10, మే 2017, బుధవారం

సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"
(లేదా...)
"ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్"

93 కామెంట్‌లు:

  1. బుద్ధియె గడ్దిని తినుచును
    క్రుద్ధుండై రావణుండు కుములుచు నుండన్
    నిద్దురలో కలనన్‌గనె:
    "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      రావణ స్వప్నంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలను గనెన్' అనండి బాగుంటుంది.

      తొలగించండి
  2. ముద్దుల కౌసల్య సుతుని
    ముద్దిమ్మనె జానకి , దశముఖునిన్ బ్రీతిన్
    ఉద్దినమున శర ములతో
    ఎద్దడినేలపడచేయ ఎల్లరు పొగడన్

    రిప్లయితొలగించండి
  3. గద్దిం చిపల్కు స్త్రీలను
    ముద్దిమ్మనె జానకి, దశముఖునిన్ బ్రీతిన్
    తద్దయు వేడ్కన్ మీర
    న్నిద్దరు గాగనొ కటియని యెదురుంబల్కెన్.
    ముద్దు= (గౌరవము), ఆదరము

    రిప్లయితొలగించండి
  4. సద్దేలేని విధంబుగా దనుజులన్ సర్వంసహాఁజంపు మీ
    రెద్దైనన్ సరసోక్తి జెప్పుడని దైవీసేవితున్ రామునిన్
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్;మోహంబుతో రావణున్
    సుద్దుల్ లేవని రోసి రంభలును మోజుల్ దీర్పగా జేరరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సర్వంసహ' అంటే భూమి. అదిక్కడ అన్వయించడం లేదు.

      తొలగించండి


  5. విద్దెల్లాడుచు చుప్పనాతి మెలపున్ వేగించె రామున్నెటుల్ ?
    ముద్దుల్లాడెడి యిఱ్రి మైకమున రామున్ కోరె నెవ్వారటన్ ?
    హద్దుల్దాటగ నెవ్వరిన్నడచెనౌ యంకంబునన్ రాముడౌ ?
    ముద్దిమ్మంచు; ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్; రావణున్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. అద్దరి శూర్పణఖ ‌చనవు ?
    ముద్దుల్లాడెడి కురంగ మును కోరినదో ?
    హద్దుల్దాట యడచె నెటు?
    ముద్దిమ్మనె; జానకి; దశముఖునిన్ బ్రీతిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      క్రమాలంకారంలో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. హద్దులు మీరఁగ జూచిన
    సుద్దులుఁ జెప్పుచు "సరసము సొగసరి సతితో
    కద్దని మండోదరి కా
    ముద్దిమ్మనె" జానకి దశముఖునిన్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మండోదరికి ముద్దిమ్మని జానకి రావణునితో చెప్పడం... మంచి భావం. చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  8. గద్దింపకు, శ్రీ రాముని
    వద్దకు జనుమిప్పుడైన వరదుడు నతడే !
    యొద్దిక పదములపై బడి
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      రాముని పాదాలకు మిద్దిమ్మని జానకి రావణునకు ఉద్బోధించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
      "వరదుం డతఁడే" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. హృద్దేవాలయ దైవమా! రఘువరా! యిచ్చోటనే గెంతుచున్
      ముద్దుల్ మూటలుగట్టు స్వర్ణ హరిణమ్మున్ గంటివో! నాకదే
      ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ .,! రావణున్
      వద్దన్నా ! యనుచున్ విభీషణుడటన్ వారించె దుర్మోహమున్ !!

      తొలగించండి
    3. ఒకరిది మోహం, మరొకరిది దుర్మోహం. భళా.. విరుపుతో ఉత్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  9. (1)
    ఎద్దువొ? మొద్దువొ? గ్రద్దవొ?
    యద్దిర! యా రంగనాయకమ్మ హితుఁడవో?
    యుద్దెర మాట లి వేలర?
    "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"

    (2)
    ప్రొద్దుననే యొక దుష్టుఁడు
    పద్దెమ్మున వ్రాసె నిటులఁ బాపఁపు వాక్యం
    బొద్దిక విడి వింటి నిటుల
    "ముద్దిమ్మన్నె జానకి దశముఖునిన్ బ్రీతిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా!
      మీ పూరణలు అత్యద్భుతములు.

      తొలగించండి


    2. అదిగదిగో వత్తురికన్
      పదిలమ్ముగ మిమ్ము రచ్చబండన నారే
      య దరుముచు రంగనాయకి
      సదనపు భక్తులు యవాయి సారించునహో :)

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      వాళ్ళకు నా చిరునామా తెలియనివ్వను కదా!

      తొలగించండి
    4. ఈ సమస్యను సృృష్టింంచిన కవికి ఇంంతకన్నామంంచి పూరణ లోకంంలో లభింంచరాదు

      తొలగించండి
    5. సందిత గారూ,
      ఇది చాలాకాలం క్రితం ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య. కాకుంటే కందపాదం పాతది. వృత్తపాదం నా సృష్టి.

      తొలగించండి
  10. అద్దిర నాటక మందున
    నిద్దరి కీ పేరులున్న విట దంపతులై
    పద్దియములు పాడుటలో
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్.

    పద్దెంబందు వచింపు మోరి యిపు డా పద్మాక్షి యస్మత్ప్రభున్
    వద్దన్నన్ వరియించె నంచు భటు డవ్వానిన్ కవిన్ జూచుచున్
    గద్దించంగను ప్రాణభీతి గదురన్ గంపించి యవ్వా డనెన్
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  11. నిద్దంబైన ధరాత్మజన్ కపటమున్ నీచుండు కొంపోవగా
    ప్రొద్దున్ రేయి యశోకవాటికను రామున్ దల్చి స్వప్నమ్ములో
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్, రావణున్
    గుద్దుల్గుద్ది వధింపమంచు తలచెన్ క్రోధమ్ము చల్లారగన్

    రిప్లయితొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన్.చారి
    సుద్దులు పలికెడు రాముని
    ముద్దిమ్మనె జానకి, దశముఖునిన్ బ్రీతిన్
    హద్దెరుగని ప్రేమ నడిగె
    నెమ్మదిగా నతని జేరి నేర్పున సతియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      చివరిపాదంలో ప్రాస తప్పింది. "ప్రేమ నడిగె। నద్దేవియె మయునిపుత్రి యతి వేడుకతోన్" అనండి.

      తొలగించండి
  13. ఒద్దిక దరిజేర సతిని
    సుద్దులు పలుకుచు పడతికి చూపగ తోచున్
    బద్దలు చేసెగ రాముడు
    ముద్దిమ్మనె, జానకి, దశముఖునిన్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. డా.ఎన్.వి.ఎన్.చారి
    సుద్దులు పలికెడు రాముని
    ముద్దిమ్మనె జానకి, దశముఖునిన్ బ్రీతిన్
    హద్దెరుగని ప్రేమ నడిగె
    నద్దేవియె మయుని పుత్రి యతి వేడుక తోన్

    రిప్లయితొలగించండి
  15. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🌺🌻🌺

    *ముద్దిమ్మనెజానకిజానకి దశముఖునినిన్ బ్రీతిన్*

    సుద్దులికేల?రఘూత్తము
    డద్దరిసిద్ధమయెబోరనంతిమముగనీ
    పెద్దలసుగతికినువ్వుల
    *ముద్దిమ్మనెజానకిజానకి దశముఖునినిన్ బ్రీతిన్*
    *🍁🍁🍁శ్రీమతి జి సందిత బెంగుళూరు🌸🌸🌸*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంతిత గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. సుద్దులు వద్దని కద్దుగ
    పద్దతియౌనే పరసతి ప్రాపును కోర
    న్నద్దరినమృత్యుదేవత
    ముద్దిమ్మనెజానకి,దశముఖునిన్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మృత్యువును ముద్దిడుమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. ముద్దియ సీతను గైకొని
    అద్దిర రావణుడు లంక కరిగిన పిదపన్
    నిద్దుర చెందగ కలలో
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  18. సుద్దుల్ జెప్పి అసత్యముల్ పలుకుచున్ శోభిల్లు దైత్యాంగనల్
    కొద్దోగొప్ప నిజమ్ము చెప్పరిపుడి కోణంగి తానిట్లనెన్
    సద్దున్ సేయకుడీతలోదరి వెసన్ సంధించె రాగాస్త్రముల్
    ముద్దిమ్మంచు వరాతనూజయడిగెన్ మోహమ్మునన్ రావణున్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. సుద్దుల్ జెప్పగనొద్దనందువు గదా శోభామయంబౌనె? నీ
    హద్దుల్ దాటితివో,విచారమిసుమంతైనన్ మదిన్ తాకదో
    రద్దౌనీ గతి,మృత్యుదేవతడిగెన్ ప్రాణంబులన్నామెకే
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వద్దు'ను 'ఒద్దు' అన్నారు. "సుద్దుల్ జెప్పగ వద్దటంచు పలుకన్ శోభామయం బౌనె..." అనండి. 'దేవత+అడిగెన్' అన్నపుడు సంధి లేదు. "మృత్యుదేవి యడిగెన్" అనండి.

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిద్దమగు నలిని రాముని
    ముద్దిమ్మనె జానకి; దశముఖునిన్ బ్రీతిన్
    ముద్దియ మండోదరి యట
    ముద్దుగ ధర్మము చరించుమోయని వేడెన్

    రిప్లయితొలగించండి
  21. సుద్దుల్ జెప్పగనొద్దనందువు గదా శోభామయంబౌనె? నీ
    హద్దుల్ దాటితివో,విచారమిసుమంతైనన్ మదిన్ తాకదో
    రద్దౌనీ గతి,మృత్యుదేవతడిగెన్ ప్రాణంబులన్నామెకే
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో సూచించిన సవరణను గమనించండి.

      తొలగించండి
  22. వద్దిక నీకీ పాపము
    హద్దులు దాటంగరాదె యతివల తోడన్
    పెద్దగ హరునిన్ దలచుచు
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్!

    ముద్దు=ఆదరణ

    రిప్లయితొలగించండి
  23. శుద్ధపు నుడులు వినవు నీ
    తద్దినమగు నీదినమ్మె తప్పనిసరిగా
    వద్దు పగ హరిపదములకు
    ముద్దిమ్మన్నె జానకి దశముఖునిన్ బ్రీతి

    రిప్లయితొలగించండి
  24. హద్దుల్ మీరిన చేటుమూడునిలపై వ్యాధుండ! శీఘ్రమ్ముగా
    శుద్ధంబౌ మదితోడ వేడుము హరిన్ సూనమ్ములర్పించుచు
    న్నద్ధర్మాత్ముడె యాయువిచ్చు దయతో, నారాము పాదమ్ములన్
    ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాము పాదాలకున్" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురువర్యుల సూచలకు ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
  25. పెద్దయితివి గద లంకను
    గద్దెక్కిన రాజు వయ్యు గనవే రాము,
    న్నొద్దిక నాతని పదమున
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  26. సుద్దులు సెప్పిరి యివ్విధిఁ
    దద్దయుఁ బొగుడుచు నసురుని దైత్యాంగనలే
    ముద్దియ గమి రావణుఁ గని
    ముద్దిమ్మనె, జానకి! దశముఖునిం ప్రీతిన్


    తద్దైత్యాంగన ధర్షితార్తిఁ గడు సంతాపమ్మునన్ వేగఁ దా
    నిద్ధైకాగ్ర్య చరిత్ర చిత్తమునఁ బ్రాణేశున్ మహాబాహునిన్
    ముద్దిమ్మంచు ధరా తనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్
    గుద్దుల్ గుద్దిన వాని యుద్ధమున సత్క్రోధమ్మునన్ లంకలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      అద్భుతంగా ఉన్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.

      తొలగించండి
    2. రాక్షసస్త్రీలు శత విధాల వేధిస్తారు సీతాదేవిని రావణుని భర్తగా స్వీకరించమని.అతని గొప్పతనాన్ని చాటుతూ.

      తొలగించండి
    3. పిట్టా వారూ,
      మొదటి పూరణలో సందర్భం వాల్మీకమే. అశోకవనంలో రాక్షసస్త్రీలు రావణునికి లొంగిపొమ్మని రకరకాలుగా
      బుజ్జగించరు, ప్రలోభపెట్టారు, వేదించారు.
      అంతెందుకు? సీతకోసం వెదుకుతున్న హనుమంతుడు లంకలో అంతఃపురంలో శయ్యపై రావణుని ప్రక్కన శయనిస్తున్న మండోదరిని చూసి సీత అని పొరబడ్డాడు.

      తొలగించండి
  27. బుద్ధిమతులౌ తనయులను
    ముద్దిమ్మనె జానకి, దశముఖునిన్ బ్రీతిన్
    యుద్ధంబున మర్ధించిన
    నుద్ధండ పతికి సములుగ నుర్విని నేలన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. 10, మే 2017, బుధవారం

      సమస్యః

      కవిమిత్రులారా! 

      ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

      "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"

      (లేదా...)

      *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

      *ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణుం*
      *డిద్దోయంచుసమస్యనీయకవి గాండ్రించెన్ మహోద్రిక్తుడై*
      *దద్దమ్మామరివేరులేదెగనపద్యంబీయపూరింపగా*
      *బుద్దేలేదుక్షమించువారికినినున్ !పూరింపనీవేదికన్*

      *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *******
      సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. డా.పిట్టా
    "ముద్ది"యనన్ ఘన యాపద
    నద్దన్ గ్రూరునకు బ్రహ్మ నా పది తలలన్
    గ్రుద్దగ ;రావణు కలలో
    ముద్దిమ్మనె జానకీ దశముఖునినిన్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా
    మద్దత్తింతన మాయ బేరములకున్ మా మిర్చి గొంపోవగా
    వద్దన్నన్ యెగబోసుకొంచు దిగిరా వాటిన్ దలారుల్ పదుల్
    గ్రద్దల్, రావణు బోలు దుష్టులు, "నొ(ఒ)రే!గ్రాహ్యంబె దుస్స్వప్నముల్?
    ముద్దిమ్మంచు ధరా తనూజ యడిగెన్ మోహంబునన్ రావణున్,
    గద్దెన్నా తెలగాణ రాముడదుగో గప్.చుప్(గప్చుప్) దురాశల్ జుమీ!!(కేసీయార్ యే రాముడు)
    (మిర్చీ తెచ్చిన రైతులు దళారుల నుద్దేశించి పలికినట్లు ఊహ)

    రిప్లయితొలగించండి
  30. సుద్దుల నెఱుగుచు బుద్ధిగ
    నద్దరి చేరి పర కాంత నాశ పడక నీ
    ముద్దుల సతి పాదమ్ముల
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్!

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా
    నేటికొక ప్రతిపాదన జేయ మనసాయె! ఇవి సమస్యలకు సరిపోతాయా?
    గణముల గణనంపు లక్ష్య గాములె కైతల్...లేదా/మరియు
    గణముల లెక్కవేసికొని గాసిలె పద్య కవీశ్వరుండునున్!ఆర్యా,చూడండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ... అవకాశాన్ని బట్టి ప్రకటిస్తాను.
      మీరేమైనా సమస్యలు పంపదలచుకుంటే నా ఇమెయిల్‍కు పంపండి.
      shankarkandi@gmail.com

      తొలగించండి
  32. డాపిట్టానుండి
    కందంలో చివర "ని" అదనం..టైపాటే.

    రిప్లయితొలగించండి
  33. 10.05.2017. శంకరాభరణము.సమస్య:
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్
    పూరణ:హద్దులు మీరకు నాతో
    సుద్దులు పల్కెడి సురుచిర సుందర సతులౌ
    ముద్దియలు పదుగురికి నీ
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్

    రిప్లయితొలగించండి

  34. పిన్నక నాగేశ్వరరావు.

    వద్దనడని రఘురాముని

    ముద్దిమ్మనె జానకి; దశముఖునిన్
    బ్రీతిన్
    ముద్దిమ్మన మండోదరి

    వద్దనె సీతపయి ప్రేమ భావము
    మెదలన్.
    ****************************
    చిన్న సవరణతో
    ****************************

    రిప్లయితొలగించండి
  35. 10/5/17
    9494846984 డా.బల్లూరి ఉమాదేవి.
    సీత రామునితో

    ఒద్దికగా దరి చేరుచు
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్
    ముద్దుగ గని మండోదరి
    వద్దనుచు పరసతి పొందు వర్జింపుమనెన్

    సీత రావణునితో
    బుద్ధిగ నీసతి కిప్పుడె
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్
    బుద్ధిగ విను నామాటను
    పద్ధతి కాదిదియు జూడ పరసతి కోరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మొదటి పూరణలో కొంత అన్వయదోషం ఉన్నా రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. గురువుగారు నమస్కారములు.
    కం||
    హద్దుల మీరకు రావణ!
    వద్దకు రాబోకు నీవు వలదుర పోపో
    ముద్దుగ నీసతిఁగనుచును
    ముద్దిమ్మనె జానకి, దశముఖునిన్ బ్రీతిన్!

    రిప్లయితొలగించండి
  37. విద్దెలనెన్నో నేర్చియు
    నిద్ధరణిజ నపహరించి నీల్గినఫలమున్
    యుద్ధమునన్ మృత్యువునకు
    ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  38. బుద్ధిన్ శుద్ధిని వీడుచున్ ధరణిజన్ ముద్దాడ నాశించుచున్
    క్రుద్ధుండై తలవంపు మీర వడిగా కూర్కుల్ల నోలాడగా
    నిద్దుర్లో కలనన్ గనెన్ దనుజుడాహ్ నీరంపు గీతన్ వలెన్:👇
    "ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్" 😊

    రిప్లయితొలగించండి