12, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1261 (శలభంబుల్ బడబాగ్ని నార్పె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్ము వెల్గొందఁగన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నువ్వు నేను సినిమాలో

    పాల వ్యాపారి కూతురూ-పారిశ్రామికవేత్త కొడుకూ
    ప్రేమించుకుంటే - పెద్దలు ఒప్పుకోరు !
    విద్యార్థులంతా ఏకమై
    నడిరోడ్డుమీద - పెద్దల సమక్షంలో
    పోలీసులకు భయపడకుండా
    వాళ్ళకు పెళ్ళి జరిపిస్తారు !
    ఆ సన్నివేశంలోనిది - ఈ పాట

    చినుకు చినుకు ఒకటై - తుదకు వరద లవదా
    గరిక గరిక ఒకటై - ఇనుప సంకెలవదా
    ------------------
    ఏకమైన కుర్రకారు - ఉప్పెనల్లె ఉరుకుతారు
    ప్రేమకోసమంటె వారు - ప్రాణమైన వదులుతారు

    అయ్యా ! అదీ సందర్భం !
    http://www.youtube.com/watch?v=TJgccC2jiu8
    చిత్తగించండి !

    01)
    _________________________________________

    బలవంతుండగు తండ్రి యడ్డుపడి , రా- పాడించగా నెంచినన్
    ఇలలో నెన్నడు లేనిరీతి పలు , లా - ఠీ వారి మధ్యంబునన్
    పలికేరందరు ముక్తకంఠమున, గా - పాడంగ , బృందంబుగన్
    వలపున్ జిక్కిన ప్రేమజంట కట , సౌ - భాగ్యంబు గల్పించగన్ !
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితో - త్సాహమ్ము వెల్గొందఁగన్ !
    _________________________________________
    లాఠీవారు = పోలీసులు

    రిప్లయితొలగించండి
  2. సేతుబంధనము గావించిన సింగిళీకములు :

    02)
    _________________________________________

    కలుషాత్ముండగు రావణాసురుని, ప్రా - కారమ్ము భేదింపగన్
    జలధిన్ దాటగ నెంచు రామునకు , వా - త్సల్యంబుతో సేతువున్
    దలపై రాళ్ళను మోసి , కట్టె గద , సీ - తా మాత నే జేరగన్ !
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితో - త్సాహమ్ము వెల్గొందఁగన్ !
    _________________________________________
    సింగిళీకము = కోతి

    రిప్లయితొలగించండి
  3. వలలో చిక్కిన చిత్రగ్రీవుని బృందం :
    http://www.telugudanam.co.in/kalaksheapam/kathalu/manchi_mitruDu.php

    03)
    _________________________________________

    ఇలపై గాంచిన వడ్ల కాశపడి,తా - మిక్కట్ల పాలైననూ
    వలలో జిక్కిన పక్షిబృంద మదె, భా - వంబందు వాపోవకన్
    వలతో సైతము పైకి పోయె, తమ యా - వాసంబు నే జేరగన్
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితో - త్సాహమ్ము వెల్గొందఁగన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  4. అల ఘోరాటవినందు రావణుడు సీతమ్మన్ కుబుద్ధిన్ తపో
    బల గర్వాంధత తస్కరింపగ దివాభాగమ్మునన్ దీవ్ర సం
    కుల సంగ్రామము సల్పెగాదె ధృతి చేకూరన్ జటాయుండు తాఁ,
    శలభంబుల్ బడబాగ్నినాపె నమితోత్సాహమ్ము వెల్గొందగాన్.

    రిప్లయితొలగించండి
  5. పలుకే శాసనమంచు కాంగ్రెసు సభా పక్షాధినేతల్ భువిన్
    జెలగన్ బెక్కు విధాలుగా జనతతుల్ సీమాంధ్రలో ఖిన్నులై
    తెలుగుంజాతి సమైక్యతన్ నిలుపరే తీక్ష్ణోద్యమోద్దీప్తులై
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్ము వెల్గొందగన్

    రిప్లయితొలగించండి
  6. చలి చీమల్ పెను పాము జంపెనను సత్సాహిత్య సిద్ధాంతముల్
    పలు పెన్మూకలు వాన రమ్ములవి కంపమ్మొండ్రు పుట్టించె కో
    మలి నాశించిన రావణుండను నసామాన్యుండు రారాజుకున్,
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్ము వెల్గొందఁగన్.

    పండితుల వారి మాట సత్యమగునట్లు భగవంతుని ఆశీస్సులు లభించు గాక!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ భాగవతుల కృష్ణారావు గారికి నమస్కారములు.

    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    పద్యములో అన్వయము మా బోంట్లకు అందుట లేదు. సమస్యలో బడబాగ్ని నార్పె అని యుండగా మీ పూరణలో బడబాగ్ని రాల్చె అని యున్నది. 3వ పాదములో గణభంగము కలదు. బడబాగ్ని అంటే సముద్ర జలములలో నుండు అగ్ని. మీరు కానలలో నుండు దావాగ్ని గురించి వ్రాసేరు. కాస్త పరిశీలించండి.

    రిప్లయితొలగించండి

  8. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    కలయన్ జూచెను కుంభ కర్ణుడు నగాకారుండు యౌర్వాగ్నియై
    శలభంబుల్ వలె చుట్టె కోతులతనిన్ చావంగ సంసిద్ధమై
    బలవంతు౦డగు రామచంద్రు డసురన్ వైకుంఠమున్ కంపగన్
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్మువెల్గొందగన్




    రిప్లయితొలగించండి

  9. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    కలయన్ జూచెను కుంభ కర్ణుడు నగాకారుండు యౌర్వాగ్నియై
    శలభంబుల్ వలె చుట్టె కోతులతనిన్ చావంగ సంసిద్ధమై
    బలవంతు౦డగు రామచంద్రు డసురన్ వైకుంఠమున్ కంపగన్
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్మువెల్గొందగన్




    రిప్లయితొలగించండి
  10. కలలో గాంచని రీతియె న్నికల సంగ్రామంబులో చి త్తుగా
    నిల జన్మించిన క్రొత్త పార్టి పలు నేతాడ్యాది సంపంనులన్
    అలరా రోటమి పాలొనర్చెను నవీ 'నామాద్మి' పార్టే సుమీ
    శలభంబుల్ బడబాగ్నినాపె నమితోత్సాహమ్ము వెల్గొందగాన్.

    రిప్లయితొలగించండి
  11. కలలో గాంచని రీతియె న్నికల సంగ్రామంబులో చి త్తుగా
    నిల జన్మించిన క్రొత్త పార్టి పలు నేతీడ్యాది సంపంనులన్
    అలరా రోటమి పాలొనర్చెను నవీ 'నామాద్మి' పార్టే సుమీ
    శలభంబుల్ బడబాగ్నినాపె నమితోత్సాహమ్ము వెల్గొందగాన్.



    రిప్లయితొలగించండి
  12. నా పద్యాన్ని క్రింది విధముగా సవరణ చేయడమైనది గమనించ గలరు.

    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితో త్సాహంబు వెల్గొందగన్
    కలగాంచె న్నొక నాటి రాతిరిని లంకాధీశు డా స్వప్నముం
    గల సైన్యంబు కపీశ్వరుండలిగి తా గంభీరుడై రువ్వు మం
    టల కాతండె భయంబునన్ పరుగు లెట్టంజేసి రారాతిరిన్


    రిప్లయితొలగించండి
  13. మిత్ర్రులారా!
    ఈనాటి సమస్యకు పూరణలు ఎక్కువగా రాలేదు. పూరణలు బాగుగనె యున్నవి. ప్రయత్నించి నింపి పంపిన మిత్రులందరికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అలసో ముండట వెండి కొండపతి హేలారీతి మ్రింగెన్ గదా
    నిల దాక్షాయణి మంగళం బనుచు నా యీసున్ సురల్ మెచ్చ గా
    కలనైనన్ తలపింప నోపదు మదిన్ కాకోల వైషమ్య మున్
    శల భంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహంబు వెల్గొం దగన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని మరియు శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు
    నేత +ఈడ్య = నేతేడ్య గుణసంధి యగును, పొరపాటున రెండు పద్యాలలో కుసంధి జరిగింది గమనించ క్షమించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కుతులు.
    రెండు రోజులుగా ఒక మిత్రుని కూతురు పెళ్ళికార్యక్రమానికి వెళ్ళి వ్యస్తుణ్ణై ఉన్నాను. నిన్న కొద్దిగా అవకాశం దొరికినప్పుడు నేమాని వారి వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోస్ట్ చెయ్యగలిగాను.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు....
    వసంత్ కిశోర్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. కలతల్ రేపెడు నీచ మానవులు సంస్కారంబు లోపింపగా
    పలు చందంబుల యుగ్రచర్యలను విశ్వంబంత సృష్టింపగా
    జ్వలితంబౌ బడబాగ్నికీలలను విజ్ఞానాస్త్ర రూపమ్మునన్
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్మువెల్గొందగన్

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. Elections 2019:

    చెలువం బొప్పెడు రాజకీయ వనిలో శీఘ్రంబుగా సాగుచున్
    బలుపౌ మోడియె మంట బెట్టగనువే వాక్యాల కాష్ఠాలతో
    కలగాంచెన్ ఖుషి రాహులుండు తనతో కాంగ్రేసు మూర్ఖుండులౌ
    శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్ము వెల్గొందఁగన్

    రిప్లయితొలగించండి