కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య.
ఈ సమస్యకు స్ఫూర్తి మొన్నటి బెంగుళూరు భువనవిజయంలో ఇచ్చిన సమస్య.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య.
ఈ సమస్యకు స్ఫూర్తి మొన్నటి బెంగుళూరు భువనవిజయంలో ఇచ్చిన సమస్య.
ధనికులైన వారు తగు పరిశ్రమలను
రిప్లయితొలగించండినెలకొలుప దలచిన స్థలములందు
కట్టడముల కొరకు నెట్టి జాప్యము లేక
తరువుల బడగొట్ట తప్పదయ్య!
నేల యీని నంత చాలని జనులకు
రిప్లయితొలగించండిరమ్య నిలయ మైన హర్మ్య ములట
ప్రాణ మున్న ద్రుమము బలి యైన కొఱతేమి
తరువుల బడ గొట్ట దప్ప దయ్య
రిప్లయితొలగించండితన కట్టౌట్లను ఎందు తీసేస్తున్నారన్న రాజకీయనాయకునికి నగర మేయరు సమాధానము:
ఎన్నికలకు ముందు ఏపైన కట్టౌట్లు
నిలుప సబబు గాని, నేడదేల?
ఎన్నికలవి ముగిసి ఏడాది దాటె, చి
త్తరువుల బడగొట్ట తప్పదయ్య!
పుష్యంగారూ,
రిప్లయితొలగించండిబాగుంది.
భూమి చాలదంచు భూరి జనులు కూడి
తరువుల బడగొట్ట- తప్పదయ్య
ప్రకృతి నాశనమ్ము ప్రళయ ప్రకోపమ్ము
సుంత యోచనమ్ము కొంత మేలు.
పాఠశాలముందు పరమ శృంగారంపు
రిప్లయితొలగించండిభంగిమలను జూపు భామినీల
' సినిమ ' బొమ్మలన్ని చించి కాల్చుచు, చి
త్తరువుల బడగొట్ట దప్పదయ్య.
సామ్యవాద మిపుడు స్థాపించు లక్ష్యసా
రిప్లయితొలగించండిధనమునందు మిగుల ధనికులైన
వారలకును పేదవారికి నడుమ యం
తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య
మీరి కట్టితిరని మీదు గృహంబును
రిప్లయితొలగించండికొలత జూపి దాని గుర్తు వైచి
పాలనాధి కారి వలదని యొసగ ను
త్తరువులఁ బడగొట్ట తప్ప దయ్య
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిజనబాహుళ్యానికి ఉపాధికోసం కట్టబడే ఫ్యాక్టరీ కోసం అక్కడి చెట్లను నరకండం తప్పులేదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
పెరుగుతున్న జనాభాకు గృహవసతి కల్పించడానికి చెట్లు కొట్టవచ్చునంటారు. బాగుంది పూరణ. అభినందనలు.
*
పుష్యం గారూ,
కాలదోషం పట్టిన చిత్తరువులను పడగొట్టవచ్చునన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
పర్యావరణ పరిరక్షణ అంశంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పాఠశాల పరిసరాల్లో శృంగార చిత్రాలు వద్దన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
అనుమతి లేని నిర్మాణాలు పడగొట్టడం అన్న అంశంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
అడవి వెం బ డిమఱి యనువుగ రహ దారి
రిప్లయితొలగించండివేయు కొఱకు నచట విస్త రించు
తరువుల బడ గొట్ట దప్ప దయ్య ! మనకు
సకల సుగుణ యుతుడ ! శంక రార్య!
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
============*=================
నూరు ఏండ్లు నిండి నోరు దెరచి నట్టి
తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య,
క్రొత్త తరువు నాటి కూరిమి నొందగా
తప్పు గాదు రామ,ధరణి యందు!
1. కాలము చెల్లిన శాసనములు రద్దు జేసి క్రొత్తవి జేయమనుచు
2. చనిపోయిన చెట్లను నరికి క్రొత్తవి నాట మనుచు
ప్రాణి జాతి కెల్ల ప్రాణము మ్రానులు
రిప్లయితొలగించండిపెంచ వలయు గాని త్రుంచ బోకు
చేయ కున్న మేలు చెడు చేష్ట విడనాడు
తరువులఁ బడఁగొట్టఁ, దప్పదయ్య!
శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
నూరు ఏండ్ల అని విసంధిగా నుంచరాదు. ఇక్కడ సంధి నిత్యమగును.
శ్రె శంకరయ్య గారు! శుభాశీస్సులు.
మీ ప్రయోగము "అంతరువుల" చాల బాగుగ నున్నది. అభినందనలు.
శ్రె గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
భామినీల అనుట బాగులేదు. భామినుల అనుట సాధువు.
స్వస్తి.
మగువ లేగు మార్గ మధ్యమందునపొంచి
రిప్లయితొలగించండిప్రాణ ద్రవ్య మాన భాగ్యములను
దోచు కొనుచు దిరుగు దుష్టపు మూకల
తరువుల బడగొట్ట తప్పదయ్య
డిసెంబర్ 18, 2013 1:00 PM
వరుని తరపు వారు వచ్చుచున్నా రదే
రిప్లయితొలగించండిమేళ తాలములను మేళవించి
పరిమళాలు మించు పన్నీరు మంచి య-
త్తరువులఁ బడఁగొట్టఁ దప్పదయ్య
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిరహదారి నిర్మాణానికి చెట్లను కొట్టడంలో తప్పు లేదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
జీర్ణవృక్షాలను పడగొట్టి క్రొత్తవి నాటాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నూరు + ఏండ్లు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘నూరు సాళ్ళు నిండి’ అందామా?
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
చెట్లను కూల్చరాదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీరూ సహదేవుని బాట పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
దుష్టులనెడి చెట్లను పడగొట్టాలంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
అత్తరుల గుబాళింపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
ప్రకృతి జనిత పెను తుఫానుల బారిని
పెళ్లగింప బడుచు పృథ్వి పైన
రాకపోక కంత రాయమ్ము గల్పించు
తరువు లబడ గొట్ట దప్పదయ్య
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండితుఫానులో కూలిన చెట్లను తొలగించాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
తుఫానుకు కూలి అంతరాయం కలిగిస్తాయేమో అని ఉన్నవాటిని ఇప్పుడే తొలగించాలంటారా?
‘జనిత పెను తుఫాను’ అన్నదానిని ‘జనితమైన తుఫాను’ అనండి.
శ్రీ తిమ్మాజీ రావు గారూ & శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ తిమ్మాజీ రావు గారి పద్యములో సూచించ బడిన సవరణ "జనితమైన పెను తుఫాను" కూడా అక్కడ సరిపోదు. గణభంగము లేకుండా సవరించ వలసి యున్నది.
స్వస్తి.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
దైవసృష్టి లోన జీవించ తరులకు
హక్కు గలదు వాని నాశ్రయించి
బ్రతుకు పక్షి గణము స్వార్ధ పరుడ వయి
తరువుల బడ గొట్ట దప్పదయ్య[తప్పు +అది +అయ్య]
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నేను ముందు అనుకున్నది ‘జనిత మగు తుఫాను...’ అని. టైపు చేసే సమయంలో పొరపాటు దొర్లింది.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండికొండ కోనలందు గోప్యముగానుండి
తరువు వెనుక దాగి ధరణి గూల్చు
ఉగ్రవాదుల నిపుడురితీయ నచ్చటి
తరువుల బడ గొట్ట దప్పదయ్య
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే ఉగ్రవాదులు అడవుల్లో దాక్కుంటారని అడవులను నిర్మూలించాలంటారా? ఎలుకల్ని చంపడానికి ఇల్లు తగులబెట్టినట్లు... :-)
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిప్రగతి కొరకు క్రొత్త బాట వేయునపుడు
రిప్లయితొలగించండిబాటల కిరు వైపు పాదపముల
నాటి పెంచుచు మరి బాట కడ్డము వచ్చు
తరువుల బడగొట్ట తప్పదయ్య .
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిదారి కడ్డంగా ఉన్న చెట్లను తొలగించడంతో పాటు, దారి కిరువైపులా చెట్లను నాటాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ నేమానివారూ ! మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సూచనపై సవరణతో...
పాఠశాలముందు పరమ శృంగారంపు
భంగిమలను జూపు భామలున్న
' సినిమ ' బొమ్మలన్ని చించి కాల్చగ , చి
త్తరువుల బడగొట్ట దప్పదయ్య.
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండినా అభిప్రాయం :- వృక్షాలు మళ్లీ మొలకెత్తుతాయి. ఉగ్రవాదం అరికట్టబడుతుంది కదా !!! :-)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి