీమతామపి!’ అని ఊరకే అన్నారా?
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని ‘విభక్తి ప్రత్యయం’ లేకుండా రాము అన్నారు.
విష్ణుమూర్తిని బూజించు విమల మతుఁడు
రిప్లయితొలగించండిరావణాసుర దౌష్ట్యంబు రగులకొనగ
పోరుసల్పంగ తలచెను ధీరతనవు
రా! మునిం జంపె రణమున రావణుండు
"ఔరా" కు వ్యావహారిక రూపముగా "అవురా" అని వాడినాను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివ్యావహారిక పదాన్ని వాడినా మీ పూరణ బాగుంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీరు వాడిన ‘సుతరాము’ నిఘంటువులో ఉన్నదే. కాకుంటే గ్రామ్యమైన అవ్యయమని పేర్కొన్నారు.
బాగుంది మీ పూరణ. అభినందనలు.
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశ౦కరయ్యగారికి వందనములు
అసురవిభు రావణుని జంపె నవతరించి
త్రేతయుగమున రాముడు ఖ్యాతుడాయె
కలియుగమ్మున దానవ బలము పెరిగి
రామునిన్ జంపె రణమందు రావణుండు
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశ౦కరయ్యగారికి వందనములు
భాగవతుల కృష్ణా రావు గారి పూరణ:
సీత నపహరించగ వచ్చు పాతకుండు
రావణాసురు గాంచి యరణ్య మందు
వలదు వలదని మౌని రావణుని వెంట
రా మునిన్ జంపె రణమందు రావణుండు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగున్నది మీ విరుపు, చక్కని పూరణ. అభినందనలు.
కాని సీతాపహరణ ఘట్టంలో అడ్డుపడి, అందులోను రణమందు... హతమైన మౌని ఎవరండీ?
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులకు ధన్య వాదములు
వంశీ కృష్ణ గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! ధన్యవాదములు.