28, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1277 (శంకరుఁ డుమ కొఱకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

39 కామెంట్‌లు:

 1. జింకను కోరెను సీతట
  శంకిం చక నడిగె సత్య స్వర్గపు తరువున్
  కింకరుడై మతి చెడిన
  శంకరు డుమ కొఱకు పారి జాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 2. శంకించక తనువొసగెను
  శంకరు డుమకొరకు, పారిజాతము తెచ్చెన్
  జంకక కృష్ణుం డప్పుడు
  పంకజముఖి సత్యకొరకు పరమప్రీతిన్.

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  ‘సీత + అట’ అన్నప్పుడు సంధి లేదు. ‘శంకించక’ ద్రుతాంతం కాదు. మూడవ పాదంలో గణదోషం... మీ పద్యానికి నా సవరణ....
  జింకను కోరెను సీతయె
  శంకించక యడిగె సత్య స్వర్గపు తరువున్
  కింకరుడై మతి చెడగా
  శంకరు డుమ కొఱకు పారిజాతము దెచ్చెన్.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 4. నిన్నటి సమస్యకు నా పూరణ..

  ఒక మనవడిని రామాయణము సీడీని కొనితెచ్చి ఇమ్మంటే ఇవ్వలేదని ఒక తాత ఆరోపణ..

  నేముదుసలి వాడనురా
  నామనుమడ తెమ్మునాకు నచ్చిన " సీడీ "
  ప్రేమగ వినెదననిన మా
  రాముడు విననియ్య, కొనడు రామాయణమున్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సిడి కొనని మనుమని గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. వంకర చంద్రుని దొడిగెను
  శంకరు డుమ కొఱకు, పారిజాతముఁ దెచ్చెన్
  గొంకక కృష్ణుడు సత్యకు,
  నింకొక మార్గమ్ము గలదె యింతులఁ జిక్కన్ !

  రిప్లయితొలగించండి
 7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఇంతులను చిక్కించుకునే మార్గాన్ని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. క్రమాలంకార పూరణ:
  సంకట హరుండు దెచ్చెను
  వంకర తొండపు ముఖమును, భామిని యలుగన్
  సంకటము దీర కృష్ణుఁడు
  శంకరుడుమ కొఱకు, పారిజాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 9. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. వెంకన్నా! వింటివ యిది ?
  శంకరుడు మ కొఱకు పారిజాతము దెచ్చెన్
  జంకనునది లేకుండగ
  శంకను గలిగించు మాట సబుబే పలుకన్

  రిప్లయితొలగించండి

 11. (ఇక్కడి మూడు పద్యాలకూ ఒకదానికొకటి సంబంధము లేదు. ఏ పద్యములోనూ ఉమా శంకరులు అనగా పార్వతీ పరమేశ్వరులు అనే అర్థంలో వాడబడలేదు.)
  చంకురపు నీడనందున
  యంకురితమ్మయిన ప్రేమనామెకు దెల్పన్
  జంకుచు తరువనము నుండి
  శంకరుడుమ కొఱకు పారిజతము దెచ్చెన్.
  (చంకురము = చెట్టు)

  కింకర వృత్తిని జేయుచు
  కింకరమగు విత్తమంది క్లేశములోడన్
  బింకము సడలని ప్రియుడా
  శంకరుడుమ కొఱకు పారిజతము దెచ్చెన్.
  (కింకరుడు = దాసుడు, కింకరమగు విత్తము = తక్కువ జీతము)

  కంకణములు గావలెనను
  పంకజముఖి భార్య గోర్కె బడలించగ, తా
  నంకిత భావము దెల్పుచు
  శంకరుడుమ కొఱకు పారిజతము దెచ్చెన్.
  (బడలించగ = బాధించగ)

  రిప్లయితొలగించండి
 12. పొంకము గాతను విచ్చెను
  శంకరు డుమ కొఱకు, పారిజాతము దెచ్చెన్
  పంకజనాభుడు సత్యకు
  వంకలు జెప్పక, ప్రియసతి వ్రతమును దీర్చెన్

  రిప్లయితొలగించండి
 13. అంకిత మిచ్చెను దేహము
  శంకరుడుమ కొరకు ;-పారిజాతము దెచ్చెన్
  జంకక కృష్ణుడు సతికై
  లెంకలె కద దివ్యులైన లేమల యెదుటన్!

  రిప్లయితొలగించండి
 14. సంకల్పించెను తపమును
  శంకరు డుమ కొఱకు, పారిజాతము దెచ్చెన్
  సంకోచింపక కృష్ణుడు
  పంకజముఖి సత్య కోర వైభవమొప్పన్

  రిప్లయితొలగించండి


 15. అంకిత మిచ్చెను దేహము
  శంకరుడుమ కొరకు ;-పారిజాతము దెచ్చెన్
  జంకక కృష్ణుడు సతికై
  లెంకలె కద దివ్యులైన లేమల యెదుటన్!

  రిప్లయితొలగించండి
 16. లంకాధిపు విభుడెవ్వడు?
  శంకరు డెందులకు మారె? చక్రియు సతికై
  జంకక నేమొనరించెను?
  శంకరు, డుమకొరకు, పారిజాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 17. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ కుమార్ గారూ,
  శంకరు డనే ప్రియుడు ఉమ అనే ప్రియురాలి కొరకు... (చివరి పూరణలో భార్యాభర్తలు) అనే అర్థంలో మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘జంకుచు తరువనమందలి.." అందామా?
  *
  శైలజ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ విరుపుతో చక్కగా ఉంది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పంకజముఖిసతి గోరగ
  జంకక తెచ్చెదరుగాదె జాబిలి నయినన్
  శంకకు తావీయకశివ
  శంకరు డుమ కొఱకు పారిజాతము దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  భార్య అడిగాక శంకరుడు తేకుండా ఉంటాడా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ఇంతకీ ఆ భర్త పేరు ‘శివశంకర్’ అంటారా? లేక అచ్చంగా శివుడేనా? ఎలా అయినా అన్వయిస్తుందనుకోండి!

  రిప్లయితొలగించండి
 20. అంక మిడె నర్ధ భాగము
  శంకరు డుమ కొఱకు, పారి జాతము దెచ్చెన్
  అంకిత హృదయము తోడను
  పంకజముఖి సత్య కొఱకు వంశీ ధరుడున్.

  రిప్లయితొలగించండి

 21. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  పూరణ:అ౦కి౦చెను సగదేహము
  శంకరు డుమ కొఱకు .పారిజాతము దెచ్చెన్
  శంకరుని గారవించుచు
  పంకజ ముఖి గౌరి తాను పాదార్చనకై

  రిప్లయితొలగించండి
 22. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  శంకరునకేమి గలదని
  శంకించకు దేవి యనుచు షణ్ముఖు కళ్యా
  ణం కడు వేడుక జరుపగ
  శంకరు డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్

  పారిజాతము = కల్పవృక్షము

  రిప్లయితొలగించండి
 24. భాగవతుల కృష్ణారావు గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘కళ్యాణం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

  రిప్లయితొలగించండి
 25. మాస్టరుగారూ ! ధన్యవాదములు.

  వంకలు లేని, జగతికి శు
  భంకరులగు దంపతులను భక్తిని జూడన్
  జంకక నింద్రుడు వచ్చెను
  శంకరుఁ డుమ, కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 26. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఉమాశంకరులకు ఇంద్రుని చేత పారిజాతాన్ని ఇప్పించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  రాక్షసుల భాదలనుండి రక్షించ మని మునులు శివపార్వతులను వేడుకొనుట
  ============*==============
  నిలిచి యుండె ముని వరులు నిల పయి తమ
  రోదనలు దీర్చ మని శంకరు డుమ కొఱకు
  పారిజాతము దెచ్చెను భామ కోర
  భీముడు వన వాసమ్మున ప్రీతి తోడ

  రిప్లయితొలగించండి

 29. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మరియొక పూరణ:

  శంకించ వలదు భక్త వ
  శంకరు డుమ కొఱకు పారిజాతము. దెచ్చెన్
  శాంకరికి దయితు డయి క్షే
  మంకరి జగములకునెల్ల “మాతను” బిరుదున్

  రిప్లయితొలగించండి
 30. వరప్రసాద్ గారూ,
  ఉమా శంకరుల కొరకు మునులు నిలిచి ఉన్నారు. బాగుంది. కాని భీముడు తెచ్చింది సౌగంధికా పుష్పాన్ని కదా! మొత్తానికి మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ తాజా పూరణ. అభినందనలు.
  “మాత + అను’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాత బిరుదమున్’ అందామా?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. వంకర గల పాముల, నెల
  వంకను ధరియించినట్టి పతి ప్రేమలలో
  వంకలు , సాకులు పలుకడు;
  శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 32. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  పంకజనాభుఁడు సత్యా
  పంకజముఖి కొఱకు భ్రాతృవైరముఁ గొని - హా
  లాంకముఁ బూనిన యట్లుగ
  శంకరుఁ డుమకొఱకుఁ; బారిజాతముఁ దెచ్చెన్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 33. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  అద్భుతమైన పూరణ నిచ్చి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 34. శంకరి జేసిన తనయుని
  బింకముతో తాదునుమిన
  భీభత్సమునన్
  వంకలు మరి చెల్లవనుచు
  శంకరుఁ డుమ కొఱకు పారి, జాతముఁ దెచ్చెన్

  జాతము = living being
  (ఆంధ్ర భారతి)

  రిప్లయితొలగించండి


 35. హుంకించెను దక్షునిపై
  శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
  తంకము గనసత్య కొరకు
  మంకుర మిద్దరు జిలేబి మగువలకు సుమీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 36. హుంకించెను దక్షునిపై
  శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
  తంకము గన సత్య కొరకు
  మంకుర మైకృష్ణుడు; భళి మగువల భాగ్యమ్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 37. బింకపు భస్మాసురునకు
  జంకుచు పారితివి నీవు ఛాఛా యనుచున్
  వంకలు పెట్టగ నభినవ
  శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి


 38. వంకల బెట్టెడు నెలతుక
  తంకము తాళక హిమగిరి దరిచేరి భళా
  డెంకణమిడి వర మున్ గొని
  శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి