11, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1260 (కారమె సుఖశాంతు లొసఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కారమె సుఖశాంతు లొసఁగు కష్టముఁ దీర్చున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. కోరము నిధి నిక్షేప ములను
  భారము కరువైన ప్రేమ బహు దుర్లభ మౌ
  దూరము జేయని ప్రియసహ
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్
  రిప్లయితొలగించండి
 2. మారిన లోకపు తీరున
  దారను వెదుకంగ తరమె ధరణిజ యంచున్
  బేరము లాడని సతిమమ
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 3. భారము జీవితమనుచును
  నీరస పడిపోక వృత్తి నేర్పును బడయన్
  గోరుచు చుట్టెడు యో శ్రీ
  కారమె సుఖశాంతు లొసఁగు కష్టము దీర్చున్.

  రిప్లయితొలగించండి
 4. "బేరములాడని మమకారమె..." బాగుంది, అక్కయ్యగారూ!

  రిప్లయితొలగించండి
 5. వారము రోజులు క్యాంపున
  నోరున్ మిక్కిలి చవిచెడెనో రామా! మా
  సారుకు కావలె పచ్చడి
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 6. వీరలు వారని దలఁపక
  కూరిమితో సకలజనులు కోరినరీతిన్
  మీరలు జేసెడి ప్రత్యుప
  కారమె సుఖశాంతులొసగు కష్టము దీర్చున్.

  రిప్లయితొలగించండి
 7. నేరము లెంచని నెచ్చెలి
  తీరుగ నుండిన బ్రతుకున తీపియె గాదా
  నారికి మేలగు నగ,నుడి
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 8. ఆరయ బంధు రి కంబులు
  వేరగు భావంబు గాక , విచ్చల విడిగన్
  మీరక , నలుగురి యా మమ
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 9. శ్రీరజతాద్రి నివాసులు
  భూరి కృపానిధులు పరమ పూజ్యులు నగు శ్రీ
  గౌరీ శంకరుల శుభా
  కారమె సుఖ శాంతు లిచ్చు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 10. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘నిధి’ తొలగిస్తే సరి!
  రెండవ పూరణలో ‘ధరణిజ పోల్కిన్’ అంటే బాగుంటుందేమో...
  *
  సహదేవుడు గారూ,
  వృత్తికి శ్రీకారం చుట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘యో శ్రీకారము’ను ‘యొక శ్రీకారము’ అనండి. లేదా ‘చుట్టెడు నా శ్రీకారము’ అన్నా బాగుంటుంది.
  *
  చంద్రశేఖర్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  అసలైన కారం రుచి చూపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రత్యుపకార పరంగా మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  నగ తెచ్చేవరకు కారాలు మిరియాలు నూరిన భార్య అది తెచ్చివ్వగానే చక్కగా మాట్లాడుతుంది, ఇంట్లో సుఖశాంతులు విలసిల్లుతాయన్న సత్యాన్ని (అందరికీ అనుభవమే) మీ పూరణలో చక్కగా చెప్పారు. బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాంధవ్యపు మమకారాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బంధురికాలు’ అనే క్రొత్త పదబంధాన్ని సృష్టించారు. దానిని ‘బాంధవ్యమ్ములు’ అని సవరించండి.
  *
  పండిత నేమాని వారూ,
  శివపార్వతుల శుభాకారాన్ని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  మమ కారము నశించిన మానవులకు కష్టము దీరుననుచు
  ==============*==================
  కారమె వరము ప్రభుతకున్ ( కారము=బలము )
  కారమె చెరసాల నేడు,కారమె జచ్చెన్,(కారము= మమకారము)
  కారమె కరియై గదలిన(కారము= నిశ్చయము)
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్!

  రిప్లయితొలగించండి
 12. భూరివిరాళపు దాతకు,
  పేరును నిరతము తలచెడి బేదకు నయినన్
  శౌరిని గొలిచెడి గుడి,ప్రా
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 13. శ్రీరామ పాలనముతో
  శ్రీరమ్యమ్ముగ నిరతము చెలగు ధరిత్రిన్
  పౌరుల ధార్మికమగు సం
  స్కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి

 14. ఒక పేద కవి భార్య, తన కవితలను రాజుగారికి అంకితమివ్వనని పట్టుబట్టిన భర్తను ఉద్దేసించి:

  "మారాము మాని వినుమా!
  కూరిమితోనొక్క కవిత కూర్చిచ్చినచో
  ఓ రాజుగారు చేయు స
  త్కారమె సుఖ శాంతులొసఁగు కష్టముఁ దీర్చున్!"

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు

  వారణపతి మత్తిలి సం
  సారజలధి మకరబద్ధ సంక్షోభితుడై
  నారాయణ!యనుచు నమ
  స్కారమె సుఖశాంతు లొసగు కష్టము దీర్చున్


  రిప్లయితొలగించండి
 16. పౌరుల శ్రేయమునే మది
  గోరుచు బహుళార్థములిడు గొప్ప పథకముల్
  ధారుణి నూనుటకున్ శ్రీ
  కారము సుఖ శాంతులొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 17. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు

  మరియొకపూరణ
  శ్రీ రామ రామ యనుచును
  తారక మంత్రము జపింప దర్శన మొసగున్
  క్షీరాబ్ధి శయను శాంతా
  కారమె సుఖశాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 18. వరప్రసాద్ గారూ,
  పద్యం బాగుంది. అభినందనలు.
  కానీ ‘కారము’ శబ్దానికి మీకు తోచిన అర్థాలను మీరే ఇచ్చుకుంటే ఎలా?
  *
  శైలజ గారూ,
  బాగుంది మీ పూరణ అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  సంస్కారంతో, శ్రీకారంతో మీరు చేసిన రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  పుష్యం గారూ,
  సత్కారంతో మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కూర్చి + ఇచ్చిన’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
  అక్కడ ‘కూర్చి యిడినచో’ అందాం.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మూడవ పాదాన్ని ‘శౌరీ యని యిడిన నమ/స్కారమె’ అంటే అన్వయలోపం పోతున్నది.

  రిప్లయితొలగించండి

 19. bhuvana vijayam on 14th evening 4pm at satish dhavan auditorium iisc bangalore.
  The event page for "Bhuvana Vijayamu" programme has been created. Below is the link
  Link : http://new.livestream.com/shaalelive/14dec2013
  Short link : http://bit.ly/1gw2FLE

  One can also look up www.live.shaale.com for the webcast..
  The recording will be done in Full HD, but live streaming may only be in 240p quality...
  This is due to the poor network signal strength in the auditorium..

  But, in any case, a Full HD video will be hosted on the same website after the event.
  mallapragada srimannarayanamurty - timmarasu,
  dhulipala mahadevamani- peddana,
  garikapati - tenali ramakrishna
  palaparti syamalananda - timmana
  . kommu subrahmanyavaraprasad - bhattumurti
  kota vankatalakshmi narasiha - dhurjati,
  errapragada ramakrishna - madayyagari mallana,
  kovela malayavasini - molla,
  ganesh - lolla lakshmi dharudu,
  t.v narayanarao - krishna devarayalu
  -------------------------
  Dr. Garikipati Narasimha Rao garu is going to perform "Ashtavadhanam" at RV Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore on 15-Dec-2013 at 10:00 AM.

  live streaming of the event link is given below..

  http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013

  Kindly circulate this among your friends who are interested.

  All are invited to the programs.

  రిప్లయితొలగించండి
 20. తీరని యాశల నెన్నడు
  కోరిన ఫలముండ బోదు కూరిమిగల శ్రీ
  శౌరీ కరుణా మృత సహ కారమె సుఖశాంతు లొసఁగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 21. శ్రీ ఆదిత్య గారి పద్యము

  దారము పూలను నిలిపెడి
  తీరున,నిలిపెను విభుండు త్రిజగతి,స్థిరమౌ
  ధారణ నిలిపిన తన ఓం
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 22. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
  వైవిధ్యముగా వ్రాయుటకు ప్రయత్నించి భంగ పడితిని గురువుగారు.

  రిప్లయితొలగించండి
 23. Details for Bhuvana Vijayam:

  Saturday,
  14th December, 2013 at
  Satish Dhawan Auditorium,
  IISc, Bangalore.

  Link for LIVE Streaming: http://new.livestream.com/shaalelive/14dec2013

  Address for "Ashtavadhanam":

  RV Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore. 15-Dec-2013 at 10:00 AM.

  Link for LIVE Streaming:
  http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు
  భాగవతుల కృష్ణా రావు గారి పూరణ

  చేరిరి పరమాత్మ దరిక
  పారముగా తప మొనర్చి పలువురు భక్తుల్
  తారక మంత్రంబగు నోం
  కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 25. ఓరిమితో పతిదేవుని
  కూరిమితో నాడు పడచు, కోడండ్రపయిన్
  నేరము లెంచని నీ మమ
  కారమె సుఖ శాంతు లిచ్చు కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 26. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శ౦కరయ్యగారికి వందనములు
  పతి దేవుని ఆదేశము
  మరియొక పూరణ
  కూరలు ప్రియమైనవి గద
  ఊరుంగాయలు మనింట నున్నవి సతిరో
  నోరూరగ గోంగూరపు
  కారమె సుఖ శాంతు లొసగు కష్టముదీర్చున్

  రిప్లయితొలగించండి 27. 1.
  నేరము చేయక యెన్నడు
  చేరక చెడు సహచరులను, చిత్తము హరిపై
  భారము నిలిపి పరులకుప
  కారమె సుఖశాంతు లొసగు కష్టము దీర్చున్
  2. ----------
  వారము విదేశ యాత్రల
  నీరసమగు తిండి తినుచు నే దిరుగంగా
  కూరలు ,పచ్చడి రుచిగను
  కారమె సుఖశాంతులొసగు కష్టము దీర్చున్.
  -----------

  రిప్లయితొలగించండి
 28. కోరిన వన్నియు దినుచు వి
  కారంబుగ బెంచు స్థూల కాయము కన్నన్
  భారీ కాని శరీ రా
  కారమె సుఖ శాంతు లిచ్చు కష్టము దీర్చున్.

  రిప్లయితొలగించండి
 29. గురువు గారికి ధన్యవాదములు.తమరి సవరణతో...

  భారము జీవితమనుచును
  నీరస పడిపోక వృత్తి నేర్పును బడయన్
  గోరుచు చుట్టెడు నా శ్రీ
  కారమె సుఖశాంతు లొసఁగు కష్టము దీర్చున్.

  మరియొక ప్రయత్నం:
  కారడవులఁజిక్కి మెకపు
  క్రూరత్వము హూంకరించఁ గుములుచు దుర్గన్
  నోరార వేడ తన మమ
  కారమె సుఖశాంతు లొసఁగి కష్టము దీర్చున్

  రిప్లయితొలగించండి
 30. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "శౌరీ" అని దీర్ఘాంతంగా ఉండరాదు. పులింగం కదా.. అక్కడ "శౌరి కరుణామృతపు సహ/కారమె..." అనండి.
  *
  ఆదిత్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  "టేక్ ఇట్ ఈజీ..."
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మమకారంతో మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు వవీందర్ గారూ,
  భగవత్సాక్షాత్కారంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  ఆకారాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. ఊరట కొఱకై వనమున
  తారట లాడుచు కనుగొన తామర లోనన్
  దూరెడి మధుపమ్ముల ఝం
  కారమె సుఖశాంతు లొసఁగు కష్టముఁ దీర్చున్

  రిప్లయితొలగించండి