మన తెలుగు అన్నారు... వెంపలి చెట్టు చాలా పీలగా మనిషి ఎత్తుమాత్రం ఉంటుంది. గూగుల్ లో tephrosia spinosa అని కొట్టండి, బొమ్మ కనిపిస్తుంది. ఇంకొక విషయం, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం "వెంపలి చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కాల్సి౦టుంది"ట. అంటే మనుషులు మరీ పొట్టివాళ్ళలాగా పుడతారట. ఆజానుబాహువులు ఉండరట భవిష్యత్తులో.
ప్రణామములు గురువుగారు..చిన్న సందేహము..పంచపాదము మన మిత్రులు వాడుట ఇంతకు ముందు చూసాను..అయితే అది ఏ సందర్హంలో వాడుతారో నాకు తెలియదు.. బావం పూర్తి అయినట్లు అనిపించక ఇక్కడ పంచ పాదం వ్రాశాను..సందేహ నివృత్తి చేయగలరని ఆశిస్తూ,..తప్పయిన మన్నించ ప్రార్ధన
గట్టి గొలుసుతొ మామిడి చెట్టునకును కట్టుడేనుగున్, వెంపలి చెట్టునకును నిచ్చెనలువేయు వీరులు నిజముగాను వత్తు రనుచుబ్రహ్మముగారు బల్కె వింత లెన్నొ! వినుడుసుజనులార వీరి గాధ
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఎర్ర చందనపు దొంగలు రెచ్చి పోతున్నా చర్యలు మృగ్యం ! ============*============== పట్టు దప్పి వనము నందు పరుగు బెట్ట బలికె మంత్రి వర్యులు, వేగ పట్టి దెచ్చి కట్టు డేనుగున్,వెంపలి చెట్టునకును శిక్ష వేయుదు సేవకా!స్థిరము గాను!
పండిత నేమాని వారూ, ఐతిహాసికమైన ఉదాహరణతో సమస్యను చక్కగా పరిష్కరించారు. మంచి పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బొమ్మ ఏనుగును కట్టివేయుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, చంద్రశేఖర్ గారి వివరణతో మీ సందేహం తీరింది కదా! మీ పూరణ పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడనట్లే ఉంది. వెంపలి చెట్టుకు ఏనుగును కట్టమన్నారు... * చంద్రశేఖర్ గారూ, చక్కని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. * శైలజ గారూ, చెప్పవలసిన భావం పూర్తి కానప్పుడు ఎక్కువపాదాలతో పద్యం వ్రాయవచ్చు. దోషం లేదు. అయితే ఆటవెలది, కంద పద్యాలకు మాత్రం ఈ సౌలభ్యం లేదు. విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పినారు. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. నేమాని వారి సవరణలను గమనించారు కదా! * వరప్రసాద్ గారూ, దొంగల నుద్దేశించి మీరు చెప్పిన రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, వైద్యుడి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రస్తావనతో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, మీ తాజా పూరణ అలరించింది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘చెట్టునకును + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెట్టునకు ననగ’ అవుతుంది. కాని గణదోషం అవుతుంది.
కేరళ లో ఏనుగులను పెంచెదరు వారి పై =============*============== పాలు ద్రాగి ముదము నొంది పరుగు బెట్టి పాడు జేయు చున్నది నేడు పంట లెల్ల కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును వెలగ కాయలు వీసుడు వేయు మయ్య
బొడ్డు శంకరయ్య గారూ, సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ తాజా పూరణ కూడా బాగుంది. అభినందనలు.
కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును
రిప్లయితొలగించండిఫలితమేమగు? తృటిలోన భగ్న మగును
ధార్తరాష్ట్రులు బంధింప దలచి కృష్ణు
భంగపడలేదె కురు సభా భవన మందు?
బాలకులతోడ నీమాట బాలుడాడె
రిప్లయితొలగించండినాడుకొనుచును బొమ్మల తోడుగాను
" గుఱ్ఱమునకున్ గుగ్గిళ్ళు కుడువబెట్టి
కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును."
వెంపలి చెట్టు అంటే ఏమని తెలియలేదు గురువుగారూ,ఏదో మునగ చెట్టు మాదిరే తేలికయినదని తెలుస్తున్నది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమన తెలుగు అన్నారు...
రిప్లయితొలగించండివెంపలి చెట్టు చాలా పీలగా మనిషి ఎత్తుమాత్రం ఉంటుంది. గూగుల్ లో tephrosia spinosa అని కొట్టండి, బొమ్మ కనిపిస్తుంది. ఇంకొక విషయం, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం "వెంపలి చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కాల్సి౦టుంది"ట. అంటే మనుషులు మరీ పొట్టివాళ్ళలాగా పుడతారట. ఆజానుబాహువులు ఉండరట భవిష్యత్తులో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రణామములు గురువుగారు..చిన్న సందేహము..పంచపాదము మన మిత్రులు వాడుట ఇంతకు ముందు చూసాను..అయితే అది ఏ సందర్హంలో వాడుతారో నాకు తెలియదు.. బావం పూర్తి అయినట్లు అనిపించక ఇక్కడ పంచ పాదం వ్రాశాను..సందేహ నివృత్తి చేయగలరని ఆశిస్తూ,..తప్పయిన మన్నించ ప్రార్ధన
రిప్లయితొలగించండిగట్టి గొలుసుతొ మామిడి చెట్టునకును
కట్టుడేనుగున్, వెంపలి చెట్టునకును
నిచ్చెనలువేయు వీరులు నిజముగాను
వత్తు రనుచుబ్రహ్మముగారు బల్కె వింత
లెన్నొ! వినుడుసుజనులార వీరి గాధ
విచ్చల విడిగా దిరుగుచు రచ్చ జేసె
రిప్లయితొలగించండికట్టు డేనుగున్ , వెంపలి చెట్టునకును
కొమ్మ లుండును జూచితె ? కొమ్మ లార!
యెక్క డైనను దానిని నివ్వ సుధను !
చంద్ర శేఖరు గారూ,
రిప్లయితొలగించండిఆసక్తికరమైన సమాచారము.
ధన్యవాదాలండి.
యజ్ఞశాల చిత్తరువిది యద్భుతముగ
నున్నదో పిల్లలార!లిదో యిచటను
కట్టుడా యజ్ఞపశువునక్కంబమునకు,
కట్టుఁ డేనుఁగున్ వెంపలిచెట్టునకును.
మహిని యత్యంత బలమైన మర్రి, దాన్ని
రిప్లయితొలగించండిపెల్లగించదు దానికే బిగియ మీరు
కట్టు డేనుగున్; వెంపలి చెట్టు నకును
తెలివి హీనులు కట్టినా నిలువ గలదె !
శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సవరణలతో:
మర్రి బలమైన దగుట నా క్ష్మారుహమును
.......
.......
కట్టుచో నది నిలచునే క్షణమునేని
గట్టి నిగళము చేబూని కంబమునకు
రిప్లయితొలగించండికట్టు డేనుగున్, వెంపలి చెట్టునకును
కట్టి నానిలు వగలదే, గసురు కొనుచు
రాజు బలికెను భటులతో రాజ సమున
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఎర్ర చందనపు దొంగలు రెచ్చి పోతున్నా చర్యలు మృగ్యం !
============*==============
పట్టు దప్పి వనము నందు పరుగు బెట్ట
బలికె మంత్రి వర్యులు, వేగ పట్టి దెచ్చి
కట్టు డేనుగున్,వెంపలి చెట్టునకును
శిక్ష వేయుదు సేవకా!స్థిరము గాను!
( ఏనుగు = దొంగలు )
ఇసుక దొంగలు రెచ్చి పోతున్నా చర్యలుశూన్యం!
రిప్లయితొలగించండి============*==============
ఇసుక యందు పొరలు గున్న యేనుగు మద
గజము వలె దిరుగుచు నుండ,గట్టి గాను
గట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును,
దంతములను ద్రుంచెద నేడు దండి గాను!
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
”ప్రజల సేమమ్ము నాశించి త్వరితముగను
కట్టుడేనుగున్ . వెంపలి చెట్టునకును
మదము తగ్గించ నౌషధ మహిమ గలదు
అరసి దానిని తెప్పించు”డనియె వెజ్జు
శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీ సవరణకు ధన్యవాదములు
శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
3వ పాదమును ఇలాగ మార్చుదాము:
కట్ట నేలనో యని చాల కసురుకొనుచు
స్వస్తి
రిప్లయితొలగించండిగట్టి గొలుసుతొ మామిడి చెట్టునకును
కట్టుడేనుగున్, వెంపలి చెట్టునకును
నిచ్చెనలువేయు వీరులు నిజముగాను
వత్తు రనుచుబ్రహ్మముగారు బల్కె వింత
లెన్నొ! వినుడుసుజనులార యెలిమి తోడ
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఐతిహాసికమైన ఉదాహరణతో సమస్యను చక్కగా పరిష్కరించారు. మంచి పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బొమ్మ ఏనుగును కట్టివేయుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
చంద్రశేఖర్ గారి వివరణతో మీ సందేహం తీరింది కదా!
మీ పూరణ పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడనట్లే ఉంది. వెంపలి చెట్టుకు ఏనుగును కట్టమన్నారు...
*
చంద్రశేఖర్ గారూ,
చక్కని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
చెప్పవలసిన భావం పూర్తి కానప్పుడు ఎక్కువపాదాలతో పద్యం వ్రాయవచ్చు. దోషం లేదు. అయితే ఆటవెలది, కంద పద్యాలకు మాత్రం ఈ సౌలభ్యం లేదు.
విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పినారు. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి సవరణలను గమనించారు కదా!
*
వరప్రసాద్ గారూ,
దొంగల నుద్దేశించి మీరు చెప్పిన రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
వైద్యుడి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రస్తావనతో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండికట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును
యనగ హనుమను గట్టిరి దనుజులొకట
ఐచ్చికమ్ముగ బందియై యతడు దెలిపె
రామచంద్రుని యత్యంత ప్రాభవమును
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ అలరించింది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చెట్టునకును + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెట్టునకు ననగ’ అవుతుంది. కాని గణదోషం అవుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమావటి యొకండడవిలోని మదగజమును
రిప్లయితొలగించండిబట్టి తెచ్చెను గుట్టుగా కట్టి వేయ
కలత చెందె నచటి చెట్టు గాంచి యెటుల
కట్టుడేనుగున్ వెంపలి చెట్టునకును
అక్రమార్జన మక్కటా! యధిక మగుచు
రిప్లయితొలగించండిబలిసె మదకరికింబోలె ప్రభుత దాని
నదుపు జేయు విధాన మెట్లనిన నహహ!
కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండికేరళ లో ఏనుగులను పెంచెదరు వారి పై
=============*==============
పాలు ద్రాగి ముదము నొంది పరుగు బెట్టి
పాడు జేయు చున్నది నేడు పంట లెల్ల
కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును
వెలగ కాయలు వీసుడు వేయు మయ్య
శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
ఒక చిన్న సూచన: వీసుడు అనరాదు వీసెడు అనుట సాధువు.
స్వస్తి.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిసమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ తాజా పూరణ కూడా బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...
రిప్లయితొలగించండిగురువు గారు,
రిప్లయితొలగించండిచిత్తరువులో కాబట్టి ఏనుగును ఆ చెట్టుకే కట్టేయవచ్చని నా భావనండి.
ధన్యవాదాలు.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండినిజమే... అక్కడ ఉన్నది యజ్ఞశాల చిత్తరువు కదా! నేనే సరిగా అవగాహన చేసికోలేదు. మన్నించండి.