31, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1279 (భ్రూణహత్యలఁ జేయుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును.

26 కామెంట్‌లు:

 1. తరిచి చూడగ నిజమేమొ తరతరాలు
  కట్టి కుడిపెడి దుష్కృత కార్యమగును
  భ్రూణహత్యలఁ జేయుట;; పుణ్య మగును
  వారి పోషణ చేపట్టి వలపుఁజూప!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించ నున్నవి !

  ఈ నాడు లో యీ రోజు వార్త !
  భార్యను 20 యేళ్ళుగా బయటి ప్రపంచం చూడకుండా
  ఒక చీకటి గదిలో బంధించిన భర్త !

  నిన్నటి వార్త !
  ఒంటరి మహిళపై 15 మంది పాశవికంగా అత్యాచారం !

  ఈ దుర్యోధన, దుశ్శాసన , దుర్వినీతుల్ని బహిరంగంగా ఉరి తియ్యాలి !
  అమ్మకాబోయే ఆడవారిని అపురూపంగా చూచుకోవాలి !

  01)
  ___________________________________

  బరువు పనులేమి చెప్పక - భావమునను
  దిష్టి తీయించి తినిపించ - తీపి రుచుల
  నిత్యసంతోషమును , మంచి - నిదుర గలుగ
  పనస పండును బోలు పా - పాయి నిచ్చు
  భ్రూణ ! హత్యల జేయుట - పుణ్య మగును
  పుష్కరాక్షుల బాధించు - పోకిరీళ్ళ
  నాడు వారిని హింసించు - నధమ జనుల
  న్యాయ మెంచక నత్యంత - హేయముగను!
  ___________________________________
  భావమునను = ప్రేమగా
  భ్రూణ = గర్భవతి

  రిప్లయితొలగించండి
 3. చాలి చాలని బ్రతుకుల సంగ రమున
  అగ్ని కాహుతి జేసి నిమగ్న మగుచు
  నిత్య ప్రళయపు నృత్యంపు నెలవు కంటె
  భ్రూణ హత్యల జేయుట పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 4. కల్మషాలకు నిలయమౌ కలియుగాన
  మానవత్వము నశియించి, మమతలుడిగి,
  హృదిని విపరీతధోరణుల్ ముదిరినపుడు
  భ్రూణహత్యల జేయుట పుణ్యమగును.

  రిప్లయితొలగించండి
 5. జన్యు పరమైన లోపాల చక్క బెట్ట
  వీలు కానట్టి విపరీత వేళ లోన
  పుడమిఁ వెతలతో వైకల్య పుట్టు కంటె
  వైద్య నిపుణులకీ నాడు సాధ్య పడెడు
  భ్రూణ హత్యలఁ జేయుట పుణ్యమగును

  రిప్లయితొలగించండి
 6. కన్ను మిన్నును గానక కనగలేక
  పుట్టకుండగ జేయుచు పుట్టిముంచు
  వారి కిట్టుల జెప్పిన - "పాపమగును
  భ్రూణహత్యలఁ జేయుట " - పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 7. నిన్నటి దత్తపదికి నా పూరణ...

  అభిమన్యుని మరణ వార్త విన్న అర్జునుని శపథం...

  ఇటుల సుతునెవడ్రా చంప నిచ్చె, వింటి
  సైంధవుండని వాడిని చంపకున్న
  వింటి విడుతును వినుమనీ మంటలోని
  కిట్టు వెడలెద నంచెక్కు పెట్టె విల్లు.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
  కరువు కాటకములు,కాలుష్యము లందు బిడ్డలను పెంచుటకన్న బిడ్డలు లేకుండుట మంచి దని.
  ===============*===============
  కరువు చెరువు గట్లును ద్రుంచి ఖరము వలెను
  నరుల నరములందు వడిగ పరుగు బెట్ట
  భ్రూణ హత్యల జేయుట పుణ్య మగును
  కలుష కాలకూటము కన్న,కలియుగమున!

  రిప్లయితొలగించండి
 9. గురుదేవు లందరూ చదివి తమ అభిప్రాయములు దెలుప ప్రార్థన !

  స్త్రీను జూచిన భక్తి బావము కలుగనంత వరకు

  ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతుల్ని బహిరంగంగా ఉరి తియ్యాలి ! మంచిదే కానీ సమస్యకు పరిష్కారము దొరకునా ?

  ఈ దుర్యోధన, దుశ్శాసనులు పుట్టుచున్నది తల్లి,తండ్రి గ్రుడ్డి వారైన,

  ముందుగా తల్లి :

  నేటి తల్లులు తమ అందము కొరకు, పెంపుడు జంతువుల కొరకు వెచ్చించు సమయము పిల్లల కొరకు వెచ్చించుచుట లేదు.

  పిల్లలు తల్లికిచ్చు మర్యాద,గౌరవములు తండ్రికివ్వరు. తల్లి పిల్లలకు మంచి చెడులు భోధించిన పైన పేర్కొన్న దుర్వి నీతులు సగము తగ్గును.

  కనుక తల్లి అంటే "స్త్రీ " సమస్యకు పరిష్కారము వెదకవలెను.

  తండ్రి :

  ధనము సంపాదించుటలో తీరిక లేకున్నది యని బలుకును, కానీ సిగరెట్టు కాల్చుటకు క్లబ్బులకు పోవు సమయము, నేను సంపాదించిన ధనముతో పిల్లలు,పెండ్లము ఏమి జేయుచున్నారని జూచిన జాలు ఈ దుర్వి నీతులు మరో సగము తగ్గును,

  మిగిలిన 25% దుర్వి నీతులు సంఘమును జూచి మారును. టివిలలో వచ్చు సీరియళ్ళ ను నిలిపిన జాలు ఆడువారిలో సంస్కారము పెరుగును. సీరియళ్ళ నిండుగా పచ్చి " XY " పలుకులు . పిల్లలు ఆ బలుకులు విని సంస్కార హీనులై నడచుచున్నారు.

  కావున ముందుగా తల్లి దండ్రుల ఆలోచనలలో మార్పు రావలెను లేకున్న దుర్వి నీతులు పెరుగుదురు తప్ప తగ్గరు .

  రిప్లయితొలగించండి

 10. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  పిదప కాలమ్ము వచ్చిన వృక్షమునకు
  కుక్క మూతి పి౦దెలు కల్గి కూలురీతి
  మానభ౦గమ్ముజేయుట మాన్యమైన
  భ్రూణ హత్యలు జేయుట పుణ్యమగును

  రిప్లయితొలగించండి
 11. మిగుల పాపమగును గద మేదిని మఱి
  భ్రూ ణ హత్యల జేయుట, పుణ్య మగును
  చెత్త బుట్టల బాపల చేర దీసి
  యాదరంబున వారిని నాదు కొనిన

  రిప్లయితొలగించండి
 12. భ్రూణహత్యల జేయుట పుణ్యమగున
  ని పలుకరెవరు, పాపమని తెలుపు దురు
  కాని, పాప పుణ్యముల ప్రక్కన బెట్టి
  చేయు చున్నారు హత్యలన్ జేటుమూడు.

  రిప్లయితొలగించండి
 13. మానవత్వము మమతను మరచి జనులు
  భార మగునని బలిజేయ పాపమగును
  భ్రూణహత్యల జేయుట,పుణ్యమగును
  ఆదరించగ వారిని అమ్మ వలెను

  రిప్లయితొలగించండి
 14. భ్రూణహత్యల జేయుట పుణ్యమగున
  ని పలుకరెవరు, పాపమని తెలుపు దురు
  కాని, పాప పుణ్యముల బ్రక్కకువదలియు
  చేయు చున్నారు హత్యలన్ జేటుమూడు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  నరుల మేధను మించు ననంతు డొకడు
  సకల జీవుల సృష్టించి సాకు చుండ
  నుసురు దీయుట పాపమైయుండ, నెటుల
  భ్రూణ హత్యల జేయుట పుణ్య మగును ?

  మరొక పూరణ

  ప్రసవ వేదన వికటించి ప్రాణములకు
  హాని కల్గించు గర్భిణికనుచు బలుకు
  వైద్య నిపుణుల సలహాల వైనమెరుగ
  భ్రూణ హత్యల జేయుట పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 16. వరప్రసాద్ గారి ఆవేదన ఆలోచించాల్సన విషయమే,తల్లిఁదండ్రు లెల్లరూ బాధ్యతాయుతంగా తమపిల్లలను పెంచడము గురించి నేడు కచ్చితంగా ఆలోచిస్తారని భావిస్తాను.

  రిప్లయితొలగించండి

 17. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ:
  ప్రగతి సూచకమ్ములు నూత్న వత్సరముకు
  నమవసతిథిని ప్రారంభ మగుటచేత
  చట్ట బద్ధము సేతురు సమ్మతించ
  భ్రూణ హత్యలు సేయుట. పుణ్య మగును

  రిప్లయితొలగించండి
 18. వరప్రసాద్ గారు చెప్పినట్లు తల్లిదండ్రుల వల్లనే పిల్లలు పాడవుతున్నట్టయితే

  ముందు తల్లిదండ్రులందర్నీ ఉరి తీసేస్తే పోలా ???

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న మా బంధువు మరణిస్తే వెళ్ళాను. ఇంతకు ముందే హోంకు చేరుకున్నాను. అందువల్ల నిన్నటి మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి. వీలైతే ఈరోజు సమీక్షిస్తాను.

  రిప్లయితొలగించండి
 20. నిన్నటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు
  ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  హరి వేంకత సత్యనారాయణ మూర్తి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  వరప్రసాద్ గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  సుబ్బారావు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  శైలజ గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి