25, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1274 (క్రిస్మస్ నాఁ డవతరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
క్రిస్మస్ నాఁ డవతరించెఁ గృష్ణుఁడు భువిపై.

27 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు !

  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఈ విషయం రహస్యంగా
  ఉస్మాన్-ఇస్మాయిలునకు చెబుతుంటే
  విని విస్మయము నొందినది నేను !
  ఎవరికీ చెప్పకండేం - అతి రహస్యం :

  01)
  ___________________________________

  కిస్మిస్ తినుచును జెప్పె
  న్నుస్మానిస్మాయిలునకు - నోహో యనగన్ !
  విస్మయము గలుగ వింటిని
  కిస్మస్ నాడవతరించె - గృష్ణుడు భువిపై !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 2. "భస్మాసురుణ్ణి చంపిన హరియే,క్రీస్తన్నా కృష్ణుడన్నా"
  ఏసుక్రీస్తు" హరికథ చెబుతూ ఒక హరిదాసు :

  02)
  ___________________________________

  అస్మద్వచనము వినుడీ
  విస్మయ మొందెడి విషయము - వీనుల విందౌ !
  భస్మాసురునే జంపిన,
  క్రిస్మస్ నాడవతరించె - గృష్ణుడు భువిపై !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. బిస్మిల్లాఖను - భీమునితో
  అయ్యా ! యెందుకాశ్చర్యం !
  నేను సతతమూ స్మరించే కృష్ణుడే
  క్రిస్మస్ నాడవతరించిన క్రీస్తు " :

  03)
  ___________________________________

  విస్మయమొందగ నేలా ?
  బిస్మిల్లాఖాను జెప్పె - భీముని తోడన్ !
  నే స్మరణ జేయు వాడగు
  క్రిస్మస్ నాడవతరించె - గృష్ణుడు భువిపై !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 4. విస్మయము గాదు వినుటకు
  తస్మాత్ జాగ్రత్త నిజము ధన్యత నొందన్
  అస్మద్ దివిజు లనంతులు
  క్రస్మస్ నాడవత రించె గృష్ణుడు భువిపై

  రిప్లయితొలగించండి
 5. కుస్మితి నాతో చెప్పినదని
  సుస్మితి-విస్మితి తో చెప్పిన వైనం :

  04)
  ___________________________________

  సుస్మితి చెప్పె న్నగుచును
  విస్మితితో వివర మంత - వినవే యనుచున్
  కుస్మితి చెప్పెను నాతో
  "క్రిస్మస్ నాడవతరించె - గృష్ణుడు భువిపై" !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 6. భస్మారావు చెప్పినా గాని ఆవిడకు నమ్మకం కుదర్లే :

  05)
  ___________________________________

  అస్మాకము విన కున్నను
  భస్మారావనెడి వాడు - వాదన జేసెన్
  విస్మయము వింటి నే డిదె
  "క్రిస్మస్ నాడవతరించె - గృష్ణుడు భువిపై" !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 7. సుస్మిత వదనుడు క్రీస్తీ
  క్రిస్మస్ నాడవతరించె, కృష్ణుడు భువిపై
  విస్మయము గొల్పి యష్టమి
  నస్మద్రక్షణకు జన్మనందెను నాడున్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 8. క్షమించాలి చివరి పాదం
  క్రిస్మస్ .....అని ఉండాలి

  రిప్లయితొలగించండి

 9. అస్మత్ పుత్రుడు వీడే
  కిస్మత్ నాకుంది గనుక కేవలమొకడే
  సుస్మితముఖ హరివేడగ
  క్రిస్మస్ నాడవతరించె, కృష్ణుడు భువిపై.

  రిప్లయితొలగించండి
 10. అస్మత్ పుత్రుడు వీడే
  కిస్మత్ నాకుంది గనుక కేవలమొకడే
  సుస్మితముఖు హరివేడగ
  క్రిస్మస్ నాడవతరించె, కృష్ణుడు భువిపై.

  రిప్లయితొలగించండి
 11. అస్మిత జెప్పెను నాతో
  కిస్మిస్ కాజులనువేసి ఖీరును తినుచున్
  విస్మయ ముగలిగె వినగా
  క్రిస్మస్ నాడవతరించె- - గృష్ణుడు భువిపై

  రిప్లయితొలగించండి
 12. అస్మత్ కవితా సుందరి
  క్రిస్మస్ నాడవ తరించె , గృష్ణుడు భువిపై
  విస్మయము గలుగు నట్లుగ
  భస్మా సురు జంపి ప్రజల బాధలు దీ ర్చెన్

  రిప్లయితొలగించండి
 13. అస్మత్ కవితా సుందరి
  క్రిస్మస్ నాడవ తరించె , గృష్ణుడు భువిపై
  విస్మయము గలుగు నట్లుగ
  భస్మా సురు జంపి ప్రజల బాధలు దీ ర్చెన్

  రిప్లయితొలగించండి
 14. విస్మయము గాదొకటనగ
  యా స్మరహరుడు,హరి, యేసు నవతారమ్ముల్
  సుస్మితు డన్నియు తానే
  క్రిస్మస్ నాడవతరించె గృష్ణుడు భువిపై!

  రిప్లయితొలగించండి
 15. విస్మయముగాదొక టనగ
  యా స్మరహరుని,హరి, యేసు నవతారమ్ముల్
  సుస్మితు డన్నియు తానే
  క్రిస్మస్ నాడవతరించె గృష్ణుడు భువిపై!

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈ నాటి సమస్యకు స్పందించి పద్యరచనము కావించిన అందరికి అభినందనలు. అందరి పూరణలు అలరించు చున్నవి. స్వస్తి

  రిప్లయితొలగించండి
 17. కృష్ణ భగవానుడు గీతలో ధర్మసంస్థాపనార్థము అవతరిస్తానని పలికినట్లే అవసరార్ధము క్రీస్తుగా అవతరించాడన్న భావంతో...

  విస్మయ మందగ నేల? చి
  రస్మరణీయంపు గీత రాల్చిన విధమే
  సుస్మిత వదనుఁడు క్రీస్తుగ
  క్రిస్మస్ నాడవతరించె కృష్ణుడు భువిపై?

  రిప్లయితొలగించండి
 18. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  కిస్మత్ గలవాడు బలికె
  క్రిస్మస్ నాఁ డవతరించెఁ గృష్ణుఁడు భువిపై
  విస్మయమొందిన శ్రోతలు
  తస్మాత్ జాగ్రత్త యనిరి దండింపకనే!

  రిప్లయితొలగించండి

 19. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  పూరణ :విస్మృతి నొందిర ?కృష్ణుడు
  అస్మిన్ మార్గమ్ము తానె యంచును తెలిపెన్
  తస్మిన్ తిథి కృష్ణాష్టమి ;
  క్రిస్మసు నాడవతరించె కృష్ణుడు భువిలో

  రిప్లయితొలగించండి
 20. అస్ముఖు డేసూ ప్రభు వీ
  క్రిస్మస్ నాడవతరించె; కృష్ణుడు భువిపై
  కిస్మత్ గల దేవకికిన్
  విస్మయమొనరించ బుట్టె వినుడష్టమిలో.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  మరొక పూరణ

  క్రిస్మస్ "డే" నే డష్టమి
  క్రిస్మస్ దినమయ్యెనటుల కృష్ణాష్టమిగ
  న్నస్మ ద్భాగ్యముగా నీ
  క్రిస్మస్ నా డవతరించె గృష్ణుడు భువిపై

  రిప్లయితొలగించండి
 22. ఇస్మైల్ వంశపు జీసస్
  క్రిస్మస్ నాడవతరించె;-కృష్ణుడు భువిలో
  నస్మద్భక్తుల బ్రోవగ
  విస్మయ విధి నవతరించె విబుధులు కొలువన్

  రిప్లయితొలగించండి
 23. విస్మయ మొందగ పాపులు
  సుస్మరణను జేయ బుధులు శుభుడై పుట్టెన్
  సుస్మిత! దేవుడు క్రీస్తై
  కిస్మస్నా డవతరించె గృష్ణుడు భువిపై !

  రిప్లయితొలగించండి
 24. మెస్మెరిజ మందు జీస
  స్సస్మాద్ కృష్ణుండనెదరు సద్గుణ శీలుల్
  విస్మయ మేమున్నదిచట?
  క్రిస్మస్ నాఁ డవతరించెఁ గృష్ణుఁడు
  భువిపై

  రిప్లయితొలగించండి


 25. విస్మయ మనగన్ జీసస్
  క్రిస్మస్ నాఁ డవతరించె; గృష్ణుఁడు భువిపై
  విస్మాపనగన్ చెఱలో
  తస్మాత్జాగ్రత్త యనెను తరుణి జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి