12, మే 2017, శుక్రవారం

దత్తపది - 112 (కమ్-సిట్-గో-రన్)

కమ్ - సిట్ - గో - రన్
(లోకము - ఈసిటుల (ఈసు+ఇటుల) - గోవు - కోరను... ఈ విధంగా)
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు. వ్రాసి+ఇటుల = 'వ్రాసి యిటుల' అవుతుంది. 'వ్రాసిటుల' అని సంధి చేయరాదు)

47 కామెంట్‌లు:



  1. వాసి! టకటంకులట యి
    ఱ్రీ! సీతయు కోరె గోము ! రివ్వున పార
    న్తా శరవేగము, కముచన
    యా సీతాపతి జిలేబి యై వెంటపడెన్ !

    *కముచు- పట్టుకొను ఆంధ్రభారతి చలువ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      "కముచన। నా సీతాపతి..." అనండి.

      తొలగించండి
  2. లంక జేరి సీత జాడ గనక హనుమ పరిపరి విధముల ఆలోచించు సందర్భము
    ఏ*కము*వాక్కాయములున్
    నాకున్ ధ్యా*సిటు*ల సీత నళినాక్షి పయిన్
    పోకయె,రాక్షస *గో*ప్యపు
    వాకిళులన్ దూరనెంతు పాపుల చే*రన్*.

    రిప్లయితొలగించండి
  3. ద్యోసత్తులు శోకమ్మున
    దోసిట చెన్నొందు విరులతో హరి గొలువన్
    గోసల బాపగ రాముగ
    వాసురనం దడరి చంపె పంక్తిగ్రీవున్
    (ద్యోసత్తులు=దేవతలు; గోస = బాధ; వాసుర = భూమి; అడరి = జన్మించి; పంక్తిగ్రీవుడు = రావణుడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాసురయందు' అనాలి కదా! అక్కడ "వాసుర నడరియును జంపె..." అనండి.

      తొలగించండి
    2. ఆర్యా! సవరణకి ధన్యవాదములు.
      __/\__

      తొలగించండి
  4. (శబరి శ్రీరామునితో.....)

    నా'కము'న్నది నీ పదనళినములనె
    యలు'సిటు'లఁ జేయఁ దగునె మహానుభావ!
    తెచ్చితి నివి'గో' ఫలములు తీయనివని
    యారగించు రామా! కో'ర న'న్యవరము.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    లోకమ్మందున నన్య భాషల మదిన్నీసి(ట్)ట్లు వర్ధిల్లె సు
    శ్రీకమ్మై చెలగంగ సంస్కృతమహో శ్రేయంబులన్ బంచగన్
    వీకన్ రాముడె నాయకుండవగ గోవిందుండు భాసిల్లగన్
    జోకన్ మార్గము శీల సంపదకిలన్ జూపింపనేరన్ గదే!!

    రిప్లయితొలగించండి
  6. [5/12, 6:34 AM] sreeramaraochepuri: రాముని కథ నీలోకమ్ము రంజిల కవి
    కోకిల మధురమగురీతి కూసి టురము
    సీత రాగోద్భవ మది విశేషప్రేమ
    సరళి చేరన్నది చరిత శాశ్వ తముగ
    [5/12, 6:36 AM] sreeramaraochepuri: కూసి+ఉరము=కూసిటురము= శ్రేష్ఠమైన కూత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూసి+ఉరము' అన్నపుడు టుగాగమం రాదు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    నీసిట్టుల బలిగొని గన
    వాసికి లోకమ్ము మెచ్చ వారసులే స
    న్నాసులె గో హత్యలకై
    కాసు గొనన్(కొనన్) రాక్షసుండ్రె కౌసల్యసుతా!.
    కాచు(సు)కొనుట.. వేచి యుండుట..కాసు..ద్రవ్యము .కొనుట ..గ్రహించుట
    నీసు..మాంసాహారము. సన్నాసి..కొరగానివాడు
    నీ.సిట్.ట్.ఉల..నీసు .ఇటుల

    రిప్లయితొలగించండి
  8. విను జానకి! (కమ్బు)గళున్
    ఘను రావణు దూరెదేని గా(సిట) గలుగున్
    నిను(గో)(రను) దూషించుచు
    మనగలవా యనిరి యచటి మగువలు సీతన్.

    నా(కము)(గో)(రను) దేవా!
    హే కమలదళాక్ష! రామ! హే సుఖధామా!
    నాకీయవె (సిట)పొట లిల
    రాకుండెడి జీవనమ్ము రఘుకుల సోమా!

    సిటపొటలు = కొట్లాటలు - (తెలంగాణ పదకోశం)

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో మూడు దత్తపదాలను ఒకే చోట చేర్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.

      తొలగించండి
  9. లవ-కుశులు తల్లితో.....

    ఏల శోకంబు నందెద వేల జనని
    ఇడుమలను దోసిటను ద్రోసి యీప్సితముగ
    నీదు మనమేమి గోరిన వాదు లేక
    నిల్పెదము ముదమారంగ నీదు చెంత!

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    శోకముఁగని, రామాయణ శ్లోకములను
    వ్రాసి, టెక్కె మెగురఁజేసి, రమణమీఱ
    రామరాజ్యమ్మె యిదిగో యిలం గనుఁడనెఁ
    బుధులు తలయూఁచి రంజిల్ల బొఱియచూలి!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  11. రావణుడు... సీతతో...

    కనులివి దేనినిన్ గనవు కంజదళాక్షిరొ ! నిన్ను దక్క , నా
    మనసిటు దక్క వేరొకటి మార్గము నెంచదదేమొ గాని , యీ
    తనువును నిన్ను దక్క వనితామణినెవ్వరి గోరబోదు , మా..
    రను ! వెనుకంజ వేయను ! త్వరన్ మురిపింపవె నన్ను జానకీ!!


    భయమునెఱుంగడయ్య ! పసిబాలుడు , లోకము జూడలేదికన్
    వయసిటు నిండలేదు పదివర్షములైనను , విల్లుఁబట్టునే ?
    దయగనుమయ్య గాధిసుత ! దానవులన్ దెగటార్చ గోరుచో
    రయమున సైన్యమిత్తు!రఘురాముని బంపగనేరనంచనెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ఎల్ల లోకమ్ములు ఇడుగడల్బడునట్లు కళ్యాణ వేదిక కాంతులిడగ
    వేదమం త్రములను విప్రులెల్లరన్చదువు చుండ జనకుని దుహిత ,లేమ,
    గోటుగత్తె, ధరణి కూతురు, క్రీగంట కౌసల్య తనయుని కాంచు చుండ
    దోసిట్దలంబ్రాలు తొయ్యలి తలపైన మోహనా కారుడు ముదము నిడుచు

    పోయు చుండగా , కరముల దోయి తోడ
    ధాత్రి తనయ జే బట్టగా ధవళ వర్ణ
    ముత్యములు ఎర్ర రంగుతో మురువు గొల్పె,
    రాముని తలపై బడిజార రంగు మారి
    నీల కాంతితో వెలుగంగ , నేల బడుచు
    తిరిగి పొందెను తమతమ తెలుపు రంగు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
      సీసంలో "విప్రు లెల్లరును చదువుచుండ..." అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. ఎల్ల లోకమ్ములు ఇడుగడల్బడునట్లు కళ్యాణ వేదిక కాంతులిడగ
      వేదమం త్రములను విప్రులె ల్లరను చదువు చుండ జనకుని దుహిత ,లేమ,
      గోటుగత్తె, ధరణి కూతురు, క్రీగంట కౌసల్య తనయుని కాంచు చుండ
      దోసిట్దలంబ్రాలు తొయ్యలి తలపైన మోహనా కారుడు ముదము నిడుచు

      పోయు చుండగా , కరముల దోయి తోడ
      ధాత్రి తనయ జే బట్టగా ధవళ వర్ణ
      ముత్యములు ఎర్ర రంగుతో మురువు గొల్పె,
      రాముని తలపై బడిజార రంగు మారి
      నీల కాంతితో వెలుగంగ , నేల బడుచు
      తిరిగి పొందెను తమతమ తెలుపు రంగు

      తొలగించండి
  13. కాకమ్మాకాశమ్మున
    ప్రాకటముగఁ గోతిమూక భళ్లూకాదుల్
    జోకఁగ నుడతయు మనసిటు
    తాకెను నిస్వార్థ సేవ ధరణిజ కమరన్

    రిప్లయితొలగించండి
  14. బంగరు మెకము కోరుట భారమయ్యె
    మనసిటు నటు కాగ కసిరి మరిది వెళ్ళి
    వెతుకఁ గోరి పంపిన తప్పు పెద్దదయ్యె
    మీర మేరను యని సీత మిడికె లోన





    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    12-05-2017
    🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
    శో *కమ్* మందెదశరథుడు
    కైకవలనరాముబాసి కా *రన్*కన్నీ
    రేకంబుదో *సిటు*ండవి
    వేకము *గో*ల్పడి స్రవద్భవిష్యత్స్పృహుడై

    🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  17. .డా.ఎన్.వి.ఎన్.చారి
    కనకపు లేడి తెమ్మనెను సీత యు "కమ్మ"ని పల్కు లన్ పతిన్
    మన"సిటు"మల్లె నీకిటుల మాయలు మంత్రము లుండు గాంచుమా
    యనుచును రామ భద్రుడు రయంబున విల్లును "గో"ట మీటగా
    మనమున దూ"ర నా"రవ ము మాయ
    లమారి మృగంబు భీతిలెన్

    రిప్లయితొలగించండి
  18. మనసున్ దోచెనయోధ్యవాసిటు బళీ మాయావి కాకుండినన్
    తనరన్ బోదితు కోర్కెతోమది విధాతా యంచునా దైత్యపున్
    వనితారత్నము రాముజాచుచు వెసన్ వర్ణించి వాచాలమ్
    కనబర్చన్ తెగగోసె ముక్కు, చెవులన్ ఖడ్గాన సౌమిత్రియున్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. అశోకవనమున రాక్షసవనితలు సీతకు దెల్పు విధము...

    లోకములు గెలుచు భూపతి
    నీకోసము బరితపించ నీధ్యాసిటులన్
    జోకగ రావణు జేరన్
    ప్రాకటమగు గోము దొరకుపార్థివి నీకున్!!!

    జోక = యుక్తము, గోము = గౌరవము, ప్రేమ

    రిప్లయితొలగించండి
  20. బోదిటు రెండో పాదంలొ వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి


  21. క గ శా వి

    హా సీతా! యన రావముల్ వనపు హాహాకారముల్ గాన న
    య్యా, శాసించెను గోముగాను శరమై యా రన్, పతిన్ రోయ గ
    న్నా సౌమిత్రిని వాసిటన్ననుజుడా, నాధున్గనన్ వెళ్ళు మ
    య్యా సాసించుము కమ్ముదెంచు సధియై యావద్బలమ్ముల్ గనన్

    ---

    హా సీతా! యన రావము
    శాసించెను గోముగాను శరమై యార
    న్నా సౌమిత్రిని వాసిట
    సాసించుము కమ్ముదెంచు సధియై యావన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మొదటి పాదము ఆఖరులో * గానుమ| య్యా
      అని చదువవలె

      జిలేబి

      తొలగించండి
  22. తా నరసి టక్కియమ్మున
    నానా రుచిఁ గోవిదార నగరాజమ్మున్
    సేనా సహితము భరతుఁడు
    గానోపు ననుకొనె గుహుఁడు కమనీయముగన్

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. ఆ రాకాసిటు సీతను
    జేరన్ గని, దాని ముక్కు సెవులను గోసెన్
    నా రామానుజు, డాసురి
    పారెను.నీరిడుచు కంట భ్రాతల కడకున్

    రిప్లయితొలగించండి
  25. లంక చేరిన హనుమంతుని చూసి లంకరాక్షసి బెదిరించినట్లుగా నూహించిన పద్యము......



    చేరన్ వచ్చితివేలరా యిటకు? నాచే మూడెనీ చావికన్
    పోరా! పో!! నరకమ్ము జేర్చెదను నిన్ బోకున్న నేనిప్పుడే
    నా రాజ్యమ్మున గోచరించినను నీ నాశమ్మికన్ దప్పదే
    రా!రామ్మంచును రాక్షసిట్టులని పోరాటమ్ముకై చేరనే.

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులారా,
    ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులకు నమస్కృతులు. ఇంతకుముందే ఇల్లు చేరాను. బస్సులో నా బ్యాగు పోగొట్టుకున్నాను. అందులో నా బ్యాంక్ పాస్‍బుక్కు, పాన్ కార్డు, ఐ.డి. కార్డు, కొన్ని ముఖ్యమైన కాగితాలున్నాయి. మనస్సు ఏమీ బాగులేదు. ప్రయాణపు టలసట... ఈరోజుకు నన్ను మన్నించండి. మీ పద్యాలను సమీక్షించే స్థితిలో లేను.

    రిప్లయితొలగించండి
  28. శోకముననున్న సీత నశోక వనముఁ
    గని యబాసిటుల సలుపగ నయమౌన
    రావణ! రహిఁ గోల్పోదు వీ రణమునందు
    చేరనుద్దండ వీరులు చేటు కలుగు

    రిప్లయితొలగించండి
  29. లలనా శోకంబేటికి
    కలలో రాముడు కపులను కలిసిటు వచ్చెన్
    బలిమిని భామన్ గోరిన
    ఖలుతో పోరంగ గంటి కదనమునందున్

    రిప్లయితొలగించండి
  30. రండు నాసేవ గైకొని పొండు యనుచు
    కంద మూలాలు మరియును కమ్మ నైన
    ఫలములను గోరి తెచ్చెను పండు శబరి
    కలి సిటుల దాశ రథులామె కలలు దీర్చె.

    రాధాకృష్ణ రేగళ్ళ
    సింహపురి

    రిప్లయితొలగించండి