10, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1259 (గంగానది తెలుఁగునాఁట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
గంగానది తెలుఁగునాఁట గలగల పాఱున్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. గంగా జలమును గ్రోలిన
    మంగళ కరమగు నటంచు మహిమా న్వితమౌ
    లింగా నీ కరుణ వలన
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్
    ==========================================
    గంగను దెచ్చితి పూజకు
    నెంగిలి వల దంది చేప నేమని జెప్పన్
    లింగని శిరమున దిరిగెడి
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  2. మంగళ కరమగు గంగను
    జంగమ దేవర శిరనిడి జగతికి నీయన్
    ఎంగిలి యంటని పావన
    గంగా నది తెలు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  3. రంగారు తోయముల కడు-
    గంగా భద్రాద్రి రామ కంజ పదములన్
    పొంగును గౌతమి దక్షిణ-
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  4. సంగమ తావులయందున
    గంగా తానమును జేయ గలుగును పుణ్యమ్
    మంగళకరముగ దక్షిణ
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  5. రంగున తెలుపై మెరయును
    సింగారిగ రాము చెంత శ్రీ గోదారే
    హంగుగనెండకు నల వెలు
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  6. పొంగెడి కృష్ణ జలమ్ముల
    సింగారపు కాలువలను చెన్నపురముకై
    హంగుగ జేర్చుటకు తెలుగు
    గంగానది తెలుఁగునాఁట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  7. కంగును తినిరఖిల జనులు
    చెంగున గెల్వగ, తెలుగుకు చేసెను మేలున్;
    హంగుగ చెన్నని పురికిన్
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్

    భావం: రాయకపోతే అర్ధం కాదేమోనని రాస్తున్నా.
    ఎన్.టీ.రామారావు తెలుగు గంగ గురించే సుమా!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు


    పొంగెను హృదయము నడు మూ
    గంగా నది తెనుగు నాట గలగల పారెన్
    బంగరు పంటలు పండెను
    సంగీతము వెల్లివిరిసె సౌఖ్యము లొదవెన్

    రిప్లయితొలగించండి
  9. సంగీతపు పోటీ లను
    రంగమ్మున నలరుచుండ రహి చిన్నారుల్
    సంగీతాద్భుత రసమయ
    గంగానది తెలుగు నాట గలగల పారున్

    రిప్లయితొలగించండి
  10. భంగము లొక వరు వరుసను
    గంగా నది తెలుగు నాట గలగల పాఱు న్
    భంగములు సాల గలిగిన
    లింగోద్భ వు డొసగ దయను లేములు దొలగెన్

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాఋఇ పూరణలన్నియు నలరారుచున్నవి. అందరికీ అభీందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మీ 2వ పద్యము 2వ పాదమును ఇలాగ మార్చుదాం:

    నెంగిలి వలదనెను చేప యేమని చెప్పన్

    శ్రీమతి శైలజ గారు:
    మీ 1వ పద్యములో శిరనిడికి బదులుగా తలనిడి అందాము.
    2వ పద్యమును ఇలాగ మార్చుదాము:

    గంగా సీమల....
    గంగా స్నానమున నొదవు కద పుణ్యంబుల్
    .........
    ..........

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమాని గురువుగారికి ప్రణామములు,..
    మీరు వ్రాసిన పద్యం అద్బుతంగా వుంది...

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    భాగవతుల కృష్ణారావుగారి పూరణ
    పొంగిన ఘనగోదావరి
    సంగీత స్వరఝరులను సవ్వడి సేయన్
    బంగారపు పంటకు వే
    గంగా నది తెనుగునాట గలగలపారెన్

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించండి.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    గురువుగారి సూచనలను గమనించారు కదా!
    *
    మిస్సన్న గారూ,
    దక్షిణ గంగన ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గంగను వెలుగంగజేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    తెలుగుగంగను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కృష్ణజలమ్ముల..’ అన్నదానిని ‘కృష్ణాజలముల’ అనండి.
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    నడుమూగంగ జేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సంగీత రసగంగలో ముంచిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    వేగంగా నదిని పారించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగాను, చక్కగాను ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. బంగరు భావములు పలు తె
    రంగుల మన శంకరాభరణమున కవితల్
    పొంగగ నవరస భాస్వత్
    గంగా నది తెలుగు నాట గల గల పారున్

    రిప్లయితొలగించండి
  16. అమ్మా లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    చెన్నపురముకై అన్నారు కదా. (చెన్నపురమునకై అనుట సాధుప్రయోగము.) చెన్నై పురికై అందామా.

    అయ్యా! వేంకటప్పయ్య గారూ!
    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.
    చెంగున గెల్వ తెలుగుకున్ అన్నారు. (తెలుగునకు అనుట సాధు ప్రయోగము.) చెంగున గెలువ తెలుగునకు అందామా.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమానిగురుదేవులకు పాదాభి వందనములతో .....

    శ్రీ శబరి గిరివాసుని దర్శించి ఈ ఉదయమే బెంగుళూరుకు జేరుకుంటిమి.
    మార్గమధ్యమమున శ్రీ మదేశ్వర బెట్ట దర్శించితిమి ఆడవుల మధ్యన ఆలయము బహు సుందరముగానున్నది.
    అక్కడ పాడిన కీర్తనలు విని వాటిని తెనుగున బాడిన తెలుగు నేల పై రసగంగ పారుననుచు..
    ===========*=============
    గంగాధరుని గన జనులు
    శృంగార రసమును ద్రాగి,సింగారమునన్
    పొంగుచు బాడగనే రస
    గంగా నది తెలుగునాట గలగల పారున్.

    రిప్లయితొలగించండి
  18. స్వాములు పొగ ద్రాగుచు నున్నారు అది
    ==========*==============
    శృంగారముగను బట్టిరి
    శృంగము కరమున ఖలులగు సింగారులు నా
    భంగిమ తో నడువగ, పొగ
    గంగా నది తెలుగునాట గలగల పారున్.
    (శృంగము= సిగరెట్టు)

    రిప్లయితొలగించండి
  19. మంగళ కర తోయము లిడు
    బంగరు పంటలను, రైతు బాంధవి! యెదలు-
    ప్పొంగగ గౌతమి, యింపెస-
    గంగా నది తెలుగునాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  20. బంగారు భవిత శూన్యము!
    రంగములన్నింట జూడ లాభము కలదా?
    క్రుంగమె? విభజనతో నే
    గంగా నది తెలుగు నాట గలగల పాఱున్?

    రిప్లయితొలగించండి
  21. గురువుగారికి ప్రణామములు.

    మన శంకరాభరణం అనే తెలుగునాట..............

    మంగళకరభావంబుల
    భంగములై పండితాళి పాదంబులతోన్
    శృంగార నూత్న కవితల
    గంగా నది తెలుగునాట గలగల పారున్.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురుదేవులు యాత్రను నానందించుచు మమ్ము తమ పద్యములతో,సవరణలతో ఆనందింపజేయుచున్నారు.మీ యాత్ర శుభయాత్రగా సాగిపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ.......

    తెలుగు ప్రజల మధ్య విషము జిమ్మినారు,అది ద్రాగిన వారి మధ్య విషము తుంగ వలె బెరుగగ స్నేహగంగా పారునా?
    ============*=============
    జంగమ వలె బట్టిరి కడు
    జంగూలము తెలుగు వారు జక్కగ నిలలో
    తుంగ వలె బెరుగగ నెటుల
    గంగా నది తెలుగునాట గలగల పారున్ ?
    జంగూలము =విషము

    రిప్లయితొలగించండి
  23. భక్తి లేని వారు భక్తి ముసుగులో శబరిమలకు వచ్చు చున్నారు.
    ==========*===========
    ఇంగిత మించుక గలిగిన
    కొంగలు భక్తియనురక్తి కొంగున గట్టన్
    నంగడి లో కొని,యెట్టుల
    గంగా నది తెలుగునాట గలగల పాఱున్ ?

    రిప్లయితొలగించండి
  24. శృంగార కవులు బట్టగ
    శృంగము కరమునను కడు విచిత్రపు భంగిన్
    పొంగెను సుమధుర పద్యపు
    గంగా నది తెలుగునాట గలగల పాఱున్!

    తెలుగునాడు = శంకరాభరణం

    రిప్లయితొలగించండి
  25. మరియొక ప్రయత్నము:

    బంగారపు తెలుగే యెస
    గంగా మన దేశ భాషగా భరతభువిన్
    హంగులతో బొంగులతో
    గంగానది తెలుగు నాట గల గల పారున్

    రిప్లయితొలగించండి
  26. మంగళమయి త్ర్యంబక గిరి
    శృంగముపై నుండి జారి శ్రీ గౌతమి తా
    పొంగుచు వచ్చిన దక్షిణ
    గంగా నది, తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  27. పండిత నేమాని వారూ,
    దూరదేశంలో ఉండి కూడా మిత్రుల పద్యాల గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ తాజా రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ ఐదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘కట్టన్ +అంగడి’ అన్నప్పుడు ‘కట్ట న్నంగడి’ అనండి. ఇటువంటి పూర్వకవుల ప్రయోగాలు కొన్ని ఉన్నాయి. అంతేకాని ‘కట్టన్ నంగడి’ అని వ్రాయకండి.
    *
    మిస్సన్న గారూ,
    ఇంపెసగంగ జేసే గౌతమిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    సమస్యను ప్రశ్నగా మార్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ శంకరయ్య గురుదేవులకు సవరణకు ధన్యవాదములతో...
    =============*=============
    ఇంగిత మించుక గలిగిన
    కొంగలు భక్తియనురక్తి కొంగున కట్ట
    న్నంగడి లో కొని,యెట్టుల
    గంగా నది తెలుగునాట గలగల పాఱున్ ?

    రిప్లయితొలగించండి




  29. పొంగుచు గోదావరియె య
    భంగతరంగముల తోడ బావనమై యెం
    చంగను దక్షిణ దిశలో
    గంగానది తెలుగునాట గలగల పారున్.

    రిప్లయితొలగించండి
  30. నాగరాజు రవీందర్ గారూ,
    ‘పెన్’గంగతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    దక్షిణగంగను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    గంగను యార్యావర్తము కే
    కంగా సరి పుచ్చ సబబు గాదనగా నా
    లింగడు యిచ్చెను దక్షిణ
    గంగానది .తెనుగునాట గలగల పారెన్

    రిప్లయితొలగించండి
  32. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని వ్యాకరణ దోషములను సవరించవలెను.

    గంగను + ఆర్యావర్తము = గంగను నార్యావర్తము అగును
    ఆర్యావర్తముకే అనరాదు : ఆర్యావర్తమునకే అనవలెను.
    ఏకంగా : ఏకముగా అనుట సాధు ప్రయోగము.
    లింగడు + ఇచ్చెను అనుచోట సంధి జరిగి లింగడిచ్చెను అగును.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. పండిత నేమాని గారికీ మీసూచనలకు
    ధన్యవాదములు. సవరణలతో
    పద్యమునుపరిశీలించండి

    గంగను నుత్తరభారత
    కంగన సరి పుచ్చ సబబు గాదనగా నా
    లింగ౦డిచ్చెను దక్షిణ
    గంగానది .తెనుగునాట గలగల పారెన్

    రిప్లయితొలగించండి
  34. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    దోషములను సూచించి సవరించ మనవి.....

    నింగిని దాటిన గంగా
    పొంగుతు పరవశమునొంది పొర్లుతు పృథ్విన్
    సంగాతించిన దక్షిణ
    గంగా నది, తెలుగు నాట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  35. హంగులతో తెలగాణన
    బంగరు పథకమున మిషను భాగీరథగా
    పొంగుచు త్రుళ్ళుచు పరుగిడు
    గంగానది తెలుఁగునాఁట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి
  36. బంగారు భాగ్య నగరిని
    శృంగారపు వీధులందు చిడిముడి తోడన్
    కంగారున వాన కురియ
    గంగానది తెలుఁగునాఁట గలగల పాఱున్

    రిప్లయితొలగించండి