కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
పార్వతీ వల్లభుండు కృపామయుండు
రిప్లయితొలగించండితాపసులకు పూజ్యుడు కదా! దశముఖుండు
పరమ భక్తితో నవ్విభు పాదపద్మ
ములను ధ్యానించుచుండి సమ్ముదమునొందు
పంచముఖుని మ్రొక్కుదురుగా పరమ తాప
రిప్లయితొలగించండిసులు ధరనునిజమునెరిగి, చూడ తలలె
యెక్కువున్నవి వీడికనెగురు శుష్క
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
జప తపమ్ముల రావణు జాడ వేరు,
రిప్లయితొలగించండిపెద్దలెల్లరు జూడగ పేగు దెంచి
వేద నాదాలు పలికించె వేళ్ళ తోనె
తాపసులకు బూజ్యుడు కదా దశ ముఖుండు!
(జాడ = ముద్ర అనే అర్ధం తో రాసాను)
(రావణుడు మహా గొప్ప భక్తుడు. తపస్సు విషయం లో నిష్ట లో అనుసరించదగిన వాడు. ప్రతి రోజూ కోటి శివలింగాలకు అభిషేకం చేసేవాడట)
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
============*==============
జగతి నేలు వాని జెలిమి జనని కోర,
కూర్మి తోడాత్మలింగము కొరకు ఘోర
తపము జేసి వరము నొంద!ధరణి యందు
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
కపట తాపసి వేషాన కలికి సీత
నపహరించిన ఘనుడని యమరె నవని
స్త్రీల జెరబట్టి మోసము సేయు కపట
తాపసులకు బూజ్యుడు గదా దశముఖుండు
సకల శుభములు గలిగించు శంక రుండు
రిప్లయితొలగించండితాపసులకు బూజ్యుడు గదా , దశ ముఖుండు
ప్రతి ది నంబును నుదయాన భక్తి తోడ
కోటి లింగము లర్చించు మేటి గుణుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిఅతుల నిష్ణాతుడై తపమాచరించి
వరములెన్నియొ పొందె రావణుడు, గోర
దైవ దర్శనమే లేక తనువు వీడు
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు
భక్త వత్సలుడుభవుడు పంచ ముఖుడు
రిప్లయితొలగించండితాపసులకు పూజ్యుడు కదా! దశముఖుండు
సకల విధ్యాసంపన్నుడు సద్గుణుండు
పరమ శివభక్తిపరుడు పండితుండు
తల్లి కోరిక నాలించి తనయు డాత్మ
రిప్లయితొలగించండిలింగమును బొంద నడివిలో భంగ పడక
జేసె హరుగూర్చి తపమును , శివని భక్త
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
జ్ఞాననిధి యయ్యు కామవికారమయుడు
రిప్లయితొలగించండిపశు గుణమ్ములు కలిగిన వాడును పర
సతుల గోరుచునుండును జనక రాట్సు
తా! పసులకు పూజ్యుడు కదా దశముఖుండు
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
కొన్ని సూచనలు:
ఎక్కువ + ఉన్నవి = ఎక్కువ యున్నవి అగును.
వీడికి అనరాదు - వీనికి అనుట సాధువు.
గురు అనుటకు బదులుగా గురువు అని గాని గురుడు అని గాని అనుట సాధువు.
శ్రీ వరప్రసాద్ గారు:
శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
కొన్ని సూచనలు:
జగతినేలు వాని చెలిమి అనవలెను. జెలిమి కాదు.
తపము జేసి వరము నొందె అనుట బాగుగ నుండును.
శ్రీ కృష్ణారావు గారు:
నమస్కారములు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
దైవ దర్శనమే లేక తనువు వీడు తాపసులకు - అనుటలో మీ భావము మా బోంట్లకు తెలియుట లేదు.
శ్రీమతి శైలజ గారు:
శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
3 4 పాదములలో గణ భంగము కలదు. ఇలాగ సవరించుదాము:
3 వ పాదములో: సకల విద్యా నిధానుడు అందాము.
4వ పాదములో: భక్తి పరుడును అందాము.
శ్రీ లక్ష్మీనారాయణ గారు:
శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
టైపు పొరపాటులు కావచ్చు - సవరించుదాము:
అడవిలో అందాము - మరియు శివుని భక్తి అందాము.
స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ
“తాపసులకు బూజ్యుడు గదా దశముఖుండు”
ననగ జెల్లును యసురా౦శజనన మంది
కామప్రేరితుడై పరకాంత జెరచి
మాన భంగమ్ము గావించు మాన్యులకును
పండితనేమాని గారికి వందనములు నాపూరణలు
రిప్లయితొలగించండితమరిపరిశీలనాదృష్టికి నోచుకోనందుకువిచారిస్తున్నాను
ఆత్మ లింగము కొరకై యహరహమ్ము
రిప్లయితొలగించండితపము నొనరించి మెప్పించె త్ర్యంబకుడిని
శివుని నామమ్ము స్మరియించు చిత్తము గల
తాపసులకు బూజ్యుడు గదా దశముఖుండు.
శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 2 పద్యములను చూచితిని. 1వ పద్యములో సవరణలకు అవసరము లేదు. అందుచేత నేను ప్రత్యేకముగా వ్రాయలేదు. 2వ పద్యములో చెల్లును + అసురాంశ అనుచోట యడాగమము రాదు. సంధి నిత్యము. సవరణలు అవసరమగుచో నేను తప్పక వ్రాస్తాను. మీరు విచారించ వలదు. మా యందు మీకున్న గురు భావమునకు మాకు సంతోషముగా నున్నది. స్వస్తి.
శ్రీ బొడ్డు శంకరయ్య గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సవరణలు:
కొరకై కి బదులుగా కోరుచు అందాము.
త్ర్యంబకుడినికి బదులుగా త్ర్యంబకేశు అందాము.
స్వస్తి.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
సవరణ జేసిన పద్యమును పరిశీలించండి
“తాపసులకు బూజ్యుడు గదా దశముఖుండు”
ననగ జెల్లును దనుజా౦శజనన మంది
కామప్రేరితుడై పరకాంత జెరచి
మాన భంగమ్ము గావించు మాన్యులకును
పండిత నేమాని గురువర్యులకు నమస్సులు, సవరణకు ధన్యవాదములు. సవరణతో.....
రిప్లయితొలగించండిఆత్మ లింగము గోరుచు నహరహమ్ము
తపము నొనరించి మెప్పించె త్ర్యంబకేశు
శివుని నామమ్ము స్మరియించు చిత్తము గల
తాపసులకు బూజ్యుడు గదా దశముఖుండు.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి అందరి పూరణలును అలరించుచున్నవి. మంచి పద్యములను రచించిన మిత్రులు --
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
శ్రీ టేకుమళ్ళ వేంకటప్పయ్య గారికి
శ్రీ కందుల వరప్రసాద్ గారికి
శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారికి
శ్రీ సుబ్బా రావు గారికి
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారికి
శ్రీమతి శైలజ గారికి
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి
అభినందనలు. స్వస్తి.
శ్రీ నేమాని వారికి నమస్కారములు. మీ చూపిన సవరణతో..
రిప్లయితొలగించండివీనికని + ఎగురు ..అని నాభావన...సరియైనదేనా..తెలుపగలరు....
మీ తా .. పసుల విరుపు ..భలే ..భలే...
పంచముఖుని మ్రొక్కుదురుగా పరమ తాప
సులు ధరనునిజమునెరిగి, చూడ తలలె
యెక్కువైయుండె వీనికనెగురు శుష్క
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ తాజా పద్యమును చూచితిని. వీని కని ఎగురు అను ప్రయోగములో ఇకార సంధికి అవకాశము లేదు. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న ఉదయం మా వృద్ధాశ్రమంలో అయ్యప్ప పడిపూజ జరిగింది. రాత్రి మరో భక్తుని ఇంట్లో పడిపూజకు పిలిచారు. అందువల్ల రోజంతా వ్యస్తుణ్ణై బ్లాగు వీక్షించడానికి అవకాశం దొరకలేదు. మన్నించండి.
పండిత నేమాని శిష్యవాత్సల్యంతో మిత్రుల పూరణ గుణదోష విచారణ చేసినందుకు ధన్యవాదాలు.
చక్కని పూరణల నందించిన...
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి,
వరప్రసాద్ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
సుబ్బారావు గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
శైలజ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ నేమాని వారికి, మాస్టరుగారికి ధన్యవాదములు..
రిప్లయితొలగించండినా పూరణ ..సవరణతో...
పంచముఖుని మ్రొక్కుదురుగా పరమ తాప
సులు ధరనునిజమునెరిగి, చూడ తలలె
ద్విగుణమనుచును గణుతించు గుణపు శుష్క
తాపసులకుఁ బూజ్యుఁడు గదా దశముఖుండు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ తాజా సవరణతో పద్యమును చూచితిని. అభినందనలు. 3వ పాదములో మీరు యతిని సమముగా గమనించ లేదు. స్వస్తి.
స్వార్థపరతతో గూడిన చపలచిత్త
రిప్లయితొలగించండిముగల వారకు, పోగాలములిక దాపు
రించినట్టి వారకు , బుద్ధి లేని యట్టి
తాపసులకు పూజ్యుడు కదా దశముఖుండు