22, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1271 (మాతను బెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
మాతను బెండ్లియాడి జనమాన్యుఁ డనంబడి పొందె సన్నుతుల్.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. ఖ్యాత యశోవిశాలుడు మహాత్ముడు రాముడు వింటి నూనగా
    నాతని చేతిలో విరిగె నా శివచాప మనూహ్యమౌ విధిన్
    చేతము పల్లవించినది సీతకు, నంతట రాముడా జగన్
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    జగన్మాత పెండ్లి ముచ్చటతో మాకు శుభోదయం కలిగించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. సాహితీ పురస్కార ప్రదానోత్సవము కార్యక్రమమునకు మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
    http://andhraamrutham.blogspot.in/2013/12/blog-post_22.html#.UrZm9tIW2i4

    రిప్లయితొలగించండి
  4. ఖ్యాతిగ తాటకిన్ దునిమి,యాగ సురక్షణఁ జేసి రాఘవుం
    డాతత భక్తితోడ గురునాజ్ఞను తా మిథిలా పురంబునన్
    బ్రాఁతిని చాపమున్ విరిచి,భక్తుల కల్పకమైన జానకీ
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  5. గూడ రఘురామ్ గారి తాతగారు కీ.శే. గూడ శ్రీరాములు గారి పూరణ....

    ఖ్యాతుఁడు దక్షిణేశ్వర మహర్షి జితాత్ముఁడు రామకృష్ణుఁ డీ
    క్ష్మాతరుణీగణమ్ము శుభకారిణి కాళిక మూర్తిమత్వ సం
    ధాతలె మాత లంచు జననాంతర సౌహృదమేమొ? ‘శారదా’
    మాతను బెండ్లియాడి జనమాన్యుఁ డనంబడి పొందె సన్నుతిన్.

    రిప్లయితొలగించండి
  6. చింతా రామకృష్ణారావు గారూ,
    మీ ఆహ్వానాన్ని అందుకొన్నాను. సంతోషం. రావాలనే సంకల్పం.. ఈశ్వరేచ్ఛ!
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. సీతను బెండ్లి యాడగను జేరిన మేటి పరాక్రమోన్నతుల్
    ఖ్యాతి వహించినట్టి ఘన క్షత్రియు లెల్లరు నీశు చాపమున్
    కాతరు లైరి యెత్తుటకు, కామన శ్రీ రఘురాము వంచి శ్రీ
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచితిని. అభినందనలు.
    2వ పాదములో ప్రాస నియమము పాటింపబడలేదు.
    నూతన యాటగాడు సమాసము సాధువు కాదు. క్రొత్త యాటగాడు అనుటయే సాధువు. సమాసములో మొదటి పదము సంస్కృతము అయినచో 2వ పదము కూడ సంస్కృతమే అయి ఉండవలెను.
    రీతిన ధావనుండు - రీతుల ధావనుండు అనండి.
    3వ పాదములో చివర గణభంగము కలదు.
    గదామాత అను పదము అర్థమగుట లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  9. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి శుభాశీస్సులు.
    మీ పద్యము చూచితిని. 3వ పాదములో అన్వయము సులభముగా లేదు.
    సీతా స్వయంవరము ఒక సభలో జరిగినట్లు అందులో ఎందరో రాజులు పాల్గొనినట్లు రామాయణములో లేదు. సినిమా కథలో మాత్రమే కలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    క్రికెట్ ఆటగాడు షిఖర్ ధావన్ పై
    ==============*===================
    దూతలు జెప్పగన్ పరగ దుర్ముఖి వత్సరమందు జన్మతా
    జాతకుడైన వాడు తన జాతికి జెందిన వారిజాక్షులన్
    కోతుల రీతి నెంచి ముదు కోమలి,బిడ్డల తల్లియైన నో
    "మాత"ను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్
    (పరగ దుర్ముఖి వత్సరమందు = సుభ ముహూర్తము జూడక)

    రిప్లయితొలగించండి
  11. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచితిని.
    జన్మతా జాతకుడు = అర్థము తెలియుట లేదు.
    ముదు కోమలి -- ముది కోమలియా?
    ఓ మాతను అనరాదు. ఒక మాతను అనవలెను.
    మరొక ప్రయత్నము చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
    మీ అమూల్య సూచనకు ధన్యవాదములు. ఈ పద్యము చూడండి

    సీత వివాహవార్త విని జేరిన రావణు డెత్త నట్టి ప్ర
    ఖ్యాతి వహించినట్టి శివ కార్ముక మున్ రఘురాముడెత్తి శ్రీ
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్
    ప్రీతిని పంచుచున్ ప్రజల రేడన రాజ్యము నేలె నేర్పుతో

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గురువర్యులకు వినమ్ర వందనాలు, దోషములను గుర్తించి ప్రోత్సహిస్తున్నందులకు ధన్యవాదములు, సవరణతో......

    జాతికి ప్రాతినిధ్య మిడ జంకని"ధావను" సుస్థిరమ్ముగా
    చేతన తోడ నాడుచు ప్రసిద్ధిని గాంచి క్రికెట్టు జట్టులో
    నూతన సభ్యుడయ్యెను వినూత్నముగా సుతులున్న తల్లియౌ
    మాతను బెండ్లి యాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    భూతల మంత పీఠమయె వ్యోమము చప్పరమాయె తారకల్
    జ్యోతులు యై విరాజిలగ సోముడు వచ్చెను నందికేశు పై
    ధాతయు విష్ణువున్ సురలు దండను భూత గణమ్ము తో జగ
    న్మాతను బెండ్లియాడి జనమాన్యుడనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  15. కూతురు పెండ్లి సేయ జనకుండు స్వయంవర వేడ్కలోపలన్
    భీతిలకుండ నెత్తి విలు విర్చిన వానికి సంతసమ్మునన్
    సీతమ తల్లి నిచ్చి మరి సేతును బెండ్లి యనంచు బల్క నా
    హూతుల మధ్య ద్రుంచె విలు నొక్కడె యా రఘురాము డప్పు డా
    మాతను బెండ్లియాడి జన మాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  16. Shankaraiah Boddu గారూ మీ పూరణ ---
    కూతురు పెండ్లి సేయ జనకుండు స్వయంవర వేడ్కలోపలన్
    భీతిలకుండ నెత్తి విలు విర్చిన వానికి సంతసమ్మునన్
    --------------------------
    చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. భూతల నాథు మాటవిని బుద్ధిగ రాముడు మ్రొక్కి గుర్వుకే
    చేతనుబట్టి యెత్తి విలు చేర్చగ నారిని దిక్కులన్నియున్
    భీతిల ముక్కలాయె మరి ప్రీతిగ మైథిలి మాలవేయ శ్రీ
    మాతను బెండ్లియాడి జన మాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి
  18. మాతను లోకమాతయగు మానిని గౌరిని పార్వతీసతిన్
    నూతన జన్మ నెత్తి పలు నోముల నోచిన కన్యకామణిన్
    పోతను పోసినట్టి యొక పున్నెపు రాశిని,యాదిదేవుడా
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి