20, మే 2017, శనివారం

సమస్య - 2365 (మండు వేసవిలోఁ జలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము"
(లేదా...)
"వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్"

68 కామెంట్‌లు:

  1. రోహిణీకార్తె వచ్చిన రోళ్ళు పగులు
    వేడి గాలులు ధరణిపై దాడి చేయు
    మండు వేసవిలో , జలి మెండు సుమ్ము
    మకర సంక్రాంతి సమయాన మంచు బడుచు
    భాస్కరుండును రాలేడు భయము కల్గి
    వసుధ పైన వేగిరముగ మిసిమి చూప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. భాసుడు తీక్ష్ణమై చెలగ ప్రాణులు తాపమునందు కుందరే
    గాసిలు జీవకోటి వడగాడ్పులు మిక్కుటమై చెలంగగా
    వేసవి కాలమంందు, చలి వెక్కసమై వడకించు నెల్లరన్
    ధ్యాస తదేకమై నిలచు తప్తహసంతిన శీతకాలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      'తప్త హసంతి' విశిష్టమైన పదప్రయోగంతో, విరుపుతో మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఇఅంటలోనున్న ఏ.సీ.ల నెల్ల వేసి
    చల్లగాఁజేయ తాపము మెల్లగ నట
    తగ్గు;సాంకేతికత చేయు తారుమారు
    మండు వేసవిలో చలి మెండు సుమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      శీతల యంత్ర ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. వయసు మీరగ కోరిక వదల లేక
    జంకు జేయక మదిలోని శంక వీడి...
    అమర నాధుని దర్శించ హిమము నందు,
    మండు వేసవిలోఁ , జలి మెండు సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      నిజమే! మండు వేసవిలో అమరనాథ యాత్రలో చలిబాధ తప్పనిదే!... చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  5. జలము లింకగ ధరణిన నిలము నిల్చు
    ఘర్మ జలము కారుచు వచ్చు చర్మపుజిల
    మండు వేసవి లోఁ, జలి మెండు సుమ్ము
    కార్తి కమ్మున జనులంత గ్రక్కదలురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరణిని' అనండి. ఇకారాంత పదాలకు 'న' రాదు. 'ని(ఇ)లము నిల్చు'...?

      తొలగించండి

  6. రోసము వేడి తాపములు రొష్టులు తీవ్రతరమ్ము గానగున్
    వేసవి కాలమందు, చలి వెక్కసమై వడకించు నెల్లర
    న్నాసిక గాను దిబ్బడ మనమ్మది డీలగు శీతకాలమున్
    వాసము సూవె బందిగము, వారుణి వాహిని పారు నెల్లెడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయితే శీతబాధకు వారుణి వాహిని తరుణోపాయమంటారు!

      తొలగించండి


    2. అబ్బే !

      యెంత మాట ! ఆంధ్రభారతి చలువ :) వా అంటే వారుణే వచ్చె, యింకొంచం వాహిని పారించి ముగించే సా నంతే :)

      జిలేబి

      జిలేబి

      తొలగించండి
  7. డా}.పిట్టా
    బండ పనిచేయ ఖరకరు యండ చెమట
    కండ కరుగగ గంగను గనును శ్రమల
    నిండ శీతల యంత్రముల్ బండ నింట
    మండు వేసవి(న్) "లోచలి" మెండు సుమ్మి!(లోజ్వరము హానికారకము."లోచలి"ని యంత్రాలతో సృష్టించుకొని మానవుడు అనారోగ్యాన్ని గుప్తంగా మూల్గునట్లు చే‌స్తున్నాడు.ప్రకృతి చికిత్సలో ఆతప స్నానాలతో చర్మ రోగాలకు చికిత్స ఉంటుంది."డి"వైటమిన్ రోగాలు యీనాటి మన స్వయంకృతాపరాధాలు.)

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఆసకు దోసమా సఖుడ!అల్లదె వేసవి నెండ స్నానమున్
    మోసము జేయ జూచెదవు:ముందర నుండును స్వాస్థ్య సంకటం
    బే;సమవర్తియై వెలగ భేషుగ బ్రకృతిని మెల్గకున్నచో
    వేసవి కాలమందు చలి 'వెక్కస'మై వడకించు నెల్లరన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో '...బ్రకృతిని' అన్నచోట గణదోషం. సవరించండి. "భేషుగ ప్రాకృతమై మెలంగకే" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  9. నరుడు సృష్టించు విజ్ఞాన పరికరముల
    కారణంబున నిండ్లలో కలుగుచుండు
    నలఘు గ్రీష్మంబు చలికాల మందు జూడ
    మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము.

    వాసిని గాంచగోరి బహుభంగుల శాస్త్రములందు శోధనల్
    చేసి యనేక వస్తువుల చేతను జీవన శైలి మార్చె తా
    నాసగ మానవుండు ఘను డౌర!భళీ (చలిలోన)హిమమందు గ్రీష్మమున్
    వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. దోస మెరుగక నిందింప తోచునేమి?
    ఆమ్ర ఫలముల రుచికిని హాయి నెపుడు?
    మంచు కురియగ జరిగెడి మార్పు నేది?
    మండు, వేసవిలోఁ, జలి మెండు సుమ్ము

    రిప్లయితొలగించండి
  11. వేసవి నిడుము నోర్వక వేగ పడుచు
    సెంట్రలేసిగ నింటిని చేయగాను
    రాత్రి శయనింప లేరుగ రగ్గు లేక
    మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హాయి యెపుడు, మార్పదేది' అనండి.

      తొలగించండి
  12. శాస్త్రవేత్తలు యోచనల్ సలిపి సలిపి
    శీతలమ్మిడుయంత్రమున్ చేతనిడిరి
    వేడునంత చలువనిడు వేడిమాన్పి
    మండువేసవాలో చలి మెండు సుమ్ము

    రిప్లయితొలగించండి
  13. ఆంధ్రమున లంబసింగిన నద్భుతముగ
    ప్రకృతి శోభాయ మానమై పరిఢవిల్లు
    మంచు పూవులు రాలును,మరియు నచట
    మండువేసవిలో జలి మెండు సుమ్ము!!!

    లంబసింగి = ఒకవూరు

    ఉక్క పోతతో నల్లాడు నుర్విజనులు
    గాలి స్తంభించి బోవును నేల పైన
    మండు వేసవిలో, జలి మెండు సుమ్ము
    పర్ణముచము నేతెంచగవసుధలోన!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. _నేటి సమస్యాపూరణం_

    *చెలియ కుచమండలముపైన చెట్టు నీడ*
    *లోన,దిగుడుబావి సలిల లోతులందు*
    *శీతల ఋతువున వేడిని స్వీక రించ*
    *మండు వేసవిలో చలి మెండు సుమ్ము*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సలిల లోతు' లనడం దుష్టసమాసం. "బావుల నీటి లోతులందు" అనండి.

      తొలగించండి
  15. చూసిన చాలు స్వర్గమిటుచోద్యముగా దిగె నంచునెంచగన్
    ఆ సుమసోయగమ్ములును ఆ జలధారలు చిమ్ముయంత్రముల్
    తా సరిలేని రీతి విసదంబుగ నుల్లముదోచు ఊటిలో
    వేసవి కాలమందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...నెంచగా। నా సుమ...' అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  16. మండు వేసవిలో జలి మెండు సుమ్ము
    పైవి ధమ్ముగ బలుకుట పాడి యగునె?
    మండు వేసవియొడలికి మంట గూర్చి
    మిగుల బాధించు నిరతము నొగులతోడ

    రిప్లయితొలగించండి
  17. చల్ల చల్లని నీడలు పల్లవించు
    చెట్లు తనరంగ వేసవి చేరదెపుడు
    నీరు నిండిన చెరువులేపారినపుడు
    మండువేసవిలో చలి మెండు సుమ్ము
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి


  18. నిన్నే కష్టేఫలే శర్మగారు సాయిన్సు బోధించారు :)

    బిందె నీటిని తలకిందు బెట్టి చక్క
    గాను పలుచని వస్త్రము గట్టి కొంకి
    నసరి గట్టి దానిచలువ నతల నిడిన
    మండు వేసవిలో చలి మెండు సుమ్ము

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా! మీకు గురువులకేం కొరత? కష్టేఫలే సైన్సు నేర్పే గురువు. ఒక గురువు ఛందస్సు నేర్పుతాడు. మరొక గురువు పద్యాలు వ్రాయడం నేర్పుతాడు. ఇంకొక గురువు ఉనిషద్వాక్యాలు బోధిస్తాడు. వంట నేర్పే గురువు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు.
      మీ యీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    2. కంది వారు ! నమో నమః ! అంతా మీ దయే ! మీదయ్యే :)

      మీకుచ దువులయ్యల దరి మిక్కుట మమ్మా !
      ఓ గురుడట చందసు సుమ మొప్పుచు చెప్పు
      న్నో గురుడట సైన్సును సుమనోరజమై! మా
      తా ! గరి టను గాంచి తళియ తానిడ నయ్యర్ :)

      శంకర వృత్తము

      జిలేబి

      తొలగించండి
    3. భళి భళీ! 'శంకర వృత్తం' అంటూ ఒకటున్నదని తెలిసి ఆనందంగా ఉంది. మీరిచ్చిన లక్ష్యాన్ని బట్టి దాని లక్షణం ఇది...
      వృత్తము పేరు - శంకర వృత్తము
      గణములు - భ-స-న-జ-య.
      యతి స్థానము - 11
      ప్రాస నియమము ఉన్నది.
      ఈ పద్యం నడక ఈవిధంగా ఉంటే కర్ణపేయంగా ఉంటుంది. UII - IIU - IIII - UII - UU (నాలుగు మాత్రల ఆవృత్తితో UII IIU IIII - UII UU విరుపుతో ఉంటే బాగుంటుంది)
      ఉదా...
      శ్రీకర కరుణాజలనిధి చేకొనుమయ్యా

      తొలగించండి

    4. కంది వారు మరో సామ్యం-

      కంద పద్యం లో రెండు, నాల్గవ పాదాలను పోలి వుంది కూడాను :)

      జిలేబి

      తొలగించండి
    5. జిలేబీ గారూ,
      నిజమేనండోయ్... నేను గమనించలేదు. మీ పరిశీలనా నైపుణ్యానికి జోహార్లు. అటువంటప్పుడు నడక క్రింది విధంగా ఉంటే ఇంకా బాగుంటుందేమో!
      UIIII - UIIII - UIIUU (శ్రీరఘువర రావణహర శ్రీకర రామా)

      తొలగించండి

    6. ధన్యవాదాలండి కంది వారు

      చేసెదనిక పద్యముల కచేరిని రామా !

      జిలేబి

      తొలగించండి
  19. ఏటికేటికి నెండలు నెక్కు వగుచు
    బయట రెక్కల కష్టపు బ్రతుకుఁ దీర్చ
    కుదప వడగాలి మరణాలు, 'గుండెలోన
    మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము'

    రిప్లయితొలగించండి
  20. కాసెడు చెట్లనే జనులు కావరమెక్కగ గూల్చివేయగన్
    దూసుకు వచ్చు భాస్కరుని దుర్భర జ్వాలల రోళ్లుచిట్లగన్
    గ్రాసముకై శ్రమించ వడ గాలుల మృత్యు భయాన గుండెలన్
    వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:
    జలధి మట్టము నుపరిని సాగు నపుడు
    నెండ తరుగుచు నుండును నెత్తు బట్టి
    నందునే కొండ లందుండు నరుల కెల్ల
    మండు వేసవిలో జలి మెండు సుమ్ము!

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:
    పగలు దీర్ఘములై యుండు వసుధలోన
    మండు వేసవిలో; జలి మెండు సుమ్ము
    దీర్ఘములగు రాతిరిలుండి తెన్నమరిన
    శీత కాలము నందున చెప్ప గాను

    రిప్లయితొలగించండి
  23. పండు వెన్నెల కురిపింత్రు చండ రాత్రిఁ
    గొండఁ జేయుదు రింపుగఁ బిండి పిండి
    యుండ శైత్య యంత్రమ్ములు దండిగ నిక
    మండు వేసవి లోఁ జలి మెండు సుమ్ము


    చూసిన మిక్కుటమ్ముగను జోద్యము లీధరఁ గాల ధర్మముల్
    కాసిన వెన్నె లొక్కతరిఁ గాయును మెండుగ నెండ లొక్కెడన్
    గాసిలఁ జేసి శీతలపుఁ గాలమునం, గనిపించ నేరదే
    వేసవి కాలమందు, చలి వెక్కసమై వడకించు నెల్లరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. (ఎల్లుండి అమెరికా వెళ్తున్న ఒక మిత్రుడితో రోజంతా తిరగవలసి వచ్చింది).
      మీ రెండు పూరణలు మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. శోషమువచ్చునిక్కముగ సూర్యుని ధాటికి యుద్దినమ్మునన్
    వేసవి కాలమందు, చలి వెక్కసమై వడకించు నెల్లరన్
    వాసమునందునైన వనవాసములోన చరించుచుండినన్
    భేషుగఁ దీర్చు శీతమును ప్రేయసి చిక్కని కౌగిలింతలే

    రిప్లయితొలగించండి
  25. మండు వేసవి లోఁ జలి మెండు సుమ్ము
    చిరునగవులను నిత్యము చిలుకరించు
    సఖియ సన్నిధిఁ జక్కగ స్నానమాడి
    గాఢపరిరంభమందునఁ గాంచ నిదుర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  27. తనువునందు చెమటపట్టు ధరణి లోన

    మండు వేసవిలో..చలిమెండు సుమ్మి

    హిమము కురిసెడి వేళల నెచట జూడ

    కాలమహిమ తెలియగల  ఘనులు గలరె?


    ఆవకాయ పెట్టుట కిల నదున దేది

    ఫేనమది హెచ్చనేమగు విశ్వమందు

    బాగుగా చింతన మొనర్చి పల్కుమయ్య

    మండు వేసవిలో చలి మెండు సుమ్మి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. తే||గీ||
    అడవి దావానలంబుచే నంటుకొనును
    మండు వేసవిలో, చలి మెండు సుమ్ము
    మకరసంక్రాంతి సమయాన మనకు నెపుడు
    తెలిసి మసలుకో, మనుజుఁడ తేటపడగ||

    ముమ్మడి చంద్రశేఖరాచార్యులు, పెంట్లవెల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రశేఖరాచార్యులు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. తే .గీ . చల్ల గాలిచ్చు యంత్రపు "బిల్లు" మోత ,
    వింత జలకాల సరదాల విలువ నెంచ ,
    పండ్ల రసముల ధరలకు వణుకు బుట్ట
    మండు వేసవి లో జలి మెండు సుమ్ము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  30. హృదయతాపమ్మునార్పగా శ్రీనివాస
    కరుణ రసవృష్టి సతతమ్ము కురియుచుండ
    చల్లగా నీడనిచ్చు వృక్షమ్ములుండ
    మండువేసవిలోఁ జలి మెండు సుమ్ము!!

    వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్"*
    వ్రాసిన వాడెవండసలు? వానిని దోడ్కొని వచ్చి యెండలో
    వేసి పదింటికిన్ మరల వెన్కకు దీయుడు నాలుగింటికిన్!
    మూసిన రెప్ప విప్పునె ? గనుంగొన నిప్పులకుప్ప నేడిలన్ !!

    నీ సిగ చందమామ నవనీత సమాన సుధాంశు జాలమున్
    పోసెను రాశిగా, భువన మోహన పావన శీతలాభ్రగా..
    ధ్యాసిత ధూర్జటీ ! వర హిమాద్రి నివాసము గాన నిన్ను నీ
    వేసవి కాలమందు చలి వెక్కసమై వడకించు , నెల్లరన్
    నీ సరిగా దలంపకవనిన్ వడగాడ్పులు గాల్చుచుండెడిన్ !!

    కూపోదకం వటచ్ఛాయా
    తాంబూలం తరుణీకుచమ్
    శీతకాలే భవేదుష్ణం
    ఉష్ణకాలే తు శీతలమ్ !!
    (Natural Air Conditioners)

    సరస కూపోదకము వటచ్ఛాయ ధరణి
    నమ్ము తాంబూలము సతీ కుచమ్ములనగ
    శీతకాలాన వేడియౌ చిత్రముగను
    మండు వేసవిలో చలి మెండు సుమ్ము!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  31. బండ బగిలెడి యెండలు బాఁదు వేళ
    నండగా నింట జేరి తోడుండు శీత
    లీకరణ యంత్రపు‌ చలువ లీల లందు
    మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము!

    లీల=విధము(తెనుగున)

    రిప్లయితొలగించండి
  32. మండు వేసవి కరగించు గండ శిలల,

    గాననంబులు నూరక గాలిపోవు;

    మంచు శిఖరాల జీవించు మానవులకు,

    మండు వేసవి లోజలి మెండు సుమ్ము.

    విద్వాన్,డాక్టర్,మూలె రామముని రెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు.కడప జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  33. దోసెలు కజ్జికాయలును దోరగ వేపిన మిర్చిబజ్జిలున్
    కాసిని పాలకోవలును ఖైరత బాదున స్ట్రీటు స్టాలునన్
    మేసిన కాళరాత్రినహ మెండుగ నెక్కగ టెంపరేచరే...
    వేసవి కాలమందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్

    రిప్లయితొలగించండి