కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కామితవరదుడు దశరథ
రిప్లయితొలగించండిరాముడు, విననియ్యకొనడు రామాయణమున్
భూమిన్ నాస్తికు డేలనొ
నామార్చన చేయబోడు, నమ్మడు స్వామిన్.
రాముడనే వ్యక్తి మతమార్పిడి మౌఢ్యమితో...
రిప్లయితొలగించండిఏమార్చగ మతమార్పిడి
తామారెను హిందువయ్యు(వైన) తమసము తోడన్
నీమమని నింట నెవరిన్
రాముడు వినఁనియ్యకొనఁడు రామాయణమున్
పామరులగు గోపాలుర
రిప్లయితొలగించండిక్షేమములను గోరి నిలుచు క్లేదుడు మనమం
దామిక గొనుచును యా బల
రాముడు విననియ్యకొనడు రామాయణమున్.
క్లేదుడు = రాజు
ఆమిక = అభిమానము, గర్వము
గురువు గారికి నమస్సులు. మిత్రుల పూరణ లద్భుతము !
రిప్లయితొలగించండిరామాయణ విషవృక్షము
పామరులే మెచ్చరెచట,పాతకి వ్రాయన్
గోమలుడౌ మా బావయు
రాముడు, విననియ్యకొనడు రామాయణమున్ !
మా బావగారు శ్రీ అభిరాముడికి అలాంటి పుస్తకా లిష్ట ముండవు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
==========&============
రామాయణమును రంకను
కాముక,భూమీశులెల్ల కలియుగ మందున్
రామా యని బిలచిన శ్రీ
రాముడు,విననియ్యకొనడు రామాయణమున్
కాముకులు రామ కోటి వ్రాసి జదువిన రామాయణమును వినలేరు
రిప్లయితొలగించండి==========*============
కాముకులు జేరి జై శ్రీ
రామ యనుచు రామ కోటి వ్రాసి జదువన్
సామజ వరదుం డగు శ్రీ
రాముడు విననియ్యకొనడు రామాయణమున్
ప।।గో॥జిల్లా భీమవరంలో మత మార్పిడి జేయుటకై నా గురుదేవుల పుత్రునికి(శ్రీ రామరాజు గారు) ఏసు క్రీస్తు విగ్రహము లొహపుది,రాముని విగ్రహము మట్టిది తీసుకోని క్రిందికి పడవేసి, రాముని విగ్రహము పగిలినది కావున రాముడు దేవుడు కాడు అని జెప్పినారు. వెంటనే పుత్రుడను స్కూలు మాన్పించి వేరే స్కూలులో జేర్పించి నారు.మా జిల్లాలో అత్యధికులు మతము మారిన వారే. అది
రిప్లయితొలగించండి============*==============
పామరులను బిల్చి నేడు బహు విధములగ బాదించి,
కోమల హృదయము నందు కోరికలన్ను బుట్టించు
గోముఖ వ్యాఘ్రము లైన గొప్ప వారల నెల్ల భువిని
రాముడు విననియ్యకొనడు రామాయణమును సుంతైన!
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినాస్తికుడు రామాయణాన్ని వినడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మతం మార్చుకున్నవాడిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తమసముతోడన్’ అన్నదానిని ‘తామసు డగుచున్’ అనండి. ‘తమస్సు’ ఉంది కాని ‘తమసము’ లేదు.
*
మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ బావగారు అభిరాముడు గారి ప్రస్తావనతో మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘వ్రాసియు’ లో ‘యు’ టైప్ చేయడం మరిచినట్టున్నారు.
సహదేవుడు గారి పద్యం నాలుగు పాదాలతో సలక్షణంగానె ఉంది కదా! మొదటివాక్యాన్ని పద్యంలో భాగంగా పొరబడ్డట్టున్నారు.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమతప్రచారకుల విషయమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
ప్రేమాయణమును జదువుచు
రిప్లయితొలగించండిరామా! నీరామకోటి వ్రాయునె జనులున్
తామస హరణా! అభినవ
రాముడు విననియ్యకొనడు రామాయణమున్
ఈ మానవ దేహంబిక
రిప్లయితొలగించండినే మాత్రము తాళగలదు యెంతని యోర్చున్
భామా? ఆకలి ! ఆత్మా
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వ్రాయునె జనులున్’ అన్నదాన్ని ‘వ్రాతురె జనులున్’ అనండి.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిఆత్మారాముడిపై మీ పూరణ చమత్కార జనకమై అలరించింది. అభినందనలు.
శైలజ గారి పూరణ, లక్ష్మీదేవి గారి పూరణ చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిరాముఁడు విన నియ్యకొనఁడు
రిప్లయితొలగించండిరామాయణమున్ పఠింప, రాముడు నతుడై
యేమిది చోద్యమె నడచుట
భూమీశుడు సత్పథాన పొండను వినినన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
నేమము లన్యాయమ్ముల
రాముడు విన నియ్య కొనడు .రామాయణమున్
భూమినిజీవుల ముక్తి కి
నా ముని వాల్మీకి వ్రాసె నారదు నానన్
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిఅవునండి టైపు జేయుటలో తప్పు దొర్లినది.
శ్రీ సహదేవుడు గారి మొదటివాక్యాన్ని పద్యంలో భాగంగా పొరబడ్డనండి.సహదేవుడు గారు క్షమించండి.
కోమలి వలదని చెప్పిన
రిప్లయితొలగించండిపామరుడై మతము మారె బైడిని గొని తా
నామత ప్రియుడై గడుసరి
రాముడు వినఁనియ్యకొనఁడు రామాయణమున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిచక్కని విరుపుతో మంచి పూరణ వ్రాసారు. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిజామున్నర ప్రొద్దెక్కెను
భామా యని యెంత బిలువ ,బల్కక పూజన్
దా మైమరచిన,నాత్మా
రాముడు విననియ్యకొనడు రామాయణమున్.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ
‘రామా రామా యిటురా’[రా,మారామా,యిటురా]
కోమలి కౌసల్య పిలిచె గుడుపగ సుతునిన్
ప్రేమగ నాటల మునిగిన
రాముడు విన నియ్య కొనడు రామా య[న]ణ మున్
గురుదేవులకు ధన్యవాదములు. తమరి సవరణతో పద్యం:
రిప్లయితొలగించండిఏమార్చగ మతమార్పిడి
తామారెను హిందువయ్యు(వైన) తామసుడగుచున్
నీమమని నింట నెవరిన్
రాముడు వినఁనియ్యకొనఁడు రామాయణమున్
పామరుని చెడ్డ మాటలు
రిప్లయితొలగించండిరాముడు విన నియ్య కొనడు, రామాయణ మున్
నేమము దప్పక చదివిన
రాముడె మఱి మనకు నిచ్చు రత్నపు సిరుల్
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిరాముడె యాతని నామము
రామునిగా పేరుగాంచె డ్రామాలందున్
దేముడు లేడను నాస్తిక
రాముడు విన నియ్యకొనడు రామాయణమున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ రెండవ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
విరుపుతో మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఏమని జెప్పుదు కొందరు
రిప్లయితొలగించండిసామాన్యులు గోరి చదువ చాలని బ్రతుకున్
ఏమాత్రము సాధ్య పడని
రాముడు విన నియ్య కొనడు రామాయణ మున్
ప ।। గో ॥జిల్లా సీతా రామ పురం మావూరు, గత 45 సంవత్సరములు గా శ్రీ రామ సప్తాహ మహోత్సవములు జరుగుచు న్నవి. కానీ నేడు మత మార్పిడి వల్ల భక్తులు కరవై వెలవెల బోచున్నది. 25 సంవత్సరముల క్రిందుట ఇసుక వేసినా రాలని జనుల తో జారుగు చుండె డిది. శ్రీ ఉష శ్రీ , శ్రీ కరిమేళ్ళ వర ప్రసాదు మొ . వారు వచ్చెడి వారు ,
రిప్లయితొలగించండిమరియొక పురాణ
===========*===============
రాముని భజనలు జేసిన
గ్రామము నందనిశము యమ ఘంటికలను శ్రీ
రాముడు విననియ్యకొనడు
రామాయణమును జదువుచు రామాలయమున్ !
రామ భక్త వరులున్నగ్రామము నందనిశమ్ము
రిప్లయితొలగించండికాముని నాట్యమ్ము, యముని ఘంటికలను,మృత్యు కేళి
రాముడు విననియ్యకొనడు,రామాయణమును జదువ ,
తామముల్ నశియించు గాద ధరనిజులకు రమ్యము గను
(తామములు=భయములు )
కవిమిత్రులు వరప్రసాద్ గారు బ్లాగులో నా పద్యం గురించిన వ్యాఖ్యలు మీరు చేసినట్లు కనబడలేదు.(గురువుగారి వ్యాఖ్యల్లో తప్ప) క్షమాపణ లెందు కండి. పరస్పర దోష చర్చలే కదా మన నైపుణ్యతను పెంచేది. స్వస్తి .
రిప్లయితొలగించండిక్షమించండి,
రిప్లయితొలగించండిశ్రీ ఉష శ్రీ గారు ,శ్రీ కరిమేళ్ళ వర ప్రసాదు గారు మొ .వారు వచ్చెడి వారు .
శ్రీ సహదేవుడు గారు మీ మంచి వాక్యములకు ధన్యవాదములు,ఆ వాఖ్యాలను తొలగించి తిని
రిప్లయితొలగించండిరామకథ చెవిన పడగనె
రిప్లయితొలగించండిమోమున చిరునగవు చిందు మూర్తి కనుల విం
దై మదినంతయునిండెడు
రాముడు విననియ్యకదడు రామాయణమున్ !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
గూడ రఘురాం గారూ,
బహుకాల దర్శనం! బాగుంది మీ పూరణ. అభినందనలు.
కోమలి ప్రేమను గొనుచు వి
రిప్లయితొలగించండిరామము లేకుండ నామె ప్రణయములోనన్
మైమరచిన వలపుల యభి
రాముడు విననియ్యకొనడు రామాయణమున్.
రిప్లయితొలగించండిఒక మనవడిని రామాయణము సీడీని కొనితెచ్చి ఇమ్మంటే ఇవ్వలేదని ఒక తాత ఆరోపణ..
నేముదుసలి వాడనురా
నామనుమడ తెమ్మునాకు నచ్చిన " సీడీ "
ప్రేమగ వినెదననిన మా
రాముడు విననియ్య, కొనడు రామాయణమున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసిడి కొనని మనుమని గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిఅభిరాముని ఉద్దేశించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
హనుమచ్ఛాస్త్రి గారూ శభాష్!
రిప్లయితొలగించండిరామాయణ నాటకమున
రిప్లయితొలగించండిరామునిగా రసికునొకని రప్పించంగన్
భామనుతా వీడుననగ
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్
రిప్లయితొలగించండివిననియ్య కొనడు అంటే అర్థం ఏమిటండి ?
జిలేబి
ఇయ్యకొను = సమ్మతించు
తొలగించండి(మీ ఆంధ్ర భారతి)
రిప్లయితొలగించండినోములు నోచుచు కంటిని
నా మణి హారమని మురిసి నాను హతవిధీ ,
సోమరి పోతు జిలేబీ,
రాముఁడు, విన నియ్యకొనఁడు రామాయణమున్
జోలాలి :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికోతులు సేతువు కట్టుట
రిప్లయితొలగించండికోతలె! నే నమ్మననుచు గొడవలు పడుచున్
ఘాతుక యేచురి సీతా
రాముఁడు విన నియ్యకొనఁడు రామాయణమున్