24, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1273 (కర్ణపేయమ్ముగాఁ బాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

21 కామెంట్‌లు:

  1. రక్కసుల యింటి పెండ్లంట! రభస మీరె!
    గళములింపారఁ గూయగ కాకములట!
    గుడ్ల గూబలు రెచ్చియు గొంతు గలప!
    కర్ణ పేయమ్ముగా పాడె గార్ద భమ్ము!

    రిప్లయితొలగించండి
  2. సహదేవుడు గారూ ! బాగుంది...

    గాడిదలు జేరెనొకచోట వేడుకగను
    సభను బెట్టెను ముందుగా సంబరమున
    కూరుచున్నవి మెచ్చగా జేరి యొకటి
    కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

    రిప్లయితొలగించండి
  3. నిండు సభలోన పాటలు నీలవేణి
    కర్ణ పేయమ్ముగా బాడె , గార్దభమ్ము
    భీక రంబుగ నఱచెను మోకరిల్లి
    యేమి బాధను నొందె నో ? నేమొ కాని

    రిప్లయితొలగించండి
  4. గోలి వారికి ధన్యవాదములు. సభకు ముందు గార్దభ ప్రార్థనా గీతము ఘనము! ఘనము! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. వింత వార్తలు ప్రచురించు పేపరందు
    కంట బడెనొక్క వింతయె,కాల మహిమ!
    గంగ డింటను బెరిగెడు ఖరము నొకటి
    కర్ణ పేయమ్ముగా పాడె గార్ధ భమ్ము!

    రిప్లయితొలగించండి
  6. కొమ్మ రెమ్మల దాగుచు కోయిలొకటి
    కర్ణపేయమ్ముగా పాడె,గార్ధభమ్ము
    ఓండ్ర పెట్టుచు పాడగ నొక్కసారి
    చిన్ని కోయిల భయపడి చెట్టు నొదిలె


    డిసెంబర్ 24, 2013 11:38 AM

    రిప్లయితొలగించండి
  7. గాడిదలు కూడి యొక చోట గాన సభను
    జరుపు కొన నిశ్చయించెనా జాతి మెచ్చ
    కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్మొ
    కటి, తలలనూపినవి శేష ఖరములెల్ల

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    ============*================
    లోక పాలు బిల్లును దెచ్చి తోక బెంచి
    కర్ణపేయమ్ముగా పాడె,గార్ధభమ్ము
    నిజముగా మేమవని యందు నీతి పరుల
    మనుచు,వినుడు సుజనులార ఘనము గాను !

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    సరస సంగీత సభలంచు స్వరములెరుగ
    నట్టి గాయకులేతెంచ దిట్టయొకడు
    బధిరుడే వచ్చి పలికెను ఫలితములను
    కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము

    మరొక పూరణ

    జరిగె పాటల పోటీలు జంతువులకు
    సూకరము నిర్ణేతగా చూచి బలికె
    కుక్కుటమ్ముల మార్జాల కూతకంటె
    కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    ఎలుగు సాంస్కృతసభలోన వెలుగు కనుడు
    యొ౦టెనాట్యమ్ము జేసెను తుంటి కదిపి
    జ౦బుకమ్ములు శ్రుతిసేయ తంబురలను
    కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము
    మరియొక పూరణ:దుష్ట దుర్యోధనుడు పుట్టు త్రుటినిబొడమె
    నక్కలూళలు వేణు గానమ్ము వలెను
    ఆశనిపాతపు ధ్వనులు లయలుగ వినుచు
    కర్ణ పేయమ్ముగా .బాడె గార్దభమ్ము

    రిప్లయితొలగించండి
  11. నవ వినోదాత్మక ప్రదర్శనము నొకటి
    కాంచి నేనొక్క మీట నొక్కగనె బళిర
    వచ్చె నొక బొమ్మ చూపెను ముచ్చెటలను
    కర్ణపేయంబుగా బాడె గార్ధభమ్ము

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    “చోరుడరుదెంచె మొరగవే శునక రాజ ”
    యనగ యజమాని మేల్కొల్ప ననియె కుక్క
    తాను జాగృత పరచుట ధర్మమనుచు
    కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందరికి శుభాశీస్సులు.
    పెద్దలు శ్రీ భాగవతుల కృష్ణారావు గారికి నమస్కారములు.
    ఈ రోజు పూరణలు అన్నియు అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అడవి జంతువు లొకచోట విడిది జేసి
    యాట లాడుచు పాటకై చీటి దీయ
    స్పర్ధ యందున గాడిద వంతు రాగ
    కర్ణ పేయమ్ముగా బాడె గార్దభమ్ము

    రిప్లయితొలగించండి




  15. రాసభమ్ముల సభలోన రమ్యమైన
    గానసభ చేతమని యందొకండు , తక్కు
    సభ్యులకు బ్రతిపాదింప ,సరియె యనగ
    'కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము. '

    (వాటి అరుపు వాటికి కర్ణపేయం గానే ఉంటుంది కదా!)

    రిప్లయితొలగించండి
  16. గురువు సంకల్ప శుద్ధితో కొఱత లేక
    నిత్య సాధన చేయించి నేర్పనెంచ
    నొక్కనాటికి వేదిక నుఱికి వచ్చి
    కర్ణపేయంబుగా బాడె గార్ధభమ్ము

    రిప్లయితొలగించండి